'Raghupathi Raghava Rajaram Episode 10' - New Telugu Web Series Written By Parupalli Ajay Kumar
'రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 10' తెలుగు ధారావాహిక
రచన: పారుపల్లి అజయ్ కుమార్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ
కాలేజ్ దగ్గర స్పృహ కోల్పోయి పడున్న స్త్రీని చూస్తాడు లెక్చరర్ రఘుపతి. ఆ యువతిని, గ్రామంలో తమ ప్రత్యర్థి సీతయ్య బావమరిది ఐన శేషగిరితో చూసినట్లు పోలీసులతో చెబుతాడు.
స్పృహ వచ్చిన ఆ యువతి- తన పేరు కమల అనీ, తనని శేషగిరి, అతని స్నేహితులు సామూహిక అత్యాచారం చేశారనీ చెబుతుంది. కమలకు తన ఇంట్లో ఆశ్రయం కల్పిస్తాడు రఘుపతి.
కాలేజీలో అవయవ దానం గురించి కల్యాణి చేసిన ప్రసంగానికి ఆకర్షితుడవుతాడు రాజారామ్. వాళ్ళ మధ్య పరిచయం పెరుగుతుంది. తన గతం గురించి చెబుతుంది కల్యాణి. కల్యాణిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇంట్లో చెబుతాడు రాజారామ్.
కోవిడ్ గురించి గ్రామస్థులకు అవగాహన కల్పిస్తాడు రఘుపతి. సీతయ్య కూతురు లలితకు కోవిడ్ అని తెలుస్తుంది. ఆమెకు తమ ఇంట్లో ఆశ్రయం కల్పిస్తాడు రఘుపతి. రాఘవ, లలిత ఒకరినొకరు ఇష్టపడతారు.
ఇక రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 10 చదవండి..
రాఘవ, రాజా మాస్క్ లు ధరించి,
చేతులకు పొడుగాటి గ్లౌజులు,
కళ్లకు పెద్ద కూలింగ్ గ్లాసులు పెట్టుకుని
రక్షిత పద్దతిలో కారు తీసుకుని వెళ్ళారు.
వెళుతూవుండగానే రాజా గూగుల్ లోకి వెళ్ళి చూసాడు.
శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఉన్నప్పుడు, ఒంట్లో బాగా నీరసంగా ఉన్నప్పుడు, పెదవులు ముఖం నీలి రంగులోకి మారడం గమనించినప్పుడు, చాతి లో నిరంతరం నొప్పిలా అనిపిస్తున్నప్పుడు, డయేరియా, వాంతులు అవుతుంటే వెంటనే స్థానికంగా ఉండే ఆరోగ్య సిబ్బందిని లేదా వైద్యులను సంప్రదించాలని లేదా 108 కు కాల్ చేయాలని వుంది..
108 కు ఫోన్ చేసి అది వచ్చే దాకా చూసే కంటే వీరినే ఆసుపత్రికి తీసుకెళ్ళటం మంచిదని కారులో ఎక్కించి తీసుకెళ్లారు.
ఆసుపత్రిలో పరీక్ష చేయించారు.
రాజా వచ్చాడని అక్కడున్న రాజా స్నేహితుడు డాక్టరు అభిజిత్ వచ్చాడు.
"ప్రభుత్వం మోబైల్ వాన్ ల ద్వారా కరోనా పరీక్షలకు సిద్దమౌతున్నది. ఏది ఏమైనా రోజురోజుకీ కరోనా విస్తరిస్తున్న సమయంలో లక్షణాల జాబితా కూడా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది ఇప్పుడు సాధారణ తలనొప్పి వచ్చినా, జలుబు చేసినా, సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు వచ్చినా భయపడుతున్న పరిస్థితి ప్రజలలో కనిపిస్తుంది. ప్రక్క వాడు దగ్గినా, తుమ్మినా అనుమానం గా చూసే స్థితికి వస్తున్నాం" అని చెప్పాడు.
పరీక్షల అనంతరం తిరిగి గ్రామానికి చేరుకున్నారు.
వారిని ఎవరితో కలవకుండా వేరే ఒక పాకలో వుంచారు. ఆ పాక యజమాని పనులకోసం పట్నం వలసపోయాడు.
రెండు రోజుల తరువాత యిద్దరికీ నెగిటివ్ అని రిపోర్ట్ రావటంతో గ్రామం అంతా వూపిరి పీల్చుకున్నది.
*****************************
లాక్ డౌన్ ముగిసిపోతున్నదని సంతసించేలోపు ప్రభుత్వం లాక్ డౌన్ కాలాన్ని పొడిగించింది.
రెక్కాడితేగాని డొక్కాడని బడుగు జీవులందరికీ గాంధీ కుటుంబం అండగా నిలచింది.
ప్రతీ కుటుంబానికీ బియ్యాన్ని పంపిణీ చేసారు.
మొహమాటపడి రానివారికి స్వయంగా ఇంటికెళ్ళి మరీ బియ్యాన్ని అందించారు.
ఈ వ్యవహారాన్ని రఘుపతి స్వయంగా పర్యవేక్షించేవాడు.
రాఘవ గ్రామమంతా తిరుగుతూ కోవిద్ లక్షణాలు ఉన్నవారికి మందులు ఇస్తూ తగిన జాగ్రత్తలు చెప్పేవాడు.
వూరిలో ఎవరూ పస్తులతో ఉండకూడదని, ఎవరూ కరోనాకు బలికాకూడదని నిరంతరం గ్రామస్తులని ఒకకంట కనిపెడుతూ గ్రామం మొత్తాన్ని ఒక రక్షణ వలయంలో ఉంచి కాపుగాసారు ముగ్గురన్నదమ్ములు.
వూరు వూరంతా కూడా వారు చెప్పిన సలహాలు, సూచనలు పాటిస్తూ మొక్కవోని మనోధైర్యంతో కరోనాని ఎదుర్కొన్నారు.
రాజా తీరికవేళలలో తాను పెట్టదలుచుకొన్న పరిశ్రమ గురించి గూగుల్ లో వెదికేవాడు.
కాలేజీలో పరిశ్రమల మీద బాగా అవగాహన కలిగివున్న ప్రొఫెసర్ చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి.
"చిన్న తరహా పరిశ్రమలు చిన్న చిన్న యంత్రాలతో, కొంతమంది కార్మికులు మరియు ఉద్యోగుల సహాయంతో వస్తువులను చేసే తయారుచేసే విధంగా ఉంటాయి.
ప్రాథమికంగా మనం పెట్టబోయే పరిశ్రమ భారత ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల పరిధిలోకి రావాలి.
ప్లాంట్ మరియు యంత్రాలపై పెట్టుబడి తప్పనిసరిగా 25 లక్షల నుండి ఐదు కోట్ల మధ్య ఉండాలి.
మెషినరీలో పెట్టుబడి తప్పనిసరిగా 10 లక్షల నుండి రెండు కోట్ల మధ్య ఉండాలి.
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ చిన్న తరహా పరిశ్రమలు ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టుగా వుంటున్నాయి.
ఇవి సాధారణంగా శ్రమతో కూడుకున్న పరిశ్రమలు.
కాబట్టి ఇవి ఎంతోమందికి ఉపాధిని కలిగిస్తాయి.
ఈ పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న వనరులను సముచితంగా ఉపయోగించుకోవడంలో సహాయపడతాయి.
ఇది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దారి తీస్తుంది.
ఉపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా చిన్న తరహా పరిశ్రమలు వెనుకబడిన ప్రాంతాల యువతకు సమాన ఆదాయ అవకాశాలను సృష్టిస్తాయి.
వీటివల్ల జనాభాకు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి.
తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో దోహదం చేస్తాయి.
ఈ చిన్న తరహా పరిశ్రమలలో
స్కూల్ మరియు ఆఫీస్ స్టేషనరీ ఉత్పత్తుల తయారీ లాభదాయకమైనది.
స్టేషనరీ పరిశ్రమ అనేది సాధారణంగా పాఠశాలలు, కాలేజీలు మరియు కార్యాలయాలతో ముడిపడి ఉంటుంది.
A4 కాపీయర్ పేపర్, పెన్నులు, పెన్సిల్స్, ఇంక్ ప్యాడ్‌లు, స్టాప్లర్లు, జిగురు, పెన్, పెన్సిల్ బాక్స్‌లు, జామెట్రీ సెట్‌లు, డెస్క్ ఉపకరణాలు, నోట్ బుక్స్, ఫైల్స్, స్కూల్ స్టేషనరీ, ఆఫీస్ స్టేషనరీ, రైటింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఎన్వలప్, ఆల్ పిన్స్, రీఫిల్స్, బాల్ పెన్‌ల తయారీ ఇవన్నీ దీనిలో భాగంగా వుంటాయి.
మనదేశంలో దాదాపు 22-24 కోట్ల మంది విద్యార్థులు నోట్‌బుక్‌లు మరియు ఇతర స్టేషనరీ వస్తువులను ఉపయోగిస్తున్నారు.
ఇండియాలో స్టేషనరీ మార్కెట్ అద్భుతమైన వృద్ధి సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఇండియా స్టేషనరీ మార్కెట్ ఆదాయాలు 2018-24లో 10. 5% CAGR వద్ద పెరుగుతాయని అంచనా వేయబడింది.
అందరికీ నాణ్యమైన నిర్బంధ విద్యను అందించే జాతీయ విద్యా విధానం మరియు సర్వశిక్షా అభియాన్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలు భారతదేశంలో స్టేషనరీ మార్కెట్ వృద్ధికి ఊతం ఇస్తున్నాయి.
పెరుగుతున్న పాఠశాలలు మరియు కార్యాలయాల సంఖ్య, మెరుగైన జీవన ప్రమాణాలు అలాగే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కారణంగా రాబోయే ఆరేళ్లలో భారతదేశంలో స్టేషనరీ ఉత్పత్తులకు డిమాండ్ బాగాపెరుగుతుంది. "
అదంతా గుర్తుకు వచ్చి
స్కూల్ స్టేషనరీకి సంబందించిన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కి మొగ్గుచూపాడు రాజా.
ప్రొఫెసర్ గారికి ఫోన్ చేసి మరిన్ని వివరాలు సేకరించాడు.
ఢిల్లీలో ఆ పరిశ్రమ ను నడుపుతున్న ఒకరి ఫోన్ నెంబర్ ఇచ్చి
" ఇది నా స్నేహితుడు అగర్వాల్ నెంబర్. నీ గురించి అతనికి చెపుతాను. రేపు అతనికి ఫోన్ చేసి మాట్లాడు" అని చెప్పారు ప్రొఫెసర్.
మరుసటి రోజు ఢిల్లీ కి ఫోన్ చేసి తనను తాను పరిచయం చేసుకుని మాట్లాడాడు.
ఆ అగర్వాల్ కూడా పాజిటివ్ గా స్పందించి అనేక వివరాలు తెలియచేశాడు.
వీలయితే ఒకసారి ఢిల్లీ వచ్చి ఇండస్ట్రీ మొత్తాన్ని చూసివెళ్ళమని ఆహ్వానించాడు.
కరోనా కొద్దిగా తగ్గుముఖం పట్టాక వస్తానని చెప్పాడు రాజా.
ముందుగా తను పెట్టబోయే పరిశ్రమ లక్ష్యాలు, వ్యాపార ప్రణాళిక గురించి కొంత నోట్స్ సిద్ధం చేసుకోవాలి.
తమ సంస్థ పేరును ఆన్ లైన్ ప్రక్రియలో నమోదు చేయాలి.
సంస్థ పేరు ఎప్పుడో ఆలోచించాడు.
Raghupati Raaghava Raajaaram
Enterprises.
పరిశ్రమ స్థాపనకు తగిన స్థలం ఎంపిక కూడా జరిగింది.
పరిశ్రమకు సంబంధించిన అన్ని అనుమతులు తీసుకోవాలి.
మౌలిక, స్థానిక సదుపాయాలూ చూడాలి.
పరిశ్రమకు కావలసిన యంత్ర సామాగ్రి,
రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయో చూడాలి.
సబ్సిడీ ఎంత ఇస్తారో కనుక్కోవాలి.
అన్నీ ఆలోచిస్తూ తను చేయవలసిన పనులన్నింటినీ వరుసక్రమంలో రాసుకున్నాడు రాజారాం.
అన్నలతో దాని గురించి చర్చించాడు.
షుమారు 2 కోట్ల పెట్టుబడితో మొదలు పెట్టాలని ప్లాన్ వేశాడు.
సగం దాకా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చని అనుకొన్నాడు.
లాక్ డౌన్ ముగిశాక ఒకసారి ఢిల్లీ వెళ్ళి అక్కడి అగర్వాల్ పెట్టిన పరిశ్రమను కూలంకుషంగా పరిశీలించి రావాలని అనుకున్నాడు.
పల్లెలోని నిరుద్యోగ యువతకు ఈ విషయాలన్నీ చెపుతూ త్వరలోనే వారు తాను స్థాపించబోయే పరిశ్రమతో వారి కష్టాలు తొలగిపోతాయని వారిలో ఆశల దీపాలను వెలిగించేవాడు.
లాక్ డౌన్ కాలాన్ని ప్రభుత్వాలు దశల వారీగా పెంచుకుంటూ పోతున్నాయి. పట్నాలలో పనులు దొరకక వలసజీవులంతా పల్లెబాట పడుతున్నారు.
కొన్ని కొన్ని మినహాయింపులతో
లాక్ డౌన్ ను తొలగించుకుంటూ వస్తున్న ప్రభుత్వం మొత్తానికి జూన్ 30 తో లాక్ డౌన్ ను పూర్తిగా తొలగించింది.
మొత్తానికి ప్రపంచాన్ని గడగడ లాడించిన మహమ్మారి కోవిద్ 19 వెంకటాయపాలెం గ్రామాన్ని మాత్రం ఏం చెయలేక తోకముడిచింది.
రఘుపతి ఊరివారిని సమావేశపరచి
కరోనా వైరస్ భయం పూర్తిగా పోయినట్లు కాదని మరికొద్దినెలల కాలం మాస్కులు పెట్టుకోవాలని, జాగ్రత్తల విషయంలో నిర్లక్షం చెయ్యకూడదని హితవు చెప్పాడు.
"అందరూ బాగుండాలి. అందులో మనం వుండాలి.
ఇదే మనందరి ఆశయం కావాలి. అందరికోసం ఒక్కడు కలసి, ఒక్కరి కోసం అందరూ నిలచి
సహకారమే మన వూపిరిగా, పరోపకారార్ధం ఇదం శరీరం అన్నట్లుగా జీవించాలి.
ఈ కరోనా కష్ట కాలంలో అందరూ కులమత బేధాలు మరచి అన్నదమ్ముల్లా ఎలా మెలిగామో యికముందు కూడా అలాగే మనమంతా ఒకే కుటుంబంలా మసలుకోవాలి.
ఈ శ్రావణ మాసం లో మా యింట్లో ముచ్చటగా మూడు శుభ కార్యాలు జరుగనున్నాయి.
నా తమ్ముడు
రాఘవ కు, సీతయ్య గారి అమ్మాయి లలితకు పెళ్ళి జరపాలని అనుకుంటున్నాం.
రెండవది మా చిన్నతమ్ముడు రాజాకు, కళ్యాణికి నిశ్చితార్థం జరుగుతుంది.
ఇక మూడవది మా ఇంటి మనిషి కమలకు, సాంబయ్య తమ్ముడు భాస్కర్ కు కూడా పెళ్ళి మా ఇంట్లోనే జరుగుతుంది.
చివరగా మన గ్రామప్రతిష్టను
ఇనుమడింప చేసే సంగతి…
మా చినతమ్ముడు మన గ్రామంలో ఒక లఘు పరిశ్రమ పెట్టబోతున్నాడు.
దాని ద్వారా మన గ్రామానికి చెందిన కొంతమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఆ పరిశ్రమ శంకుస్థాపన కూడా శ్రావణం లోనే ఉంటుంది.
వీటి తేదీలు ఖరారు అయ్యాక మీకు తెలియచేస్తాము. మీరంతా వచ్చి ఆశీస్సులు అందచేయండి. "
అని ముగించాడు రఘుపతి.
వూరి జనులంతా గాంధీ గారి కుటుంబాన్ని పొగడ్తలతో ముంచెత్తారు.
గాంధీగారు
"సర్వేజనా సుఖినో భవంతు,
లోకా సమస్తా సుఖినో భవంతు"
అని వచ్చిన వారందరికీ ఆశీస్సులు అందచేశారు.
చివరగా పల్లవి, తిలక్, అలేఖ్య, అనిరుద్ కలసి తమ లేత గొంతులతో అందరినీ అలరించేలా శ్రావ్యమైన పాట పాడారు.
' భేదాలన్నీ మరచి..
మోసం ద్వేషం విడచి...
మనిషి మనిషిగా బ్రతకాలి…
ఏనాడూ నీతికి నిలవాలి…
బాపూ..
ఈ కమ్మని వరమే మాకివ్వు...
అవినీతిని గెలిచే బలమివ్వు..
రఘుపతి రాఘవ రాజారాం..
పతిత పావన సీతారాం...
ఈశ్వర అల్లా తెరే నాం..
సబకో సన్మతి దే భగవాన్.... '
========================================================================
– సమాప్తం –
రఘుపతి రాఘవ రాజారాం ధారావాహికను ఆదరించిన మా ప్రియమైన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత శ్రీ పారుపల్లి అజయ్ కుమార్ గారి తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
========================================================================
పారుపల్లి అజయ్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పారుపల్లి అజయ్ కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు పారుపల్లి అజయ్ కుమార్ ...
పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుడుని ...
ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణ వాసిని ...
సాహిత్యం అంటే ఇష్టం .... కథలు,
నవలలు చదవటం మరీ ఇష్టం ...
పదవీ విరమణ తరువాత నా సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మం లో
"పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట - చావా రామారావు మినీ రీడింగ్ హాల్ " పేరిట ఒక చిన్న లైబ్రరీని మా ఇంటి క్రింది భాగం లో నిర్వహిస్తున్నాను ..
షుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి .
నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు ..
రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు ...
ఉచిత లైబ్రరీ ....
మంచినీరు ,కుర్చీలు ,రైటింగ్ ప్యాడ్స్ ,వైఫై ,కరెంటు అంతా ఉచితమే ...
ఉదయం 6 A M నుండి రాత్రి 10 P M దాకా ఉంటారు ...మనసున్న
మనిషిగా నాకు చేతనైన సాయం నిరుద్యోగ మిత్రులకు చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి.
Comments