'Raithanna Pandaga Season' - New Telugu Story Written By Pitta Gopi
Published In manatelugukathalu.com On 18/07/2024
'రైతన్న పండగ సీజన్' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
ప్రపంచ దేశాలకు కడుపునిండా అన్నం పెట్టడంలో రైతన్నలు కష్టం దాగి ఉందని ఎవరికి చెప్పల్సిన పని లేదు. అలాగే ప్రపంచంలో అందరు కూడా ఎక్కువగా నిర్లక్ష్యం చేసేది రైతన్నలనే.ఇది కూడా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇప్పుడైతే రైతులకి కష్టాలే తప్ప ఇంకేం మిగలటం లేదు. సంవత్సరం మొత్తం అందరికీ పండగ సీజన్లే. ఎన్నెన్నో పండగలు వచ్చి వెళ్తుంటాయి కానీ..! రైతులకు పండగలంటూ ఏమీ ఉండవు.వాళ్ళు కష్టంతో పండించిన పంట పండాలి,అవి చేతికి అందాలి అప్పుడే రైతుకు వస్తుంది పండగ. అదే రైతన్న పండగ సీజన్.
ఒకప్పుడు రైతులు ఖరీఫ్ సీజన్ నే పండగ సీజన్ గా భావించేవాళ్ళు. ఎందుకంటే..! అప్పట్లో ఏ కరువుకాటకాలు లేవు. చీకుచింతా లేకుండా ఉండేవాళ్ళు. పొలమే ప్రాణంగా ,పంటే ధ్యేయంగా కష్టపడేవాళ్ళు. సమయానికి వర్షాలు పడేవి. దీంతో ఏ ఆలోచన లేకుండా వరినాట్లు వేసేవాళ్ళు. అప్పట్లో ఏ రసాయన ఎరువులు లేవు ఆవులు, గేదెలు, మేకలు,గొర్రెలు విసర్జించిన పేడ వంటి వాటిని గత్తంగా మార్చి పొలానికి అందించి భూసారం పెంచుకునేవాళ్ళు.దీంతో పంటలకు ఏ తెగుళ్ల బేడదా ఉండేది కాదు. పొలాలు అన్ని పచ్చని రంగులో అహ్లాదకరంగా ఉండేవి. పంట బాగా పండి చక్కగా వరికోతలు కోసి ఎంతో ఆనందంతో కొత్త ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకుని పండుగ చేసుకునేవాళ్ళు. అందుకే అప్పట్లో ఖరీఫ్ సీజన్లో పంట వేయాలంటే ప్రతి రైతు ఒక పండగగా భావించేవాళ్ళు. నిజంగా అదే ఒక పండగ. వర్షాలు ఎక్కువగా పడేది కూడా ఆ సమయంలోనే. అందుకే వర్షాలు పడితే చాలు పంట పండుతుంది. పంట పండితే చాలు పండగ వస్తుంది ఇది అంతా గతం.
ఇప్పుడు రైతన్నకు పంట వేయాలంటే భయం. సొంత పొలం ఉన్న రైతు కూడా పంట వేయాలంటే భయపడుతున్నాడంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం అవుతుంది. కొందరు రైతులు భూములను ప్రభుత్వం కొని పరిశ్రమలు, ఫ్యాక్టరీలు విద్యుత్ ప్లాంట్ మొదలైన వాటిని నిర్మించటం, ప్లాస్టిక్ వాడకం పర్యావరణంలో విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయి. ఈ కారణంగా సరైన సమయంలో వర్షాలు పడక రైతులు విత్తు నాటక పచ్చని పైరుగాలులు వీయాల్సిన సమయంలో కూడా బీడు భూములుగా మారుతున్నాయి.
కౌలు రైతుల పరిస్థితి అయితే మరి అద్వాన్నంగా ఉంటుంది. ఎంతోమంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకునే సంఘటనలే అందుకు నిదర్శనం.
ఒక రైతు పరిస్థితిని చూస్తే
ఖరీఫ్ సీజన్ జూలై నెలలో మొదలవుతుంది. ఏదో కొద్దిపాటి వర్షం పడటంతో ఎంతో ఉత్సాహంతో,మరెంతో ఆనందంతో వరి విత్తు వెద పద్దతిలో వేశాడు. అలా వేసిన తర్వాత దాదాపు వారం వ్యవధిలో వర్షాలు పడాలి. వెదజల్లిన విత్తనాలు మొలకెత్తాలి. ఆ తర్వాత కూడా పదేపదే వర్షాలు పడి పంటకు నీరు అందాలి కానీ.. విత్తనాలు వేసి పదిరోజులు అవుతున్నా..! వాన జాడ ఉండటం లేదు. ఒకవేళ వర్షం పడినా కుండపోతతో పొలం నిండా ఒకేసారి నీరు చేరిపోయేలా పడుతుంది. తర్వాత మరలా నెలలు గడచిన వర్షాలు ఉండవు.
ఒకేసారి కుండపోత వర్షాలు వలన చెరువులు, బావుల్లో నీరు చేరినా..!అవి పారే విధంగా అయితే కాదు. మరలా పొలాల్లో తడి ఆవిరైపోయి కొద్దిగా ఎదిగిన ఆ పైరు నీరు లేక ఎండుతు బంగారు రంగులోకి మారటం మొదలవుతుంది.
ఆ పంటను చూడలేక రైతులు కష్టమో,నష్టమో.. వేశాక తప్పుతుందా..? ఆ ఎండుతున్న పైరును కాపాడుకోవటానికి తమ రెక్కలకు, మోటర్లకు పని చెబుతు ఉన్న కొద్దిపాటి నీటితో తడుపుతు కాపాడే ప్రయత్నం చేస్తారు.
పొట్ట దశ వచ్చే సరికి తెగుళ్లు బేడదతో రకరకాల రసాయన ఎరువులు, పురుగుల మందులు పిచికారీ చేసి వాటి నుండి రక్షించుకోవడానికి నానా అవస్థలు పడి ఎలాగోలా వాటి నుండి గట్టెక్కుతారు.
పంట వేసిన మొదట్లో రావల్సిన, పడవల్సిన తుఫానులు, వర్షాలు పంట కోత దశకు వచ్చే సమయంలో పడి పంటను ముంచెత్తుతున్నాయి.. ఈ సమయంలో రైతులకు కంటిమీద కునుకు ఉండదు, కడుపు నిండా మెతుకు దిగదు. ఈ తుఫానులు వలన పంటలు ఏకంగా నీటిలో మునిగి, సుడిదోమ, వెన్నుపోటు, అగ్గితెగులు, వరి వెన్నెలు విరిగిపోవటం,తడిసిన గింజలు రాలిపోవడం, రంగు మారటం జరుగుతుంటాయి.
అయినా..!మొక్కవోని ఆశతో కోత కోసి ఆరబెట్టాక కూడా ఎప్పుడు వర్షాలు పడతాయో.. తెలియక హడావుడిగా కుప్పలు పెట్టడంతో గింజలను తినటానికి కానీ,అమ్మటానికి కానీ సంకోచించే పరిస్థితి రైతన్నకి వస్తుంది.
దాదాపు ప్రతి రైతుది ఇదే పరిస్థితి. ఇంతటి కష్టంలో కూడా ఏ పంటను కల్తీ చేయని ఏకైక వ్యక్తులు మన రైతులు.
ఒకప్పటి రైతన్నల పండగ సీజన్ ఇప్పట్లో మరి రానట్లే. పండగలంటూ ఎన్నెన్నో వచ్చినా..! ఖరీఫ్ సీజన్లో పుష్కలంగా వర్షాలు పడినపుడే రైతులకు నిజమైన పండగ.అదే...అదే రైతన్నకు పండగ సీజన్.
**** **** **** **** **** ****
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )
Profile:
Youtube Playlist:
నా పేరు పిట్ట.గోపి నేను శ్రీకాకుళంలో అంబేద్కర్ యూనివర్సిటీలో ఎం ఏ సోషల్ వర్క్ పూర్తి చేశాను. నాకు సమాజాన్ని,సమాజంలో మనుషులను గమనించటం అలవాటు. ముఖ్యంగా సమాజంలో జరిగే ఏ చిన్న మంచి-చెడులనైనా.. మంచి కథలుగా మలచటంలో నాకు నేనే సాటి.వ్రృత్తిరిత్య నేను వ్యవసాయ కుటుంభంలో మద్యతరగతికి చెందిన వ్యక్తిని.ఇప్పటికే నేను రాసిన కథలు 90కి పైగా మన తెలుగు కథలు డాట్ కామ్ వెబ్సైట్ లో ప్రచూరితం అయ్యాయి.అలాగే ప్రతిలిపిలో కూడా నా కథలు అచ్చయ్యాయి. నా కథలు బహుమతులుకు ఎంపికకాకున్నా..(లాప్టాప్ లేదు) ఫోన్ లోనే టైపింగు చేయాలన్నా కథలు పంపాలనే ఆశక్తి తగ్గిపోతుంది. కానీ..! సమాజంలో జరిగే సంఘటనలకు అక్షరరూపం ఇచ్చి పదిమందికి తెలపాలనేదే నా అభిలాష. నా కథల్లో మంచి చెడులను పాఠకులు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
Comments