'Rangurangula Holi' - New Telugu Poem Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 29/03/2024
'రంగురంగుల హోళి' తెలుగు కవిత
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
రంగురంగుల హోళి….
రంగు రంగుల హోళి - రమ్యమైన హోళి.
ఏటా వచ్చెను వసంతాగమనంలో,
ఊహలు తెచ్చెను రంగుల హరివిల్లులలో.
మది ఊగించెను ఆనంద ఢోలికలలో.
మిత్రులను దరి చేర్చి మనసులను రంజింపచేసేది హోళి.
శతృవుల మనసును మార్చి స్నేహ సౌరభాలనిచ్చేది హోళి.
వయసును ఖాతరు చేయని హోళి.
మనసుకి ఆహ్లాదాన్నిచ్చేది హోళి.
చిన్నా, పెద్దా అందరిని ఒకచోట చేర్చేది హోళి.
కామ దహనాన్ని జరుపుకునే హోళి.
మనలో ఉండే కోపాన్ని దహించే హోళి.
మితృత్వాన్ని పెంచేది హోళి.
శతృత్వాన్ని తెంచేది హోళి.
బాల్యాన్ని మరోసారి గుర్తుచేసేది హోళి.
వృధ్ధాప్య బాధలని మరిపించేది హోళీ.
అందరినీ రంగుల ఆనంద సాగరంలో ఓలలాడించేది హోళి.
బావా మరదళ్లకు, క్రొత్త దంపతులకు సరాగాల రంగుల హోళి.
ఎంతసేపున్నా ఆ కేళిలో తనివి తీరదు ఆ హాయి.
ఆబాలగోపాలం ఇష్టపడే పండుగ హోళి.
ఆసేతు హిమాచలం కనువిందు చేసేది హోళి.
కావాలి మన జీవితం అందమైన రంగులమయం.
మారాలి మన మనసులు శోభాయమానం.
….నీరజ హరి ప్రభల.
Opmerkingen