top of page

రాలుగాయి పిల్లలు

#PatrayuduKasiViswanadham, #పట్రాయుడుకాశీవిశ్వనాథం, #RalugayiPillalu, #రాలుగాయిపిల్లలు, #పిల్లలకథలు, #TeluguChildrenStories, #తెలుగుజాతీయాలు

Ralugayi Pillalu - New Telugu Story Written By Patrayudu Kasi Viswanadham

Published In manatelugukathalu.com On 10/03/2025

రాలుగాయి పిల్లలు - తెలుగు కథ

రచన : పట్రాయుడు కాశీవిశ్వనాథం

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



ప్రార్థన అనంతరం తరగతి గదుల్లోకి వెళ్ళారు పిల్లలు. ఐదవ తరగతి అంతా గోల గోలగా ఉంది. తుడిచే వాళ్ళు ఒకవైపు, నడిచే వాళ్ళు ఒక వైపు. 


తరగతి గది శుభ్రం అయ్యాక అందరిని నిశ్శబ్దంగా ఉండమని చెప్పి హాజరు వేయడం మొదలుపెట్టారు కాశీ మాస్టారు. ఈ తరగతిలో పిల్లలు చేసే అల్లరి అంతా ఇంతా కాదు రాలుగాయి పిల్లలు. 


కోపం వచ్చి పిల్లల్ని మందలిస్తే తల్లిదండ్రులు గొడవకు దిగుతారు, బెదిరిస్తారు. ఆ బాధ పడలేక పిల్లల్ని, ఏమీ అనలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఉపాధ్యాయులు.


పిల్లలందరి చేత పాఠం చదివించాలి అనే ఉద్దేశంతో తెలివైన పిల్లల్ని తెలివి తక్కువ పిల్లల్ని కలిపి చిన్న చిన్న సమూహాలుగా కూర్చోబెట్టి చదివించడం ప్రారంభించారు కాశీ మాష్టారు. 


పున్నమి అనే పిల్ల మాత్రం అటూ ఇటూ తిరుగుతోంది కానీ చదవడం లేదు ఎన్నిసార్లు చెప్పినా తన పని తనదే ఈ సమూహం లోంచి ఆ సమూహం లోకి మారుతుందే తప్ప పుస్తకం తీసి చదవదు. చెప్పి చెప్పి మాష్టారుకి విసుగు వచ్చింది కానీ పున్నమి మాత్రం స్థిరంగా కూర్చోలేదు.


ఇంతలో బెల్ అయింది కాశీమాస్టారు మరో తరగతికి వెళ్ళిపోయారు. సాయంత్రం మళ్ళీ పిల్లలందరినీ క్రీడామైదానంలో కూర్చోబెట్టుకుని ఒక్కొక్కరిని పిలిచి చదివించారు కాశీ మాస్టారు. పున్నమి చదవలేకపోయింది. మౌనంగా తల దించుకుని నేల చూపులు చూసింది. 


గట్టిగా మందలించి చదవడం నేర్చుకోమని చెప్పారు. సాయంత్రం బడి వదిలారు పిల్లలంతా పొలోమని ఇళ్లకు పరుగులు తీశారు. పున్నమి మాత్రం ఏడుస్తూ నిలబడింది.


“సార్ సార్… మా అమ్మకి ఒక్కసారి ఫోన్ చేయండి.” అని అని వెక్కి వెక్కి ఏడుస్తూ అడిగింది. 


“ఎందుకు? ఏమైంది? అలా ఏడుస్తున్నావు?” అని అడిగారు మాస్టారు.

 

సమాధానం చెప్పకుండా మౌనంగా నిలబడింది. 


“పరవాలేదు చెప్పు నేను ఎవ్వరికీ చెప్పను” అన్నారు మాస్టారు.


“సార్ నిన్న రాత్రి, నిన్న రాత్రి…” 


“పరవాలేదు చెప్పు” అన్నారు మాస్టారు. 


“నిన్న రాత్రి మాకు తిండి లేదు, నిద్రలేదు.” 


“ఏమైంది పున్నమీ?”


“మా అమ్మ నాన్న గొడవ పడ్డారు.” 


“ఎందుకు?”


“నాన్న పేకాటలో డబ్బులు పోగొట్టుకుని, బాగా తాగి ఇంటికి వచ్చాడు. అమ్మ అడిగిందని గట్టిగా కొట్టాడు. కత్తితో పొడవబోయాడు. రాత్రంతా నిద్ర లేదు. తెల్లవారి అమ్మ అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్లిపోయింది. ఇంటికి తాళం వేసి ఉంది. మేము ఎక్కడ ఉండాలో అర్థం కాలేదు. అమ్మ కోసం చెల్లి ఏడుస్తోంది.” అని గుక్క తిప్పుకోకుండా చెప్పింది పున్నమి కళ్ళంట నీరు కారుస్తూ.


‘ఈ పసి హృదయాలకు ఇన్ని సమస్యలా? భయంకరమైన అగ్ని పర్వతాలను గుండెల్లో దాచుకుని, నిరంతర మానసిక సంఘర్షణతో సతమతమవుతూ కూడా బడికి వచ్చేది ఈ రాలుగాయి పిల్లలేనా’ అని మనసులో అనుకుంటూ ఉండగానే 


“సార్” అన్న పిలుపు తో చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ పున్నమి వైపు జాలిగా చూసారు కాశీ మాష్టారు.

“మా అమ్మతో మాట్లాడాలని ఉంది ఒక్కసారి ఫోన్ చెయ్యండి సర్” అని దీనంగా అడిగింది.


“సరే” నని ఫోన్ పున్నమి చేతికి ఇచ్చారు.


పున్నమి తల్లితో మాట్లాడింది, చెల్లి గురించి చెప్పింది. 


పున్నమి ఇంటికి వెళ్ళిపోయింది. ‘ఇన్ని సమస్యలతో ఆ చిన్ని మనసు చదువు మీద ఎలా లగ్నం చేయగలదు?. 


తల్లిదండ్రులు పిల్లల ముందు తగవులాడుకుంటూ ఉంటే ఆ పసి మనసులు ఎంత గాయపడతాయో కదా! 


ఈ విషయాన్ని గ్రహించక పిల్లలు చదవలేదు, చెప్పిన మాట వినలేదు అంటూ వాళ్ళ మీద కోపం తెచ్చుకుంటారు కానీ వాళ్ళ మనసు తెలుసుకునే ప్రయత్నం చేయరు తల్లిదండ్రులు. అని బాధ పడుతూనే రాత్రి అంతా గడిపారు కాశీ మాష్టారు.


మర్నాడు ఉదయం మాష్టారు బడికి వెళ్ళేసరికి ఉదయించే సూర్యునిలా, వేయి పున్నముల వెలుగులా, తలంటు స్నానం చేసి కొత్తబట్టలు కట్టుకుని, దేవునికి దీపం పెట్టి పూజ చేసుకుని, “గుడ్ మార్నింగ్ సర్” అంటూ నవ్వుతూ అతని కళ్ళముందు దర్శనమిచ్చింది పున్నమి.


***


పట్రాయుడు కాశీవిశ్వనాథం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు: పట్రాయుడు కాశీవిశ్వనాధం

Patrayudu kasi viswanadham


విద్యార్హత: ఎం.కాం., బి.ఇడి., బి.ఎ., 

ఎం.ఎ(ఆంగ్లం)., ఎం.ఎ.(తెలుగు).

స్వగ్రామం : చామలాపల్లి అగ్రహారం 

విజయనగరం జిల్లా.

నివాసం : శృంగవరపుకోట (ఎస్‌.కోట)

వృత్తి : పాఠశాల సహాయకులు(ఆంగ్లం) 

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కవరపుకోట.


ప్రవృత్తి: కవితలు, బాలల కధలు, బాలాగేయాలు  రాయడం 


ఆలిండియా రేడియోలో స్వీయ కవితా పఠనం చేయడం.


సేకరణలు:

**********

1.వివిధ దేశాలకు చెందిన స్టాంపులు, నాణెములు, 2.నోట్లు, 3.వార్తా పత్రికలు(వివిధ భాషల వి), 4.స్పూర్తి కధనాలు, 5.మహనీయుల జీవితాల్లో మధురఘట్టాలు, 6.సాహసబాలల కధనాలు, 7.వివిధ నెట్‌ వర్క్‌ ల సింకార్డులు ఓ చర్లు, 8.వివిధ పతాకాలు, ప్రతీదీ వందకు పైగా సేకరణ. 9. వైకల్యాలని అధిగమించి  విజయాలను సాధించిన వారి స్ఫూర్తి కధనాలు వివిద పత్రికలనుంచి 150 కి పైగా సేకరణ.


విద్యార్థులతో సేవాకార్యక్రమాలు:

*******************************

1.విధ్యార్ధులల్లో సేవాభావాన్ని పెంపొందించడం కోసం విద్యార్ధులను బృందాలుగా చేసి వారి నుంచి కొంత మొత్తం సేకరించి, దానికి నేను కొంత మొత్తం కలిపి అనాదాశ్రమాలకు వికలాంగ పాఠశాలకు సంవత్సరానికొకసారి 4000 రూ. ఆర్ధిక సాయం. ప్రతీ సంవత్సరం శివరాత్రినాడు విధ్యార్ధులే స్వయంగా తయారు చేసుకుని భక్తులకు పులిహోర పంపిణీ. కనీసం 30 కిలోలు. విధ్యార్ధుల సహకారం తో చలివేంద్రాలు ఏర్పాటు.


2.మండలస్థాయిలో విద్యార్థులకు  *భగవద్గీత శ్లోక పఠన పోటీలు.

3.రామాయణం క్విజ్ పోటీలు* నిర్వహించడం.


బాల రచయితలుగా తీర్చిదిద్దడం

*******************************

బాలలను రచనల వైపు ప్రోత్సహించడం.వారి రచనలు వివిధ పత్రికలకు పంపడం జరిగింది.

నా ప్రోత్సాహం తో మా పాఠశాల విద్యార్థుల కథలు, బాలగేయాలు బాలబాట పత్రికలో  10 కి పైగా ప్రచురించబడ్డాయి.

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳


సంకలనాలు :


1.గురజాడ శతవర్ధంతి

కవితా సంకలనం లో  

2.ఆంధ్ర సంఘం పూణె వారి 'ఆమని'         సంకలనం లో 

3.రచనా సమాఖ్య బొబ్బిలి వారి 'జల    సంరక్షణ',

4.'రక్త బంధం', 

5.'ఆకుపచ్చనినేస్తం' కవితా సంకలనాలలో.

6. గుదిబండి వెంకటరెడ్డి గారి 'ఏడడుగుల           బంధం' సంకలనం లో 

7.రమ్య భారతి వారి కృష్ణా పుష్క్కర సంకలనం లో 8.సాహితీ ప్రసూన దాశరధి ప్రత్యేక సంకలనం లో

9.తెలుగు ప్రతిలిపి వారి మాతృ స్పర్శ కవితా సంకలనంలో 

10.గుదిబండి వెంకటరెడ్డి గారి నేస్తం కవితా సంకలనం (2019)లో 

11. బైస దేవదాసుగారి నీటి గోస కవితా సంకలనం లో

12. ఉరిమళ్ల సునంద చిన్నారి లతీఫా కవితా సంకలనం లో

13.మద్యం మహమ్మారి కవితాసంకలనం లో నా కవితలకు చోటు.

🌷🌷🌷🌷🌷🌷🌷


బహుమతులు

1.డా. పట్టాభి కళా పీఠం విజయవాడ వారి జాతీయ స్థాయి కవితల పోటీలో ప్రధమ బహుమతి 1000/-(నేను నేను కాదు)2016

2.తెలుగు తేజం చిట్టి కధల పోటీలో పేగు బంధం కథకి తృతీయ బహుమతి.

3.జిల్లా రచయితల సంఘం వారు నిర్వహించిన కధల పోటీలో తృతీయ బహుమతి.

4.సాహితీ కిరణం వారి మినీ కవితల పోటీలో ద్వితీయ బహుమతి.

5.ఆంధ్ర సంఘం పూణే వారి కవితల పోటీలో ద్వితీయ బహుమతి.

6.కెనడా డే సందర్భంగా తెలుగు తల్లి సంస్థ వారి కధల పోటీలో  అద్భుతం కధ కి ప్రథమ బహుమతి.1000/- 2018

7.నవ్య దీపావళి కధల పోటీలో నాకు చనిపోవాలనుంది కధ సాధారణ ప్రచురణకు ఎంపిక.

8.ప్రియమైన కథకులు సమూహం వారు నిర్వహించిన కథలపోటీ (2019) లో అల్లరి పిడుగు కథకు ప్రత్యేక బహుమతి

9.తెలుగుతల్లి కెనడా డే వారు నిర్వహించిన కథల పోటీ 2019 లో ఒక్క క్షణం ఆలోచిద్దాం కథకి ప్రధమ బహుమతి 1000 రు.

ఇంకా మరెన్నో బహుమతులు, సన్మానాలు, సత్కారాలు. 


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


బిరుదులు : 

1.తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారి సహస్ర కవిమిత్ర, 

2.సహస్ర లేఖా సాహిత్య మిత్ర, 

3.సహస్ర వాణి శత స్వీయ కవితా కోకిల, 

4.శతశ్లోక కంఠీరవ, 

5.సూక్తిశ్రీ, 

6.తెలుగు ప్రతిలిపివారి "కవి విశారద"

7.గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి రాష్ట్రస్థాయి పురస్కారం 2016

8.జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2017.

9.బండారు బాలనంద సంఘం వారి జాతీయ ఉత్తమ బాల సేవక్‌ పురస్కారం 2017,

10.సర్వేపల్లి జాతీయ విశిష్ట సేవాపురస్కారం 2018, 2019 లలో

11.ప్రతిలిపి వారి బాలమిత్ర 2019 పురస్కారం పొందడం జరిగింది.

12.కాశీ మావయ్య కథలు బాలల కథా సంకలనానికి పెందోట బాల సాహిత్య పురస్కారం 2023



🌹🌹🌹🌹🌹🌹🌹

ముద్రించిన పుస్తకాలు :


1."జన జీవన రాగాలు" (స్వీయ కవితా సంపుటి),

2."జిలిబిలి పలుకులు"( బాల గేయాల సంపుటి).

3.*దేవునికో ఉత్తరం*  బాలల కధా సంపుటి

4.*అద్భుతం* బాలల కథా సంపుటి

5.కాశీ మామయ్య కథలు బాలల కథా సంపుటి.

6.తాతయ్య కల బాలల కథా సంపుటి.

అముద్రితాలు


1*మౌనమేలనోయి* కథల సంపుటి

2 ఉభయ కుశలోపరి లేఖల సంపుటి

3*నీకోసం* భావ కవితా సంపుటి.

4చెట్టు కథలు

5 పేదరాశి పెద్దమ్మ కథలు

6 మృగరాజు సందేశం కథల సంపుటి


ఇష్టాలు


పిల్లలతో గడపడం

బాలసాహిత్య పఠనం

బాలసాహిత్య రచన


ప్రచురణలు


ఇప్పటి వరకు..వివిధ దిన,వార, మాస, ద్వైమాస, జాతీయ, అంతర్జాతీయ,అంతర్జాల  పత్రికలలో బాలల కధలు 250,బాల గేయాలు 180 సాంఘిక కథలు50, కవితలు 120,  ప్రచురణ అయ్యాయి.

 

🌿🌿🌿🌿🌿🌿🌿🌷🌷🌷🌷🌷🌷

 




 
 
 

Comments


bottom of page