top of page

రైతు కోసం కాదు మన కోసం

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #UpparakongatiRamaKrishna, #ఉప్పరకొంగటిరామకృష్ణ, #RaituKosamKaduManaKosam, #రైతుకోసంకాదుమనకోసం


Raitu Kosam Kadu Mana Kosam - New Telugu Poem Written By - Upparakongati Rama Krishna Published In manatelugukathalu.com On 01/01/2025

రైతు కోసం కాదు మన కోసంతెలుగు కవిత

రచన: ఉప్పరకొంగటి రామకృష్ణ


మార్కెట్ లో ధర చూసి 

అప్పు తెచ్చి పొలం దున్ని

విత్తనాలు నాటి నీరు పెట్టి

నారు పెంచి నాటు వేసి


కలుపు తిసి మందు చల్లి

మందు కొట్టి పంట పండించి

మార్కెట్ కు తీసుకొని వస్తే

ధర లేదు ఆంటే కళ్లల్లో నీళ్లు

తెచ్చుకొని తక్కువ ధర కు అమ్మీ


ఇoటికి వెడితె అప్పు ఇచ్చినోడికి 

వడ్డి కే సరిపోతే రైతు ఏమి తినాలి 

భార్యబిడ్డలకు ఏమి పెట్టాలి

వ్యాపారులు ధనవంతులు

అవుతున్నారు కాని రైతులు

అప్పుల పాలు అవుతున్నారు


రైతు కోసం కాదు మన కోసం  

ఒక్కసారి రైతులు కాని వ్యవసాయం

వదిలి పెడితే మనం తినడానికి

అన్నం కుడా దొరకదు! కాబట్టీ

రైతులను ప్రోత్సహిస్తూ వాళ్ళను

వ్యవసాయం చేయనిద్దాం 


వ్యవ’సాయం’ లోనే ఉందీ ‘సాయం’

రైతులకు గిట్టుబాటు ధర 

ఎప్పుడు ఉండాలి అవునుకుంటున్నాను

జై కిసాన్! జై వ్యవసాయం!

జై! జై! వ్యవసాయకార్మికుడ జైహో!!


ఉప్పరకొంగటి రామకృష్ణ  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు: ఉప్పరకొంగటి రామ కృష్ణ

విద్య: డిగ్రీ పూర్తయింది

నాన్న పేరు: యు. కె. నరసయ్య

తల్లి పేరు: యు. కె. పద్మ

చిరునామా: హెచ్ మురవాని గ్రామం, పెద్దకడుబూరు మండలం, కర్నూలు జిల్లా

28 views1 comment

1 Comment


ఉప్పరకొంగటి కవిత: "రైతు కోసం కాదు మన కోసం" చదువుతున్నప్పుడు కళ్ళు చెమ్మగిల్లాయి.


రైతుల కష్టాలు - నిజాలు ... రెండిటినీ తెలియ పరిచాయి ... వెల్లడి చేశాయి.


నిపుణులు కూర్చుని చర్చించుకొని ... రైతులకు మంచి - ప్రగతి - అభ్యుదయం - సౌభాగ్యం ... జరిగేలా - కలిగేలా చూడాలి.


.* ఉత్తి ఆధునిక టెక్నాలజీ సరిపోదు ... మంచి నిర్వహణ లో కూడా శిక్షణ ఇవ్వాలి.


రైతు సంక్షేమ పదకాలు వేరే గా తయారు చేయాలి.


ఇతర దేశాలను సంప్రదిస్తే మంచిదేమో???


మన భారత దేశం జనాభా 143 కోట్లు.


ప్రతి మనిషి ... భారతీయుడు కనీసం ₹1 / రూపాయి రోజూ ప్రభుత్వ నిధి కి దానం చేస్తే ... రోజుకు కనీసం ₹ 143 కోట్లు (రూపాయిలు) హెచ్చుతుంది.


దానిని రైతుల మరియు పేదల క్షేమం కొరకు మాత్రమే వాడాలి అని ఒప్పందం పెట్టుకోవాలి.

పి.వి.పద్మావతి మధు నివ్రితి

Like
bottom of page