top of page

సహజకవి సోమన్నకు 'తెలుగు కీర్తి' పురస్కారం

Writer: Gadwala SomannaGadwala Somanna

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #TeluguKeerthi, #తెలుగుకీర్తి, #అమ్మగోరుముద్దలు

సోమన్న "అమ్మ గోరు ముద్దలు" పుస్తకావిష్కరణ మరియు 'తెలుగు కీర్తి' పురస్కారం ప్రదానం


Sahaja Kavi Somannaku Telugu Keerthi Puraskaram - New Telugu Article About Gadwala Somanna Published In manatelugukathalu.com On 21/01/2025

సహజకవి సోమన్నకు 'తెలుగు కీర్తి' పురస్కారం - తెలుగు వ్యాసం

రచన: గద్వాల సోమన్న


పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త, బాలబంధు గద్వాల సోమన్న 62వ పుస్తకం "అమ్మ గోరు ముద్దలు" శ్రీశ్రీ కళావేదిక సి. ఇ. ఓ డా. కత్తిమండ ప్రతాప్ గారు, కర్నూలు కన్స్యూమర్ ఫోరమ్ జడ్జి శ్రీ నరహరి నారాయణ రెడ్డి మరియు విచ్చేసిన ప్రముఖ కవులు, కళాకారుల చేతుల మీద కౌత పూర్ణానంద విలాస్, విజయవాడలో ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న, రమారమి 6 వసంతాల కాల వ్యవధిలో 63 పుస్తకాలు రచించి, పలు చోట్ల వాటిని ఆవిష్కరించిన గద్వాల సోమన్న అవిరళ కృషిని గుర్తించి "తెలుగు కీర్తి" పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డప్పు కళాకారుడు కేశవయ్య, ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు, కొప్పుల ప్రసాద్ మరియు అతిరథ మహారథులు పాల్గొన్నారు. పురస్కార గ్రహీత గద్వాల సోమన్న ను తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు అభినందించారు.


-గద్వాల సోమన్న




 
 
 

1 Comment


ఫీడ్ బ్యాక్: సహజ కవి సోమన్నకు "తెలుగు కీర్తి" పురస్కారం ... తెలుగు కవిత లోకానికే పురస్కారం


ఎందుకలా ?


1) చాలా సాధారణ తెలుగు భాష - ప్రజా భాష లో వ్రాస్తారు


2) అర్థం కాని - కష్టమైన సంస్కృత పదాలు ఉండవు


3) క్లుప్తంగా ఉంటాయి (3 - 5 నిముషాల్లో చదివేయ వచ్చు)


4) సమాజానికి ... చిన్న - పెద్ద, ఆడ - మగ ... అందరికీ ఉపయోగపడే అంశాల మీద వ్రాస్తారు


ఉదాహరణ:

అమ్మ, చెట్టు ఇతరత్రా


5) అంశానికి తగ్గట్టు ... అన్నీ ఒక్క కవితలో ... 16 వాక్యాల లో ఇమిడ్చి వడ్డిస్తారు.

పి.వి.పద్మావతి మధు నివ్రితి

Like
bottom of page