'Rupayi Dandakam - New Telugu Song Written By Sudarsana Rao Pochampally
Published In manatelugukathalu.com On 02/11/2023
'రూపాయి దండకం' తెలుగు పాట
రచన : సుదర్శన రావు పోచంపల్లి
ఓ రూపాయి రూప్యమా శుభ్రమా
భారత దేశమందున్ జన్మించి బహు
రూపులన్ విలువలున్ బొందుచున్
లక్ష్మీ దేవి అవతారమైనట్టి నినున్
నిత్యంబు చెలామణిన్ జేయకన్
బీదయున్ బిక్కియున్ ధనికుడున్
ఉదయస్తమానంబులందున్ నిన్నే
తలచుచున్ లెక్కించుచున్ ఉండలేకన్
సదా నీ ధ్యాసతో పరువుయున్
బ్రాణముల్ లక్షించకన్ వెరువకన్
నిను గోరి నీ దాసాను దాసులై
పైసయే ప్రాముఖ్యమంటున్ నుందురో
రూప్యమా కౌశిక సంతతిన్ బోలి
శత సంతుగలిగి సతతము రాణించు
బిళ్ళ రూపాయివై కాగితంబైకెక్కి
ఒకటి రెండు ఐదు పది ఏబది ఆపై
వంద రెండొందలున్ నింక ద్విసహస్రంబులై
చలామణి అగుచున్ దేశ విదేశాలయందున్
నీ విలువకున్ విలువగా మార్పు జెందుచున్
ధరణిలో బుట్టి ధరణికే ధర బలుక జేయుచున్
ధరణి పంటకున్ ధరలంటున్ వెండి బంగారు
మున్నగు లోహాలకున్ వీడకన్ విలువలన్ బెంచుచున్
భక్తికిన్ భుక్తికిన్ రక్తికిన్ అనురక్తికిన్
కూలికిన్ నాలికిన్ విద్య వైద్యాలకున్
పాప పుణ్య కార్యంబులున్ పయనంబులున్
నువు లేక లోకంబు స్థంభించదే
ప్రాణముల్ బాయున్ గదా దక్కన్ నీవేకదా
చచ్చినన్ వైకుంఠ ధామంబునన్
వివాహాది శుభ కార్యంబులున్
రూపాయ లేకున్న ఏ తీరు ఏ కార్యమున్
సాగబోదో సారస సోదరీ
సరసిజనాభు పత్ని రూపా
నమోస్తుతే రౌప్యమాతా నమస్తే నమస్తే నమోస్తుతే
***
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
Sir, స్కూల్ రోజుల్లో రూపాయి మీద Wren & Martin grammer book లో వ్యాసం చదివాను. మళ్లీ ఇప్పుడు మీ కవిత!. నాకు నచ్చింది.✅