top of page

ప్రేమికుడు - పార్ట్ 9


He's an ex

'Premikudu (He's an ex) - Part 9' - New Telugu Web Series Written By BVD Prasada Rao Published In manatelugukathalu.com On 03/08/2024

'ప్రేమికుడు (He's an ex) - పార్ట్ 9' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళతాడు శేషగిరి. అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతిని కలుస్తాడు. తన ఇంటికి వెళ్లిన శేషగిరి, భార్య దగ్గర పార్వతి ప్రస్తావన తెస్తాడు. పార్వతికి సహాయం చేయాలనుకుంటున్నట్లు చెబుతాడు. కోపగించుకుని పుట్టింటికి వెళ్తుంది అతని భార్య గిరిజ. శేషగిరి దాపరికం లేని వ్యక్తి అని, కాబట్టి అతని ద్వారా ప్రతి విషయాన్నీ తెలుసుకొమ్మని చెబుతుంది గిరిజ తల్లి సరళ.


ఫోన్ లో పార్వతితో శేషగిరి, గిరిజ మాట్లాడుతారు.

జాతర కోసం రికి వెళ్లిన శేషగిరి, భార్యతో కలిసి పార్వతిని కలుస్తాడు.



ఇక ప్రేమికుడు పార్ట్ 9 చదవండి. 


"అత్త లేదు. నా భర్త పదేళ్లప్పుడు చనిపోయిందట. అత్త పోయేక.. మామ ఎటో పోయాడట. నా భర్త ఆ ఇంటి ఏకైక బిడ్డట. నా అత్తింటి బోగాటం ఇంతే. ఇంతకి మించి ఏమీ లేదు." చెప్పింది పార్వతి.


"మీ భర్త ఏం చేస్తున్నారు." అడిగింది గిరిజ.


"బంధువులు చేరతీయక పోయినా.. నా భర్త.. ఇరుగు పొరుగు వాళ్ల సానుభూతితో పెరిగాడట. తను నేర్చుకున్న టైలరింగ్ తో ఒక అద్దె కుట్టు మిషన్ తో ఇంట్లోనే షాపు మొదలెట్టి.. ఇప్పుడు రెండు సొంతం.. మూడు అద్దె కుట్టు మిషన్ లతో బజారులో ఒక షాపు నడుపుతున్నాడు." చెప్పింది పార్వతి.


అర నిముషం తర్వాత..

"మరి ప్రొబ్లం ఎక్కడ. మీ భర్త నీతో ఎలా ఉంటాడు." అడిగింది గిరిజ. 


గుప్పున పార్వతి అలజడయ్యింది.

గిరిజ గుర్తించింది.


"పార్వతి గారూ.. ఏమోషన్ కావద్దు. ప్లీజ్. మీకు జరిగిందేదో దారుణంలా తోస్తోంది. అది మీకు తెలుసు. మాకు తెలిస్తే.. ఒకరికి ఒకరం తర్కించుకోగలం." మెల్లిగా చెప్పింది గిరిజ.


"ఆయన ఒక.. అబ్బ.. ఏం చెప్పాలి.. ఎలా చెప్పేది.." పార్వతి చిందరవందరవు తోంది.


భర్తని చూస్తోంది గిరిజ.

శేషగిరి.. పార్వతినే చూస్తున్నాడు.

"ఆవేశం పడవద్దు. ఆందోళనని వీడండి. మాట్లాడుకుంటే మీకు తప్పక మేలవుతోంది. నమ్మండి." చాలా సౌమ్యంగా చెప్పింది గిరిజ.


"అవును పార్వతి." శేషగిరి కలగచేసుకున్నాడు.


అప్పుడే..

"పారూ.. ఇలా రావే." లోపలి ఇంటి నుండి గట్టిగానే పిలుపు వినబడింది.


"అమ్మ." చెప్పింది పార్వతి. లేచింది. అటు వెళ్లింది.


అప్పుడే.. శేషగిరితో..

"పార్వతి అతలాకుతలం అవుతోంది. పాపం ఏం జరిగిందో." అంది గిరిజ.


"చెప్పడానికి నాన్చుతోంది. చెప్పితేగా తెలుస్తోంది." అన్నాడు శేషగిరి.


"ప్రయత్నిద్దాం." చెప్పింది గిరిజ.


పార్వతి తిరిగి వచ్చింది.

"మీ అమ్మగారు నడవ లేరా. మంచం మీదే ఉంటారా." అడిగింది గిరిజ.


"నడవ లేదు. దేకుతోంది. ఒక పక్క సపోర్ట్ ఇస్తే.. ఒక కాలితో నెమ్మదిగా అడుగులు వేస్తోంది. ఎక్కువగా మంచానే ఉంటుంది." చెప్పింది పార్వతి.


అర నిముషం తర్వాత..

శేషగిరి కదపడంతో..  

పార్వతి కదిలింది. తనది చెప్పనారంభించింది.

***

పార్వతి చెప్పుతున్న..

ప్లాష్బాక్ 1..


పార్వతి అమ్మమ్మ నుండి కబురు రావడంతో..

ఆ ఊరు వెళ్లారు పార్వతి తల్లిదండ్రులు.

"పార్వతికి సంబంధం చూసాం. ఊర్లోదే." చెప్పింది పార్వతి అమ్మమ్మ.


ఆ వెంబడే..

"అత్త పోరు ఉండదు. మామ ఇంటి పట్టున ఉండడు. ఇంటికి అబ్బాయి ఒక్కడే. పేరు కుమార్. కుమార్ రాజాలా ఉంటాడు. పేరుకు తగ్గట్టే మంచోడు. పెళ్లాన్ని బాగా చూసుకుంటాడు. మీరు చూస్తే ఇష్టపడి తీరుతారు. పార్వతికి బయటనే ఆ అబ్బాయిని మామూలుగా చూపించడం జరిగింది కూడా." చెప్పింది పార్వతి అమ్మమ్మ.


"ఏమ్మా చూసావా." అడిగింది పార్వతి తల్లి.


"చూసాను. టైలరింగ్ షాపులో చూసాను." చెప్పింది పార్వతి.

అప్పుడే..

"ఆ షాపు ఆ కుర్రోడిదే." చెప్పింది పార్వతి అమ్మమ్మ.


 "కుర్రోడు నచ్చాడా." అడిగాడు పార్వతి తండ్రి.

 తలాడించింది పార్వతి.


"నోటితో చెప్పు." చెప్పాడు పార్వతి తండ్రి.


"బాగానే ఉన్నాడు." చెప్పింది పార్వతి.


"మరేం. పెద్దలు కలగచేసుకోండి. మాట్లాడేయండి. ఈ సంబంధం కుదుర్చుకోండి." అనేసింది పార్వతి అమ్మమ్మ.


'దీని పీడ వదుల్చుకోవాలి.' అనుకుంది. ఇలా అనుకోవడం ఇప్పటికి వందో సారి దాటిన మాటే.


"కుర్రోడు ఏం చేస్తాడో." అడిగాడు పార్వతి తండ్రి.


"చెప్పాగా. టైలరింగ్ షాపున్నోడు. ఆరు కుట్టు మిషన్లు ఉన్నాయి. నడి బజారున షాపు. పనికి కొదవ లేదు. పైగా ఇచ్చిందే పుచ్చుకొనే మనిషి, మాకు తెలిసిన మనిషి ద్వారా తెలుసుకొని ఉన్నాను." చెప్పింది పార్వతి అమ్మమ్మ.


"సరే. ఎలా వచ్చాంగా. చూద్దాం." తేల్చేసాడు పార్వతి తండ్రి.


ఆ సాయంకాలం..

కుమార్ ఇంటికి వెళ్లారు.. పార్వతి అమ్మమ్మతో.. పార్వతి తల్లిదండ్రులు.


పార్వతి తండ్రి.. అరెకర పొలం భూమి మాత్రమే ఇస్తామన్నాడు.


కుమార్.. భూమి వద్దు.. దానికి తగ్గ డబ్బు ముట్ట చెప్పమన్నాడు. పెళ్లి ఖర్చులను పెట్టుకోమన్నాడు.

పార్వతి తండ్రి ఒప్పేసుకున్నాడు.


తక్కువ మాటలతోనే వెంటనే సంబంధం కుదిరిపోయింది.


ఆ వెంబడే..

ఓ ముహూర్తాన.. పార్వతి అమ్మమ్మ ఊరిలోనే.. ఓ గుడిలో.. పార్వతి, కుమార్ ల పెళ్లైపోయింది.

***

రాగిణి అల్లరి కొనసాగుతుండడంతో..

పార్వతి చెప్పడం ఆపింది.


"దీనికి బోర్ కొడుతున్నట్టుంది." అన్నాడు శేషగిరి.


రాగిణిని సముదాయిస్తూనే..

"దీనికి నిండుగా బొమ్మలు ఉండాలి." గిరిజ అంది. 


చిన్నగా నవ్వుతోంది.

శేషగిరి లేచాడు. రాగిణిని ఎత్తుకున్నాడు.

గిరిజ కూడా లేచింది.

"పాప ఊరుకొనేలా లేదు. మేము వెళ్తాం." నెమ్మది నెమ్మదిగా చెప్పింది.


"మళ్లీ కలిసి మాట్లాడదాం." శేషగిరి చెప్పాడు.


పార్వతి లేచి నిల్చుంది.

తను ఏమీ అనలేక పోతోంది.

ఆ భార్యాభర్తలు కూతురుతో కదిలారు.


వాళ్ల వెనుకనే..

పార్వతి గడప వరకు వెళ్లి ఆగింది.


ఆ భార్యాభర్తలు.. వీథిలో ఆగి.. పార్వతికి.. 'బై బై'లు చెప్పారు.

రాగిణి అల్లరి ఆగిపోయింది.


వీథిలో చేరువనే తచ్చాడుతున్న కుక్కను చూస్తూ ఉంది.

"ఆంటీకి బై చెప్పు." తన చంకనున్న కూతురుతో అంటున్నాడు శేషగిరి.


రాగిణి తల తిప్పి.. పార్వతి వంక చూస్తూ..

"బై." అనేసింది.


పెద్దలు ముగ్గురూ నవ్వుకున్నారు.

వచ్చిన వాళ్లు తిరిగి తమ ఇంటికి వెళ్తుండగా..

పార్వతి ఇంట్లోకి నడిచింది.. వీథి తలుపు మూసుకొని.

 ***

రాత్రి..

రాగిణి భోజనం తిన్నాక.. తన ముందు తమతో తెచ్చుకున్న తన బొమ్మలని కుమ్మరించింది గిరిజ.


అప్పటికి శేషగిరి సూచన మేరకు..

నలుగురుకీ భోజనాలు వడ్డన చేసి పెట్టింది అనసూయ. 

వాళ్లు భోజనాలు చేస్తూ మాట్లాడుకుంటున్నారు.


"ఏమైనా.. వాళ్లకి మనకు పడనప్పుడు.. వాళ్లింటికి వెళ్లడం నచ్చడం లేదు." అనేసింది అనసూయ.


"నాకున్నూ. అందులో కోడలిని అక్కడికి తీసుకు వెళ్లడం మరీ బాగోని విసయం." కలగచేసేసుకున్నాడు అప్పలస్వామి.


"చెప్పాగా నాన్నా. గతాన్ని ఇంకా సాగ తీసుకోవడం ఎందుకు. పైగా పార్వతికీ పెళ్లయ్యిపోయింది. నాకూ పెళ్లయ్యిపోయింది. వెళ్లింది నా భార్యతో కూడా. మీరు మరీ తప్పుగా ఇంకా ఆలోచిస్తున్నారు. నాకూ మీ తీరు నచ్చడం లేదు." అనేసాడు శేషగిరి.


చేస్తున్న భోజనం ఆపేసి.. 

"బిడ్డా.. ఇది చిన్నూరు. ఒకరివి ఒకరు పట్టించుకుంటారు. ఆ మాటలు పడడం మాకు కష్టం." చెప్పింది అనసూయ.. శేషగిరిని చూస్తూ.


శేషగిరి ఏదో అనబోయాడు.

అంతలోనే గిరిజ అడ్డై..

"మీ పెద్దల మాట మీరడం కాదు కానీ.. నాదో మాట." చెప్పి.. ఆగింది.


తల్లిదండ్రులతో పాటుగానే.. గిరిజను చూస్తున్నాడు శేషగిరి.

"మనం తప్పు చేయనప్పుడు.. మనది తప్పు కానప్పుడు.. ఇతరల జోక్యాన్ని అస్సలు పట్టించుకో కూడదు." చెప్పింది గిరిజ.


ఆ వెంబడే..

"నా భర్తని వెనుకేసుకోవడం లేదు కానీ.. ఈయన బంగారం." చెప్పేసింది.


శేషగిరి ఒళ్లు పులకరిస్తోంది.

తల్లిదండ్రుల వైపు చూసాడు.

వాళ్లిద్దరూ అప్పుడే ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు.


అటు నుండి చూపుని తిప్పి.. గిరిజ మీద చూపుని ఆపాడు.

అతడినే ఆమె చూస్తోంది. తృప్తిగా నవ్వుతోంది.

తన రెప్పలను రెప్పపాటు వ్యవధిల్లో చికిలించి..

'థాంక్స్' చెప్పాడు పెదాలతో.


దానికి గిరిజ సుతిమెత్తగా నవ్వేసింది.

వాళ్ల భోజనాలు కొనసాగుతున్నాయి.


========================================================================

ఇంకా వుంది..

======================================================================== 


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.










149 views0 comments

Comments


bottom of page