top of page

పూజనీయుడు తండ్రి

Updated: 2 days ago

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #PujaniyuduThandri, #పూజనీయుడుతండ్రి, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 55


Pujaniyudu Thandri - Somanna Gari Kavithalu Part 55 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 10/04/2025

పూజనీయుడు తండ్రి - సోమన్న గారి కవితలు పార్ట్ 55 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


పూజనీయుడు తండ్రి

----------------------------------------

నాన్న గుణం గొప్పది

చూడగా సృష్టిలో

పొంగిపొర్లు చున్నది

ప్రేమ యేరు మనసులో


నిలువెల్లా త్యాగము

మహాత్ముడు నాన్నలో

నవనీతం హృదయము

సూర్యుడే ఇంటిలో


బాధ్యతకు ఆనవాలు

ప్రక్కనుంటే చాలు

వారు లేక సదనము

వాడిన పూలవనము


నాన్న చెప్పే మాట

భవితకు పసిడి బాట

పూజనీయుడు తండ్రి

ఇంటికి కంచుకోట















మా మంచి అన్నయ్య

----------------------------------------

ప్రేమ పంచును అన్న

అన్న మనసే వెన్న

వెన్నెల్లా చల్లన

పసిడి కన్నా మిన్న


మేమంటే ఇష్టము

మాకెంతో శ్రేష్టము

నాన్న తదుపరి మాకు

అన్న కదా దుర్గము


ఉంటాడు తోడుగా

వెన్నంటే నీడగా

ఆడిస్తాడు ఆటలు

చూస్తాడు మంచిగా


అన్నయ్య ఇంటిలో

చంద్రుడే నింగిలో

మా బాగోగులు చూచి

కొలువుండు గుండెలో










చెట్టు ఆవేదన-నివేదన

----------------------------------------

చెట్టు తల్లిని నేను

హాని చేయగ లేను

ఎందుకు నాపై కక్ష!

నరికి వేస్తారు శిక్ష!


నా ద్వారా ఫలములు

నిలుపుతాను అసువులు

చల్లని నీడ నిస్తా!

గొడుగులా నిలుస్తా!


రాకుండా కరువులు

కురిసేలా వానలు

చేసేస్తా మేలులు

ఉంటాను తల్లిగా


స్వచ్ఛ వాయువునిస్తా!

ఆయువు పెంచేస్తా!

గొడ్డలికి బలి చేయకు

బిడ్డా! తొందరపడకు


















ఇష్టమైన తాతయ్య

----------------------------------------

తాత గారి పలుకులు

జుంటితేనె ధారలు

కథలూ,ఊసులతో

నింపుతాయి బొజ్జలు


తాత చెప్పు నీతులు

ఉద్ధరించు మాటలు

ఆలకిస్తే గనుక

దిద్దుతాయి బ్రతుకులు


ప్రేమగా నిమురుతూ

నేర్పుతాడు విలువలు

బజారుకెళ్ళితే

తెస్తాడు వస్తువులు


ఇష్టమైన తాతయ్య

ఇల్లంతా దీపము

మీసాల తాతయ్య

ప్రేమకు ప్రతిరూపము












అందాల ప్రకృతి

----------------------------------------

ప్రకృతితో మమేకము

కావాలోయ్! నేస్తము

తాకునోయ్! హృదయాలు

తనివితీరని అందాలు


శోభకూర్చు పుడమికి

మేలు చేయు మనిషికి

ప్రకృతి వరప్రసాదము

చుట్టూ పచ్చదనము


ప్రకృతిని రక్షిస్తే

ఎంతెంతో లాభము

అందరికీ క్షేమము

అగును స్వర్గధామము


తల్లిలాంటిది ప్రకృతి

మనోహరమే ఆకృతి

దాని పరిరక్షణే!

జీవకోటి రక్షణే!


-గద్వాల సోమన్న


Comments


bottom of page