top of page
Writer's pictureBVD Prasada Rao

ప్రేమికుడు - పార్ట్ 27


#BVDPrasadaRao, #బివిడిప్రసాదరావు, #ప్రేమికుడు, #Premikudu, #He'sAnEx, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

'Premikudu (He's an ex) - Part 27' - New Telugu Web Series Written By BVD Prasada Rao Published In manatelugukathalu.com On 01/11/2024

'ప్రేమికుడు (He's an ex) - పార్ట్ 27' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



 జరిగిన కథ:


తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళతాడు శేషగిరి. అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతిని కలుస్తాడు. ఆమె సమస్యల్లో ఉందని తెలుసుకొని సహాయం చేయాలనుకుంటున్నట్లు భార్యతో చెబుతాడు. తల్లి సలహా మీద అంగీకరిస్తుంది అతడి భార్య గిరిజ. 


జాతర కోసం ఊరికి వెళ్లిన శేషగిరి, భార్యతో కలిసి పార్వతిని కలుస్తాడు. శోభనం రోజునుండే భర్త విచిత్ర ప్రవర్తన ప్రారంభమైనట్లు చెబుతుంది పార్వతి. ప్రతిరోజూ తనని మానసికంగా హింసించేవాడని చెబుతుంది. 


పార్వతి విషయంలో తన తలిదండ్రుల సహాయం తీసుకుందామంటుంది గిరిజ. మామగారి కారులో కుమార్ ని కలవడానికి వెళతాడు శేషగిరి. డ్రైవర్ సుందరం తో కలిసి కుమార్ దగ్గరకు వెళ్తాడు. భార్యతో తన ప్రవర్తన మార్చుకోవాలని కుమార్ కు గట్టిగా చెబుతాడు. 


కుమార్, తన భార్య పార్వతికి ఫోన్ చేసి క్షమించమని అడుగుతాడు. కుమార్ ప్రవర్తన గురించి మామగారితో కలిసి సైకియాట్రిస్ట్ ని కలుస్తాడు శేషగిరి. కుమార్ లో మార్పు నిజమే అయి ఉంటుందని చెబుతాడు సైకియాట్రిస్ట్.


శేషగిరి బ్యాంకు జాబ్ వస్తుంది. 

కుమార్, పార్వతిలు కలుస్తారు. శేషగిరికి కృతజ్ఞతలు చెబుతారు. 


ఇక ప్రేమికుడు చివరి భాగం చదవండి.


ఆరేళ్ల తర్వాత..

 గ్రామ దేవత పండుగకై తన ఊరు వచ్చాడు శేషగిరి.. తన భార్యని తీసుకొని.. తమ ఇద్దరు పిల్లలతో.. తన సొంత కారులో.


 శేషగిరి ఇప్పుడు బ్యాంక్ మేనేజర్.


 కూతురు రాగిణి.. ఫిఫ్త్ స్టాండర్డ్ చదవుతోంది.

 కొడుకు రాందేవ్.. థర్డ్ స్టాండర్డ్ చదువుతున్నాడు.


 ఈ మారు శేషగిరి అత్తమామలు కూడా వచ్చారు.. సుందరంతో తమ కారులో.


 శేషగిరి వాళ్లు ఊర్లోకి వచ్చిన అర గంట లోపే..

 పార్వతి.. కుమార్ స్వయంగా వచ్చి.. శేషగిరిని తన వాళ్లందరితో కలిసి రమ్మని తమింటికి ఆహ్వానించారు.


 కుమార్.. సొంతంగా ట్రాక్టర్ కొనుగోలు చేసుకున్నాడు. పార్వతి వాళ్ల పొలాల పక్కనే మరో రెండు ఎకరాల పొలాలను పార్వతి పేరున కొనుగోలు చేసుకున్నాడు. వ్యవసాయం పనుల్లో మంచి గ్రిఫ్ సంపాదించుకున్నాడు.


 కుమార్ చొరవతో.. అతను ఊరిలో తిరుగాడుతున్న మంచితనంతో.. పార్వతి.. ప్రస్తుతం ఆ గ్రామ పంచాయితీ మెంబర్ గా పని చేస్తోంది.


 ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు తమకు ఫోన్ కాల్స్ ద్వారా తెలుస్తున్నా.. వాళ్లని ప్రత్యక్షంగా కళ్లారా చూసే సరికి గిరిజతో పాటుగా శేషగిరి తెగ ముచ్చట పడతాడు.


 పార్వతి ఇంటిన..

 "సార్ కాళ్లకి నమస్కరించండి." చెప్పుతున్నాడు కుమార్.. 

తన కొడుకు గిరితో.. కూతురు శేషతో.


 తన కాళ్లకి నమస్కరిస్తున్న ఆ పిల్లల్ని దగ్గరగా తీసుకున్నాడు శేషగిరి.


 "ఓ. బాగా ఎదిగారే. గుడ్. ఆడ, మగ తేడా తప్పా.. పిల్లలిద్దరూ ఒకేలా ఉన్నారుస్మీ. కవలలుగా మరి." అన్నాడు చిన్నగా నవ్వుతూ.

 ఆ వెంబడే..

 "చదివించండి." చెప్పాడు.


 "చదివిస్తున్నాం. ఇద్దరూ ఫోర్త్ క్లాస్." చెప్పింది పార్వతి. 


 "ఈ మా సౌభాగ్యం.. మీ చలువే సార్." అన్నాడు కుమార్ గొప్పగా.. శేషగిరిని చుస్తూ. 


 పార్వతి మురిసిపోతోంది.

 గిరిజ.. శేషగిరిని చూస్తోంది.

 శేషగిరి మనసు పొంగి పొర్లడం తనకి తెలుస్తోంది.

*** 

 గుట్ట మీద జాతరన..

 కుమార్.. పార్వతిలు..

 తమ పిల్లలతో పాటు.. శేషగిరి పిల్లల్ని సందడిగా తిప్పుతున్నారు.


 వీలు ఛైర్ లో ఉన్న పార్వతి తల్లి చెంతన..

 సరళ.. నాగేశ్వరరావు.. 

 అనసూయ.. అప్పలస్వామి..

 ముచ్చటగా ముచ్చట్లాడుకుంటున్నారు.


 వీళ్లకు దరిన..

 గిరిజ.. శేషగిరి ఉన్నారు.

 అందరికీ కొట్టిన కొబ్బరి బొండాలను తెచ్చి ఇస్తున్న సుందరం.. 

 ఆ వరసన.. చివరగా ఒక కొబ్బరి బొండాం తెచ్చి..

 శేషగిరికి అందించాడు.


 శేషగిరి స్ట్రా తీసి పక్కన పడేస్తూ..

 "నువ్వు స్ట్రాతో కాక.. ఇలా తాగగలవా." అన్నాడు గిరిజతో.


 ఆ వెంబడే..

 నేరుగా తన చేతిలోని కొబ్బరి బొండంని నోటి ముందు ఎత్తి పెట్టుకొని దాని నీటిని గడగడా తాగేస్తున్నాడు.


 శేషగిరి తాగి.. ఖాళీ బొండంని పక్కన పెట్టేక.,

 "అల్లుడు సార్.. మీకు ప్రాక్టీస్ ఉంది. గిరిజమ్మకు అలా తాగమంటే ఎలా." అన్నాడు సుందరం.


 శేషగిరి నవ్వేసాడు.

 "నువ్వు ఒకటి తెచ్చుకో." చెప్పాడు సుందరంతో.


 "లేదు అల్లుడు సారూ.. ఇందాకే టీ తాగాను." చెప్పాడు సుందరం.


 "సరే.. పిల్లలు దగ్గరికి పోదాం పద." అన్నాడు శేషగిరి.


 ఆ వెంబడే..

  "రిజా నువ్వూ రారాదూ." అడిగాడు.


 "మనం ఎందుకు అల్లుడు సారూ. పిల్లల్ని కుమార్ వాళ్లు తిప్పుతున్నారు. నేను చూసాను. పిల్లలు సరదాగా తిరుగుతున్నారు." చెప్పాడు సుందరం.

 శేషగిరి ఆగిపోయాడు.

 గిరిజ ఖాళీ బొండంని పక్కన పెడుతోంది.

 "ఏమైనా.. కుమార్ మంచిగా మారిపోయాడు అల్లుడు సారూ." చెప్పాడు సుందరం.


 ఆ వెంబడే..

 "అల్లుడు సారూ.. మీరంటే కుమార్ కి గొప్ప గురి. ఇందాక మాటల్లో కుమార్ చెప్పాడు.. తాము మరో బిడ్డని కంటె.. మీ పేరు పెట్టే వీలు లేదని.. పిల్లలు పుట్టకుండా కుమార్ ఆపరేషన్ చేయించేసుకున్నాడట." నొక్కి చెప్పాడు.


 సుందరం సమాచారంకి.. శేషగిరి గాలిలో తేలిపోతున్నట్టు ఫీలవుతాడు.


 భర్త ఫీలింగ్ ని గిరిజ పసిగట్టేసింది.. ముసి ముసిగా నవ్వుకుంటోంది..


========================================================================

సమాప్తం

ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత శ్రీ బివిడి ప్రసాదరావు గారి తరఫున అభివాదాలు తెలియజేసుకుంటున్నాము.

======================================================================== 

బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.










151 views0 comments

Comments


bottom of page