#PunnamiRathri #పున్నమిరాత్రి #TeluguSuspenseThriller #TeluguHorrorStories
'Punnami Rathri' - New Telugu Story Written By Veereswara Rao Moola
Published In manatelugukathalu.com On 26/09/2024
'పున్నమి రాత్రి' తెలుగు కథ
రచన: వీరేశ్వర రావు మూల
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
డిస్ట్రిక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్ఆఫీస్, విశాఖపట్టణం
డిజిపి నరేంద్ర ఉన్నతాదికారుల తో సమావేశం నిర్వహించాడు.
"మూడు నెలల్లో ముగ్గురు అమ్మాయిల మిస్సింగ్ కేసులు. ఒక్క క్లూ లేదు. ముగ్గరూ వర్జిన్సే. అది కూడా అమ్మాయిలు హస్టల్స్ నుండి మాయమవుతున్నారు. మొదటి అమ్మాయి సాంఘిక సంక్షేమ హాస్టల్ నుండి, రెండో అమ్మాయి లేడీస్ హాస్టల్ నుండి. నాకు పెరెంట్స్ నుండి, హోమ్ మినిస్టర్ నుండి చాలా ప్రెషర్ ఉంది. ఆయన్ని ప్రతిపక్షాలు ఉతికి ఆరేస్తున్నాయి. నాకు త్వరగా కేస్ ని సాల్వ్ చెయ్యాలి"
"ఇన్ స్పెక్టర్ రంజిత్ ఐతే దీన్ని సాల్వ్ చెయ్యగలడనిపిస్తోంది. " అన్నాడు ఐజి రామన్.
"సరే, జార్ఖండ్ లో ఉన్న రంజిత్ ని పిలవండి డెప్యుటేషన్ మీద"
********
నరేంద్ర ఇంటి దగ్గర..
"గుడ్ మార్నింగ్ సార్, నరేంద్ర గారూ "
"గుడ్ మార్నింగ్, రంజిత్, ఉదయమే వచ్చావా ?" అంటు ఒంగి, షూ లేస్ కట్టుకుంటున్నాడు.
అతని షూ మీద మొసలి బొమ్మ ఉంది. అది చూసి రంజిత్ అడిగాడు. "మీరు కాస్టలీ షూ వాడుతున్నారా ? "
"అవును ఒరిజినల్ మొసలి చర్మం, సింగపూర్ నుండి తెప్పించాను."
"వెరీ నైస్, మీ టేస్ట్ డిఫరెంట్ గా ఉంది. "
"ఎప్పుడు మొదలు, మన సెర్చ్"
"ఈ రోజే "
"బెస్ట్ ఆఫ్ లక్ "
"థాంక్యూ"
*********
రంజిత్ ఇప్పటి వరకూ మిస్సయిన అమ్మాయిల వివరాలు పరిశీలించాడు. నెలకు ఒక అమ్మాయి మిస్సయింది. చెక్ పోస్ట్ ల దగ్గర సి సి టీవి ఫుటేజ్ పరిశీలించాడు. ఒక ఫుటేజ్ లో మొసలి బొమ్మ తో ఉన్న టీ షర్ట్ ధరించి ఉన్న వ్యక్తి కనిపించాడు.
అమ్మాయిల్ని ఎత్తుకు పోయి, వేరే రాష్ట్రాలలో అమ్మేసే ముఠా పని చేస్తోందా ?
ముగ్గురి పేర్లు పేర్లు కాగితం మీద రాసాడు.
నందన - 13 వ తేది
విమల - 13 వ తేదీ
వర్ష - 13 వ తేది
ముగ్గురు మిస్సయిన రోజు కి ఒక విశేషం ఉంది. అది పౌర్ణమి.
అంటే పౌర్ణమి నాడే మిస్సవుతున్నారా ?
పౌర్ణమి కి, మిస్సింగ్ కి ఏదైనా లింక్ ఉందా ?
యాదృచ్చికమా ?
రంజిత్ టీ తాగుతూ కేలండర్ కేసి చూసాడు. రేపే పౌర్ణమి!
**********
మర్నాడు సాయంత్రం ఐదు గంటలికి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేస్ నమోదయ్యింది. పేరు కరుణ. వర్జిన్.
ఖచ్చితం గా పున్నమికి, మిస్సింగ్ కి లింక్ ఉంది.
కనిపెట్టాలి అనుకున్నాడు రంజిత్
********
రంజిత్ కి అరకు దగ్గర లో ఉన్న గ్రామం బోయిగూడా నుండి ఫోన్ వచ్చింది. అతను జర్నలిస్ట్ రవీంద్ర. రంజిత్ క్లాస్ మేట్.
"రంజిత్ సరదాగా వీకెండ్ లో రాకూడదూ "
"రాక పోతే ఊరుకోవు కదా. నీ చేతి బిర్యాని రుచి చూడాలి కదా"
"మరి ఆలస్యం ఎందుకు, ఈ వీకెండ్ ప్లాన్ చేసుకో "
"ష్యూర్"
*********
"రంజిత్ నీకో విషయం తెలుసా, ఇక్కడ ఒక గుహ ఉంది "
"అందు లో ప్రతీ పున్నమి కి దెయ్యాలు వచ్చి నాట్యం చేస్తాయి అని స్థానికులు అంటారు"
"పున్నమి " అనగానే రంజిత్ ఉలిక్కి పడ్డాడు.
"ఈ పున్నమి కి అక్కడికి వెడుతున్నాం"
"రిస్క్ ఏమో "
"విషయం బయటికి రావాలంటే తప్పదు "
రంజిత్ కి బోయిగూడా లో స్ధానికుడు కలిసాడు.
అతను చెప్పిన ప్రకారం గుహ దగ్గర కార్లు కనిపించాయట.
"నువ్వెందుకు అటు వెళ్ళావు ?"
"మంచి రుచి గల కుందేళ్ళు అక్కడే ఉంటాయి " అన్నాడు చిన్న గొంతు తో
*********
పున్నమి నాటి రాత్రి రవీంద్ర, రంజిత్ బైక్ మీద ఆ గుహ దగ్గరికి వెళ్ళారు. గుహ ని సమీపిస్తుండగా త్రాచు పాము ఒకటి పడగ విప్పి దారి లో ఉంది.
బైక్ స్లో చేసాడు. సరిగ్గా అదే సమయం లో డ్రైవ్ చేస్తున్న రవీంద్ర ని ఒక ముసుగు వ్యక్తి తల మీద కొట్టాడు. రంజిత్ అలర్టయి పిస్తోలు ని అతని వైపు పేల్చాడు. ఆ ముసుగు వ్యక్తి పారిపోతూ బురదలో బూటు ని వదిలేసాడు. రవీంద్ర కి కట్టుకట్టి బూటు ని నీళ్ళ తో కడిగి చూసాడు. దాని మీద బొమ్మ ని చూసి ఆశ్చర్య పోయాడు!
"మొసలి"
రంజిత్ అదే మొసలి బొమ్మని డిజిపి నరేంద్ర బూటు పై చూసాడు.
నరేంద్ర కి ఇందు లో పాత్ర ఉందా ?
***********
"అమ్మాయిల మిస్సింగ్ కేస్ ప్రొగ్రెస్ ఏమిటీ ?" అడిగాడు డిజిపి నరేంద్ర
"ఇన్విస్టిగేషన్ ప్రొగ్రెస్ లో ఉంది. మన డిపార్ట్ మెంట్ వాళ్ళ ఇన్వాల్వ్ మెంట్ ఉందేమోనని అనుమానం ఉంది. "
"నో నో నాకు నా టీమ్ మీద నమ్మకం ఉంది. నీకు కష్టమైతే చెప్పు వేరే ఎసైన్ మెంట్ ఇస్తా"
"అలా కాదు. చిన్న అనుమానం. త్వర లోనే సాల్వవుతుంది"
"సరే ' ఫోన్ కట్ చేసాడు నరేంద్ర
"Everybody is gentleman until the contrary is proved " అనుకున్నాడు రంజిత్ మనస్సు లో
********
రంజిత్ గరల్స్ హాస్టల్స్ దగ్గర బందోబస్తు పెంచాడు. అనుమానం గా ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు. వాట్సాప్ గ్రూప్ ద్వారా హాస్టల్స్ లో ఉండే అమ్మాయులను ఎలర్ట్ చేసాడు. రంజిత్ మళ్ళీ గుహ దగ్గరికి వెళ్ళాడు. చుట్టుపక్కల ఖాళివాటర్ బాటిల్స్, ఖాళి మందు బాటిల్స్ కనిపించాయి. కాని మనుష్యులు కనబడలేదు.
*******
ఈ సారి సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీసుల తో గుహ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళే ముందు రవీంద్ర దగ్గరికి వెళ్ళి "వస్తావా ?"
అడిగాడు.
"లేదు ! యాక్సిడెంట్ అయ్యాక కొంచెం చెయ్యి నొప్పిగా ఉంది, రాను"
"సరే, రెస్ట్ తీసుకో "
బయటికి వెడుతూ కిటికీ లోంచి చూసాడు. రవీంద్ర ఎవరితోనో లో గొంతుక తో మాట్లాడు తున్నాడు
రంజిత్ ఆ విషయాన్ని పరిగణన లో కి తీసుకోలేదు.
********
పున్నమి నాటి రాత్రి. వాట్సాప్ గ్రూప్ లో ఉండే అమ్మాయిల నుండి ఓకే మెస్సేజ్ వచ్చింది. ఒక్కనెంబర్ నుండి తప్ప. ఆ నెంబర్ ని ట్రేస్ చెయ్యమన్నాడు రంజిత్!
కంట్రోల్ రూమ్ నుండి పన్నెండు తర్వాత ఆ నెంబర్ యాక్టివ్ లేదని తెలిపారు. నెంబర్ డాబా గార్డెన్స్ ఏరియాది. మై గాడ్ మళ్ళీ అమ్మాయి కిడ్నాప్.
గుహ దగ్గర ఒక తెల్లని కారు ఆగడం చూసాడు రంజిత్.
నాలుగు దిక్కుల నుండి పోలీసులు గుహ లో కి ప్రవేశించారు. అక్కడ పెద్ధ అగ్ని గుండం. ఎదురుగా ఎర్రని నాలుకతోకాళీ విగ్రహం. బలి ఇవ్వడానికి సిద్దంగా ఉంచిన అమ్మాయి !
అమ్మాయిని బలి ఇవ్వడానికి కత్తి ఆ ఆకారం ఎత్తగానే గురి చూసి పేల్చాడు రంజిత్ !
వెంటనే పెద్ద జడల వ్యక్తి రంజిత్ వైపు చూసాడు.
"నువ్వా"
ఆ వ్యక్తి ఎవరో కాదు!
జర్నలిస్ట్ రవీంద్ర!
'నువ్వు రవీంద్ర కదా ఇదేం పని " అన్నాడు రంజిత్
"అవునుబాగా గుర్తు పట్టావు. రవీంద్ర నే. పదవ తరగతి తర్వాత ఒరిస్సా బిస్తా గ్రామం వెళ్ళి పోయాను. అక్కడ మంత్ర గాళ్ళ తో కలిసి క్షుద్ర విద్యలు నేర్చుకున్నా. ఇప్పుడు పదిమంది అమ్మాయిలను కాళి కి బలి ఇస్తే నా లక్ష్యం సంపద తో పాటు ఒకే సారీ వెయ్యిమందిని నియంత్రించే శక్తి వస్తుంది "
అప్పటి కే పోలీసులు రవీంద్ర ని చుట్టుముట్టి సంకెళ్ళు వేసారు.
రవీంద్ర ను తీసుకువస్తుంటే రంజిత్ కి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో పిస్తోలు కణత కి పెట్టి "రవీంద్ర ని వదలక పోతే నీ ప్రాణాలు లేచి పోతాయి "
కొద్దిగా కన్ను తిప్పి చూసాడు.
అతను ఎవరో కాదు నరేంద్ర!
నరేంద్ర ఈ ముఠా లో భాగమా ? ఆశ్చర్య పోయాడు.
"నిన్ను రప్పించి చంపడానికే గుహ హింట్ ఇచ్చాను. "
తను పోయినా ఫర్వాలేదు రవీంద్ర తప్పించుకో కూడదు. ఆలోచిస్తున్నాడు రంజిత్. అందరూ గుహ బయటికి నడుస్తుంటే అప్పుడు జరిగింది అనూహ్య సంఘటన.
నరేంద్ర చేతి మీద పడింది ఒక నల్ల త్రాచు!
వెంటనే చేతి లో ఉన్న గన్ ని వదిలేసాడు. రంజిత్ వెంటనే గన్ తీసుకోవడం, నరేంద్ర ని రెండు సార్లు పాము కాటు వెయ్యడం జరిగిపోయింది.
నరేంద్ర నేల మీదకి వాలి పోయాడు. రవీంద్ర తో పోలీస్ వ్యాన్ అందరితో వైజాగ్ వైపు సాగిపోయింది. పున్నమి నాటి చంద్రుడు నిర్వికార సాక్షి గా వెలుగులు చిందుతున్నాడు.
*********
"వెల్డన్ రంజిత్, క్రిటికల్ కేస్ సాల్వ్ చేసావు " అన్నాడు డిజిపి నరేంద్ర!
షూ కేసి చూసాడు. మొసలి బొమ్మ ఉంది.
" నీకు తెలుసా ఇప్పుడు ఈ షూ కి ఇండియాలో డూప్లికేట్ తయారవుతోంది.. అంతే కాదు, నన్ను పోలిన వాళ్ళు దొంగల్లో ఉన్నారు. గుహ లో నువ్వు చూసింది నరేంద్ర కాదు. పాత నేరస్తుడు సురేంద్ర! "
"కాదేది అనుకరణ కి అనర్హం " అన్నాడు రంజిత్ మొసలి బొమ్మని చూస్తూ.
ఇద్దరూ నవ్వారు!
సమాప్తం
వీరేశ్వర రావు మూల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
కవి, రచయిత. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా పనిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో కథలు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వందకు పైగా కవితలు వివిధ వెబ్ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది.
Comentarios