top of page
Writer's pictureBVD Prasada Rao

ప్రేమికుడు - పార్ట్ 25


#BVDPrasadaRao, #బివిడిప్రసాదరావు, #ప్రేమికుడు, #Premikudu, #He'sAnEx, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

'Premikudu (He's an ex) - Part 25' - New Telugu Web Series Written By BVD Prasada Rao Published In manatelugukathalu.com On 22/10/2024

'ప్రేమికుడు (He's an ex) - పార్ట్ 25' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళతాడు శేషగిరి. అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతిని కలుస్తాడు. ఆమె సమస్యల్లో ఉందని తెలుసుకొని సహాయం చేయాలనుకుంటున్నట్లు భార్యతో చెబుతాడు. తల్లి సలహా మీద అంగీకరిస్తుంది అతడి భార్య గిరిజ. 


జాతర కోసం ఊరికి వెళ్లిన శేషగిరి, భార్యతో కలిసి పార్వతిని కలుస్తాడు. శోభనం రోజునుండే భర్త విచిత్ర ప్రవర్తన ప్రారంభమైనట్లు చెబుతుంది పార్వతి. ప్రతిరోజూ తనని మానసికంగా హింసించేవాడని చెబుతుంది. 


పార్వతి విషయంలో తన తలిదండ్రుల సహాయం తీసుకుందామంటుంది గిరిజ. మామగారి కారులో కుమార్ ని కలవడానికి వెళతాడు శేషగిరి. డ్రైవర్ సుందరం తో కలిసి కుమార్ దగ్గరకు వెళ్తాడు. భార్యతో తన ప్రవర్తన మార్చుకోవాలని కుమార్ కు గట్టిగా చెబుతాడు. కుమార్, తన భార్య పార్వతికి ఫోన్ చేసి క్షమించమని అడుగుతాడు. కుమార్ ప్రవర్తన గురించి మామగారితో కలిసి సైకియాట్రిస్ట్ ని కలుస్తాడు శేషగిరి. కుమార్ లో మార్పు నిజమే అయి ఉంటుందని చెబుతాడు సైకియాట్రిస్ట్.


ఇక ప్రేమికుడు పార్ట్ 25 చదవండి.


లంచ్ కి ఇంటికి వచ్చిన శేషగిరి..

గిరిజచే స్వీట్ తినపించాడు.


"ఏమటండీ విశేషం." ఆనందమవుతూనే గిరిజ అడుగుతోంది.


"ఆ మధ్య బ్యాంక్ టెస్ట్.. రెండో ఫేస్ గా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేగా. నేను సెలక్ట్ అయ్యా." చెప్పాడు శేషగిరి.


"కంగ్రాట్స్ అండీ." గొప్పైపోతోంది గిరిజ.


అక్కడే ఉన్న రాగిణి నోట్లో ఓ కోవా బిళ్లని పెట్టాడు శేషగిరి.


"ఇక అయ్యగారు.. బ్యాంక్ ఎంప్లాయ్." గిరిజ నింపాది తప్పుతోంది.


"ది ప్రోస్పెక్టివ్.. త్వరలో ఆర్డర్స్ వస్తున్నాయి." చెప్పాడు శేషగిరి.


"ఊరు మార వలసి ఉంటుంది కదా." నెమ్మదిగా అంది గిరిజ.


"తప్పదుగా." అనేసాడు శేషగిరి.


"మనం ముందే అనుకున్నాం. ప్రిపేరయ్యే ఉన్నాంగా." సాధారణంగా అనేసింది గిరిజ.


ఆ వెంబడే..

"మీరు కోరుకున్నది.. ఇష్టపడింది.. బ్యాంక్ ఉద్యోగం. సో. దాని కోసం మీతో మేము ఎక్కడికైనా వస్తాం." చెప్పింది. 


ఆ తర్వాత..

ఆ ఇద్దరూ లంచ్ కై కదిలారు.

"పాపది ఐందిగా." అడిగాడు శేషగిరి.


"ఆఁ." అంది గిరిజ.


"సాయంకాలం త్వరగా వచ్చేస్తా. మనం మీ మమ్మీ వాళ్లింటికి వెళ్దాం." చెప్పాడు శేషగిరి డైనింగ్ టేబుల్ ముందు కుర్చీ లాక్కొని కూర్చుంటూ.


"నేను ఫోన్ చేసి ఈ లోగా చెప్పేస్తాగా." చెప్పింది గిరిజ. తనూ ఒక కుర్చీ లాక్కొని కూర్చుంది.


శేషగిరి నవ్వేసాడు.

ఆ ఇద్దరి లంచ్ మొదలయ్యింది.

మధ్యలో..

"నైట్.. సోఫా.. బెడ్ చేస్తా." మురిపెంగా గుణుస్తాడు శేషగిరి.


కొంటెగా భర్తని చూస్తూ.. సిగ్గుగా నవ్వుకుంటుంది గిరిజ.

అప్పుడే గుర్తుకు వచ్చినట్టు..

"సేఫ్టీలు ఐపోయాయిగా. తెచ్చుకుంటేనే నైట్ కి ఉంటుంది." మెల్లిగా అంది.


"ఇంకా వాడాలా." నెమ్మదిగా అడిగాడు శేషగిరి.


"ప్లీజ్.. పాప స్కూలుకు వెళ్లేక వద్దులెండి." చెప్పింది గిరిజ.


ఆ వెంబడే..

"రెండో బిడ్డ తర్వాత.. మీరు ఎంచక్కా వెసెక్టమీకి వెళ్తారు." చెప్పింది.


చిన్న పాజ్ తర్వాత..

"ఆ తర్వాత.. నో మోర్ సేఫ్టీలు." నవ్వింది గిరిజ.

శేషగిరి మురిసాడు.

***

రెండు రోజుల తర్వాత..

ఈ లోగా.. ఫోన్ కాల్స్ ద్వారా..

పార్వతి.. గిరిజ ఒక మారు మాట్లాడుకున్నారు.

పార్వతి.. కుమార్ నాలుగు మార్లు మాట్లాడుకున్నారు.


ఉదయం..

శేషగిరి ఇంట్లో ఉండగానే..

కుమార్ నుండి ఫోన్ కాల్ వచ్చింది.

గిరిజ సమక్షంలోనే కుమార్ తో తన ఫోన్ స్పీకర్ ని ఆన్ చేసి మాట్లాడుతున్నాడు శేషగిరి.


"ముప్పై లక్షలకు ఆ అసామి ఇల్లు కొనడానికి ఒప్పుకున్నాడు." చెప్పుతున్నాడు అటు కుమార్.


"మరి పెరిగే అవకాశం ఉండదా." అడిగాడు ఇటు శేషగిరి.


"అబ్బే.. ఎవరూ ముందుకు రావడం లేదు. ఇద్దరు వచ్చినా.. ఇంతకైతే వద్దనేస్తున్నారు. చిన్నిల్లు అంటున్నారు." చెప్పాడు కుమార్.


ఆ వెంబడే..

"కొనబోతున్న అసామిది మా ఇంటి పక్క ఇల్లే. తనింటిని.. మా ఇంటిని కలిపి ఏదో బిల్డింగ్ కట్టుకుంటామంటున్నాడు. అందుకే ముప్పై లక్షల వరకు వెళ్లానంటున్నాడు." చెప్పాడు.


"మీరేమంటారు." అడిగాడు శేషగిరి.


"ఇచ్చేద్దామనుకుంటున్నాను." చెప్పాడు కుమార్.


నిజానికి.. కుమార్ కి ఒకటే తొందరగా ఉంది.. పార్వతిని చేరిపోవాలని. తన మార్పుకి ఆమెచే మెప్పు పొందాలని.


"సరే. కానీయండి." చెప్పేసాడు శేషగిరి.


కుమార్ "సరే" అనేసాడు.

***

మూడు రోజుల తర్వాత..

ఆఫీస్ లో ఉండగా శేషగిరికి కుమార్ నుండి ఫోన్ వస్తోంది.

ఆ కాల్ కి కనెక్టయ్యాడు శేషగిరి.

కుమార్ చెప్పుతోంది వింటూనే..

"నేను ఆఫీస్ లో ఉన్నాను. ఓ గంటలో తిరిగి ఫోన్ చేస్తాను." చెప్పాడు శేషగిరి.


కుమార్ అలానే అన్నాక.. ఆ ఫోన్ కాల్ కట్ చేసేసాడు శేషగిరి.

తర్వాత..

లంచ్ కి ఇంటికి వచ్చేక..

కుమార్ ఫోన్ సంగతి చెప్తూ..

"కుమార్ ఇల్లు కొన్నతను పూర్తి డబ్బు ఇచ్చేస్తామన్నాడట. రేపు రిజిస్ట్రేషన్ పెట్టుకుందామంటున్నాడట. కుమార్ అంత డబ్బు తన దగ్గర వద్దంటున్నాడు. నా బ్యాంకులో వేస్తామంటున్నాడు." చెప్పాడు గిరిజతో శేషగిరి.


"ఆ కుమార్ ఇంతగా మెత్తబడిపోతున్నాడేమండీ." అంది గిరిజ.


"సర్లే.. ప్రస్తుతం మనకు కావలసింది అదేలే. ఇప్పుడు మనమేం చేయాలో చెప్పు. ఏది బాగుంటుంది." అడిగాడు శేషగిరి.


"ఇంతలో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి అనుకున్నట్టు కానియ్యలేం. ఆ డబ్బు మన పేరున వేయమనడం వద్దు. సో.." ఆగింది గిరిజ.


'ఆమె ఏం చెప్పబోతోందో' చూస్తున్నాడు శేషగిరి.


"ఆ డబ్బును.. తనకు బ్యాంక్ అకౌంట్ ఉంటే.. దానిలో ముందు వేయమనండి. తర్వాత ఏం చేయాలో చెప్తామనండి." చెప్పింది గిరిజ.


"పర్వాలేదా." అడిగాడు శేషగిరి.


"ఇంతగా మనతో మాట్లాడుతున్నవాడు.. ఏం మాట మార్చడు.. మారడు. కానీయండి." చెప్పేసింది గిరిజ.


"సరే. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పేస్తాను." జేబులోంచి ఫోన్ తీస్తాడు శేషగిరి.


"అలాగే.. ఆ కొనే వాడికి ఎప్పటిలోగా ఇల్లు హేండోవర్ చేయవలసి ఉంటుందో అడగండి. ఇల్లు అమ్మేసేక ఇల్లు ఖాళీ చేసేయమంటే పార్వతి ఊరు వచ్చే వరకు కుమార్ ఉండేది ఎక్కడ." చెప్పింది గిరిజ.


ఆ వెంబడే..

"ఇవి మాట్లాడి రండి. లంచ్ చేద్దాం." చెప్పి.. వడ్డనకై కదిలింది.


కుమార్ తో ఫోన్ కాల్ లో మాట్లాడేక..

డైనింగ్ టేబుల్ చేరిన శేషగిరి..

"తన బ్యాంక్ లో అమౌంట్ ఉంచడానికి కుమార్ ని ఒప్పించాను. ఇల్లు నెలాఖరికి ఖాళీ చేసి ఇచ్చేయాలట." చెప్పాడు భార్యతో.


"సర్లేండి. నెలాఖరు అంటే.. ఉఁ. ఇంకా పక్షం రోజులు. ఈ లోగా కుమార్ ని పార్వతిని కలిపేయాలి. ఆ పనీ కానిద్దాం." అంది గిరిజ.

***

రెండవ శనివారం..

మధ్యాహ్నం.. లంచ్ చేసేక..

శేషగిరి.. నాగేశ్వరరావు కారులో..

తల్లిదండ్రుల ఊరు బయలు దేరాడు.. భార్యా, బిడ్డతో.

తను ఉద్యోగం మారుతున్న విషయం ఫోన్ లో చెప్పినా.. మరో మారు స్వయంగా తన తల్లిదండ్రులకు చెప్పాలని.. 

పార్వతితో మాట్లాడేక.. ఆమె సంగతులను తన తల్లిదండ్రులతోను.. ఆమె తల్లితోను స్వయంగా మాట్లాడాలని.

***

గిరిజే చెప్పుతుండంతో ఏమీ అనక.. పార్వతి సంగతులు సావధానంగా శేషగిరి తల్లిదండ్రులు విన్నారు.

గిరిజ చెప్పడం ఆపేక..

"సరే. మీ ఇష్టాలే కానీయండి." అనేసింది అనసూయ.


"అలా కాదు. మీరు కావేషాలు వదలండి. ఆవేశాలు పడకండి. మనింటి ఆడ బిడ్డ కష్టాల్లో ఉంటే ఆదుకోమా. మంచిగా పోతేనే మనకు మంచి దక్కుతోంది." గిరిజే చెప్పింది. 


"మంచి పనేగా. ఓ ఆడకూతురు సంసారం నిలుపుతున్నారు. మాకూ సంతోషమే." చెప్పాడు అప్పలస్వామి.


"ఇప్పుడు మీకు వాళ్ళ వలన పోయేది ఏమీ లేదు. వాళ్లకి మీ వలన ఒరిగేది ఏమీ లేదు. ఉభయలూ ఇక పెద్దరికాలు నిలుపుకోండి." చెప్పాడు శేషగిరి.


ఆ వెంబడే..

"పార్వతికి మేము దన్ను కాగలిగాం. నా భార్య చెప్పినట్టుగా మీరు ఆవేశకావేషాలే కాదు భేషజాలు మానుకోండి. మాతో పాటు పార్వతి ఇంటికి రండి. మీరొస్తే వాళ్లుకు మీరు దన్నవుతున్నారని అనుకుంటారు. మీ పెద్దరికం నలుగురూ చెప్పుకుంటారు.. మెచ్చుకుంటారు. మంచి మంచే." చెప్పాడు.


గిరిజను చూసాడు.

గిరిజ తన అత్తమామలనే చూస్తోంది.


అంతకు ముందు.. దారిలో.. కారులో.. తన భర్త తల్లిదండ్రులను పార్వతి వాళ్లతో కలుపుదామని గిరిజ శేషగిరితో చెప్పి ఉంది.


"మేమెందుకు." అంటుంది అనసూయ.


"లేదు అత్తమ్మ. ఇలా ఇక కలవండి. వాళ్లతోనే కాదు. అందరితోనూ కలుస్తుండండి. ఒకరికి ఒకరు తోడవ్వడంలో మంచే జాస్తీగా అందుతోంది." కలగచేసుకుంది గిరిజ.


అప్పలస్వామిని చూస్తోంది అనసూయ.

"పిల్లలు చెప్పుతున్నారుగా. లే." చెప్పాడు అప్పలస్వామి. లేచాడు.


అనసూయ కూడా లేచింది.

శేషగిరి భార్యని చూసి చక్కగా నవ్వుకున్నాడు.


========================================================================

ఇంకా వుంది..

======================================================================== 


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.










143 views0 comments

Comments


bottom of page