#BVDPrasadaRao, #బివిడిప్రసాదరావు, #ప్రేమికుడు, #Premikudu, #He'sAnEx, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు
'Premikudu (He's an ex) - Part 24' - New Telugu Web Series Written By BVD Prasada Rao Published In manatelugukathalu.com On 17/10/2024
'ప్రేమికుడు (He's an ex) - పార్ట్ 24' తెలుగు ధారావాహిక
రచన: బివిడి ప్రసాదరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళతాడు శేషగిరి. అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతిని కలుస్తాడు. ఆమె సమస్యల్లో ఉందని తెలుసుకొని సహాయం చేయాలనుకుంటున్నట్లు భార్యతో చెబుతాడు. తల్లి సలహా మీద అంగీకరిస్తుంది అతడి భార్య గిరిజ.
జాతర కోసం ఊరికి వెళ్లిన శేషగిరి, భార్యతో కలిసి పార్వతిని కలుస్తాడు. శోభనం రోజునుండే భర్త విచిత్ర ప్రవర్తన ప్రారంభమైనట్లు చెబుతుంది పార్వతి. ప్రతిరోజూ తనని మానసికంగా హింసించేవాడని చెబుతుంది.
పార్వతి విషయంలో తన తలిదండ్రుల సహాయం తీసుకుందామంటుంది గిరిజ. మామగారి కారులో కుమార్ ని కలవడానికి వెళతాడు శేషగిరి.
డ్రైవర్ సుందరం తో కలిసి కుమార్ దగ్గరకు వెళ్తాడు. భార్యతో తన ప్రవర్తన మార్చుకోవాలని కుమార్ కు గట్టిగా చెబుతాడు. కుమార్ అంగీకరించినట్లు కనిపిస్తాడు. భార్య పార్వతికి ఫోన్ చేసి క్షమించమని అడుగుతాడు.
ఇక ప్రేమికుడు పార్ట్ 24 చదవండి.
"అబ్బే అంతటది లేదు." అంటూనే..
"కుమార్ మారిన విషయంలో మాత్రం కుమార్ ని శంకించాడు." చెప్పాడు శేషగిరి.
"ఏమన్నాడు." అడిగింది గిరిజ.
"కుమార్ మారినట్టు నటిస్తున్నాడేమో అన్నాడు." మెల్లిగా చెప్పాడు శేషగిరి.
"నటనైతే కాకపోవచ్చు. అట్టి వాడైతే.. ఊరు వదిలి.. పార్వతి ఊరికే రాలేడుగా. ఎవరైనా కోరి బోనులో దూరరుగా." అంది గిరిజ.
"అదే తిరిగి అతడే అన్నాడు కూడా." చెప్పాడు శేషగిరి.
ఆ వెంబడే..
"వేదాంతిలా అన్నాడు. మనుషులు పరిపరిలా ఆలోచిస్తారు. అది సహజం అన్నట్టు అన్నాడు." నవ్వేడు శేషగిరి.
మిగతా ముగ్గురూ నవ్వేసారు.
వాళ్ల లంచ్ కొనసాగుతోంది.
ముందుగా శేషగిరి భోజనమే ఐంది.
వాషింగ్ తర్వాత..
తిన్నగా వెళ్లి.. బొమ్మలతో ఆడుకుంటున్న రాగిణి ముందు కూర్చున్నాడు.
"అల్లుడు గారు ప్రతి మాటని పట్టుకుంటారు." నవ్వుతూ అంది సరళ.
"పెర్ఫిక్షన్ కోసం లేవే." చెప్పాడు నాగేశ్వరరావు.. భార్యనే చూస్తూ.
"చాదస్తుడు మాత్రం కాదు." నవ్వింది గిరిజ.
"భలే దానివి లేవే. మాకు తెల్వదా." సరళ నవ్వుతోంది.
"అల్లుడు గారు.. పెర్ఫెక్ట్ మాన్. నో డౌట్."
కలగచేసుకున్నాడు నాగేశ్వరరావు.
ఆ ముగ్గురి లంచ్ కావస్తోంది.
***
టీ సమయంన..
హాల్లో కూర్చొని టీలు తాగుతూ మాట్లాడుకుంటున్నారు వాళ్లు.
"మరి ఎప్పుడు కుమార్ ని రప్పించి.. ఆ పార్వతికి అప్పగించేది." అడిగాడు నాగేశ్వరరావు.
"దానికి ముందు ఇంకొక్కటి పూర్తి చేయాలనుకుంటున్నాను అంకుల్." చెప్పాడు శేషగిరి.
"అవును డాడీ. ఇందాకే నాతో డిస్కస్ చేసారీయన." గిరిజ కలగచేసుకుంది.
"దేనికై." అడిగింది సరళ.
"ఆ కుమార్ లోని జాడ్యంకి కారణం ఏమై ఉండొచ్చు. సడన్ గా దాని లోంచి వచ్చేయడం సహజమేనా. తిరిగి అది రిపీట్ కావచ్చా.. లాంటిపై వీరు అనుమానాలు వ్కక్తపరిచారు. మేము రకరకాలుగా అనుకున్నా.. సమాధానం పడలేక పోయాం." చెప్పింది గిరిజ.
"నిజమే. ఇట్టివి ఆలోచించాలి. ఇదొక రోగమయ్యితే టక్కున మాయమై పోయినట్టు పోదు. మారినట్టు మభ్య పెడుతున్నాడా. అది కాక పోవచ్చు. ఎందుకంటే.. ఆ పార్వతిని తన దగ్గరికి కాక.. తనే పార్వతి దగ్గరికే వస్తున్నాడాయే. మరేమై ఉండొచ్చబ్బా." నాగేశ్వరరావు తల పట్టుకున్నాడు.
"అల్లుడుగారు అనుమానిస్తోంది ఆలోచించ తగ్గదే." అనేసింది సరళ.
గిరిజ.. శేషగిరి ఏమీ అనడం లేదు.
"దీన్ని ఎలా తేల్చుకోవాలి. ఇదేమైనా ఓ మానసిక రుగ్మత. అలా ఐతే.. ఓ సైకియాట్రిస్ట్ కలిస్తే జవాబు దొరుకుతోంది." అన్నాడు నాగేశ్వరరావు.
"ఎందుకు.. అంత అవసరమేముంది. ఇప్పటికి అన్నీ అనుకూలంగా ఉన్నాయిగా." అనేసింది సరళ.
"అలా కాదు ఆంటీ. ఫ్యూచర్ లో ఎట్టి అవస్తలు రాకూడదనదే నా తాపత్రయం." చెప్పాడు శేషగిరి.
గిరిజ భర్తనే చూస్తోంది.
సరళ మరేమనడం లేదు.
నాగేశ్వరరావే.. "గుడ్.. సైకియాట్రిస్ట్ సలహా సూచనలు తీసుకుందాం. చేసిన పని ఏదో సజావుగా నిర్వహిద్దాం." చెప్పాడు.
"ముందు ఒక మారు అనుకున్నాం.. సైకియాట్రిస్ట్ కలుద్దామని. అప్పుడు కాదనుకున్నా.. ఇప్పుడు కలవాలి." అనేసాడు శేషగిరి.
"డన్. కలిసేక.. నెక్స్ట్ స్టెప్ వేద్దాం." అనేసాడు నాగేశ్వరరావు.
సరళ.. గిరిజ ఏమీ అనడం లేదు.
"అంకుల్.. మీ ఆఫీస్ కు వెళ్లే దారిలో.. ఫైవ్ స్టార్ హోటల్ కి ఆపోజిట్ న ఓ బిల్డింగ్ పైన సైన్ బోర్డ్ చూసాను. అక్కడ సైకియాట్రిస్ట్ క్లీనిక్ ఉంటుంది." చెప్పాడు శేషగిరి.
"యయ. నేనూ చూసినట్టు ఉంది. గుర్తు వస్తోంది." చెప్పాడు నాగేశ్వరరావు.
ఆ వెంబడే.
"ఈ రోజే కలుద్దాం." అన్నాడు.
"ఈ రోజు సన్డే డాడీ." గుర్తు చేసినట్టు అంది గిరిజ.
"రండి అంతా వెళ్దాం. మనమూ తిరిగినట్టు ఉంటుంది. సైకియాట్రిస్ట్ ఉంటే కలుద్దాం." చెప్పాడు నాగేశ్వరరావు.
అంతా 'సరే' అనేసారు.
***
శేషగిరి చెప్పిన చోటన సైకియాట్రిస్ట్ క్లీనిక్ ఉంది.
ఆ బిల్డింగ్ పార్కింగ్ ప్లేస్ లో కారు ఆపాడు నాగేశ్వరరావు.
మూడో ఫ్లోర్లో కిడ్స్ జోన్ కనిపించడంతో..
"నేను.. మమ్మీ.. పాపను కిడ్స్ జోన్ కు తీసుకు వెళ్తాం. డాక్టర్ గారు ఉంటే.. కలిసి.. మీ ఇద్దరూ అక్కడికి వచ్చేయండి." చెప్పింది గిరిజ.
శేషగిరి 'సరే' అన్నాడు.
రాగిణితో వాళ్లు అటు వెళ్లగా..
నాల్గో ఫ్లోర్లో ఉన్న క్లీనిక్ కు వెళ్లారు మిగతా ఇద్దరు.
లక్కీగా సైకియాట్రిస్ట్ ఉండడంతో.. మామా అల్లుడు కుదుట పడ్డారు.
తమది రెండో టోకిన్ కావడంతో..
అక్కడికి వెళ్లిన అర గంట లోపునే వీళ్లు సైకియాట్రిస్ట్ ముందుకు చేరగలిగారు.
శేషగిరే మాట్లాడేడు. చెప్పవలసినవి చెప్పాడు.
"మీరు చెప్పిన దాని బట్టి ఆ వ్యక్తిది పెద్ద ప్రోబ్లం కాదు. తన భార్యతో అలా ప్రవర్తించిన వాడు.. సడన్ గా మారిపోవడం.. మీ నిలదీతకి ఎదురు తిరగక పోవడం.. మీ కండిషన్స్ కు ఒప్పేసుకోవడం.. గమనిస్తే.. అతడు ప్యూర్లీ భయస్తుడు. అతడది జబ్బు కాదు. ఒక విధమైన మానసిక బలహీనత. దానిని మనం ఎత్తి చూపి.. దండించే సరికి దారికి వచ్చేసాడు. తిరిగి చేస్తాడా అంటే.. పరివేక్షణ ఉంటుంటే మరి చేయడు.. చేయలేడు." ఆగాడు సైకియాట్రిస్ట్.
అతడినే చూస్తున్నాడు.. నాగేశ్వరరావుతో సహా శేషగిరి.
"ఒక చిన్న ఉదాహరణ.. ఓ వ్యక్తి తన మానసిక బలహీనత మూలంగా.. చాటుగా.. సెక్స్ బొమ్మల్ని.. సెక్స్ వీడియోస్ని.. చూడడం.. లేదా అట్టివి చదవడం చేస్తుంటారు. అట్టి వారు అట్టి వాటిని బహిరంగంగా కోరుకోలేరు. ఎందుకంటే తన లోని భయం పై చేయిన ఉండడమే. ఇలాంటి వారే తన చాటుతనం ఒక్కమారుగా బహిర్గతమైతే.. వారు అంత వరకు చేసింది సమర్ధించుకోలేరు. బహిర్గతం చేసిన వారిని ఫేస్ చేయలేరు.
పైగా బహిర్గతం చేసిన వారికి తనలోకి భయం మూలంగా దాసోహం ఐ తీరుతారు. వీరు తన ఉనికికి మచ్చ రానివ్వకూడదని.. ఆ బహిర్గత పర్చిన వారు ఏం చెప్తే అది చేస్తారు. ఇదే మీ వ్యక్తికి అప్లై ఐంది. సో.. నో వర్రీస్. బట్.. ఆ వ్యక్తిని కొన్నాళ్లైనా ఓ కంట కని పెట్టుకోండి. అతడిలోని బలహీనత పల్చబడిపోతే.. అతడే ఓ హీరో అవుతాడు." చెప్పాడు సైకియాట్రిస్ట్.
"అంతే అంటారా." అడిగాడు శేషగిరి.
"ఖచ్చితంగా." చెప్పాడు సైకియాట్రిస్ట్.
మామా.. అల్లుడు.. సాఫీ అయ్యారు.
అక్కడి నుండి కదిలారు.
***
మర్నాడు..
శేషగిరి ఇంటిన..
కాఫీలు తాగుతూ..
హాలులో.. సోఫాలో..
శేషగిరి.. గిరిజలు ఉన్నారు.
రాగిణి ఇంకా నిద్రలేవలేదు.
గిరిజ సూచన మేరకు.. శేషగిరి..
కుమార్ కి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు.
ఇటు శేషగిరి ఫోన్ స్పీకర్ ఆన్ చేయబడి ఉంది.
అటు కుమార్ మాటలు చాలా అణుకువగా ఉన్నాయి.
"పని వాళ్లకి మరో చోట పని చూసుకోమని చెప్పేసాను. అద్దె కుట్టు మిషన్లు తిరిగి ఇచ్చేయబోతున్నట్టు ఆయా వాళ్లకు చెప్పేసాను. ఎవరెవరికి ఎంత ఎంత ఇవ్వాలో లెక్కలు కట్టి రడీగా ఉన్నాను. నా సొంత కుట్టు మిషన్లు ఉంచుకుంటాను. వాటితో పార్వతి ఇంటిన.. ఆ ఊరి వాళ్ల నుండి టైలరింగ్ పనులు సేకరించి చేస్తాను. నాకు వచ్చిన పని టైలరింగే. ఇక నా ఇల్లు అమ్మకంకి వచ్చేసింది. ఓ ఇరవై వేలు దగ్గర ఆగింది.." చెప్పుతున్నాడు అటు కుమార్.
'ఎంతకి అన్నట్టు' ఇటు గిరిజ సైగ చేయడంతో..
"ఇల్లు ఎంతకి అమ్మబోతున్నారు." అడిగాడు శేషగిరి.
"ఇల్లు చూసారుగా. సెంటర్ లో ఉంది కనుక.. ఇరవై తొమ్మిది లక్షల ఎనబై వేలుకి అడుగుతున్నారు. నేను ఇరవై వేలు కలిపి ఇమ్మంటున్నాను." చెప్పాడు కుమార్.
"అవునా. మీ ఇల్లు అమ్మకం పెట్టినట్టు చాలా మందికి తెలిసి ఉందా." అడిగాడు శేషగిరి.
ఆ వెంబడే..
"నలుగురుకి తెలిస్తే మంచి రేటుకు వెళ్తుంది." చెప్పాడు.
"చాలా మందికి చెప్పాను. వీళ్లే ఇంత వరకు వచ్చారు." చెప్పాడు కుమార్.
"ఇంకా నలగనీయండి. తొందర వద్దు." శేషగిరి సలహా ఇచ్చాడు.
ఆ వెంబడే..
"ఇంకేంటి." అన్నాడు.
"పార్వతితో మాట్లాడుతున్నాను. తను నన్ను క్షమించినట్టే ఉంది. నేను మారి చూపుతాను. తనకి పూర్తి నమ్మకం కలిగిస్తాను." చెప్పాడు అటు కుమార్.
అప్పుడే.. శేషగిరి భార్యని చూసాడు.
గిరిజ బొమలాడిస్తోంది. చక్కగా నవ్వుతోంది.
"సరే. అక్కడి మీ పనులు కానిస్తుండండి. మంచి ముహూర్తం చూసి.. మిమ్మల్ని పార్వతి ఇంటికి తీసుకు వస్తాం." చెప్పాడు ఇటు శేషగిరి.
"సరేనండీ." అటు కుమార్ చెప్పాడు.
శేషగిరే ఆ ఫోన్ కాల్ కట్ చేసేసాడు.
"హమ్మయ్య." అన్నాడు.
గిరిజ చక్కగా నవ్వుతోంది.
"కుమార్ ఇంటి డబ్బును పార్వతి అకౌంట్ న వేయిస్తాను." చెప్పాడు శేషగిరి.
"అలా వద్దు. జాయింట్ అకౌంట్ న ఇద్దరి పేరున ఉంచండి. మరీ ఒన్ సైడ్ కాకూడదు." చెప్పింది గిరిజ.
ఆ వెంబడే..
"తొలుత టైలరింగ్ పనులు కుమార్ చేసుకున్నా.. మెల్లిగా కౌలులో ఉన్న పార్వతి వాళ్ల పొలాలు తీసుకొని.. కుమార్ చే వ్యవసాయ పనులు సాగిస్తే బాగుంటుంది." చెప్పింది.
"నిజమే.. ఆ ఊరిలో అట్టివే బాగా నడుస్తాయి." చెప్పాడు శేషగిరి.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Commentaires