'Ratha Sapthami Visishtatha' - New Telugu Story Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 16/02/2024
'రథసప్తమి విశిష్టత' తెలుగు కథ
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
ఆదిదేవ నమస్తుభ్యమ్ ప్రసీద మమ భాస్కరా!
దివాకర నమస్తుభ్యమ్ ప్రభాకర నమోస్తుతే|
ధ్యేయత్ సదా సవితృమండల మధ్యవర్తే!
నారాయణ సరసిజాసన సన్నివిష్టః!
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటిః!
హారీ హిరణ్మయ వపుధ్రృతః శంఖచక్రః.|
నమః సవిత్రే జగదేక చక్షుసే!
జగత్ ప్రసూతి స్ధితినాశహేతువే!
త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే!
విరించి నారాయణ శంకరాత్మనే|
సప్తాశ్వరధమారూఢమ్ ప్రచండమ్ కశ్యపాత్మజమ్!
శ్వేత పద్మధరమ్ దేవమ్
తమ్ సూర్యమ్ ప్రణమామ్యహమ్|
ఓమ్ నమస్తే బ్రహ్మ రూపాయ!
ఓమ్ నమస్తే విష్ణు రూపాయ!
ఓమ్ నమస్తే రుద్రరూపాయ!
భాస్కరాయ నమోనమః. |
ఉదయస్తు బ్రహ్మ రూపేషు!
మధ్యాహ్నేతు మహేశ్వరః!
సాయంకాలే సదావిష్ణుః!
త్రిమూర్తిస్తు దివాకరః|
ఇలా ఎన్నో , ఎన్నెన్నో సూర్యుని గురించి ప్రార్ధనా శ్లోకాలు. సూర్యచంద్రులు లేనిదే ఈ విశ్వమే లేదు.
నేడు రథ సప్తమి.
అనగా సూర్యుడు ఉద్భవించిన రోజు. హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు. సూర్యభగవానుడు కశ్యప మహాముని కుమారుడు. తేజోవంతుడు, దేవతామూర్తి. లోకసాక్షి అయిన ఆ సూర్య భగవానుని అర్చించి ఆయన కరుణా కటాక్షాలను పొందే సుదినమే మాఘ శుద్ధ సప్తమి. అదే ఆయన జన్మతిథి... రథసప్తమి పర్వదినం.
రథసప్తమినాడు సూర్యోదయానికి పూర్వమే స్నానాదికాలు చేసి, సూర్యోదయానంతరము దానాలు చేయాలి. ఈ రోజు సూర్యభగవానుని ఎదుట ముగ్గువేసి, ఆవు పిడకలపై ఆవుపాలతో పొంగలి చేసి చిక్కుడు ఆకులపై ఆ పొంగలిని ఉంచి ఆయనకు నివేదన ఇవ్వాలి. ఇతర మాసములలోని సప్తమి తిథుల కన్నా మాఘమాసమందలి సప్తమి తిథి బాగా విశిష్టమైనది. సూర్యుని గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు రథము మీద సాగుతుందని వేదము 'హిరణ్యయేన సవితా రథేన” అని తెలుపుతుంది.
సూర్య గమనం ప్రకారము ఉత్తరాయన(ణ)ము, దక్షిణాయనము అని రెండు విధములు. ఆషాఢ మాసము నుంచి పుష్యమాసము వరకు దక్షిణాయనము, సూర్యరథము దక్షిణాయనములో దక్షిణ దిశగా పయనిస్తుంది.
తరువాత సూర్యుడు మకర రాశి ప్రవేశముతో ఉత్తరాయన ప్రారంభమవుతుంది. అందుకే ఆరోజు పవిత్ర దినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. 'భా” అంటే సూర్యకాంతి. “కతి" అంటే సూర్యుడు.
మనకు కనిపించే ప్రత్యక్ష దైవము సూర్య భగవానుడు. నిత్యం మనము చేసే అన్ని పనులకు ఆయనే ప్రత్యక్ష సాక్షి. ఆయన సమస్త జీవరాశికి ఆయురారోగ్య ప్రదాత. 🙏
….సమాప్తం.
నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
Video link
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
Profile Link:
Youtube Play List Link:
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు
"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏
Comments