top of page
Writer's pictureNallabati Raghavendra Rao

రచయితలను అన్యాయం చేయకండయ్యా బాబు



'Rachayithalanu Anyayam Cheyakandayya Babu' - New Telugu Story Written By Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 21/09/2024 

'రచయితలను అన్యాయం చేయకండయ్యా బాబుతెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



ఆ సినీ నిర్మాతగారు చింతపిక్కల జంబుకేశ్వరం..

గతంలో మనిషి చాలా మంచోడు. కానీ సినీ ఫీల్డ్ లో ప్రవేశించాక అతని ఆశ అత్యాశగా మారిపోయింది.. అతని కోరికలు నేల మీద లేవు మరి.. గుర్రాలు అయి పోయి ఆకాశంలో పరుగు పెడుతున్నాయి.. ఆ విధం బెట్టిదనిన. 


 **


మన నిర్మాత చింతపిక్కల జంబుకేశ్వరం గారు

మొదటి సినిమా. ''దంచుడే దంచుడు '' తో వచ్చిన 5 కోట్ల రూపాయల లాభంతో మరో 20 కోట్లు రూపాయలు ఐదు రూపాయల వడ్డీకి అప్పు చేసి..పాన్ ఇండియా లెవెల్లో ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా తీసి హైదరాబాదులో హైటెక్ సిటీ మొత్తం కొనేయాలి అన్న ప్లాన్ తో ఒక శుభ ముహూర్తాన నిర్ణయించుకొని టవ ల్ గట్టిగా కట్టుకున్నాడు తన నడుముకి.

 

కథ అన్వేషణ మొదలుపెట్టాడు.

చాలా కథలు విన్నాడు కుదరలేదు.


ఏం చేయాలబ్బా అని తల పట్టుకు కూర్చుంటే ఒక ఐడియా వచ్చింది..


గత సినిమాకు చివరలో మూడు కథలు చెప్పించుకుని డబ్బులు ఇవ్వకుండా పంపించేసిన రచయిత శతకోటి శివలింగాన్ని పిలిచి పదో పరకో ముందుగానే చేతిలో పెట్టి..బ్రతిమలాడి బామాలి మరో మూడు కథలైన్లు చెప్పించుకొని.  గతంలో లాగే అతనిని బుట్టలో పెట్టి పంపించేసి ఆ మూడు కథలను కలగా పులగం చేసి మరలో వేసి రుబ్బి ఆ పిండి తో ఒక బ్రహ్మాండమైన కథ తయారు చేసి ఇది వరకటిలాగే సినిమా తీయాలని నిర్ణయిoచుకున్నాడు.. గౌరవనీయమైన నిర్మాత చింత పిక్కల జంబుకేశ్వరం.


ప్లాన్ మొదలెట్టాడు. 


ఇక్కడ.. శతకోటి శివలింగం జేబులో సెల్ ఫోన్ డురు డురు..మంది


మన వెర్రిబాగుల కథా రచయిత.. శతకోటి శివలింగం.. ఫోన్ అందే సరికి.. ఓరి నాయనోయ్.. నిర్మాత గారి నుండి ఫోన్..అని పిచ్చివాడిలా ఎగిరి గంతేసికొని వచ్చేశాడు..హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కు.


నిర్మాత ఇచ్చిన నూట పదహారు రూపాయలు జేబులో పెట్టుకొని..ఆయన ఇచ్చిన స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ తాగి నిర్మాత గారు ఏర్పాటుచేసిన ఏసీ హోటల్ రూమ్ లో స్పాంజి సోఫా మీద కూర్చొని.. రెండు మూడు సెల్ఫీలు తీసుకుని కథ చెప్పడం మొదలుపెట్టాడు.


"నిర్మాతగారు.. కథ వినండి చెప్తున్నాను.."

కట్ చేస్తే..


ఈ టైటిల్ పేరు..నిజాయితీ నిర్గుణరావు


నిజాయితీ నిర్గుణరావు.  సడన్ గా చచ్చిపోయాడు.


యమభటులు వచ్చారు.


" నాకు యమలోకం రావడం తెలుసు. చాలా గ్రంథాలు చదివాను. నేను వచ్చేస్తాను. మీరు వెళ్లిపోండి" అన్నాడు.


" సార్.  మా అయ్యగారు తీసుకు రాకుండా వెళ్లితే మమ్మల్ని కొడతారండి" అన్నారు భయంగా ఆ వచ్చిన యమభటులు.


" మా ఇంటి పేరు 'నిజాయితీ'.  నాతో తేడా రాదు మీరు వెళ్లిపోండి " అని చిరాకుపడ్డాడు.  నిజాయితీ నిర్గుణరావు


యమభటులు వెళ్లిపోయారు.


నిర్గుణరావు హ్యాపీగా ఆ సాయంత్రం బయలు దేరాడు యమలోకానికి. కొంత దూరం వెళ్ళాక చీకటి దారి పక్కనే వెలుగు దారి కనిపించింది. సరే కదా అని ఆ వెలుగు దారి గుండా నడిచి నడిచి.  వెళ్లేసరికి అతను స్వర్గలోకం చేరాడు. 'ఇంద్రుడు రంభ ఊర్వశి మేనక తిలోత్తమ' అక్కడ.  సీను చూసి.. అదిరిపోయాడు మన నిజాయితీ నిర్గుణ రావు.


దేవేంద్రుడు అతని దగ్గరకు వచ్చి.. స్వాగతం పలికి..

" నాయనా నువ్వు ఒకరికి చిన్న మహోపకారం చేసి ప్రాణం రక్షించావు..అందుకనే నీకు వెలుగు దారి కని పించింది. అది నీ అదృష్టం.. దాన్ని నువ్వు సద్విని యోగం చేసుకుని ఇక్కడికి వచ్చావు. ఇది అందరికీ సాధ్యం కాదు. అందుచేత నువ్వు ఈ స్వర్గలోకంలో కేవలం 30 రోజులు ఉండి.  అన్ని స్వర్గభోగాలు అనుభ వించి తర్వాత యమలోకం వెళ్ళవచ్చు.. యమలోకం వెళ్ళక తప్పదు. కానీ ఇది నీకు చిన్న ఆఫర్ లాంటిదన్న మాట." అంటూ ఆహ్వానించాడు.


" సార్ ఇంద్రుడు గారు.. నేను దారి తప్పిన బాటసారి ని. ఇక్కడ ఉండిపోయి యమభటులుకు అన్యాయం చెయ్యలేను. 30 రోజులు కాదు కదా 30 సెకండ్లు కూడా ఇక్కడ ఉండను. మా ఇంటి పేరు.. 'నిజాయితీ'.  అంటూ వెనుతిరిగాడు మన నిజాయితీ నిర్గుణరావు.


ఇంద్రుడు గారు.. "అబ్బో.. తెలుగురాష్ట్రాల ప్రజలు

ఇంత నిజాయితీపరులా!!!" అనుకుంటూ విస్తు పోయాడు!?!?!?..''. 


కథ చెప్పడం ఆపిన.. శతకోటి శివలింగం నిర్మాత వైపు చూసి కాలరెగరేసి పోజు పెట్టాడు.


''ఎలా ఉంది సార్ ఈ కథ. గత 100 సంవత్సరాలలో ఎప్పుడైనా ఇలాంటి కథ విన్నారా '' అంటూ ప్రశ్నిం చాడు.


నిర్మాత పై పెదవి కింది పెదవి రెండు విరిచాడు.


రచయిత తన తలగోక్కుని..


ఇంకో కథ ఇలా చెప్పడం మొదలు పెట్టాడు. 



నిర్మాతగారు.. కంగారు పడకండి. మీరు పెదాలు విరవద్దు.. నొసలు చిట్లించవద్దు.. తల గోక్కోవద్దు.. ఈ రెండవ కథ. వినండి అదిరిపోద్ది. 


కట్ చేస్తే.. చేశారు కదా..



దీని టైటిల్.. బలే బలే సత్తిపండు.  అదిరింది కదూ.. టైటిలే ఇంత గొప్పగా బాగుంటే.. కథ ఇంకెంత గ్రాండ్ గా ఉంటుందో.. నేను ఆనందం పట్టలేకపోతున్నాను నిర్మాత గారు అలాంటిది అన్నమాట ఈ కథ


వినండి..సగం తెలివితేటలు సత్తిపండు హాస్య వల్లరి గ్రూపుకు కామెడీ వెర్షన్ రాద్దామని కూర్చున్నాడు. ఎంతకీ అతని బుర్ర పని చేయటం లేదు. అతని భార్య పోలేరమ్మ లోపలినుండి టీ పట్టుకుని వచ్చింది.


"ఏమే.. గ్రూపు కి కామెడీ స్కిట్టు ఏదైనా చెప్పవే.. నా బుర్ర పని చేయడం లేదు" అంటూ అడిగాడు.


"చెప్తా రాసుకోండి ".. అంది.. టీ అందిస్తూ.


 టీ తాగుతూ రాయడం మొదలు పెట్టాడు మన సత్తిపండు.. అనబడే హీరో గారు.


"ఒక ఊరిలో భార్య భర్త వున్నారు. భర్త జాబ్ చేస్తు న్నాడు..భార్య వంట చేస్తుంది.. రాస్తున్నారా.. జాబు చేస్తున్న భర్తకు బుర్ర లేదు.  వంట చేస్తున్న భార్య కు బుర్ర ఉంది." అంటూ ఆగింది పోలేరమ్మ.


"ఇది ఎట్టా?? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు సగం తెలివి తేటల సత్తిపండు..


"ఎట్టాగా ఏంటి.? ఇట్టాగే.. మనలాగే.." అంటూ

ఖాళీ గ్లాసుతో లోపలికి వెళ్ళిపోయింది.. పోలేరమ్మ.


తాగిన టీ అంతా కక్కుకున్నంత పని జరిగింది మన సగం తెలివితేటలు సత్తిపండు గారికి. ''


కథ చెప్పడం ఆపాడు.  శతకోటి శివలింగo.


''కథ చిన్నది అనుకోకండి.  చిన్న కథ లోనే పెద్ద సందే శం ఇమిడిఉంది.. దీన్ని ఓకే చేస్తారా..''


అడిగాడు రచయిత.. 


నిర్మాతగారు ఈసారి చొక్కా పైకెత్తి బొజ్జ సాపు చేసుకొని.. ఆవలింతలు మొదలుపెట్టాడు.


రచయిత శతకోటి శివలింగానికి పరిస్థితి అర్థమైంది.. మూడవ కథ చెప్పడం వెంటనే మొదలు పెట్టేసాడు.


''అయ్యా ఇది చివరి కథ 

 టైటిల్.. ''పెసరట్టు.. భలే భలే పెసరట్టు''.. గతంలో కూడా మీకు మూడు కథలు చెప్పాను కదా.. అదే ఆనవాయితే కొనసాగిద్దాం.. వినండి''!


 కట్ చేస్తే.  ఏ పరిస్థితుల్లోనైనా కట్ చేసి తీరాలి నిర్మాత గారు.  కట్ చేయాలి తప్పదు..


మన మూడవ హీరో గోదారి గోవిందరావు కి ఎప్పటినుండో ఒక కోరిక తీరడం లేదు.  అదే.. ఇంట్లో పెసరట్టుఉప్మా అల్లం చెట్ని ఈ మూడు కలిపి ఒకే సారి తిందామని.  అతని జీవిత కోరిక.


అబ్బే.. ఇంట్లో వాళ్లు..

పెసరట్టు ఉప్మా వేస్తే చెట్నీ చేయటం లేదు.  పెసరట్టు చెట్ని చేస్తే ఉప్మా చేయడం లేదు.. పోనీ.. చెట్నీ ఉప్మా చేస్తే పెసరట్టు చేయడం లేదు..


జీవితం మీద విరక్తిపుట్టిన గోవిందరావు ఆ రాత్రి భార్య కు నాలుగు చీవాట్లు పెట్టి.


''నువ్వు నేను చచ్చేదాకా పెసరట్టు ఉప్మా అల్లం చట్నీ మూడు ఒకేసారి చేయవు.. రేపు హోటల్ కి వెళ్లి తిని వస్తాను. ఆ విధంగా నా జీవితాశయం చెల్లించుకుంటాను'.. అంటూ పెళ్ళానికి ఇంకో నాలుగు చివాట్లు పెట్టి ఆ చీవాట్లను బాగా తినమని.. పెళ్ళాం మీద కోపం చల్లారక.. తన తలకు తనే బాదుకుని పడుకున్నాడు.


మర్నాడు తెల్లవారుజామునే.. పెళ్ళాని కన్నా ముందు లేచి.. గబగబా కార్యక్రమాలు ముగించుకుని హోటల్కు వెళ్లి.. 4 పెసరట్లు.. ఉప్మా చట్నీ ఫుల్లుగా తినేసి.. 200 రూపాయల బిల్లు కట్టి బ్రేవ్ అని త్రేన్పు కుంటూ ఇంటికొచ్చాడు.. గోవిందరావు.


భర్త ఇంటిలో పడుకున్నాడో బయటికి వెళ్ళాడో చూడ కుండా.. భర్త పెట్టిన తిట్లకు భయపడి..తన మటుకు తాను లేచిపోయి.. అరడజను పెసరట్లు ఉప్మా చెట్ని చేసేసింది.. గోవిందరావు భార్య.. భర్త కోసం.


 గోవిందరావు హోటల్లో కడుపు పూర్తిగా నింపుకొని ఇంటికి వచ్చేసరికి ఆరడజను పెసరట్లు గిన్నెడు ఉప్మా గిన్నెడు చెట్ని.  సిద్ధంగా ఉన్నాయి.  అల్లం జీలకర్ర ఉల్లి మిర్చి.. స్మెల్ అదరగొట్టేస్తుంది. కానీ మన గోవింద రావు కడుపులో.. పెసరగింజ పట్టే చోటు కూడా లేదు!


ఏం చేస్తాడు..? ఏం చేయాలి??ఎవరికి ఇద్దామన్న మనసొప్పదు. సాయంత్రానికి పనిచేయవు..తప్పని పరిస్థితుల్లో భార్యనే తినేయమన్నాడు.


 పెద్ద వెండికంచం.. ముందు పెట్టుకొని.. భార్య తింటూ ఉంటే.. మిడిగుడ్లు తో చూస్తూ కూర్చున్నాడు మన గోదారి గోవిందరావు!''


కథ చెప్పడం ఆపి.. ఆ కథారచయిత.. శతకోటి శివలింగం..


''భలే ఉంది కదూ భలే ఉంది కదూ..'' అంటూ ఎగిరి గంతేసి..కూర్చున్నాడు.


''ఏమి బాగుందయ్యా బాబు మాడిపోయిన పెసరట్టు లా ఉంది మీ కథ.. వెళ్ళు వెళ్ళు..'' అంటూ పంపించేశాడు..నిర్మాత గారు ఆ రచయిత ని.


షరా మామూలే ఈ మూడు కథలతో బ్రహ్మాండం మైన వంట వండి కొత్త స్వీట్ తయారు చేశాడు.. నిర్మాత గారు.


షూటింగ్ మొదలైంది భారీ ఎత్తున నిర్మాణం జరిగింది..

 సినిమా షూటింగ్ మొత్తం కూడా పూర్తయిపోయింది.



ప్రివ్యూ చూసిన అందరూ అదిరిపోయింది.. అదిరిపో యింది..అన్నారు.


నిర్మాతగారి ఆనందానికి అవధులు లేవు. ఒక శుభ సమయాన రిలీజ్ చేశారు.



దెయ్యాలు విహరించే దుర్ముహూర్తం లాంటి సమయం అది.. యమగండం వర్జ్యo ఇవి రెండు కలగలిగిన దూబూచుల ముహూర్తం అది. 


ఒక్కటంటే ఒక్క టికెట్ ముక్క తెగలేదు.


వారం రోజుల్లో వచ్చిన కలెక్షన్.. అక్షరాల 25 లక్షలు.  పెట్టుబడి 25 కోట్లు. !!!


కృష్ణానగర్లో పెంట కుప్పల పక్కన నెత్తి మీద మాసిపో యిన టవల్ వేసుకొని కూర్చున్న నిర్మాతగారు.. ఇలా బాధపడ్డారు..



''అయ్యో. అందరికీ డబ్బులు ఇచ్చాను కానీ.. మూల కథలు చెప్పిన రచయితను మోసం చేశానే.. రెండు సార్లు మోసం చేశాను.. నాకు తగిన శాస్తి జరిగింది.'' అనుకుంటూ నెత్తి నోరు మిగిలిన అవయవాలు అన్ని ఏ ఒక్కటి వదలకుండా బాదుకున్నాడు.


కానీ ఏం లాభం జరగవలసింది జరిగిపోయింది.


 **

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు 




31 views0 comments

Comments


bottom of page