'Rachayithalaku Sathakoti Vandanalu' Details Of Sanmanam Programme Conducted By manatelugukathalu.com
Written By Mallavarapu Seetharam Kumar
రచన : మల్లవరపు సీతారాం కుమార్
మనతెలుగుకథలు.కామ్ ఆధ్వర్యంలో 30 /10 /2022 తేదీన రవీంద్ర భారతి లో జరిగిన రచయితలకు సన్మానం కార్యక్రమం విజయవంతంగా , కన్నుల పండుగగా జరిగింది.
ఒక సభ ఎంతమేరకు విజయవంతం అయిందనే విషయం, ఆ సభకు విచ్చేసిన సభికుల ప్రతిస్పందనను బట్టి తెలుస్తుంది. మా అభిమాన రచయితలు/రచయిత్రులు చూపిన ఆదరణ ముందు, మేము చేసిన సన్మానం చిన్నదేమోననిపించింది. అంతలా వెబ్ సైట్ మీదనే కాక, మా పైన వ్యక్తిగతంగా కూడా తమ అభిమానాన్ని వ్యక్తపరిచారు మా రచయితలు/రచయిత్రులు.
ఇక సన్మాన కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన రచయితలు కూడా తమ అభిమానాన్ని మెయిల్ ద్వారా/ఫోన్ల ద్వారా తెలియజేసారు.
సన్మానానికి ఎంపిక కాని రచయితలు కూడా తోటి రచయితలకు జరుగుతున్న సన్మాన కార్యక్రమాన్ని అభినందించారు. తాముకూడా మరిన్ని మంచి రచనలు చేస్తామని తెలియజేశారు.
అందుకే మా రచయితలందరికీ శతకోటి వందనాలు సమర్పించుకుంటున్నాం.
ఈ కార్యక్రమానికి గౌరవనీయులు శ్రీ మద్దాళి రఘురాం గారు ముఖ్య అతిథిగా, గౌరవనీయులు శ్రీ మునగా రామ మోహన రావు గారు ప్రత్యేక అతిథిగా విచ్చేసి, సభకు నిండుదనాన్ని కలిగించారు.
శ్రీ మద్దాళి రఘురాం గారు నిగర్వి, నిరాడంబరుడు. కిన్నెర ఆర్ట్ థియేటర్స్ సెక్రెటరీగా సాహిత్య సాంస్కృతిక రంగాలకు ఎనలేని సేవలు అందిస్తూ ఉన్నారు. పలువురు ప్రముఖులతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎవరో వచ్చి అంతరించి పోతున్న మన కళలను, సంస్కృతిని కాపాడాలని అనుకోకుండా తానే స్వయంగా అందుకు పూనుకుని, జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి.
శ్రీ మునగా రామమోహన్ రావు గారు ఉన్నత విద్యావేత్త. సామాన్యమైన వ్యక్తిలా కనిపించడం వీరి ప్రత్యేకత. పలు కంపెనీలకు CEO లాంటి ఉన్నత పదవులు చిరునవ్వుతో నిర్వహించి, తన సమర్థతను నిరూపించుకున్నారు. సామజిక కార్యక్రమాలకు కోట్లలో విరాళాలు ఇచ్చినా గొప్పలకు పోకుండా అది తన బాధ్యతగా భావిస్తూ ఉంటారు.
వీరిద్దరూ ఎన్నో కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉన్నా ఈ కార్యక్రమానికి విచ్చేయడమే కాకుండా మొదటినుండి చివరి వరకు వేదిక మీద ఉండి, సన్మాన గ్రహీతలను ఆనంద పరిచారు.
ప్రతి రచయిత వేదిక వద్దకు వస్తున్నప్పుడు మాతోపాటు లేచి నిలబడి, చప్పట్లతో స్వాగతించి, రచయితల పట్ల వారికున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఇది వారు స్వయంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలా భావించి ఉత్సాహంగా పాల్గొన్నారు.
వీరిరువురికి మా శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాం.
సమయాభావం వల్ల సన్మాన కార్యక్రమం లో మేము చెప్పాలనుకుని, చెప్పలేకపోయిన కొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాము.
శ్రీ ఆంజనేయ స్వామి అపరిమిత శక్తివంతుడు. కానీ తన శక్తి తనకు తెలియదు. వేరొకరు గుర్తించి తెలియజేసినప్పుడే ఆ స్వామికి తన శక్తి గురించి తెలుస్తుంది.
రచయితలు, కళాకారులు కూడా అంతే!
తమ లో దాగిఉన్న ప్రతిభను ఇతరులు గుర్తించి, ప్రోత్సహించిన తరువాతే, ఆ ప్రతిభ బయటకు వస్తుంది. మేము నిర్వహించే పోటీలు, ఇచ్చే బహుమతులు, ఇలాంటి సన్మాన కార్యక్రమాలు... ఇవన్నీ రచయితలలో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసి, వారిని ప్రోత్సహించడం కోసమే.
కాబట్టి సన్మానం పొందిన ఏ రచయిత కూడా 'ఈ సన్మానానికి నాకు అర్హత ఉందా' అని సందేహించాల్సిన అవసరం లేదు. మీలో ఉన్న ప్రతిభను మేము గుర్తించాము కాబట్టి మిమ్మల్ని సత్కరించుకున్నాము.
మీరు పొందిన బిరుదు గురించి, మీకు జరిగిన సన్మానం గురించి సగర్వంగా చెప్పుకోండి. మీరు ఎవరికీ తీసిపోరని తెలుసుకోండి.
నిర్వాహకులు, ఆహ్వానితుల మధ్య నమ్మకం, అభిమానం ఉంటే ఆ సభ విజయవంత మవుతుందని ఈ కార్యక్రమం ద్వారా రుజువయింది. మనకు ఆత్మీయులైన వారి ఇంట జరిగే వేడుకకు హాజరైనప్పుడు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ ఎంత ఆనందంగా ఉంటామో, అదే ఆనందం అక్కడున్న వారందరిలో కనిపించింది. ఈ సన్మాన కార్యక్రమానికి సంబంధించిన వీడియోలను మా యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశాము. వాటికి సంబంధించిన లింకులు ఇక్కడ ఇస్తున్నాము.
Sanmanam Part 1 Youtube Video link
Sanmanam Part 2 Youtube Video link
Sanmanam Part 2 Youtube Video link
కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫోటోలు అప్లోడ్ చేసాము. అన్ని ఫోటోలను చూడడానికి, డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ లింక్ మీద క్లిక్ చేయండి.
రచయితలు ఇప్పటికే మాకు పంపిన అభిప్రాయాలను ఈ పోస్ట్ లో కామెంట్స్ రూపంలో పొందుపరుస్తున్నాము.
మనతెలుగుకథలు.కామ్ వారు నిర్వహిస్తున్న ఉగాది కథలు మరియు నవలల పోటీ వివరాలకు
మరొకమారు రచయితలకు, ముఖ్య అతిథి శ్రీ మద్దాలి రఘురాం గారికి, ప్రత్యేక అతిథి శ్రీ మునగా రామ మోహన రావు గారికి, మా అభిమాన పాఠకులకు శతకోటి వందనాలు తెలియజేసు కుంటున్నాము.
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
@surekhap4148 • 12 hours ago (edited)
చూడ ముచ్చటైన సభ 🫶 శ్రీయుత సీతారామ్ గారికి నా ఆశీస్సుల అభినందనలు
CHANDU TANGELLA • 1 hour ago
Good programme Seetaram Kumar
కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎంతో చక్కగా, పద్దతిగా, అభినందనీయంగా నిర్వహించిన సీతారాం కుమార్ గారికి వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
నాకు సాహిత్యం గురించి గొప్పగా తెలియక పోయినా నా రచనలలోని ఆలోచనను గుర్తించి నాకు సన్మానం చేసి మరిచిపోలేని ఙ్ఞాపకాన్ని అందించిన మీరు ఇలాగే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి, ఎన్నో మంచి రచనలకు గుర్తింపు కలిగించి మీ మనతెలుగుకథలు.కామ్ ను విస్తరించుకుని పేరు ప్రతిష్ఠలు సంపాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
Radhika Dasu
కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించిన manatelugukathalu.com వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు అభినందనలు.
Srinivas Bhagavathula • 1 hour ago
మా సన్మానాన్ని ఇంత చక్కని వీడియో తీసి జీవితకాలం చెరిగిపోని ఙ్ఞాపకంగా మాకు అందించిన మన తెలుగు కథలూ. కామ్ వారికి.....ఏమిచ్చి బుుణంతీర్చుకోవాలో తెలియటంలేదు. శతకోటి ధన్యవాదాలు అండీ.... భాగవతుల భారతి ఖమ్మం