#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #PunyabhumiNaDesamu, #పుణ్యభూమినాదేశము
Punyabhumi Na Desamu - New Telugu Poem Written By - Gadwala Somanna
Published In manatelugukathalu.com On 29/12/2024
పుణ్యభూమి నా దేశము - తెలుగు కవిత
రచన: గద్వాల సోమన్న
అందమైన దేశము
పవిత్రతకు నిలయము
నా జన్మభూమి ఇల
ఆదర్శప్రాయము
నాలుగు వేదాలు
పుట్టిన పుణ్యభూమి
ఎన్నెన్నో మతాలు
వెలసిన గొప్ప భూమి
భిన్నత్వంలో కడు
ఏకత్వము కల్గిన
లౌకిక రాజ్యము
సమతకు సాదృశ్యము
అతి పెద్ద రాజ్యాంగము
సువిశాల ప్రదేశము
కలిగినది నాదేశము
నాకెంతో భాగ్యము
మహనీయులు పుట్టిన
త్యాగము చూపెట్టిన
పౌరుషానికి ప్రతీక
దేశాలకు దీపిక
నా జన్మభూమి ఘనత
గళమెత్తి పాడెదను
నా జన్మభూమి చరిత
కలం పట్టి వ్రాసెదను
-గద్వాల సోమన్న
Comments