top of page
Writer's pictureBVD Prasada Rao

ప్రేమికుడు - పార్ట్ 26


#BVDPrasadaRao, #బివిడిప్రసాదరావు, #ప్రేమికుడు, #Premikudu, #He'sAnEx, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

'Premikudu (He's an ex) - Part 26' - New Telugu Web Series Written By BVD Prasada Rao Published In manatelugukathalu.com On 27/10/2024

'ప్రేమికుడు (He's an ex) - పార్ట్ 26' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళతాడు శేషగిరి. అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతిని కలుస్తాడు. ఆమె సమస్యల్లో ఉందని తెలుసుకొని సహాయం చేయాలనుకుంటున్నట్లు భార్యతో చెబుతాడు. తల్లి సలహా మీద అంగీకరిస్తుంది అతడి భార్య గిరిజ. 


జాతర కోసం ఊరికి వెళ్లిన శేషగిరి, భార్యతో కలిసి పార్వతిని కలుస్తాడు. శోభనం రోజునుండే భర్త విచిత్ర ప్రవర్తన ప్రారంభమైనట్లు చెబుతుంది పార్వతి. ప్రతిరోజూ తనని మానసికంగా హింసించేవాడని చెబుతుంది. 



పార్వతి విషయంలో తన తలిదండ్రుల సహాయం తీసుకుందామంటుంది గిరిజ. మామగారి కారులో కుమార్ ని కలవడానికి వెళతాడు శేషగిరి. డ్రైవర్ సుందరం తో కలిసి కుమార్ దగ్గరకు వెళ్తాడు. భార్యతో తన ప్రవర్తన మార్చుకోవాలని కుమార్ కు గట్టిగా చెబుతాడు. 


కుమార్, తన భార్య పార్వతికి ఫోన్ చేసి క్షమించమని అడుగుతాడు. కుమార్ ప్రవర్తన గురించి మామగారితో కలిసి సైకియాట్రిస్ట్ ని కలుస్తాడు శేషగిరి. కుమార్ లో మార్పు నిజమే అయి ఉంటుందని చెబుతాడు సైకియాట్రిస్ట్.

శేషగిరి బ్యాంకు జాబ్ వస్తుంది.


ఇక ప్రేమికుడు పార్ట్ 26 చదవండి.


తొలుత బెట్టు చూపినా..

గిరిజ చొరవతో..

పార్వతి తల్లి.. శేషగిరి తల్లిదండ్రులతో కలివిడి ఐంది.

కూతురు సంగతులతో కొంత ఆందోళన పడినా.. శేషగిరి ముందుండి.. కూతురు సంసారం నిలుపుతున్నందుకు.. అల్లుడే తమ ఇంటికి వచ్చి.. తన శ్రమను, డబ్బును వెచ్చిస్తూ.. తమ బాధ్యతలను మోయబోతున్నందుకు పార్వతి తల్లి ఆనందమయ్యింది. 


పార్వతి సరేసరి.


"ఓ మంచి ముహూర్తం చూసి.. కుమార్ ని తెచ్చి ఇంటిలో పెడతాను. నేను చెప్పినవన్నీ అతడి చేసి చూపుతాడు. ఇక మీరు పాతవి మర్చిపోండి.. ముఖ్యంగా.. పార్వతి నువ్వు.. మళ్లీ చెప్పుతున్నాను నీకు.. నువ్వు కొత్త పార్వతిగా మారు.. భర్తతో కలిసి నీ కుటుంబాన్ని నువ్వు చక్కగా.. మొండిగా.. ధీమాగా తీర్చి దిద్దుకో." చెప్పాడు శేషగిరి.

ఆ వెంబడే..

"నాతో.. నా భార్యతో పాటు.. నా తల్లిదండ్రులు.. ఈ ఊరు వాళ్లు మీకు అండగా ఉంటాం. నిశ్చింతగా ఉండండి." చెప్పాడు.

***

ఐదు రోజుల తర్వాత..

డిన్నర్ అయ్యేక..

భార్య, బిడ్డలతో కలిసి..

నాగేశ్వరరావు ఇంటికి బయలు దేరాడు శేషగిరి.


అప్పటికి నాగేశ్వరరావు ఇంటిలో ఉన్నట్టు తెలుసుకున్నాడు.

అంతా హాలులో సమావేశమయ్యారు.

రాగిణి.. తల్లి ఒడిలో కునుకుపాట్లు పడుతోంది.


"ఈ వేళప్పుడు రావడమేమిటో." అడిగాడు నాగేశ్వరరావు.


"ఉదయం నాకు పోస్టింగ్ ఆర్డర్స్ అందాయి.." చెప్పుతున్నాడు శేషగిరి.


"ఉదయం ఫోన్ చేసి చెప్పారుగా. ఫస్ట్ కు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తున్నట్టు కూడా చెప్పారుగా." శేషగిరినే చూస్తున్నాడు నాగేశ్వరరావు.


"అవునవును." అన్నాడు శేషగిరి.


అంతలోనే..

"ఈ లోగా ఆ కుమార్ ని ఆ పార్వతిని కలపేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం." కలగచేసుకుంది గిరిజ.


"గుడ్. అలానే కానీయండి." అనేసాడు నాగేశ్వరరావు.


"వస్తున్న ఇరవై ఐదున బాగుంది. మీకు ఆ రోజుకు కుదురుతోందా." అడిగాడు శేషగిరి.. నాగేశ్వరరావును.


"నాకా. ఐనా నేను ఎందుకు. నా అవసరం ఏమైనా ఉంటుందా." అన్నాడు నాగేశ్వరరావు.


"పెద్దగా మీరు.. ఆంటీ ఉంటే.. పట్టుగా ఉంటుంది." చెప్పాడు శేషగిరి.


"అరె. అల్లుడు గారూ.. మీరు మరీన్నూ. అంతగా ఏమీ ఆలోచించకండి. మొదటి నుండి మీరు.. అమ్మాయి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో. మీ ఇద్దరూ చాలు. మీ మీది కంటే ఆ ఇద్దరికీ ఎవరి మీదా అంత గురి ఉండదు కూడా." చెప్పాడు నాగేశ్వరరావు.


"అవును అల్లుడు గారూ. మీరు చక్కగా ప్రొసీడ్ అవ్వండి." చెప్పింది సరళ.


భార్యని చూస్తాడు శేషగిరి.

"నేనూ చెప్పా. అలాగే ఫోన్ లో మాట్లాడండి అన్నా. మీరే స్వయంగా మాట్లాడదాం అని లాక్కొచ్చారు." గిరిజ చిన్నగా నవ్వుతోంది.


"వీళ్లు మనకు ఎల్డర్స్. ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్." శేషగిరి పొందికగా చెప్తాడు.


"చిత్తం ప్రభూ." నాటకీయంగా అంది గిరిజ. ఆ వెంబడే.. నవ్వేసింది.


ఆ నవ్వుకు వంతు పడుతూ..

"చాల్లేవే. అల్లుడు గారు మంచే చెప్పారులేవే." అనేసింది సరళ.. శేషగిరి ఏమనుకుంటాడో అని.


నాగేశ్వరరావు ఏమీ అనడం లేదు.

అప్పటికే రాగిణి.. గిరిజ ఒడిలోనే నిద్రపోతోంది.


"పాప నిద్రపోయింది. ఈ రాత్రికి ఇక్కడ ఉండిపోండి. ఇప్పుడేం వెళ్తారు." అన్నాడు నాగేశ్వరరావు.


"హాలులో లైట్లు ఆర్పలేదు." చెప్పింది గిరిజ.


"ఇంటికి తాళం సరిగ్గా వేసారుగా." అడిగింది సరళ.


"ఆఁ." అనేసింది గిరిజ.


"ఐతే.. ఉండిపోండి. కావాలంటే.. రేపు ఎర్లీగా వెళ్దురు." చెప్పింది సరళ.


"ఏమంటారు." అడిగింది భర్తను.. గిరిజ.


"సర్లే." అనేసాడు శేషగిరి.


గిరిజ లేచి.. రాగిణిని గదిలో మంచం మీద వేసి.. అటు ఇటు దిండులు పెట్టి వచ్చి.. తిరిగి సోఫాలో కూర్చుంది.

అప్పుడే..

"మీరు నగరం ఎప్పుడు వెళ్తారు." అడిగాడు నాగేశ్వరరావు.. శేషగిరిని.


"ఈ పార్వతి పని కాగానే." చెప్పాడు శేషగిరి.


ఆ వెంబడే..

"ముందు నేను వెళ్తాను. జాయినింగ్ కంటే ముందే అక్కడ రెంట్ కు ఇంటిని చూస్తాను." చెప్పాడు.


"ఆ పనికి మీరు ఎందుకు. సుందరంని పంపుదాం. తను మీ బ్యాంకుకు దరిన ఇల్లు చూస్తాడు. తన పనితనం నాకు తెలుసుగా." చెప్పాడు నాగేశ్వరరావు.


"అవును అల్లుడు గారు. సుందరంకి వాస్తు తెలుసు కూడా. పైగా తన మాటలతో బుట్లో వేసుకోగల ఒడుపు ఉన్న వాడు." చెప్పింది సరళ.


"అవును. ఆ పని చేద్దాం. సుందరంకి ఆ అద్దింటి పని పురమాయించుదాం." కలగ చేసుకుంది గిరిజ.


ఆ వెంబడే..

"ఇక్కడి మా ఇల్లును అద్దెకు ఇచ్చే పనిని కూడా సుందరంకి అప్పగిస్తాం." చెప్పింది.


"ఇది అద్దెకి ఇచ్చేస్తారా." అడిగాడు నాగేశ్వరరావు.


"మరి. తాళం వేసి వదిలేయడం ఎందుకు. మనుషులు నడవాడాలి." చొరవగా చెప్పింది సరళ.


ఆ వెంబడే..

"దీని అద్దె అక్కడి అద్దెకు జమ ఐతే.. వీరికి కలిసి వస్తోంది." చెప్పింది.


నవ్వేసాడు నాగేశ్వరరావు.

శేషగిరి ఏమీ అనలేదు.

వాళ్లు సంభాషణ మరో పక్కకు తిరిగింది.

***

ఓ మంచి రోజున..

తమ ఇంటికి రప్పించుకున్న కుమార్ ను తీసుకొని.. ఊరు బయలుదేరాడు శేషగిరి.. భార్య, బిడ్డతో.. నాగేశ్వరరావు కారులో.


తాము వస్తున్నట్టు ముందుగానే అప్పలస్వామికి.. పార్వతికి తెలిపి ఉన్నాడు.

అప్పలస్వామి.. అనసూయతో కలిసి కుమార్ తో సావధానంగా వ్యవరిస్తున్నాడు.


తమ లంచ్.. తన కన్నవారింట కానిచ్చేక..

శేషగిరి.. వాళ్లందర్నీ తోడ్చుకొని.. పార్వతి వద్దకు వెళ్లాడు.

అక్కడా కుమార్ కు సరైనా రీతినే మర్యాదలు అందాయి.

కుమార్ వీటన్నింటికీ తబ్బిబ్బుపడుతూనే తడవ తడవగా సంతసిల్లుతున్నాడు.

'నాకింతటి భాగ్యమా.' అనుకుంటున్నాడు.


'తన తప్పిదంకి ఇంతటి క్షమాశ్రమమా.' అనుకుంటున్నాడు కూడా.


అలానే..

'ఇదంతా శేషగిరిగారు పెట్టిన భిక్ష.' తన తలపున స్థిర పర్చేసుకున్నాడు.


ఆ మర్నాడు..

భార్యా బిడ్డలతో కలిసి.. పార్వతిని, కుమార్ ని తీసుకొని పక్కూరులోని బ్యాంక్ కు వెళ్లాడు శేషగిరి.


పార్వతి.. కుమార్ పేర్లతో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయించాడు.. కుమార్ ఇష్టతతో. దానిలో కుమార్ ఇల్లు అమ్మగా వచ్చిన మొత్తంని జమ చేయించాడు.


తిరిగి తన భార్య, బిడ్డతో ఊరికి బయలు దేరుతూ.. శేషగిరి..

"కుమార్ గారూ.. మందుగా ఇక్కడ మీ టైలరింగ్ ని చేపట్డండి. అలాగే నా నాన్న మిమ్మల్ని మా పొలాలకు.. పార్వతి వాళ్ల పొలాలకు తరుచు తీసుకు వెళ్తుంటాడు. ఇక్కడి వ్యవసాయ విధాలు గమనించండి. మెల్లి మెల్లిగా మీరు వ్యవసాయం వైపుకు రండి. మీకు అంతా మంచే జరుగుతోంది." చెప్పాడు.


అంతకు ముందు.. తన తల్లిదండ్రుల చేత.. తాము తెచ్చిన.. కొత్త బట్టలను.. పార్వతి, కుమార్ లకు పెట్టించాడు.

***

గ్రామ దేవత పండుగ పిలుపులు..

అటు తన తల్లిదండ్రుల నుండి..

ఇటు పార్వతి కుటుంబం నుండి..

రావడంతో..

తన బ్యాంక్ పనికి మూడు రోజులు సెలవులు పెట్టి.. 

నగరం నుండి నేరుగా..

గిరిజ.. రాగిణిలతో తను పుట్టిన ఊరు వచ్చాడు శేషగిరి.


ఇరు కుటుంబాల వారు.. పార్వతి పొలాల్లో.. సాయంసమయాన.. ఆరుబయలున.. ఆకు పచ్చని గడ్డిన.. గుండ్రంగా కూర్చొని ఉన్నారు. 


పార్వతి తల్లిని.. తను కొని పెట్టిన వీలు ఛైర్ న కూర్చొండబెట్టి.. 

అక్కడికి తెచ్చి పెట్టాడు కుమార్.


రాగిణికి కొత్త వాతావరణం ఉసిగొల్పుతోంది. పురిలేని నెమలిలా ఆడుకుంటోంది.

అంతా అనందమానందంగా మాట్లాడుకుంటున్నారు.

ఆ మాటలు మధ్యన.. శేషగిరి.. గిరిజ..


కుమార్ చక్కగా తమని చూసుకుంటున్నాడని పార్వతి ద్వారా తెలుసుకున్నారు.

తమ జాయింట్ అకౌంట్ లోని మొత్తంని పార్వతితో కూడపలుక్కొని పెంచుకుంటున్నట్టు కుమార్ ద్వారా తెలుసుకున్నారు.


కుమార్.. త్వరలోనే పార్వతి వాళ్ల పొలాలును కౌలుదారుల నుండి తీసుకొని వ్యవసాయంలోకి అడుగు పెట్టబోతున్నట్టు అప్పలస్వామి ద్వారా తెలుసుకున్నారు. 

అలాగే..

పార్వతి గర్భవతి అని పార్వతి తల్లి ద్వారా తెలుసుకున్నారు.


"కంగ్రాట్స్ కుమార్ గారూ." చెప్పాడు శేషగిరి హాయిగా.


"కంగ్రాట్స్ పార్వతి గారూ." చెప్పింది గిరిజ చక్కగా.


అప్పుడే కుమార్ అన్నాడు..

"శేషగిరిగారూ.. మాకు అబ్బాయి పుడితే.. గిరి అని.. అమ్మాయి పుడితే శేష అని పేర్లు పెట్టాలని.. నేను.. పార్వతి నిర్ణయించుకున్నాం." చెప్పాడు కుమార్ ఎంతో వినయంగా.


"అదేమిటి." శేషగిరి నిజంగా విడ్డూరమయ్యాడు.


"మరి.. మీరు మా పాలిటి దొడ్డ మనిషి. మీరు అనుక్షణం మా ఇద్దరి మనసుల్లోనే కాదు.. మా అనునిత్యం స్మరణల్లోనూ ఉండాలి. పైగా మా పై తరాలకు మీరు పరిచయమవుతుండాలి." గొప్పగా చెప్పుతోంది పార్వతి.


శేషగిరి కళ్లల్లో నీళ్లూరుతున్నాయి. 

వాటిని గిరిజ మాత్రమే చూడగలుగుతోంది.

========================================================================

ఇంకా వుంది..

======================================================================== 


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.










141 views0 comments

Comments


bottom of page