top of page
Writer's picturePitta Govinda Rao

రెండు అక్షరాల ప్రేమ



'Rendu Aksharala Prema' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 07/02/2024

'రెండు అక్షరాల ప్రేమ' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


సృష్టి కి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ అని పాడుతుంటారు కదా.. ! ఆ జీవం పోసినదే తల్లి. ఆ తల్లికే రెండక్షరాలు అంటారు. 


ఆ జీవానికి, తల్లికి దగ్గర సంబంధం ఉంది. ఒక ఆడదిగా, తల్లిగా జీవితంలో తన పాత్ర ఎంత సాగుతున్నా తరగదు. ఆ పాత్రలో ఆ తల్లి కష్టాలు తర్వాత తరంలో తల్లి అయిన వారికే తెలుస్తుంది తప్ప ఏ మగాడికి తెలియదు. ఎందుకంటే మగాడు తలకిందులుగా తపస్సు చేసినా తల్లి కాలేడు. 


తల్లి కాబోతున్నానంటే తొమ్మిది నెలలు నరకం అని ఆలోచించరు. తల్లి అవుతున్నానంటే ఏ ఆడదానికైన ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఆ అనుభూతే వేరు. 


అయితే.. ! నేటి కాలంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వృద్దాప్యంలో పిల్లలు ఇచ్చే గౌరవం శూన్యం. వాటి మూలంగా ఏర్పడ్డవే వృద్దాశ్రమాలు. 


తల్లిదండ్రులకు బలం ఉన్నంత వరకు పిల్లలు ఇంట్లో ఉంచుకుంటారు. వారి సలహాలు, అనుభవాలు తమకు పనికొస్తాయనే ఆలోచన అది. తర్వాత వృద్దాశ్రమాలే వారికి చివరి గూడుగా మారుతున్నాయి. 


శారదకి ఇద్దరూ.. కొడుకులే పుట్టారని, శారద ఎంతో అదృష్టవంతురాలని ఊరి జనమంతా ఎప్పుడు చెప్పుకుంటు ఉంటారు. ఆ మాటలకు శారద పొంగిపోతుందో లేదా పిల్లలు మీద ప్రేమో కానీ పిల్లలు ఇద్దరిని కంటికి రెప్పలా చూసుకుంటుంది. పెద్దవాడు మురళి, చిన్నవాడు అఖిల్. గర్బంలో కంటికి రెప్పలా చూసుకున్నది, పెంచి పెద్దవాళ్ళని చేయటంలో కూడా అదే సున్నితత్వం. నిజంగా పిల్లలు అంటే ఏ తల్లికైనా ప్రాణం కదా.... 


ఒక మనిషైనా.. 

ఒక జంతువైనా.. 

ఒక పక్షైనా... ఏదైనా సరే తల్లి అన్నాక తన ప్రాణం గూర్చి ఆలోచించదు, ఎల్లప్పుడూ పిల్లలు యోగక్షేమాలు గూర్చే, వారి ఆనందం గూర్చే తల్లి ఆలోచనలన్ని. అందుకే ఈ సృష్టిలో తల్లికి ఎక్కడ లేని స్థానం ఉంది. అసలు ఆ పేరులోనే ఒక అందం, ఒక ధైర్యం, ఒక బలము‌, ఒక నమ్మకం, ఒక ప్రాణం ఉన్నాయి. 


ఇంత పవిత్రమైన ఆ పేరుకు కొందరు కర్కశమైన కొడుకుల వలన చాలా మచ్చలు పడుతున్నాయి. ఆ పేరుని దైవంలా భావించి గుడిలోను, గుండెలోను పెట్టి పూజించల్సింది పోయి.. ఎవరూ లేని ఒక అనాధాశ్రమం‌, ఒక వృద్దాశ్రమానికి పంపుతున్నారు. 


శారద నిర్మలమైన మనసు కలది. అంటే.. ! తన పిల్లలకు కూడా అదే మనసు ఉండాలని, మంచి బుద్దులు అబ్బాలని తాపత్రయం పడుతుంది కదా.. ! 


మురళి, అఖిల్ ఇద్దరు పాఠశాలలోకి అడుగు పెట్టారు. పాఠశాలకు వెళ్తుంటే ఆ పిల్లలు ఇద్దరు.. తల్లిని వదలేందుకు ఇష్టపడటం లేదు. అమ్మ.. అమ్మ అంటు ఒకటే ఏడుపు. వారిని వదిలేందుకు తల్లికి కూడా ఇష్టం లేదు కానీ.. ! వాళ్ళు చదువుకుంటే మంచి స్థానంలో ఉంటారని. నిజమే కదా.. ! ప్రతి తల్లి తన బిడ్డలను చదివించేది తనకు బువ్వ పెడతారని కాదు. ఆ బువ్వ కోసం ఎవరి వద్దా చెయ్యి చాచరని. అందుకే తనకు తాను మనసులో ఓర్చుకుంటుంది. ఎప్పుడు పాఠశాల విడిచిపెడతారా.. అని ఒకవైపు పిల్లలు, మరోవైపు తల్లి ఎదురుచూపులు. రోజులన్ని ఆ ఇద్దరు కొడుకులుకు ఊహా తెలిసిన వరకు ఇలాగే సాగాయి. ఒకసారి మురళి, అఖిల్ ఇద్దరు శారదను చేరోవైపు లాగుతూ

‘అమ్మ నాది’ అంటే ‘అమ్మ నాదీ’ అని పోటి పడేవాళ్ళు. వారి పోటీకి ఆ తల్లి ఎంతగానో సంతోషించేది. ఇది ఆ తల్లి, పిల్లలకు ఉండే బంధం. 


ఇక వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. ఆమె వయస్సు పెరిగింది. అయినా.. ! వారికి తల్లి పై ఎంతో ప్రేమ. ఇద్దరు పోటిపడి మరీ చూసుకునేవారు. అలా అయితే ఇంకా ఏ తల్లికైనా ఇంకేం కావాలి... ? వాళ్ళు పెద్దవాళ్ళు అయితే అయ్యారు కానీ అమ్మే అన్ని నడిపిస్తుంది. అవును అమ్మకు సాద్యం కానిదేది లేదు కాదా.. ! అయినప్పటికీ అమ్మకు ఎప్పటి నుండో ఎన్నో కోరికలు ఉంటాయి. వాటిని తన అనే వారి కోసం మనసులో చంపుకుని, అనుకున్నది సాదించటానికి ఎదురయ్యే సమస్యలు\తో, అవమానాలతో ఆత్మగౌరవాన్ని చంపుకోలేక, తన ఇష్టాలను ఎవరికి చెప్పకోలేక మనసులో దాచుకుని పైకి ప్రేమని కురిపిస్తుంది. 


అలా మరికొంత కాలం గడవగా ఇప్పుడు శారదా వ్రుద్దాశ్రమంలో చివరి గడియాలు లెక్కిస్తుంది. 


" అమ్మ నాది అంటే అమ్మ నాది " అని ఏ కొడుకులైతే పోటిపడ్డారో... పెద్దయ్యాక కూడా అమ్మని చూసుకోటానికి ఏ కొడుకులైతే పోటిపడ్డారో.. పెళ్లి అయ్యాక ఆ కొడుకులే ఇప్పుడు తల్లి ఆస్తులతో సంభందం లేకుండా ఆ కొడుకులు బాగా గొప్పవాళ్ళు అయ్యారు. అందుకే

" అమ్మ నీదంటే అమ్మ నీది "అని పోట్లాడుకుంటు చివరకు కనికరం లేకుండా వృద్దాశ్రమంలో ఉంచి తాము మాత్రం అమ్మ కష్టంతో నిర్మించుకున్న అద్దాల మేడలో బార్య పిల్లలతో ఉంటున్నారు. 


ఇదేంటయ్యా... శారదా మంచి అదృష్టవంతురాలని, ఇద్దరు కొడుకులు పుట్టారని, బాగా చూసుకుంటారని, ఆమెకు కష్టాలే ఉండవని ఊరి జనాలు ఆనుకుంటే పాపం ఆ అమ్మ పరిస్థితి ఇంత ఘోరంగా మారింది? 


శారదకి కష్టాలు సంగతి అటుంచు పిల్లలు మనసు మారినా.. తల్లి మనసు మారదు కదా.. ఆ పిచ్చి తల్లికి కొడుకుల వద్దే ఆనందంగా ఉండి కన్ను మూయాలని ఆశ. ఆమె ఆశ, ఆ కోరికను ఆ కర్కశమైన కొడుకులకు ఎవరు చెప్తారు.. ? మనుమలు, నాన్నమ్మ, తాతయ్యల గూర్చి అడిగితే నాన్నమ్మ వృద్దాశ్రమంలో ఉందని ఎలాగూ చెప్పరు. మరీ ఏమంటారు... ?


చెప్తే చనిపోయిందని చెప్పాలి. మరీ..! బతికుండగానే చనిపోయిందని చెప్పటానికి వారికి మనుసు వస్తుందా అంటే.. ఎందుకు రాదు.. ? తల్లి ప్రేమని మరిచి వృద్దాశ్రమంలో చేర్చినపుడే వారి దృష్టిలో తల్లి చనిపోయింది కదా.. రెండక్షరాల ప్రేమ గల తల్లి మనకు భూలోక దైవం. అది తెలుసుకోలేకపోయారు వాళ్ళు. 


ఓ దైవమా... గుడిలో జంతువులను బలి ఇచ్చి రక్తం చిందిస్తే పవిత్రమంటా.. , ప్రాణం పోసే తల్లి రక్తానికేమో అసలు ప్రవేశమే లేదంటా.. ఏ దేవుడు చెప్పిన ఆచారం ఇది.. ? 


ఆ తల్లి తన చివరి కోరిక కూడా నెరవేరదని ఆమెకు తెలుసు. కనీసం చివరి చూపునకైనా వస్తే చాలనుకుని మరొ కోరిక కోరుకుంది. అదైనా నెరవేరుతుందో లేదో చూడాలి. 


**** **** **** **** **** ****

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )

Profile:

Youtube Playlist:

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం 



44 views0 comments

Comments


bottom of page