top of page

రాజయోగం

#KandarpaMurthy, #కందర్పమూర్తి, #Rajayogam, #రాజయోగం, #పిల్లలకథలు, #TeluguChildrenStories,  #బాలలజానపదకథ


'Rajayogam' - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 07/10/2024

'రాజయోగం' తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్




 కుశాల రాజ్యంలో సిరిపురం ఒక చిన్న పల్లె గ్రామం. అక్కడ గోవిందుడు అనే అనాథ గొల్ల యువకుడు గ్రామంలోని ప్రజల ఆవులను అడవికి మేత కోసం తీసుకెళ్లి సంధ్యా సమయానికి

తీసుకు వస్తాడు. ఊరిలోని కొందరు ఆ యువకుడిని గోవిందు అని, చిన్నోడు అని పిలుస్తుంటారు.


 ఒకరోజు గోవిందుడు అడవిలో ఆవులను మేపుతు చెట్టు కింద కూర్చొని పిల్లన గ్రోవి వాయిస్తుండగా ఒక సాధువు వచ్చి "దాహంగా ఉం ది, సమీపంలో నీళ్లు దొరుకుతాయా "అని అడిగాడు. 


 అందుకు గోవిందు "సాములూ, ఈ అడవిలో నీళ్లుండవు" అని  సాధువు చేతిలోని పాత్రను తీసుకుని ఒక ఆవు దగ్గరకెళ్లి పాలను  పితికి తెచ్చి సాధువు చేతికిచ్చాడు. 


 పాలను తాగి దాహం తీర్చుకున్న సాధువు గోవిందు ఉదార గుణానికి మెచ్చి" బిడ్డా, నీకు రాజయోగం ఉంది. రాజసింహాసనం మీద కూర్చుంటా”వని దీవించి వెళిపోయాడు. 


 చిన్నప్పుడు గోవిందు నాయనమ్మ దగ్గర రాజుల కథలు వింటూ సింహాసనం, గుర్రాలు, యుద్ధాలు మాటలు వినేవాడు.  గ్రామానికి తిరిగి వచ్చిన గోవిందు ఊళ్లో కనబడిన వారందరికీ

"నాను రాజునవుతా, సింవాసనం మీద కూచుంటా, గుర్రం తోలుతా" అంటూ అమాయకంగా చెప్పేవాడు. 


 గోవిందుకి మతిభ్రమించిందని గ్రామప్రజలు నవ్వుకునేవారు. ఒకరోజు ఉదయాన్నే దేవాలయ పూజారి గుడికి వెళుతుంటె  "సాములూ, నాను రాజునవుతా. సింవాసనం మీద కూచుని 

రాజ్యం ఏలుతా" అంటూ ఎదురెళ్లాడు. 


 "ఓరి మూర్ఖుడా, ఒంటి మీద గుడ్డకు ప్రాప్తం లేని నువ్వు  రాజ్యానికి రాజౌతావా, ఫో! " అని కసురుకున్నారు. 


 ఎవరెన్ని అవహేళన మాటలన్నా లెక్కచెయ్యక గొల్ల చిన్నోడు  రోజూ అడవికి ఆవులను మేతకు తీసుకెళుతున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఆవులను అడవికి తీసుకెళ్లిన గొల్ల గోవిందు గ్రామానికి తిరిగి రాలేదు. అడవిలో క్రూరమృగాలు తినేసి ఉంటాయని అనుకున్నారు ఊరిజనం. 


 కుశాల రాజ్యానికి రాజైన చక్రధరుడికి సంతానం లేదన్న చింతనలో అన్ని రాజవిద్యలు తెలిసిన సరైన యువకుణ్ణి తెచ్చి యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేసే ఆలోచనలో ఉన్నట్టు మంత్రి దుర్జనుడికి చెప్పాడు.  మంత్రి దుర్జనుడికి ఒక దురాలోచన వచ్చింది.  ఒక అమాయకుడైన యువకుణ్ణి తెచ్చి రాజసింహాసనం మీద కూర్చోబెట్టి మహరాజును అంతం చేసి రాజ్యాధికారాన్ని తన చెప్పుచేతల్లో ఉంచుకోవచ్చని తలిచి సేనాపతి సారంగుడితో ఆలోచన చేసి రాజ్యంలో వెతికి అమాయకుడైన యువకుణ్ణి పట్టి తెమ్మన్నాడు. 


 మహరాజు చక్రధరుడికి విధేయుడైన సేనాపతి సారంగుడు మంత్రి రాజద్రోహం తెలుసుకుని తగిన బుద్ధి చెప్పాలని మనసులో అనుకుని, రాజ్యంలో నలుమూలల గాలించి లోకజ్ఞానం తెలియని అమాయకుడైన యువకుణ్ణి పట్టి తెమ్మని సైనికులను పంపేడు. 


 సైనికులు అడవి దారంట వెళుతుంటె గొల్ల గోవిందు చెట్టు  కింద బాంసురి వాయిస్తు కనబడ్డాడు. సేనాపతి చెప్పిన లక్షణాలున్న గోవిందును చూసి బంధించి " నిన్ను రాజ్యానికి రాజును చేస్తామని " చెప్పి సేనాపతి వద్దకు తీసుకువచ్చారు. 


 వంటిమీద సరైన వస్త్రాలు లేకుండా అమాయకంగా ఉన్న గొల్ల చిన్నోడు గోవిందును చూసిన సేనాపతి సరైన యువకుడని తలిచి యువరాజుగా తీర్చి దిద్దాలనుకున్నాడు. గుర్రాలు సైనికులను చూసి తను నిజంగా రాజు కాబోతున్నానని తెల్సి గోవిందు సేనాపతి చెప్పినట్టు చెయ్యసాగేడు. 


 సేనాపతి అన్ని రాజనీతులు, గుర్రపు స్వారి, యుద్ధ తంత్రం ఇలా రాజవిద్యలు నేర్పి యువరాజుగా తీర్చి దిద్ది 'చంద్రశేఖరుడని' నామకరణం చేసాడు. అమాయకంగా కనబడే గొల్ల యువకుడు గోవిందు ఇప్పుడు చలాకీగా యువరాజులా మారేడు. 


సేనాపతి చంద్రశేఖరుడికి మంత్రి దుర్జనుడి దురాలోచన గురించి తెలియచేసి రాజసింహాసనం మీద పట్టాభిషిక్తుడవగానె మంత్రిని బంధించి మహరాజును కాపాడమని కోరాడు. అనుకున్న ఆలోచన ప్రకారం మంత్రి దుర్జనుడు యువరాజు చంద్రశేఖరుడిని మహరాజు చక్రధరుడికి చూపి కుశాల రాజ్యానికి తగిన యువరాజని పరిచయం చేసాడు. 


 చంద్రశేఖరుడు వంగి మహరాజు పాదాలకు వందనం చేసాడు. ఆ యువకుడి వినయ విధేయతలు, రూపు రేఖలు చూసి మహరాజు చక్రధరుడు మురిసిపోయాడు. పట్టాభిషేకం జరిగే వరకు ఆ యువకుణ్ణి తన దగ్గర ఉంచమని కోరాడు. మంత్రి దుర్జనుడు సరేనని చంద్రశేఖరుణ్ణి మహరాజు వద్ద ఉంచాడు.  చంద్రశేఖరుడు వృద్ధుడైన మహరాజును కన్నతండ్రిలా ప్రేమగా చూడసాగేడు. ఆ యువకుడి ప్రేమాభిమానాలకు చక్రధరుడు తనకి తగిన వారసుడు దొరికాడని సంతోషించాడు. 


 అనుకున్న ముహూర్తానికి రాజపురోహితుల ద్వారా కుశాల రాజ్యానికి యువరాజుగా చంద్రశేఖరుడు పట్టాభిషిక్తుడయాడు. వెంటనే విధేయుడైన సేనాపతి సారంగుడి ద్వారా మహామంత్రి దుర్జనుడిని బంధించి చెరసాలలో వేయించాడు. తను కుశాల రాజ్యానికి యువరాజుగాను, స్వామి భక్తుడైన సేనాపతి సారంగుడిని మహామంత్రిగా చేసిన గోవిందు అనే అమాయక గొల్లయువకుడు చంద్రశేఖరుడు రాజ్యాన్ని అన్ని విధాల సుఖ శాంతులతో పాలించసాగేడు. తను పుట్టి పెరిగిన సిరిపురం గ్రామాన్ని ఎంతో అభివృద్ది చేసాడు. 


 సమాప్తం  


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


 పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

   కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


33 views0 comments

Comments


bottom of page