'Repati Pourulu' - New Telugu Story Written By Yasoda Gottiparthi
Published In manatelugukathalu.com On 27/07/2024
'రేపటి పౌరులు' తెలుగు కథ
రచన: యశోద గొట్టిపర్తి
“టీచర్! మే ఐ కం ఇన్ ?”
“యెస్ కం ఇన్..” అనగానే లోపలికి వచ్చిన అటెండర్.......
“సుశీలా టీచర్! మీ కోసం మీ క్లాస్ స్టూడెంట్ అర్జున్ పేరెంట్స్ వచ్చారు. మిమ్మల్ని ప్రధానోపాధ్యాయులు గారు రమ్మంటున్నారు. "
“నేను క్లాస్ లో ఉన్నాను ఎలా?”
“ఫరవాలేదు, వచ్చి వెళ్ల మన్నారు.. అర్జంట్ టీచర్”.
“సరే వస్తున్నాను” అంటూ “క్లాస్ లీడర్ ఎవరూ?”
“నేనే టీచర్” అంటూ నిలబడ్డ రామును చూచి “నేను బయటికి వెళ్తున్నాను. నేను వచ్చేంతవరకు క్లాస్ ను నిశ్శబ్దంగా ఉండనివ్వు. ఎవరైనా అల్లరి చేస్తే వాళ్ల పేర్లు బోర్డ్ మీద వ్రాయి. నేను వచ్చాక వాళ్ల పని చెప్తాను” అంటూ “ఇక్కడ వచ్చి నిలబడు” అంటూ టీచర్ ‘కుర్చీకి దగ్గరగా’ అని చూపించి వెళ్ళింది.
“టీచర్! మీరు హోమ్ వర్క్ అంటూ క్లాస్ వర్క్ బుక్ లో ప్రశ్నలకు సమాధానాలు వ్రాయమని ఇస్తున్నారు. అది క్లాస్ లో చేయవలసిన పని అండి. ఇంట్లో చదువుకోవడానికి టైం ఉండడం లేదు. మీరు ఈ వర్క్ కేవలం ఆదివారానికి హోమ్ వర్క్ గా ఇస్తే పిల్లలు సెలవు రోజును సద్వినియోగం చేసుకుంటారు. ఇంట్లో అస్తమానూ వ్రాయవద్దని అంటె టీచర్ కొడుతుందని చెపుతున్నాడు. అలా చెప్పాడని నేను వ్రాయడం లో సహాయం చేస్తున్నాను”.
“మేము సిలబస్ ప్రకారం సబ్జెక్ట్ పూర్తి చేయాలండి. ప్రతి సబ్జెక్ట్ కు సంబంధించిన పాఠాలు వ్రాయడం, చదవడం లాంటివి క్లాస్ లో టీచర్ ఆధ్వర్యం లో చేయడం చాలా కష్టం. అందుకు తగిన సమయం ఉండదు. ఎక్స్ట్రా క్లాస్ లు అని పెడితే అదనపు భారం పడుతుంది”.
“
టీచర్! మీరు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అక్షర జ్ఞానం లేని తల్లి తండ్రులు తమ పిల్లలకు న్యాయం జరగడం లేదని విజ్ఞప్తి చేసు కుంటున్నామండి" అనడం తో.........
“ఏ సమస్య అయినా కుటుంబం నుండే పరిష్కారం కావాలండి. మీరు ఫీజులు కట్టి బడికి పంపిస్తున్నామంటూ, జీతాలు ఇస్తున్నామని అంతా ఉపాధ్యాయులే చూసుకుంటారని భరోసాతో యాజమాన్యం.... పిల్లల పైన శ్రద్ధ కనబరచడం లేదు. పేరెంట్స్ టీచర్ మీటింగ్స్ అంటూ అమలు చేస్తున్నా అందుకు కూడా హాజరు కావడం లేదు.
తల్లి తండ్రి ఇద్దరూ కలిసి తమ పిల్లలను శ్రద్ధ చేయక, చదువు విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. క్లాస్ లో నలభై మందికి ఒక్క టీచర్ ప్రతి విద్యార్థి పై శ్రద్ధ కనబరచా లంటే సాధ్యమేనా? మీరే చెప్పండి?
మీరు ఉపాధ్యాయులు చెప్పే హోమ్ వర్క్, చదువు కోవడం లో శ్రద్ధను చూపడం కరక్టే కానీ, వారు చెప్పిన అభిప్రాయాలకు గౌరవ మిస్తూ పిల్లలకు అర్థమయ్యే ట్లు చెప్పాలి....... కానీ మా మాటలను నిర్లక్ష్యం చేస్తే, మీ మాటలను నిర్లక్ష్యం చేసిసమాజానికి ద్రోహులవుతారు.
విద్యార్థులు ఇంటి కంటే పాఠశాలలో గడిపే సమయం ఎక్కువ”.
టీచర్ చెప్పిన మాటలు విన్న అర్జున్ చదువులో వెనుక బడి యున్న తన తోటి విద్యార్థులకు చదివించడం లోనూ, వ్రాయించడం లోనూ సహాయం చేస్తూ వారి చేత చదువు మీద శ్రద్దా శక్తులు పెరిగే విధంగా పేరు తెచ్చుకున్నాడు.
సుశీలా టీచర్ చెప్పినట్టల్లా చేసి అర్జున్ ఆమెను మంచి టీచర్ గా, తాను ఉత్తమ విద్యార్థిగా పిలువ బడుతున్నాడు.
“అరుణ టీచర్, క్రాంతి. మాస్టర్ వాళ్ల క్లాస్ లో ఈ ఒత్తిడి ఉండదురా. చదివినా చదవకున్నా మంచి మార్కులు వస్తాయి”.
“అదెట్లారా” అన్నాడు రవి.
“అరుణా టీచర్ క్లాస్ లో ప్రక్క టీచర్ తో మాట్లాడుకుంటూ టైం పాస్ చేస్తుంది. ఆ టైమ్ లో మనం కూడా అల్లరి చేస్తూ హాయిగా ఉంటున్నాం. లీడర్ ను నిలబెట్టి క్లాస్ ను నిశ్శబ్దంగా ఉంచమని చెప్తుంది”.
ఆ మాటలు విన్న అర్జున్ “అలా చేయడం వల్ల మనకు పాఠం సిలబస్ పూర్తి కావడం లేదు. తీరా పరీక్షల ముందు చెప్తే అర్థం కాక, చదువుకునే సమయం లేక, చదువక పోవడం వల్ల పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తున్నాయి.
అప్పుడు ఆ సబ్జెక్ట్ లో ఫెయిల్ కావడం వల్ల అదే తరగతిలో ఉండాల్సి వస్తుంది. అప్పుడు నష్ట పోయేది మనమే కదరా”.
“అలా ఏం జరుగదురా. అప్పుడప్పుడు అరుణా టీచర్ నన్ను పిలిచి ‘ఈ రోజు పనమ్మాయి రాలేదు బాబూ, కాస్తా ఆ గిన్నెలు కడిగి పెడతావా చందూ’ అని చెప్తుంది. ఇల్లు దగ్గరే కాబట్టి నేను ఆ పని చేస్తే, నాకు తన సామాన్య శాస్త్రం సబ్జెక్ట్ లొ మార్కులు వేసి పాస్ చేస్తుంది రా” అన్నాడు చందూ.
“క్రాంతి మాస్టర్ కల్లబొల్లి కబుర్లు కాల క్షేపం చేస్తాడు. మనం వెనుక బెంచి లో కూర్చుని చేసే పిచ్చి పనులు ఏమీ పట్టించుకోడు”.
అక్కడికి వచ్చిన అర్జున్ “ఏం మాట్లాడు కుంటున్నారు? సమయం విలువ తెలుసు కుని మసులు కోవాలి. ముందు కాలం గురించి ఆలో చించు కోవాలి. ఇలా వృధా కాలక్షేపం చేస్తే మన తల్లి తండ్రుల ఆశయ సంకల్పం బలహీన పడుతుంది. పాఠశాల విద్యా ప్రమాణాలు తగ్గి పోతాయి. మనకు మనమే ఏ నష్టం జరుగ కుండా చూసుకోవాలి”.
ఇంత లో సామాన్య శాస్త్రం టీచర్ అరుణా మేడం వచ్చి మానవ శరీర నిర్మాణం, వాటి విభాగాలు బొమ్మల రికార్డ్ బుక్స్ ఒక్కొక్కరు లైనులో వచ్చి కరెక్షన్ చేయించుకోండి అనగానే విద్యార్థులందరూ తమ బుక్స్ పట్టుకుని వెళ్ళారు.
అర్జున్ వేసిన బొమ్మలు చూసి “ఇలా వేశావ్? ఒక్కటి చక్కగా లేదు. వాటి పోలికే లేదు. మీకు డ్రాయింగ్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది కదా!" డ్రాయింగ్ కొలతలతో, సులభమైన పద్దతులతో, శిక్షణ ఇవ్వడం లేదా టీచర్? నువ్వు చదువులో ఫస్ట్ ర్యాంక్ లో ఉంటావు, నువ్వు దించిన బొమ్మలు అసలే బాగులేవు. నేను మార్కులు వేయ లేను. "
బాగా ఆలోచించి ‘పేపర్ మీద వేసే బొమ్మలకే చాలా రకాల విలువలను తెలియ చేశాను. మరి సామాన్య శాస్త్ర బోధన లో నేను శ్రద్ధ తీసుకోవడం లేదు. వాళ్లకు అర్థమయ్యే టట్లు చెప్పడం లేదు. ఉపాధ్యాయురాలు గా విద్యార్థులకు తగిన న్యాయం చేయలేక పోతున్నాను’ అని తనను తానే ఆత్మ విమర్శ చేసుకుని, తనకు కనువిప్పు కలిగించిన అర్జున్ నీ అభినందించింది. పిల్లలందరికీ సైన్స్ పాఠాలు బోధిస్తూ వారికి చదువు పట్ల ఆసక్తి కలిగేలా చేసింది.
అర్జున్ తనలో తానే గర్వ పడ్డాడు.
***
“ఏమ్మా! సుమతీ! బడికి రావడం లేదు. పైగా సెలవు చీటీ ఇవ్వలేదు. వారం రోజులకు పైగా స్కూల్ కు రాకుండా ఉంటే పేరు తీసివేయ బడుతుంది. రేపు వచ్చేప్పుడు డాక్టర్ సర్టిఫికేట్ పట్టుకుని రా".
“టీచర్! అవన్నీ ఏమీ తేలేనండి. నేనుబడి మానేస్తున్నాను. మా అమ్మా నాన్న చదువు మాన్పించేస్తున్నారు”.
“ఎనిమిదవ తరగతి మధ్యలో మానడ మేమిటి? మీ తల్లి తండ్రిని తీసుకు వచ్చి ప్రధానోపాధ్యాయుల తో అనుమతి తీసుకోవాలి”.
లoచ్ టైం లో సుశీల టీచర్ దగ్గరికి వచ్చి, “నాకు పెళ్ళి కుదిరింది టీచర్. ఇంట్లో వాళ్ళు పెళ్ళి చేస్తామంటున్నారు. నాకు ఇంకా చదువు కోవాలని ఉన్నది” అంటూ ఏడుస్తూ చెప్పింది.
“అమ్మాయికి 18 సంవత్సరములు నిండే వరకు పెళ్లి చేయకూడదు. పిల్లలందరూ బాగా చదివి లైఫ్ లో మంచి పొజిషన్ లో ఉండాలని మంచి సలహాలు ఇస్తూ, ఎక్స్ట్రా క్లాస్ లు టూష న్స్ చెపుతున్నారు. మీరేమో మధ్యలోనే మానేస్తే మేము చేసే కృషికి అర్ధ మేముంది?”
******************
మరునాడు వచ్చి, “నాకు ఫీజులు కట్టడం మా అమ్మా నాన్నకు భారం అవుతుందట. నా తరువాత ఇద్దరు చెల్లెళ్ల ను కూడా చదివిoచాలంటే చాలా ఖర్చు అని ఆలోచిస్తున్నారు టీచర్. నాకు వచ్చిన చదువు చాలు, ఉత్తరం ముక్క వ్రాయ వస్తె చాలు అని నన్ను ఇంటి పనులలో పెట్టు దామని అనుకుంటున్నారు. ఇంతలో మా బావ వచ్చి పెళ్ళి చేసు కుంటా ననడం తో నన్ను చదువు మా నేయ మంటున్నారు”.
“రేపు మీ పేరెంట్స్ ను తీసుకుని రా” అని చెప్పి పంపించింది సుశీల టీచర్.
**********************
ఇంటికి వెళ్ళే సరికి “నీకు బాగా చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని కోరిక ఉంది కదా! నాకు మంచి ఉద్యోగం వచ్చింది. నిన్ను చదివించే స్థోమత కూడా ఉంది. నన్ను పెళ్ళి చేసుకో. నీకు ఏ లోటు లేకుండా చూచు కుంటాను. మీ నాన్నకు భారం తగ్గుతుంది” అని వెంట పడ్డాడు.
“బావా! పెళ్ళి వల్ల నా స్వేచ్ఛా జీవితం పోతుంది. పెద్ద వాళ్ళందరూ నన్ను ఇంటి పనులకు, వాళ్లకు సేవలు చేయ మంటారు. పెళ్ళి తరువాత భర్తగా నామాట కూడా వినవు. ఇవన్నీ నీకెలా తెలుసు అనుకుంటున్నావా? మా అమ్మ కూడా ఆరోజుల్లో చదువుకుంటానని అంటే, మా అయ్య ఇల్లు, పిల్లలను చూసుకుంటే చాలు అని ఇల్లు మొగుడు పిల్లల పనులు అని ఇల్లుదాట నీయలేదు. ఊళ్ళో వయోజన విద్య, రాత్రి బడు లు అంటూ ఎన్ని కార్యక్రమాలు పెట్టినా ఈ వయసులో చదువుకుని ఏం చేస్తావే అంటూ మా నాన్న పంపించ లేదట. కాలo మారినా మనుషులు మారక పోతే మన జీవితాలు ఎప్పటిలాగే ఉంటాయి."
సుమతి మాటలు విన్న బావ “నువ్వు ఎక్కడికీ వెళ్ళేది లేదు” అంటూ గదిలో పెట్టీ తాళం వేశాడు.
****************************
మరునాడు సుమతి స్కూల్ కు రాక పోయేసరికి ఏదో జరిగింది అని పసిగట్టి, సుశీల మరో ఇద్దరు టీచర్స్ కలిసి సుమతి ఇంటికి వెళ్ళారు.
“సుమతి ఎక్కడ? చూపించండి?” అని తల్లి తండ్రిని నిల దీయగా బెదరక పోతే “మిమ్మల్ని పట్టుకు పోవడానికి పోలీసులు వస్తారు” అనగానే జరిగిన సంగతి చెప్పారు.
‘మేము అమ్మాయిని బడికి పంపక పోవడానికి కారణం మా ఆర్థిక పరిస్థితి’ అని చెప్పారు.
“మాకు సుమతి అంతా చెప్పింది........ పెళ్ళి పేరుతో చదువు మాన్పించడం కూడా కరెక్ట్ కాదు. మైనర్ బాలికకు పెళ్ళి చేస్తే శిక్ష కు అర్హులవుతారు.
స్కూల్ తరపు నుండి మీ అమ్మాయితో సహా ఇలాంటి ఆర్థిక కారణాల వల్ల చదువు మానేస్తున్న పిల్లలకు ఫీజు మాఫీ, స్కాలర్ షిప్ లు ఇచ్చేందుకు కృషి చేస్తున్నాం. మీ అమ్మాయి చదువుకు మేము భరోసా ఇస్తు న్నాము.
‘వివాహం విద్యా నాశాయ’. విద్యార్ధినుల వసతికి అనువుగా నిర్మాణాలు చేపడతాం. ఆడ పిల్లలు చదువుకునే అందుకు ప్రత్యేక విద్యాలయాలు, కళాశాలలు ప్రభుత్వం చేత ఏర్పాటు చేయిస్తాం. స్త్రీలకు న్యాయ పరమైన హక్కులు పెరగాలంటే ముఖ్య మైన విధానం చదువు. ఉన్నత విద్య ఉన్నత మైన విద్య, చదువు ఉంటేనే మానసిక వికాసం. దానితో ఎవరి సమస్యలను వాళ్లు పరిష్కరించు కోగలుగుతారు. తమ జీవితాలను ఆదర్శ వంతంగా తీర్చి దిద్దు కోగలరు. అమ్మాయి చదువు జగతికి వెలుగు. పిల్లల వయసు లోనే వాళ్లకు దేని నైనా గ్రహించి, జ్ఞాపకం పెట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఉపాధ్యాయులు కోరుకునేది...... తమ సమాజానికి మంచి విద్యార్థుల నందిస్తే తాము పుట్టినందుకు, ఆ వృత్తికి ఉపయోగం ఉంటుంది అనుకుంటాము”
అంతా విని తాము చేసిన పనికి క్షమాపణలు అడిగి “మీరు చెప్పింది తప్పకుండా పాటిస్తాము” అని ఊరు వాళ్ళందరూ విద్యార్థుల చేత "ఉపాధ్యాయుల దినోత్సవం" గౌరవంగా, ఘనంగా జరిపించి పిల్లల చేత "ఆచార్య దేవోభవ" అంటూ పాదాభి వందనాలు చేయించారు.
"నేటి బాలలే రేపటి పౌరులు"గా వర్ధిల్లoడి అంటూ ఆశీర్వదించారు ఉపాధ్యాయులు.
సమాప్తం.
యశోద గొట్టిపర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి
హాబిస్: కథలు చదవడం ,రాయడం
Comments