#BVDPrasadaRao, #బివిడిప్రసాదరావు, #ప్రేమికుడు, #Premikudu, #He'sAnEx, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు
'Premikudu (He's an ex) - Part 23' - New Telugu Web Series Written By BVD Prasada Rao Published In manatelugukathalu.com On 12/10/2024
'ప్రేమికుడు (He's an ex) - పార్ట్ 23' తెలుగు ధారావాహిక
రచన: బివిడి ప్రసాదరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళతాడు శేషగిరి. అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతిని కలుస్తాడు. ఆమె సమస్యల్లో ఉందని తెలుసుకొని సహాయం చేయాలనుకుంటున్నట్లు భార్యతో చెబుతాడు. తల్లి సలహా మీద అంగీకరిస్తుంది అతడి భార్య గిరిజ.
జాతర కోసం ఊరికి వెళ్లిన శేషగిరి, భార్యతో కలిసి పార్వతిని కలుస్తాడు. శోభనం రోజునుండే భర్త విచిత్ర ప్రవర్తన ప్రారంభమైనట్లు చెబుతుంది పార్వతి. ప్రతిరోజూ తనని మానసికంగా హింసించేవాడని చెబుతుంది.
పార్వతి విషయంలో తన తలిదండ్రుల సహాయం తీసుకుందామంటుంది గిరిజ. మామగారి కారులో కుమార్ ని కలవడానికి వెళతాడు శేషగిరి.
డ్రైవర్ సుందరం తో కలిసి కుమార్ దగ్గరకు వెళ్తాడు. భార్యతో తన ప్రవర్తన మార్చుకోవాలని కుమార్ కు గట్టిగా చెబుతాడు. కుమార్ అంగీకరించినట్లు కనిపిస్తాడు.
ఇక ప్రేమికుడు పార్ట్ 23 చదవండి.
మర్నాడు..
ఆరవుతుండగానే.. కోరే.. తిరిగి ఊరు బయలు దేరేసాడు శేషగిరి.
"సుందరం.. రాత్రి టిఫిన్ చేసి వచ్చేక.. వెంటనే పడుకున్నా.. సరిగ్గా నిద్ర లేదు. నేను ఇప్పుడు కారులో పడుకుంటాను." చెప్పాడు.
కారు బేక్ సీట్ల వైపుకు ఎక్కేసి.. వాటి మీద నడుము చేరవేసేసాడు.
సుందరం కారు స్టార్ట్ చేసాడు.
రెండు నిముషాల లోపే..
"అల్లుడు సార్.. మధ్య మధ్యన ఆపుతాను. టీ లకు లేవండి." చెప్పాడు.
"లేదు. నేను లేచే వరకు లేపకు. నిజానికి కడుపు కూడా బరువుగా అనిపిస్తోంది." చెప్పాడు శేషగిరి.
"ఐతే కొబ్బరి బొండాల వద్ద కారు ఆపుతాను." చెప్పాడు సుందరం.
"వద్దు సుందరం. ప్లీజ్.. నన్ను పడుకోని. నిద్రలో అన్నీ సర్దుకు పోవచ్చు. నాకు మెలుకువ వస్తే లేస్తాలే." శేషగిరి విసుగు కనబడనీయకుండా చెప్పగలిగాడు.
సుందరం కామ్ అవుతాడు.
కారుకై సుందరం పార్కింగ్ ప్లేస్ కు వెళ్లినప్పుడు..
గిరిజకి ఫోన్ చేసి..
"బయలుదేరి వచ్చేస్తున్నాను. సుందరం నసని తప్పించుకోడానికి నిద్రపోతున్నట్టు బేక్ సీట్లలో పడుకుంటాను. మరి ఫోన్ చేయను. నువ్వూ చేయకు. పార్వతి నాకు ఫోన్ చెయ్యవచ్చు. నేను చేస్తే విషయాలు చెప్పవలసి ఉంటుంది. సో. నా ఫోన్ స్విచ్ఛాప్ న పెడతాను." చెప్పాడు.
***
పార్వతి ఫోన్ మోగుతోంది.
అప్పటికి తల్లి తలకి పార్వతి నూనె రాసి.. దువ్వుతోంది.
చూస్తే.. తనకు కుమార్ ఫోన్ కాల్ చేస్తున్నట్టు పార్వతి గుర్తించింది.
తను తటపటాయిస్తోంది.
"ఫోనొస్తోందిగా. మాట్లాడు. మీ మేనత్తేమో. నాకు ఇవ్వు. నేను మాట్లడతాను." అంటోందిపార్వతి తల్లి.
అంతలోనే ఆ ఫోన్ కాల్ కటయ్యింది.
"మళ్లీ వస్తే.. మాట్లాడతాలే." చెప్పేసి..
తల్లి జుత్తుని ముడి పెట్టేసి.. తల్లిని మంచం మీద పడుకో పెట్టేసింది.
ఫోన్ తో పెరటి వైపుకు నడిచింది పార్వతి.
'తను మళ్లీ చేస్తాడా. లేక.. నేను చెయ్యాలా.' అనుకుంది.
'శేషగిరి బయలుదేరి వచ్చేస్తు్న్నాడు.. వచ్చేక విషయాలు మాట్లాడతాడు..' అని గిరిజ అంతకు ముందే తనకు ఫోన్ చేసి చెప్పి ఉంది.
ఇంతలో.. తనకు తన భర్త ఫోన్ చేయడం.. పార్వతిని అవస్త పరుస్తోంది.
పార్వతి తన ఆలోచనల్లో తనుండగా..
తిరిగి కుమార్ ఫోన్ చేస్తాడు.
గట్టిగా ఊపిరి పీల్చుకొని..
వస్తూన్న కుమార్ ఫోన్ కాల్ కి కనెక్ట్ ఐ..
"హలో." అంది పార్వతి.
"పనుల్లో ఉన్నావా. నీతో మాట్లాడాలి." అటు కుమార్ అడుగుతాడు.
కుమార్ అడిగే విధం మెత్తగా ఉండడం పార్వతి గుర్తించింది.
దాంతో సన్నగా చలించింది.
"చెప్పండి." అంది.
"ఎలా ఉన్నావు." అడుగుతాడు కుమార్.
పార్వతి మది కదులుతోంది.
అప్పుడే..
"పార్వతీ.. మీ మనుషులు వచ్చేసారా." అడిగాడు కుమార్.
పార్వతి నోట మాట రావడం లేదు.
"నిన్న మీ వాళ్లు నన్ను కలిసారు." మాటలు కూడ తీసుకుంటున్నట్టు చెప్పుతున్నాడు కుమార్.
కుమార్ మాట తీరుకు పార్వతి స్థితి పల్చబడుతోంది.
"నా తప్పు తెలుసుకున్నాను. నా కళ్లు తెరిపించారు మీ శేషగిరిగారు." చెప్పుతున్నాడు కుమార్.
పార్వతి అప్పుడే తన ఎడమ చెవి వైపు నుండి కుడి చెవి వైపుకు ఫోన్ ని మార్చుకుంటుంది.
"నీ పట్ల నా ప్రవర్తన ఎంత దారుణమైనదో.. శేషగిరిగారు చెప్పేక నాకు తెలిసింది. నన్ను నమ్ము. నా పిచ్చితనంకి కారణం.. పూర్తిగా మా నాన్నే. నాకు అతడి చేష్టలే బాగా ఆకట్టుకున్నాయి.. అబ్బేసాయి." కుమార్ ఆగాడు.
పార్వతి వైపు ఎట్టి ధ్వని రాకపోవడంతో..
"పార్వతీ వింటున్నావా." దీనంగా అడిగాడు అటు కుమార్.
పార్వతి గమ్మున రియాక్ట్ కాలేకపోతోంది.
తిరిగి కుమార్ అడుగుతాడు.
దాంతో.. "ఆఁ. వింటున్నాను." పార్వతి అనగలిగింది.
"అప్పుడు నా వయస్సు పది.. పదకొండు యేళ్లుంటాయి. నన్ను దగ్గర పెట్టుకొని.. నాన్న.. అమ్మని.. నేను నీతో రాత్రులు చేయించుకునేలా చేయించుకునే వాడు. అవి నాకు తల కెక్కేసాయి. వాటిలోనే కిక్కు ఉంటుంది అనుకున్నాను. నాన్న కూడా అలానే కిక్కు తెచ్చుకోవాలని నూరి పోసేవాడు." కుమార్ చెప్పేస్తున్నాడు.
పార్వతి డంగైపోతోంది. నిల్చోలేక.. బావి గట్టుకు చేరగిల బడిపోయింది. ఐనా ఫోన్ ని చెవికి నొక్కి పెట్టే పట్టుకుంది.
"అమ్మ పోయేక.. నాన్నకి ఏమైందో ఏమో.. నన్ను వదిలేసి పోయాడు. దరిద్రుడు ఈ మధ్యన రైలు కింది పడో.. రైలు గుద్దో చనిపోయాడట. పోలీసులు చెప్పారు. నా బతుకును పిసికేసాడు." కుమార్ గొంతు బొంగురవుతోంది.
పార్వతికి అది తెలుస్తోంది.
"పార్వతీ.. నాకు ఇన్నాళ్లు చెప్పేవారు లేక.. నా లోకమే నాదన్నట్టు.. నా చేతలే సరైనవి అన్నట్టు నడిచాను. నువ్వు అడ్డుకుంటూ చెప్పేవి నువ్వు తప్పించుకోవడానికి అనుకున్నాను. కానీ.. శేషగిరిగారు మాట మాట విడతీసి చెప్పేక.. నా తప్పు ఏమిటో తెలుసుకున్నాను." మళ్లీ ఆగాడు కుమార్.
పార్వతిది ప్రస్తుత పరిస్థితి ఇది అనలేం. తను రకరకాలుగా లోలోన స్పందిస్తోంది.
"పార్వతీ.. నిన్ను క్షమించమనడం చిన్నది. నా తప్పులు మార్చుకోవడానికి.. నేను ఇక నీ కాళ్ల దగ్గర పడి ఉంటాను. చెప్పుకోవడానికి అసలు సిగ్గు పడను.. పెంపుడు కుక్కలా నీ దగ్గర ఇక తిరుగుతాను." చెప్పుతున్నాడు కుమార్.
అటు కుమార్ పడుతున్న యాతన.. పార్వతికి తెలుస్తోంది. తన కన్నీళ్లు ధార కడుతున్నాయి. తన పెదాలు వణికిపోతున్నాయి.
"ఏమండీ." అనగలిగింది.
"పార్వతీ.. శేషగిరిగారు ఎప్పుడు రమ్మంటే ఆ వెంటనే నేను వచ్చేస్తాను. నీ దగ్గర పడి ఉంటాను.నమ్ము." చెప్పాడు కుమార్.
ఆ వెంబడే..
"పార్వతీ.. నమ్ము.. నాకు నీ ఇంటిలో ఓ మూలనైనా ఇంత.. ఇంత చోటు ఇవ్వు. పడి ఉంటాను. అదే నా గతంకి తగ్గ శాస్తి. చనిపోవడం.. పారిపోవడం నాకు ఇష్టం లేదు. అలా చేసి మరింత పాపంని నేను అనుభవించలేను. మా నాన్నలాంటిగతి నాకు వద్దు." చెప్పడం ఆపాడు కుమార్.
'ఏమండీ.. అలా మాట్లాడ వద్దు. మరీ మీరు ఇదైపో వద్దు. మీరు నా భర్త. మిమ్మల్ని నేను కాదనుకోలేను. మీలో మార్పునే కోరుకుంటున్నాను.' చెప్పాలనుకుంది.
కానీ పార్వతి చెప్పలేక..
"అలానే. శేషగిరి ఇంకా రాలేదు. అతడు రాగానే.. అతడితో మాట్లాడిస్తాను." చెప్పింది ముద్ద ముద్దలా.
"దాని కోసమే ఎదురు చూస్తాను." చెప్పాడు కుమార్.
"సరే. ఉంటాను." నెమ్మదిగా చెప్పి.. ఆ ఫోన్ కాల్ ని కట్ చేయగలిగింది పార్వతి.
ఆ ఫోన్ నే చూస్తూ.. అలానే ఉండి పోయింది.
***
నాగేశ్వరరావు ఇంటి ముందు కారాగింది.
అప్పుడే నిద్ర నుండి లేచినట్టు లేచి.. కారు దిగాడు శేషగిరి.
"అల్లుడు సార్.. ఒళ్లు తేలిక పడిందా." అడిగాడు సుందరం.
"కొంత వరకు పర్వాలేదు. నీకు కారులో కంపెనీ ఇవ్వలేక పోయాను. ఏమీ అనుకోకు." శేషగిరి చెప్పాడు మెల్లిగా.
సుందరం జవాబు అక్కరలేదన్నట్టుగా ఇంట్లోకి నడిచేసాడు.
బయటికి వచ్చిన నాగేశ్వరరావు..
"ఇంటికి వెళ్లు. ఈ రోజు కారు పని లేదు. రేపు రా." చెప్పాడు సుందరంతో.
కారుని సరైన ప్లేస్ లో పెట్టేసి.. దాని కీ ఇచ్చేసి.. "సరే సార్." వినయంగా చెప్పాడు సుందరం.
తర్వాత..
తన బైక్ మీద ఇంటికి బయలుదేరిపోయాడు.
నాగేశ్వరరావు బయటి గ్రిల్ గేట్ ని మూసేసి.. ఇంట్లోకి కదిలాడు.
***
లంచ్ చేస్తూ..
ఆ నలుగురూ మాట్లాడుకుంటున్నారు.
"ఆ కుమారే.. మన కంటే ముందు పార్వతికి జరిగినది చెప్పేసాడట. తెగ పశ్చాత్తాప పడిపోతున్నాట. మీ పిలుపుకే ఎదురు చూస్తున్నాడట." చెప్పింది గిరిజ.
తిండం ఆపి.. "అదేమిటి. నీకెలా తెలిసింది." శేషగిరి అడుగుతాడు.
"మీరు దార్లో ఉండగానే.. నాకు పార్వతి ఫోన్ చేసి చెప్పింది." చెప్పింది గిరిజ.
"పార్వతి రియాక్షన్ ఏమిటి." అడిగాడు శేషగిరి.
"ఆమె మాటల్లో ఉబ్బితబ్బిబ్బు చక్కగా తెలిసింది." చెప్పింది గిరిజ చిన్నగా నవ్వుతూ.
"మరే.. భర్త వద్దు అన్నది ఇప్పుడు కోరుకుంటుందా." తమషాగా అన్నాడు శేషగిరి.
"అయ్యో.. అల్లుడు గారూ.. భర్త చేష్టలకు భీతిల్లింది తప్పా.. మారిన భర్తని వదులుకుంటోందా." అనేసింది సరళ.
"అంతేలే." అనేసాడు నాగేశ్వరరావు.
వాళ్ల లంచ్ కొనసాగుతోంది.
"మొత్తం ఇంతటికి.. మీ పనితనమే సిసలైన కారణం. అంతే. మీకు నా కంగ్రాట్స్." చెప్పాడు నాగేశ్వరరాపు.
"ముమ్మాటికి అంతే. ప్రత్యేకంగా చెప్పక్కర లేదు. ఆ పిల్లలిద్దరూ అల్లుడు గారికి బుుణపడి ఉండి తీరాలి." చెప్పింది సరళ.
శేషగిరి ఏమీ అనలేదు. కానీ లోలోపల తృప్తిపడిపోతున్నాడు.
"ఆఁ. అన్నట్టు.. సుందరం నస అంత ఇబ్బంది పెట్టిందా అల్లుడు గారూ." నాగేశ్వరరావు నవ్వుతాడు.
"ఇదే మీకు కొత్త. మాకు సుందరంది ఎన్నళ్లగానో ఎరిక. ఏమైనా మంచోడు. కల్లాకపటం లేనోడు." అంది సరళ.
"అంతే అనుకోండి. అతడి అభిప్రాయాలు అతడు చెప్పేస్తాడు. కానీ ఇతరలకు అవి నొప్పిస్తావేమో అని తలవడు." శేషగిరి కలగచేసుకున్నాడు.
"ఏం అల్లుడు గారూ.. లైన్ ఏమైనా క్రాస్ అయ్యాడా." అడిగాడు నాగేశ్వరరావు.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Comments