top of page
Writer's pictureOtra Prakash Rao

శభాష్ సంజీవి - ఎపిసోడ్ 3



'Sabhaash Sanjeevi - Episode 3' - New Telugu Web Series Written By Otra Prakash Rao Published In manatelugukathalu.com On 13/01/2024

'శభాష్ సంజీవి - ఎపిసోడ్ 3' తెలుగు ధారావాహిక

రచన : ఓట్ర ప్రకాష్ రావు 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్




జరిగిన కథ:

‘గుడ్దిగోలా’ బ్రాండ్ కూల్ డ్రింక్ తాగడంవల్ల వచ్చే నష్టం గురించి స్కూల్ లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి నిరూపిస్తాడు తొమ్మిదవ తరగతి స్టూడెంట్ సంజీవి.. 

దాంతో సంజీవి మీద పగ పెంచుకుంటారు వ్యాపారి జిడ్డు, డీలర్ చండుడు.. 

వార్డెన్ విశ్వనాథాన్ని లోబరుచుకుని, సంజీవి మీద దొంగతనం నేరం మోపి, ఆ బాధలో ఉన్న అతన్ని కిడ్నాప్ చేస్తారు.. అక్కడ బాలు అనే కుర్రాడు పరిచయమౌతాడు సంజీవికి.. 


గుడ్దిగోలాకు అనుకూలంగా మరో మ్యాజిక్ ప్రదర్శన ఏర్పాటు చెయ్యడానికి ప్లాన్ వేస్తాడు చండుడు.. 

ఇక శభాష్ సంజీవి - ఎపిసోడ్ 3 చదవండి.. 


సాయంత్రం అంగడి ముందు షామియానాతో పాటు ‘ఉచిత మేజిక్ ప్రదర్శన’ అన్న పెద్ద బోర్డు వెలిసింది.. 

బడి వదలగానే మేజిక్ ప్రదర్శన ఆరంభమయింది.. బడినుండి బయటకు వచ్చినపిల్లలు చాలామంది మేజిక్ ప్రదర్శన చూడటానికి వచ్చారు.. 

పిల్లలను సంతోష పరిచే కొన్ని మేజిక్ ప్రదర్శనలు ప్రదర్శించాడు.. పిల్లలందరూ ఉత్సాహంతో ఆనందిస్తూ చూడసాగారు 


 "ఈ మధ్య వ్యాపారాలలో పోటీ ఎక్కువయింది.. అంతెందుకు ఇక్కడ అమ్ముతున్న ఆ కంపెనీ చల్లనిపానీయం మీద చాలా మంది గుర్రుగావుంది.. అందుకే తమకు తెలిసిన రసాయన పదార్థములు కలపగానే మార్పులు కలగడం, ఆమార్పును తమకు అనుగుణంగా మార్చడం జరుగుతోంది.. అది ఎంతవరకు నిజమో మీకు చూపిస్తాను.. "


 ఒక ఎర్రటి క్యాబేజీ చూపించి అందరి ముందు ముక్కలుగా కోసి మిక్సీలో వేసి క్యాబేజీ రసం తయారు చేసి వడగట్టి ఒక జగ్గులో పోసి ఉంచాడు. 

అంతకుముందు నీటితొ వున్నఐదు గాజు గ్లాసులను తనముందు ఉంచాడు. 

ఒక అబ్బాయిని పిలిచి అందులో ఏముందో కొద్దిగా తాగిచూసి చెప్పమన్నాడు. 

 ఆ అబ్బాయి తాగి చూసి నీళ్లు సార్ అన్నాడు. 

 “ఇక్కడా పెద్దవారున్నారు.. ఎవరైనా ఇద్దరు వచ్చి మిగిలిన గ్లాసుల నందు ఏముందో చూసి చెప్పండి.. ” అన్నాడు.. 


అక్కడున్న ఇద్దరు వచ్చారు.. వాళ్లిద్దరూ నాలుగు గ్లాసులు చూసి ”నీళ్లు వున్నాయి అండీ" అని చెప్పివెళ్లారు.. 

క్యాబేజీ రసం పోసిన ఆ జగ్ ను మరో అబ్బాయిని పిలిచి చేతికిచ్చాడు. 


"నీ చేతులోనున్న క్యాబేజీ రసాన్ని ఈ ఐదు గ్లాస్ నందు పోసి ఏం జరుగుతుందో చూడు "అన్నాడు మెజీషియన్. 

తనదగ్గరున్న క్యాబేజీ రసాన్ని ఐదు గ్లాస్సులందు పోసాడు.. 

మరికొంత సేపటికే అందరూఆశ్చర్యపోయారు.. 

ఒక్కొక్క గ్లాస్ నందున్న ద్రవం ఒక్కొక్క రంగుగా మారింది.. 


 "డియర్ స్తూడెంట్స్, నేను ఐదు గ్లాస్ లందు నీటినే పోసాను.. ఐదు గ్లాసులందువున్న నీటిలో మీముందే క్యాబేజీ రసం కలిపాను.. 'ఒక్కొక గ్లాస్ నందున్న నీరు క్యాబేజీ రసం కలవగానే ఒక్కొక్క రంగుతో మారడం మీరు చూసారు.. ఇదే మేజిక్.. ఇలాంటి మేజిక్ సరదాకు ప్రదర్శించాలి కానీ చెడుకు ప్రదర్శించకూడదు.. 


మీ బడిలో కొన్ని రోజుల ముందు సంజీవి అనే కుర్రాడు ఆ కంపెనీ కూల్ డ్రింక్ మీద తప్పుడు ప్రయోగం చేసి మిమ్మల్ని దారి తప్పించాడని తెలిసింది.. ఆ ప్రదర్శన చేయడానికి ఎంత డబ్బు తీసుకున్నాడో తెలీదు.. కానీ ఆ తరువాత బడికి రావడం మానుకొన్నట్లు తెలిసింది.. చిన్న వయసులో డబ్బుకోసం ఇలా ప్రవర్తించడం చాలా బాధగా వుంది.. " అన్నాడు మెజీషియన్.. 

 ఆయన మాటలు పిల్లలలో సంజీవి మీద కొత్తగా అనుమానం కలిగించింది.. 


"పిలవగానే ప్రదర్శనకు సహకరించిన పిల్లలకు, గ్లాస్ నందున్న నీటిని పరీక్షించిన ఆ ఇద్దరికీ, గుడ్డి గోలా పానీయం బాటిల్ ఒక్కొక్కరికి బహుమతిగా ఇస్తున్నాను.. అది త్రాగి సంతోషించండి.. " అన్నాడు.. 


 ఆ తరువాత మరికొన్ని ప్రదర్శనలకు బడిపిల్లలకు అవకాశం ఇస్తూ వారికి ఉచితంగా కూల్ డ్రింక్ ఇచ్చాడు.. 


 మెజీషియన్ అందరి వైపు చూస్తూ  “ఇప్పుడు మీరే మరో మేజిక్ ఒకటి చేయబోతారు.. ఎవరైనా విద్యార్థి లేచి ఇక్కడకు రావాలి “


ఒక్క సారిగా నలుగురు లేచి "నేను నేను" అంటూ చేతులు పైకెత్తరు.. ఆ నలుగురు మేజిక్ ప్రదర్శనలో ఉత్సాహంతో పాల్గొనడానికి ముందుకొచ్చారు అనడంకన్నా ఉచితంగా లభించే గుడ్ది గోల పానీయం తాగాలన్న ఉద్దేశ్యంతో ముందుకు వచ్చారన్న సంగతి మెజీషియన్ ఊహించాడు.. 

మొదటి అబ్బాయిని పిలిచి తన జేబులోని డబ్బులు ఇస్తూ "ఇక్కడ అంగట్లో వెళ్లి అర్ధ లీటర్ పాకెట్ పాలు తీసుకొని తొందరగా రా" అన్నాడు.. 


ఆ కుర్రాడు వేగంగా వెళ్లి పాల పాకెట్ తెచ్చి ఇచ్చాడు.. 

రెండవ అబ్బాయి వైపు చూస్తూ "అక్కడున్న గ్లాస్ తీసుకుని ఏమైనా ఉన్నదా పరీక్షించి చూడు" అన్నాడు. 


ఒక సారి గ్లాసు ఎత్తుకొని చూసి “ఏమీ లేదు సార్ “ అన్నాడు. 


మూడవ అబ్బాయిని పిలిచి "ఆగ్లాస్ కడిగి తీసుకునిరా " అన్నాడు. 


గ్లాస్ కడిగి తనచొక్కాతోనే శుభ్రంగా తుడిచి ఇచ్చాడు.. 

నాలుగవ అబ్బయిని పిలిచి పాల పాకెట్ కవర్ నందున్న పాలను గ్లాసులో పోయమంటూ చిన్న కత్తి ఇచ్చాడు.. కత్తితో కట్ చేసి పాలు పోసాడు.. 


“నేను చెప్పిన పని చేసినందుకు మీ నలుగురికి గుడ్డి గోలా పానీయంతో పాటు ఒక్కొక్కరికి ఒకపెన్ బహుమతిగా ఇస్తున్నాను.. “ అంటూ పెన్నుతో పాటు గుడ్ది గోలా పానీయం ఇచ్చాడు.. 


నలుగురూ విజయగర్వంతో సంతోషంతో తాగుతూ వెళ్లి ఇంతకుముందు కూర్చున్న చోట కూర్చున్నారు.. 

మెజీషియన్ ఒక మ్యాజిక్ దండంతో “అబ్రక దబ్రా దబ్రాక అబ్రా” అంటూ మూడు సార్లు గట్టిగా అని ఆ దండాన్ని పాలలో ఉంచి కలిపాడు ఆశ్చర్యం పాలు రంగుమారింది.. నురగలు కక్కుతూ అగ్ని పర్వతం పేలి లావా బయటకు వచ్చినట్లు బయటకు రాసాగింది.. పిల్లలందరూ ఆశ్చర్యంతో గట్టిగా చప్పట్లు కొట్టారు. 


 "చూడు పిల్లలూ! ఈ పాలతో నేను మేజిక్ చేసాను.. దానికోసం ఈ పాలను తాగితే మీరు రోగాల పాలవుతారు అని చెప్పడం న్యాయమా.. మీ బడిలో ఒక అబ్బాయి గుడ్డి గోలా పై చేసింది ఇలాంటి మ్యాజిక్.. మేజిక్ వెనుక దాగివున్న రహస్యాన్ని దాచి ఉంచి ఆ పానీయం చాలా ప్రమాదమని చెప్పడం చాలా తప్పు.. నిజంగా ఈ గుడ్డి గోలా అంతటి విషతుల్యమైనది అయితే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా, మీరంతా చదువుకున్న పిల్లలు. కాస్త ఆలోచించండి.. "అన్నాడు మెజీషియన్.. 

*********

మరుసటి రోజు బడికి వచ్చాక జరిగింది తెలుసుకొన్న హెడ్ మాష్టర్ చాలా బాధ పడ్డారు. 

 "పిల్లలు అన్నిటినీ మరచి ఆ కూల్ డ్రింక్ ఇవ్వగానే తాగారంటేఅది వారి అమాయకత్వానికి నిదర్శనం.. కానీ ఒక మంచి విద్యార్థి అయిన సంజీవిని నిందిస్తేఎవరూ అడ్డు చెప్పకుండా ఉండటమే నాకు చాలా బాధకలిగింది" అన్నాడు వెంకటరమణ.. 


" సార్, సంజీవి నిజాన్ని నిర్భయంగా బయట పెడితే, అది నిజం కాదంటూ మరో మాజీషియన్ప్రదర్శనతో అదంతా ఒక అబద్దం అని నమ్మించాడు.. " అంది భాగ్యలక్ష్మీ టీచర్.. 

“లాభం కోసం వ్యాపారం వెయ్యి తలలు వేస్తుంది.. సైన్స్ రహస్యాన్ని దాచిపట్టి ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు.. సంజీవి ప్రదర్శన వృధా అయింది.. "


“ఈ రోజూ సంజీవి బడికి రాలేదు సార్” అన్నాడు. 

 “నేను వార్డెన్ను కలసి అడుగుతాను" అంటూ వెళ్ళాడు.

 

హాస్టల్ లోనికి వెంకటరమణ ప్రవేశించడం చూసి వార్డెన్ విశ్వనాథం గతుక్కుమన్నాడు. 

“మూడు రోజులక్రితం డబ్బు దొంగలించి పట్టుపడ్డాడు.. బాధపడ్డాను తప్ప వాడిని కోప్పడలేదు.. మీరు కావాలంటే ఇక్కడున్న వారిని ఎవరినైనా అడగండి.. " అన్నాడు విశ్వనాథం.

 

“నేనూ వినపడ్డాను.. పోలీసులకు ఫిర్యాదు చేశారా "


"అనాథ బాలుడు ఎక్కడికని వేళ్తాడో తెలీదు.. మూడు రోజులు తిరిగాడంటే ఆకలికి కడుపుమాడిందంటే తిరిగి వస్తాడననుకొన్నాను.. అలా రాకుంటే ఈ రోజు ఫిర్యాదు చేద్దామనుకున్నాను "


“ ఆ రోజే ఫిర్యాదు చేసి ఉండాలి.. ఇప్పుడు పోలీసు స్టేషనుకు వెల్దాము పదండి " అన్నాడు 

వేరే దారిలేక మనసులో ఇష్టం లేకున్నా వెంకటరమణతో బయలుదేరాడు.. 


ఇన్స్పెక్టర్ రామ్మూర్తి దగ్గర తనకు అనుకూలంగా ఉండేలాచెప్పాడు విశ్వనాథం.. 

సంచిలోనున్న ఆ ఉత్తరాన్ని ఇన్స్పెక్టర్ కు ఇచ్చాడు.. 


తెల్లటి పేపర్ చూసి “ఎందుకిలా ఉంచాడు” అన్నాడు ఇన్స్పెక్టర్ రామ్మూర్తి.

వెంకటరమణ ఆ పేపర్ తీసుకొని పరీక్షగా చూసాడు.. “సార్ ఇందులో ఎదో రహస్య సమాచారం ఉన్నట్లు వుంది.. ఒక కొవొత్తి తెప్పిస్తారా "అనడిగాడు.

 

 ఒకమనిషిని పంపి కొవ్వొత్తి తెపించాడు.. వెంకటరమణ కొవ్వొత్తి వెలిగించి ఆ మంటకు కొద్దీ దూరంలో ఉంచాడు.. 

అందులో అక్షరములు స్పష్టంగా కనపడింది.. 


 ‘ త్వరలో డబ్బుతో వస్తాను.. ఆ పనిలోనే వున్నాను’ అని వ్రాసి వుంది.. 


“సార్ ఇది బేకింగ్ సోడాతో వ్రాసినది.. వేడి చేసినప్పుడు వ్రాసిన అక్షరాలూ తెలుస్తుంది " అన్నాడు వెంకటరమణ.. 


 "ఎవరో దొంగలతో పరిచయం ఏర్పడినట్లుంది.. బంగారు లాంటి భవిషత్తు పాడుచేసుకొన్నాడు " అన్నాడు విశ్వనాథం.. 


 “మీరు కంప్లైంట్ వ్రాసివ్వండి నేను విచారిస్తాను.. "అన్నాడు ఇన్స్పెక్టర్ రామ్మూర్తి. 

ఫిర్యాదు వ్రాసి ఇచ్చినతరువాత సెలవు తీసుకొని వెంకటరమణతో పాటు విశ్వనాథం బయలు దేరారు.. 

రామూర్తి ఆ పేపరును పరీక్షగా చూసాడు.

 ఆ పేపర్ పైనున్నకంపెనీ  బ్రాండ్ పేపర్లు ఇక్కడ దొరకదు.. సంజీవి వ్రాయడానికి అవకాశం లేదు.. విశ్వనాథం మీద ఒక కన్ను వేసి ఉంచాలి అనుకొన్నాడు.


********* 

మరుసటిరోజు బడిలో ప్రార్థనా గీతంముగియగానే "మూడు రోజుల క్రితం మన సంజీవి కనిపించడం లేదు.. పోలీసులకు ఫిర్యాదు చేసాము.. నాకు మీ అందరి సహకారం కావాలి.. సంజీవి బస్సు లేక ట్రైన్ కు వెళ్లాడా లేక ఎవరైనా కారు లాంటి వాహనాల్లో బలవంతంగా తీసుకుకెళ్ళారా అని అర్థం కావడం లేదు.. మనం అన్ని కోణములలో చూడాలి.. మన సంజీవి తప్పిపోయిన రోజు బడిదగ్గర మీరేదైనా కారు చూసివుంటే గుర్తుకు తెచ్చుకొని చెప్పండి.. " అన్నాడు వెంకటరమణ.


" సార్ వాడు ఆ రోజు ఉదయం బడికి వెళ్ళలేదు సార్ " అన్నాడుఎనిమదవ తరగతి చదువుతున్న వెంకట కృష్ణమూర్తి.. 

"నీకెలా తెలుసు "


"హాస్టల్ నుండి రోడ్డు చివరకు వచ్చాక బడికి వెళ్లాలంటే తూర్పు వైపు వెళ్ళాలి.. వాడు పడమటివైపు వెళ్ళాడు.. మా ఇల్లు పడమటి వైపు వీధిలో వుంది.. నేనా సమయాన స్నానాలగదికి వెళ్ళబోతూ కిటికీ నుండి చూసాను సార్.. " వెంకట కృష్ణమూర్తి అన్నాడు.. 


 “సంజీవితో నీకు పరిచయముందా” అడిగాడు వెంకటరమణ.


“పరిచయం లేదు సార్, ఆ రోజు మాజిక్ ప్రదర్శన చివర గుడ్డి గోలాపానీయం గురించి ప్రదర్శన చేసినప్పుడు చూసాను.. “


“పడమటి వైపు ఎందుకెళ్ళాడు” అనుమానంగా అన్నాడు వెంకటరమణ.

 

"పడమటి వైపు వీధి దాటితేనే మీ ఇంటికి వెళ్ళడానికి వీలవుతుంది.. ఒక వేళసంజీవి మీఇంటికి వచ్చి మీతో ఏదైనా చెప్పటానికి వెళ్తూ ఉండవచ్చు.. " అన్నాడు మధుబాబు.


“మధుబాబు నీవు చెప్పింది కరెక్ట్.. వాడు ఏదో చెప్పాలని వచ్చాడు.. ఈ మధ్యలో కిడ్నాప్జరిగింది " భగవాన్..


"సార్, వెంకట కృష్ణమూర్తిఇంటినుండి మీ ఇంటికి వెళ్ళడానికి మధ్యన ఎక్కడో కిడ్నాప్ లాంటిది ఏదో జరిగింది.. ఏ చిన్న క్లూ దొరికినా మనం వెంటనే పోలీసులకు చెబితే వాళ్ళు సులభంగా సంజీవిని కనిపెట్టగలరు.. " అన్నాడు యుగంధర్.


"తొమ్మిదవ తరగతి విద్యార్థులకుచివరి పీరియడ్ రద్దు చేస్తాను.. వారితోపాటు ఎనిమదవ తరగతి చదువుతున్న వెంకటకృష్ణమూర్తి మీతో రావడానికి అనుమతి ఇస్తున్నాను.. మీరందరూ వెంకటకృష్ణమూర్తి ఇంటినుండి మా ఇంటివరకు వున్న ఇండ్లలో విచారించండి.. ఎటువంటి చిన్న ఆధారం దొరికినా చెప్పండి. మనం పోలీసులకు చెబుతాము.. మీతోపాటు నేనూ వస్తున్నాను " అన్నారు వెంకటరమణ.


చివరి పీరియడ్ ప్రారంభం కావడానికి గంట కొట్టగానే పిల్లలందరూ తమ పుస్తకాల సంచులనుతీసుకొని తరగతి గది దాటి వచ్చారు.. 


అప్పటికే వెంకటరమణ వారి కోసం ఎదురుచూడ సాగాడు.. 

========================================================================

ఇంకా వుంది..

శభాష్ సంజీవి - ఎపిసోడ్ 4 త్వరలో

========================================================================

ఓట్ర ప్రకాష్ రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1. పేరు:  ఓట్ర ప్రకాష్ రావు

https://www.manatelugukathalu.com/profile/oprao/profile2. నా గురించి   : 2017న జనవరి నెలలో రాణిపేట బి.హెచ్.ఈ.ఎల్. నందు పదవీ విరమణ పొందిన తరువాత తమిళ నాడు లోని తిరుత్తణి లో స్థిరపడ్డా ను. ”Free Yoga” పేరు మీద తిరుత్తణి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఉచితముగా యోగాసనములు నేర్పుతున్నాను. తీరిక సమయంలో కథలు వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను 2020 సంవత్సరం మార్చ్ మాసం నుండి లాక్ డౌన్ కారణంగా బడులు తెరవకపోవడంతో పిల్లలకు ఉచిత యోగ తరగతులకు వెళ్ళలేక పోయాను 3. విద్య : ఐ టీ ఐ 4. సాహిత్య ప్రపంచంలోని తీపి జ్ఞాపకాలు  :  1988 న ఆంధ్రప్రభ వారు నిర్వహించిన తెలుగు మినీ కథల పోటీలో మొదటి బహుమతి,  2015 నందు రాయగడ రచయితల సంఘం నిర్వహించిన కథల పోటీలో కన్సోలేషన్ బహుమతి,    2017 ,2018,2019,2020 నందు కెనడా తెలుగు తల్లి వారు నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందా ను.   2018 న కెనడా తెలుగు తల్లి వారు నిర్వహించిన కవితల పోటీలో బహుమతి పొందాను               2018 అక్టోబర్ నెలలో Mytales.in నిర్వహించిన చిట్టినీతి కథల పోటీలో నా కథను ఉత్తమ కథగా ఎన్నిక               2020 ప్రతిలిపి వారు నిర్వహించిన మాండలిక కథల పోటీలో మొదటి బహుమతి లభించింది             2021 శ్రీ శ్రీ కళావేదిక వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో మొదటి బహుమతి           2021 మనతెలుగుకథలు.కామ్ వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో ప్రత్యేక బహుమతి 6. ఇంతవరకు ప్రచురించినవి  ఆంధ్రప్రభ ,ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, గోతెలుగు ,హాస్యానందం, జాగృతి, కెనడా తెలుగుతల్లి, ప్రజాశక్తి ,ప్రతిలిపి ,ప్రియదత్త, రచన, వార్త, విపుల ,శ్రీ శ్రీ కళావేదిక, మనతెలుగుకథలు.కామ్ - పత్రికలలోమొత్తం మీద ఇంతవరకు 70 కథలు ప్రచురించబడింది       ఆంధ్ర ప్రభ , బాల భారతo ,ఈనాడు హాయ్ బుజ్జి , మనతెలంగాణ , నవతెలంగాణ , ప్రభాత వెలుగు దర్వాజా , ప్రజాశక్తి , సాక్షి, వార్త , విశాలాంధ్ర - పత్రికలలో 130 బాలసాహిత్యపు కథలు


26 views0 comments

Comments


bottom of page