'Purri Jagannadhudu' - New Telugu Poems Written By Sudarsana Rao Pochampally
Published In manatelugukathalu.com On 25/10/2023
'పూరీ జగన్నాథుడు' తెలుగు పద్యాలు
రచన : సుదర్శన రావు పోచంపల్లి
సీసం- దామోదరుండును దారువు అయెనన
ఏలన దెలుపగ ఎరుగ సతులు
ఇరువురు ఉండగ ఇబ్బంది అతనికి
నిలిచియు ఒకతన నిలువదొకతి
శేషుడు ఉదధిలొ సేమము ఉండగ
పయనము జేయను పనికిరాడు
గరుడిని రమ్మన్న గనగను ఉరగము
దానిని దిన జూచు ధర్మమొదిలి
ఆట వె-ఇట్టి బాధలుండ ఇందీవరుండన
కొయ్యబారిపోయె కొనకు జూడ
పూరి యందు జేరి పూజలు బొందుతు
జగము నాథు డనుచు జనము గొల్వ
పూరీలో దేవుడు కొయ్య రూపమున జగన్నాథు డెట్లు అయ్యాడు అంటె
శ్రీ మహా విష్ణువుకు శ్రీ దేవి భూ దేవి అని ఇద్దరు భార్యలు-కాలక్షేపానికి ఎటన్న పోదామనుకుంటె
ఒకామె{భూదేవి} కదులదు ఇంకొకామె {శ్రీదేవి}ఒక్కచోట నిలువదు -
ఇక ఆదిశేషుడిని రమ్మంటె సముద్రములో మేను వాల్చి పయనానికి పనికి రాడు-
పోనీ గరుడుడైనా వస్తాడనుకుంటె త్రోవలొ ఎక్కడ పాములు కనపడ్డ వాటిని తినడానికై ధర్మ మొదిలి క్రిందికి దిగుతాడు -ఇన్ని బాధలుండగా విష్ణువు కొయ్యబారిపోయి జగన్నాథునిగా నిలుస్తాడు -అంటే జగన్నాథుడు కొయ్యతో చెక్కబడ్డ దేవుడు.
{ఇది వ్యంగ్యానికి మాత్రమే}
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
Comments