top of page
Writer's pictureBVD Prasada Rao

ప్రేమికుడు - పార్ట్ 5


He's an ex

'Premikudu (He's an ex) - Part 5' - New Telugu Web Series Written By BVD Prasada Rao Published In manatelugukathalu.com On 15/07/2024

'ప్రేమికుడు (He's an ex) - పార్ట్ 5' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళతాడు శేషగిరి. అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతిని కలుస్తాడు.


గతంలో ఇరువైపుల పెద్దలూ అంగీకరించక పోవడంతో వారి వివాహం జరగదు. పార్వతికి కుమార్ అనే వ్యక్తితో, శేషగిరికి గిరిజతో వివాహాలు జరుగుతాయి.



శేషగిరి, ఇప్పుడు పార్వతిని కలిసిన విషయం తెలిసి అతని తల్లిదండ్రులు మందలిస్తారు. పార్వతి, తన భర్తతో కలిసి ఉండటం లేదని అనిపిస్తోందని శేషగిరికి చెబుతారు వాళ్ళు.


తన ఇంటికి వెళ్లిన శేషగిరి, భార్య దగ్గర పార్వతి ప్రస్తావన తేవడానికి ప్రయత్నిస్తాడు. పార్వతికి సహాయం చేయాలనుకుంటున్నట్లు చెబుతాడు. కోపగించుకుని పుట్టింటికి వెళ్తుంది అతని భార్య గిరిజ.


ఇక ప్రేమికుడు పార్ట్ 5 చదవండి. 


"అమ్మమ్మా.. నా కారు ఏదీ." అడుగుతోంది రాగిణి.


"అదా. డ్రాయింగ్ రూంలో పెట్టా. రా. ఇస్తాను." అటు కదిలింది సరళ.. రాగిణితో.


రాగిణి కారుతో ఆడుకుంటుండగా..

హాలులో ఉన్న గిరిజ వద్దకు వచ్చి..

"కాఫీ కలపనా." అడిగింది సరళ.


"వద్దు." సాధారణంగా చెప్పింది గిరిజ.


కూతురు పక్కనే సోఫాలో కూర్చుంటూ..

"నీ వాలకం బాలేదు. ఏం జరిగింది." సరళ ఆరా చేపట్టింది.


వెంటనే చెప్పక పోయినా..

నిముషం తర్వాత..

రాత్రి జరిపిన భర్త నిర్వాకం మొత్తం పూసగుచ్చినట్టు చెప్పేసింది తల్లితో.. గిరిజ.


సరళ ఎట్టి రియాక్షన్ బయట పెట్టక పోయినా.. తన మనసున నొచ్చుకుంది.

పిమ్మట సర్దుకుంది.

"నువ్వేమంటావు." అడిగింది కూతురుని.


"నా తల దిమ్మెక్కి ఉంది." విసుక్కుంటుంది గిరిజ.


"హుష్. ఆందోళన వద్దు. ఆలోచిద్దాం." తేలిక పర్చేందుకు చూస్తోంది సరళ.


గిరిజ ఏమీ అనలేక పోతోంది.

రాగిణి బ్యాటరీ కారును నడుపుకుంటూ హాలులోకి వస్తోంది.

"తల్లీ.. హాలులో ఆడుకో వద్దని చెప్పుతానుగా. టీవీ.. సోఫాలు ఉన్నాయిగా. అటు బాల్కనీ వైపు వెళ్లమ్మా." మృదువుగానే మనవరాలుతో సరళ చెప్పుతోంది.


"ఓకే. అమ్మామ్మా." ముద్దుగా అంది రాగిణి. అటు వెళ్తోంది.


'చక్కటైన భార్య. ముచ్చటైన బిడ్డ. పసందైన కాపురం.' గొణుక్కుంటుంది సరళ.


ఆ వెంబడే..

"అణుకువ.. అనుకూలత.. మొండుగా కనిపించిన అల్లుడుగారిలో ఈ కొత్త యాంగిల్ ఏమిటి." బయటికే అనేసింది.


"అదేనమ్మా నా ఆందోళన." చెప్పేసింది గిరిజ.


రమారమీ రెండు నిముషాల మౌనం పిమ్మట..

"ఆ పార్వతి కాపురం పునరుద్ధరించడం ఏమిటి. ఇతనికి ఎందుకు." అంది సరళ.


"దానికి ఒకప్పటి ప్రేమికుడు కదమ్మా." వ్యంగ్యంగానే అంది గిరిజ.

"బాగుంది సంబడం. కాపురంలో ఉన్నోడు.. ఇలాంటి పనులు చేయోచ్చా." నోరు నొక్కుకుంటుంది సరళ.


"నా కర్మమ్మా." దిగులయ్యిపోతోంది గిరిజ.


కూతురు అవస్తని పసిగట్టి..

"అయ్యో. అలా అనుకోకమ్మా. దీనిని ఎవరూ వెనుకేసుకు రాలేం. మేము ఉన్నాంగా. మితి మీరనివ్వం. ధైర్యంగా ఉండు." చెప్పింది సరళ. ఆవిడ కూతురు బుగ్గలు నిమురుతోంది.


ఆ వెంబడే..

"ఇంతకీ ఈ బాగోతం మీ అత్తమామలకు తెలుసా." అడిగింది.


"ఏమోనమ్మా." నిస్సంగంగా అనేసింది గిరిజ.


"పాపం. వాళ్లకు తెలియక పోవచ్చు. వాళ్లని ఎరిగిన వాళ్లమేగా. వాళ్లు నిజంగా భోళా మనుషులు." అంది సరళ.


"వాళ్ల ఊసు ఎందుకులే అమ్మా. ఇతని వాలకమే భయ పెడుతోంది." నీర్సమై పోతోంది గిరిజ.


"దిగులు పడకు. మీ ఆయన వాలం కత్తించేద్దాం. ఎట్టి తమాషా ఐనా తొక్కేద్దాం." సరళ ఖండితంగా అంది.


గిరిజ మాట్లాడ లేదు.

పావు నిముషం తర్వాత తనే..

"ఎలా అమ్మా." అడిగింది.


"నీ భర్త వైపు నుండే నరుక్కోద్దాం." చెప్పింది సరళ.


"అదెలామ్మా." విస్మయమయ్యింది గిరిజ.


"ముందుగా అల్లుడుగారు నీకు ఈ విషయం చెప్పాడు. కదా. అంటే.. అతడిలో దాపరికం లేదు. మర్మం లేదు. సో.." ఆగింది సరళ.


ఆ గ్యాప్ లోనే..

"సో." అంది గిరిజ.


"ఆ పార్వతి విషయంలో అల్లుడుగారి చేష్ట ఓపెన్ సీక్రెటే. తెలుస్తోందిగా. ముందే నీతో అతడి చేత ఏమిటో చెప్పాడు. పైగా నీ అభిప్రాయం కోరాడు. సో. అతడు నీ గ్రిప్ న ఉన్నట్టే." ఆగింది సరళ.


తల్లినే చూస్తోంది గిరిజ.

అంతలోనే రాగిణి అక్కడికి వస్తోంది.

"మమ్మీ. వాటర్ కావాలి." అడిగింది గిరిజను.


గిరిజ లేచింది. ఫ్రిడ్జ్ వైపు కదిలింది.

వెనుకే రాగిణి వెళ్తోంది.


"వాటర్ ఇచ్చి.. అందులో చాకోబార్ లు ఉంటాయి. రేపర్ తీసి ఒకటి తల్లికి ఇవ్వు." చెప్పింది సరళ.. కూతురుతో.


గిరిజ ఆ పనులు కానిచ్చి.. తిరిగి వచ్చింది.

చాకోబార్ తింటూ.. రాగిణి తిరిగి కారు వైపుకు వెళ్తోంది.

"చెప్పమ్మా." అడిగింది గిరిజ. తను తల్లి పక్కన కూర్చుంది.


"అల్లుడుగారు ఎస్కేప్ కాడు. నీతో ముందుగా చెప్పాడంటే.. అన్నీ చెప్పే చేస్తాడు. తెలుస్తోందిగా. ఒక వేళ తప్పుడు ఆలోచనే అతడిలో ఉంటే.. తప్పక తను తీసిన గోతి లోనే అతడు పడడం ఖాయం. అంత వరకు రాడు. నన్ను నమ్ము." చెప్పింది సరళ.


ఆ వెంబడే..

"ఒకరిని సేవ్ చేయాలనే గుణం ఉందంటే నీ భర్త మంచోడు కిందే లెక్క." సరళ.. కూతురుకు నమ్మకం కుదురుస్తోంది.


"అతడి మీద నాకు గురి ఏర్పడి ఉంది." చెప్పింది గిరిజ.


"ఒకటి చేయ్. పార్వతి గురించి అతడు చేయబోతోంది.. నీకు ముందుగా చెప్పమను." చెప్పింది సరళ.


ఆ వెంబడే..

"ఆ చెప్పేది వార్నింగ్ లా కానీ.. కండిషన్ లా కానీ కాకుండా.. సౌమ్యంగా.. కోరుకుంటున్నట్టుగా చెప్పు. చాలు." చెప్పింది.


గిరిజ తలాడించింది.

"జరిగేది నాకు నువ్వు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండు. కంట్రోలింగ్ మన చేతుల్లో ఉండే అతడు మితి మీరడు. నీ చెయ్యి జారిపోడు." చెప్పింది సరళ. 


తల్లి భరోసా తన తల కెక్కించుకుంటోంది గిరిజ.

***

తమ ఇంటిలో..

రాగిణి భోజనం అయ్యేక.. తను హాలులోని టివి చూస్తుంటే..

డైనింగ్ టేబుల్ ముందు.. ఎదురెదురుగా కూర్చొని.. శేషగిరి.. గిరిజ ఎవరికి వారు వడ్డన చేసుకుంటూ డిన్నర్ కానిస్తున్నారు.


ముందుగా గిరిజే తమ మధ్య తచ్చాడుతున్న మౌనంని తుంచేస్తూ..

"ఆ పార్వతి విషయం మీ అమ్మా నాన్నలతో మాట్లాడేరా." అడిగింది.


అంత వరకు తలెత్తకుండా భోజనం చేస్తున్న శేషగిరి..

వెసులుబాటుగా ఫీలవుతూ.. తలెత్తాడు. భార్యని తేఱిపాఱ చూసాడు.


"లేదు. వాళ్ళకి చెప్పలేదు." నెమ్మదిగానే చెప్పాడు.


ఆ వెంబడే..

"మొదటి నుండి వాళ్లు.. పార్వతి విషయంలో చాలా దుందుడుకుగా మూవ్ అయ్యేవారు. నేను చెప్పేది వినేవారు కాదు. నన్నే గట్టిగానే మందలించేవారు." చెప్పాడు.


గిరిజ వెంటనే ఏమీ మాట్లాడ లేదు.

శేషగిరే కలగ చేసుకుంటున్నట్టు..

"పార్వతి విషయంలో నా ఆలోచన నీకు చెప్పాను. కానీ నీ అభిప్రాయం తీసుకోనిదే నేనేమీ చేయను. ప్రామిష్. డోన్ట్ థింక్ అదర్వైజ్ ప్లీజ్." భార్యనే చూస్తూ చెప్పాడు.


భర్తనే చూస్తోంది గిరిజ. ఆమెకు భర్త తీరు ఆకట్టుకుంటుంది.

తను మనసున ముచ్చటవుతోంది.


"మీ మమ్మీ, డాడీలకు ఈ విషయం చెప్పేసావా." 

దీనమవుతున్నాడు శేషగిరి.


అది గుర్తించిన గిరిజ.. ఒక్కమారుగా భర్త మీద జాలి పడుతోంది.

చిన్నగా కదిలిపోతూ..

"అబ్బే. లేదు లేదు." అబద్ధమాడింది. భర్తని బేజార పర్చరాదని తలిచింది.


ఆ పిమ్మట.. ఆ ఇద్దరి మధ్య మాటలు లేవు.

ఇద్దరి డిన్నర్ పూర్తయ్యింది.


తను తిన్న కంచాన్ని, గ్లాస్ ని పట్టుకు పోయి.. షింక్ న కడిగి పక్కన పెట్టేసాడు శేషగిరి.. ఎప్పటి మాదిరిగానే.

తను తిన్న కంచం, గ్లాస్ లతో లేస్తూ..

"రాగిణిని తీసుకు పోయి మన గదిలో నిద్ర పుచ్చండి." చెప్పింది.


ఆ వెంబడే..

"నేను ఇక్కడి పనులు చక్క పెట్టి.. హాలులో.. సోఫా కమ్ బెడ్ న ఉంటాను." మెల్లిగా చెప్పింది.


శేషగిరి తబ్బిబ్బయ్యాడు.

అది గుర్తించిన గిరిజ ముసి ముసిగా నవ్వుకుంటోంది.

***

మర్నాడు..

శేషగిరి ఆఫీసుకు టైంకి వెళ్లాడు.

రాగిణి పక్కింటి పాపతో ఆడుకోవడానికి వెళ్లి ఉంది.

హాలులో సోఫాలో కూర్చొని ఉంది గిరిజ.

సరళకి ఫోన్ చేస్తోంది.


తన ఫోన్ కాల్ కు తల్లి కనక్ట్ కాగానే..

"డాడీ ఆఫీస్ కు వెళ్లి పోయారా." అడిగింది.


"ఆఁ. ఏదో మీటింగ్ అని పెందలినే వెళ్లి పోయారు. వచ్చే సరికి రాత్రి కావచ్చన్నారు." చెప్పింది సరళ అటు నుండి.

ఆ వెంబడే...

"మీ ఆయన." అడిగింది.


"ఇప్పుడిప్పుడే వెళ్లారు." చెప్పింది గిరిజ.


ఆ వెంటనే తనే..

రాత్రి డైనింగ్ టేబులు వద్ద.. తనకు.. భర్తకు మధ్య చోటు చేసుకున్న కబుర్లను చక్కగా చెప్పగలిగింది.


విన్న సరళ కడు సంతసిల్లింది.


========================================================================

ఇంకా వుంది..

======================================================================== 


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.










148 views0 comments

Comments


bottom of page