'Raghupathi Raghava Rajaram Episode 7' - New Telugu Web Series Written By Parupalli Ajay Kumar
'రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 7' తెలుగు ధారావాహిక
రచన: పారుపల్లి అజయ్ కుమార్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ
కాలేజ్ దగ్గర స్పృహ కోల్పోయి పడున్న స్త్రీని చూస్తాడు లెక్చరర్ రఘుపతి. ఆ యువతిని, గ్రామంలో తమ ప్రత్యర్థి సీతయ్య బావమరిది ఐన శేషగిరితో చూసినట్లు పోలీసులతో చెబుతాడు.
స్పృహ వచ్చిన ఆ యువతి- తన పేరు కమల అనీ, తనని శేషగిరి, అతని స్నేహితులు సామూహిక అత్యాచారం చేశారనీ చెబుతుంది. కమలకు తన ఇంట్లో ఆశ్రయం కల్పిస్తాడు రఘుపతి.
కాలేజీలో అవయవ దానం గురించి కల్యాణి చేసిన ప్రసంగానికి ఆకర్షితుడవుతాడు రాజారామ్. వాళ్ళ మధ్య పరిచయం పెరుగుతుంది. తన గతం గురించి చెబుతుంది కల్యాణి. కల్యాణిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇంట్లో చెబుతాడు రాజారామ్.
ఇక రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 7 చదవండి..
శేషగిరి కేసు ఏం తేలటం లేదు.
వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వుంది.
ఆశ్రమం ను అధికారులు వెళ్లి తనిఖీ చేసారు.
ఆ రిపోర్ట్ ఇంతవరకు బయటకు రాలేదు.
ఆ రిపోర్ట్ బయటకు రాకుండా ఎవరో అడ్డుపడుతున్నారు.
ఈ విషయం లో తను అనవసరంగా కలుగ చేసుకోవటం ఎందుకని ఊరుకున్నాడు రఘుపతి.
సంక్రాంతి పండుగ అయిపోగానే కళ్యాణిని, పిల్లలను హైదరాబాద్ లో దిగబెట్టి వచ్చాడు రాజా.
వెళ్ళేముందు కళ్యాణి తో " కళ్యాణీ నువ్వు ఇప్పుడు ఈ ఇంటి సభ్యురాలివి. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నిస్సంకోచంగా మాకు ఫోన్ చేయి. అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా సందేహించవద్దు.
పది పదిహేను రోజులకోసారి మా ముగ్గురిలో ఎవరో ఒకరు వస్తూపోతూ వుంటాం. పిల్లలికి మోహన్ గురించి అసలు నిజం చెప్పవద్దు. పిల్లలు అడిగితే విదేశాలలో ఉద్యోగం కోసం వెళ్ళాడని, రెండు సంవత్సరాల దాకా రాడని చెప్పు.
వారికి గ్రహించుకునే వయసు వచ్చాక చెప్పవచ్చు. నీ ప్రోగ్రాం విషయాలు ఎప్పటికప్పుడు తెలియ చేస్తూ వుండు. జాగ్రత్త. " అని చెప్పి పంపించాడు రఘుపతి.
జనవరి నెల చివరికి వచ్చేసరికి కోవిద్ - 19 అనే మహమ్మారి యితర దేశాలనుండి భారతదేశం లోకి వచ్చిందన్న వార్త రఘుపతిని కలచి వేసింది. మార్చి నెల మొదటి వారం నాటికి కరోనా వైరస్ ప్రభావం దేశంలో, రాష్ట్రంలో ఉధృతం కాసాగింది.
వూరి వారందరిని సమావేశ పరచమని సర్పంచ్ గోపాలరావు గారితో చెప్పాడు. సమావేశానికి వచ్చిన వారి నుద్దేశించి రఘుపతి మాట్లాడాడు.
"మీరందరూ ఈ మధ్యన మనదేశానికి వచ్చిన మహమ్మారి కరోనా గురించి వినే వుంటారు. కరొనా వైరస్ వ్యాపించడానికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు డాక్టర్లు, నిపుణులు.
సాధారణంగా ఒక మనిషి నుండి మరో మనిషికి ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఇది దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు కూడా వచ్చే తుంపరల ద్వారా వ్యాపిస్తుంది.
శారీరక సంబంధం ఉంటే ఈ వైరస్ వ్యాపిస్తుంది.
అదే విధంగా స్పర్శ, షేక్ హ్యాండ్ వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
వైరస్ కలిగిన పదార్థాన్ని ముట్టుకున్నా.. అనంతరం చేతులను శుభ్రం చేసుకోకుండా శరీర భాగాలను తాకినా వ్యాపిస్తుంది.
కరొనా వైరస్‌లు శరీరంలో ప్రవేశించిన అనంతరం అనేక తీవ్ర లక్షణాలను చూపుతుంది. ఒక్కోసారి కఫంతో కూడిన దగ్గు ఉంటుంది.. ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంటుంది. ఛాతీ దగ్గర నొప్పిగా ఉంటుంది.
గుండె, ఊపిరితిత్తుల దగ్గర ఇబ్బందిగా ఉంటుంది.
రోగనిరోధక శక్తి బలహీనం అవుతుంది. ఇది కొన్ని సార్లు ప్రాణాపాయానికి దారితీస్తుంది
అయితే తగిన జాగ్రత్తలు పాటిస్తే దీని గురించి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఇది మనకు రాకుండా చేసుకోవడం మనచేతుల్లోనే వుంది.
సబ్బు మరియు నీరు ఉపయోగించి మీ చేతులను తరచుగా కడుక్కుంటూ వుండాలి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు చేతిరుమాలుతో నోరు మరియు ముక్కును కప్పుకోండి.
జలుబు లేదా ఫ్లూ వంటి లక్షణాలు ఉన్న వారితో సన్నిహితంగా మసలవద్దు.
మీకు ఎలాంటి లక్షణాలు లేకపోయినా ఇతరులనుండి రక్షించుకోవడానికి మాస్క్‌ని ఉపయోగించడం మంచిది.
మీకు లేదా మీయింట్లో వారికి జ్వరం, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే ముందుగానే వైద్యడిని సంప్రదించండి.
వారిచ్చే సలహాలు, సూచనలు పాటించాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నొప్పి, జ్వరం, దగ్గుకు మెడిసిన్ తీసుకోవాలి.
ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి.
నీరు ,ఎక్కువగా తాగుతుండాలి. చేతులను కడగకుండా ముఖం, ముక్కు, నోటిని తాకొద్దు.. అనారోగ్యంగా అనిపించినప్పుడు వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి.
మీ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోండి..
గుంపులుగా గుమి కూడవద్దు. వీలైనంతవరకు ప్రయాణాలు చేయకండి. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే కరోనా మనవైపుకు రాదు.
చివరగా జ్వరం, తలనొప్పి, శరీర నొప్పి, అలసట, దగ్గు, శ్వాస ఆడకపోవడం, సరిగా ఆహారం తీసుకోకపోవడం, రుచి లేదా వాసన కోల్పోవడం లాంటి లక్షణాలు ఏవి కనపడినా నా దృష్టికి తీసుకువస్తే తక్షణ రక్షణ చర్యలు,వైద్య సలహాలు మీకు అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తాను. "
సర్పంచ్ మాట్లాడుతూ "రోజురోజుకి విస్తరిస్తున్న కరోనా వైరస్‌ని కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరూ కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అందరూ రఘుపతి చెప్పిన జాగ్రత్తలు పాటించండి. ఈసమావేశానికి రాని వారికి, మీ చుట్టుప్రక్కల వారికి కూడా ఈ విషయాలన్నీ వివరించండి. "
అని చెప్పాడు.
మార్చి 25 న ఉగాది పండుగకు పిల్లలను తీసుకుని రమ్మని రఘుపతి కళ్యాణి కి ఫోన్ చేసి చెప్పాడు.
కరోనా భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న కళ్యాణి, పిల్లలు రఘుపతి ఫోన్ రాగానే వెంకటాపురం వచ్చేశారు.
ప్రపంచంలోని అనేక దేశాలు లాక్ డౌన్ పెడుతున్నారన్న వార్తలు విని రాఘవ ఎందుకైనా మంచిదని ఓ యాభై బస్తాల ధాన్యాన్ని మిల్లు ఆడించి తెచ్చి యింటిలో నిల్వచేసాడు.
రాజా తన ఫ్రెండ్స్ లో MBBS చేసి ప్రస్తుతం హౌజ్ సర్జన్ చేస్తున్న వారికి ఫోన్ చేసి కరోనా గురించి అన్ని వివరాలు సేకరించాడు. అవసరమయితే వారి సేవలు అందుబాటులో ఉండాలని చెప్పాడు.
యింట్లో విడిగా వున్న రెండు గదులను ఖాళీచేసి ఉంచారు.
ఆరోజు మార్చి 19 న ప్రధాన మంత్రి ప్రసంగం వుందని యింట్లో అందరూ టీవీ ముందు చేరారు. కరోనావైరస్ వ్యాప్తి గురించి దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పిఎం నరేంద్ర మోడీ ప్రజలు 'సామాజిక దూరం' పాటించాలని మరియు కోవిద్-19 ను ఎదుర్కోవడానికి రాబోయే కొద్ది వారాల పాటు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని కోరారు.
అలాగే నిత్యావసర సరుకుల కొరత లేదని ఆయన హామీ ఇచ్చారు.
ప్రజలు భయాందోళనలకు గురికాకుండా చూడాలని అధికారులను, పోలీసులను, వైద్యసిబ్బందిని కోరారు.
మార్చి 22 న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తమ ఇళ్లలోనే ఉండి 'జనతా కర్ఫ్యూ' పాటించాలని మోదీ తన ప్రసంగంలో భారత ప్రజలను కోరారు.
అమ్మయ్య ఒక్కరోజు 'జనతా కర్ఫ్యూ' మాత్రమే,లాక్ డౌన్ లేదని గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు.
కానీ మార్చ్ 22 రాత్రి ఎటువంటి ముందస్తు సూచనలు లేకుండా ఒక్కసారిగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించేసింది.
స్కూళ్ళు,కాలేజీలు,రవాణా,కిరాణా
అన్నీ బంద్. మెడికల్ షాప్స్, హాస్పిటల్స్ తప్ప మిగిలినవి ఏవీ లేవు. తెలంగాణా రాష్ట్రంలో జనజీవితం ఒక్కసారిగా స్తంభించి పోయింది. కరోనా అంటేనే ప్రజలు గజగజ వణికిపోతున్నారు. దీని ధాటికి ఇల్లు దాటికి బయటికి రావడం లేదు.
గాంధీ గారు ఊరంతా తిరిగి గ్రామప్రజలకు ధైర్యం చెప్పారు.
ఎవరింటిలోనయినా తిండిగింజలు అయిపోతే తమ యింటినుండి తీసుకెళ్లమని చెప్పారు.
అవసరమయితే హాస్పిటల్ కు పోవటానికి తమ కారు ఉపయోగించుకోవచ్చని కూడా చెప్పారు. ఎవరికి ఏ సహాయం కావాల్సి వచ్చినా ఏ వేళలో నయినా తమ ఇంటి తలపులు తట్టవచ్చని చెప్పాడు.
రాఘవ, రాజా వూరి యువకులను అందరినీ రమ్మని వూరి పొలిమేరలలో ముళ్ల కంచెలను పెట్టించారు.
వైద్య సహాయానికి తప్ప వూరిలో వారు వూరుదాటి బయటకు పోకుండా నిరంతరం ఎవరో ఒకరు అక్కడ కాపుండాలని అందరికీ డ్యూటీలు వేశారు.
గ్రామంలో కూరగాయతోటలు వేసిన వారితో రఘుపతి మాట్లాడాడు. కూరగాయల ధరలు మొత్తం తమ కుటుంబం భరిస్తుందని ఎవరు వచ్చి అడిగినా కూరగాయలు వారికి ఉచితంగా అందజేయమని చెప్పాడు. అదే విషయాన్ని ఊరి వారందరికీ తెలియచేసాడు.
గ్రామమంతా కరోనా గురించి జాగ్రత్తలు పాటిస్తూ కొద్దిరోజులేగా అని అనుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం దేశమంతా మార్చ్ 25 నుండి ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ ప్రకటించింది.
విశాల, కళ్యాణి కలసి కుట్టుపని వచ్చిన ఆడవారితో మాస్కులను తయారుచేసి ఊరందరికీ పంచిపెట్టారు.
కళ్యాణి ఊరిలోని ఇల్లిల్లు తిరుగుతూ వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పింది.
గాంధీగారి కుటుంబం చేస్తున్న సహాయ సహకారాలకు స్పందించి సర్పంచ్, మరికొంతమంది డబ్బున్నవారు కూడా ముందుకు వచ్చారు. తాము కూడా సహాయం అందిస్తామని చెప్పారు.
పది రోజులు ప్రశాంతంగా గడచిపోయాయి. రఘుపతి ఇల్లిల్లూ తిరిగి ఆహార ధాన్యాలు వున్నాయోలేవో కనుక్కుంటున్నాడు.
రాఘవ ఎవరికయినా కరోనా లక్షణాలు ఉన్నాయా అని వాకబుచేస్తున్నాడు. రాజా ఊరి పొలిమేర దగ్గర వున్నాడు.
ఆ రోజు రాఘవకు ఒక ఇంటినుండి గట్టిగా కేకలు వినిపించి అటు నడిచాడు.
అది సీతయ్య ఇల్లు.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
పారుపల్లి అజయ్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పారుపల్లి అజయ్ కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు పారుపల్లి అజయ్ కుమార్ ...
పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుడుని ...
ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణ వాసిని ...
సాహిత్యం అంటే ఇష్టం .... కథలు,
నవలలు చదవటం మరీ ఇష్టం ...
పదవీ విరమణ తరువాత నా సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మం లో
"పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట - చావా రామారావు మినీ రీడింగ్ హాల్ " పేరిట ఒక చిన్న లైబ్రరీని మా ఇంటి క్రింది భాగం లో నిర్వహిస్తున్నాను ..
షుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి .
నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు ..
రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు ...
ఉచిత లైబ్రరీ ....
మంచినీరు ,కుర్చీలు ,రైటింగ్ ప్యాడ్స్ ,వైఫై ,కరెంటు అంతా ఉచితమే ...
ఉదయం 6 A M నుండి రాత్రి 10 P M దాకా ఉంటారు ...మనసున్న
మనిషిగా నాకు చేతనైన సాయం నిరుద్యోగ మిత్రులకు చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి.
Comments