top of page

పుస్తకం


'Pusthakam' New Telugu Story


Written By BVD Prasada Rao


(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

రైలు స్పీడందుకుంది.

కిటికీ లోంచి గాలి చల్లగా తగులుతుంది.

నా లోయర్ బెర్త్ న నేనే ఉన్నాను. నాకు నచ్చినట్టు సర్దుకు కూర్చున్నాను.

చేతిలోని పుస్తకం ఊరిస్తుంది. మడత పెట్టుకున్న పేజీ లగాయితు.. తిరిగి చదవడం మొదలు పెట్టడానికి.. పుస్తకం తెరుస్తుండగా..


ఎదురు బెర్త్ వైపు నుండి మాటలు చకచకా వినిపించగా..

పుస్తకం మూసి అటు చూసాను.

ఎదురు లోవర్ బెర్త్ మీద ఇద్దరు ఉన్నారు. ఒకరు యువకుడు.. మరొకరు పెద్దాయన.


"నీ బెర్త్ ఎంత." అడిగేడు యువకుడు.. పెద్దాయనని.

ఆయన తన కుడి చేతి బొటన వేలుతో పైకి చూపాడు.

"అప్పరా." అడిగాడు యువకుడు.

"కాదు. మిడిల్." చెప్పాడు పెద్దాయన.


"ఈ బెర్త్ నాది. ఖాళీ చేయ్." చెప్పేసాడు యువకుడు.. కాస్త కటువుగానే.

"ఇది పగలు కదా. కూర్చోవచ్చుగా." పెద్దాయన చెప్పాడు.


"డబ్బులు కట్టి దీన్ని నాకై బుక్ చేసుకున్నా." అసహనం చూపుతున్నాడు యువకుడు.

"పడుకుంటావా." అడిగేడు పెద్దాయన.


"కూర్చుంటాను." విసుగవుతున్నాడు యువకుడు.

"మరి కూర్చొనే ఉన్నావుగా." తేలిగ్గా అనేసాడు పెద్దాయన.


నన్ను వింత పరుస్తుంది వాళ్ల సంభాషణ.

"అయ్యా. నాకు ఇలా నచ్చదు. ఖాళీ చేయ్." చిరాకయ్యాడు యువకుడు.

"నేను మిడిల్ కు వెళ్తే.. ఏం కూర్చోగలవు." అమాయకంగా అన్నాడు పెద్దాయన.


సర్రున ఏదో గొణుగుతున్నాడు యువకుడు.

పెద్దాయన లేచాడు.

ఆ వెంబడే.. నన్ను చూస్తూ.. "ఇక్కడ కూర్చొవచ్చా." అడిగాడు.


నేను కదిలాను. తిరిగి సరిగ్గా కూర్చున్నాను.

"సరే." అన్నాను.


ఆ పెద్దాయన నా బెర్త్ మీద చివరంటూ కూర్చున్నాడు.

"పర్వాలేదు. ఇటు జరిగి సరిగ్గా కూర్చోవచ్చు." చెప్పాను.


ఆయన అలానే చేసాడు.

ఎదురు లోవర్ బెర్త్ మీది యువకుడు.. చెవులకు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు.. చేతి లోని ఫోన్ సెట్టింగ్స్ సర్దుకున్నాడు.. తన బెర్త్ మీద బార్లా కాళ్లు చాపుక్కూర్చున్నాడు.


పెద్దాయనను చూసాను. ఆయన ప్రశాంతంగా అగుపించాడు.

చేతి లోని పుస్తకంను తొడ మీద పెట్టుకున్నాను.


"ఎంత వరకు." అడిగాను పెద్దాయణ్ణి.

ఆయన చెప్పాడు.


"రేపు ఉదయం ఆరవ్వచ్చు మీరు అక్కడ దిగడానికి." చెప్పాను.

ఆయన చిన్నగా తలాడించాడు. తర్వాత నన్ను అడిగాడు 'ఎక్కడ వరకు' అని.

చెప్పాను.


"మీరు ఎంతకు దిగుతారు." అడిగాడు.

"సరిగ్గా ఐతే.. రేపు సాయంకాలం మూడుకు." చెప్పాను.


పెద్దాయన ఒంగి.. ఎదురు లోవర్ బెర్త్ కింద నుండి ఓ బ్యాగ్ లాగాడు. దాని సైడ్ పోల్డర్ నుండి వాటర్ బాటిల్ తీసాడు. తిరిగి బ్యాగ్ ను లోనికి నెట్టేసాడు.

కొద్దిగా వాటర్ తాగి.. బాటిల్ ను తన పక్కన పెట్టుకొని.. దానిని పట్టు క్కూర్చున్నాడు.

నేను కిటికి దరికి జరిగి.. పుస్తక పఠనంలో పడిపోయాను.


చాలా సేపటి తర్వాత.. పెద్దాయన అలజడితో.. చదువుతున్న పేజీ.. పై చివరన.. మడత పెట్టి.. పుస్తకం మూసాను. అటు చూసాను.

పెద్దాయన తన బ్యాగ్ లోంచి రెండు కప్పుల కేరియర్ ను తీసుకున్నాడు.

టైం చూసుకున్నాను. లంచ్ టైం.


కేరియర్ ని ఎక్కడ పెట్టి తెరవాలా అన్నట్టు పెద్దాయన కదులుతున్నాడు. గుర్తించాను.

"ఈ బెర్త్ తీసుకోవచ్చు. నేను మీ మిడిల్ బెర్త్ తీసుకుంటాను." చెప్పాను. లేచాను.

పెద్దాయన 'సరే' అన్నాడు.


నేను చేతిలోని పుస్తకంను చంకన చేర్చుకున్నాను. ఎదురు మిడిల్ బెర్త్ సర్దుకోడానికి అవస్థ పడుతున్నాను.


"ఒంటి చేత్తో ఏం సర్దుతావు. ఆ పుస్తకం ఇలా ఇస్తే.. పట్టుకుంటాను. రెండు చేతులు ఉపయోగించి బెర్త్ సర్దుకోవచ్చు." చెప్పాడు పెద్దాయన.


ఐనా.. నేను నోటితో పుస్తకం పట్టుకొని.. రెండు చేతులతో బెర్త్ సర్దుకున్నాను. పిమ్మట చేతిలోకి పుస్తకం తీసుకున్నాను.

"పుస్తకం అంటే ఏంటి అంత ఇది." అడుగుతున్నాడు పెద్దాయన.


"పుస్తకం అంటే ప్రీతి. అందులోనూ.. ప్రయాణాల్లో పుస్తక పఠనం అంటే నాకు భలే ఇష్టం. అలాగే లోవర్ బెర్త్ జర్నీ అంటే మరీ మక్కువ. బెర్త్ మీద కాళ్లు చాపుకొని కిటికీకి వీపు ఆన్చుకొని పుస్తకం పట్టు పట్టడడం.. వావ్." చెప్పాను.

పిమ్మట నా బ్యాగ్ తో ఆ మిడిల్ బెర్త్ మీదికి చేరిపోయాను. నడుము వాల్చాను.

తిరిగి పుస్తక పఠనంలో పడ్డాను.

***

ఎవరో తట్టినట్టు కావడంతో.. నిద్ర లేచాను.

పెద్దాయన. రైలు ఆగి ఉంది. నేను బెర్త్ దిగాను.


నా చేతిన పుస్తకం పెట్టి.. "ఇది నీదే. రాత్రి.. నిద్దట్లో.. నీ ఛాతీ పై నుండి కింద పడింది. నేను చూసాను. నిద్ర భంగమని ఆగాను. నేను ఇక్కడ దిగి పోవాలి. పుస్తకం పక్కన పెట్టి పో బుద్ధి కాలేదు. పుస్తకం మీది నీ మక్కువ నాకు నచ్చింది. పుస్తకం అందించాలని తప్పక లేపాను. క్షమించాలి." చెప్పాడు పెద్దాయన.


అప్పుడే రైలు కూత వేసింది. పెద్దాయన.. తన బ్యాగ్ తో దిగి పోయాడు. రైలు కదిలి పోయింది. నేను బోగీ తలుపు దరికి చేరాను.


ప్లాట్ఫాం మీది పెద్దాయన నా కన్నీటి కళ్లకు ఆనడం లేదు.

రైలు స్పీడందుకుంది.

***

బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Podcast Link

Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.





Comments


bottom of page