'Putrodayam' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally
Published In manatelugukathalu.com On 27/10/2023
'పుత్రోదయం' తెలుగు కవిత
రచన : సుదర్శన రావు పోచంపల్లి
అయోధ్య నగరాన చందమామ
దశరథుడు మహరాజు చందమామ
ఆరాజు దేవేర్లు చందమామ
ముచ్చటగ ముగ్గురూ చందమామ
కౌసల్య పెద్దామె చందమామ
మధ్యామె సుమిత్ర చందమామ
కడపటి భార్యయే చందమామ
కైకేయి అనునామె చందమామ
సంతాన లేమితో చందమామ
ఆ రాజు చింతించి చందమామ
పుత్రకామేష్టి యను చందమామ
యజ్ఞము జేసెనూ చందమామ
ఆ పూజ ఫలమునా చందమామ
ఆతనికి కలిగిరీ చందమామ
నలుగురూ పుత్రులూ చందమామ
కోసలా పుత్రికీ చందమామ
రాముడూ జన్మించ చందమామ
సుమత్ర కూతురుకు చందమామ
లక్ష్మణ శత్రఘ్నులూ చందమామ
కేకయా పుత్రికీ చందమామా
భరతుడూ జన్మించె చందమామ
ఆ తీరు సంతుతో చందమామ
ఆనందముతోనుండ చందమామ
రామునికి పదహారు చందమామ
యేండ్ల ప్రాయంబునా చందమామ
విశ్వామిత్రుడను చందమామ
మహర్షి వేంచేసె చందమామ
తాపసుల యజ్ఞాన్ని చందమామ
చెడగొట్టు రక్కసుల చందమామ
దునుమాడ రాముణ్ణి చందమామ
తనవెంట పంపమనె చందమామ
రుషి కోరగానపుడు చందమామ
రాజుకూ నోట చందమామ
మాట రాకుండెనూ చందమామ
ముని శాపమునకు వెరచి చందమామ
రామ లక్ష్మణులను చందమామ
క్షేమముగబోబంపె చంద మామ
ముని ఆజ్ఞ శిరసుంచి చందమామ
సోదరులు ఇరువురూ చందమామ
రక్కసుల దునుమాడి చందమామ
జతనమూ గాపాడ చందమామ
ముని ఎంతొ మెచ్చుకొని చందమామ
ముదముతొ దీవించె చందమామ .
***
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
Comentários