top of page

సాహస సైనికులకు వందనం

#SahasaSainikulakuVandanam, #సాహససైనికులకువందనం, #Kandarpa Murthy, #కందర్ప మూర్తి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Sahasa Sainikulaku Vandanam - New Telugu Poem Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 26/01/2025

సాహస సైనికులకు వందనం - తెలుగు కవిత

రచన: కందర్ప మూర్తి


వీర  సైనిక సోదరా ! వందనం  నీకు

మతం,  జాతి,  కులం,  ప్రాంతీయ

భావన  లేక  క్రమశిక్షణ  గొడుగు కింద

మూడు రంగుల జండా రెపరెపల సవ్వడిలో

దేశ  సరిహద్దుల  నిసిత  పహరాతో

ఎల్ల వేళల  భరతమాతకు  రక్షణలో

నీ  కర్తవ్యం  అమోఘం!  సైనికా !!


 అమ్మను  కాదని,  నాన్నను వదిలి

 తోబుట్టువుల  చింతలేకుండా

 ఆలు బిడ్డల  ఆలోచన  మరిచి

 సర్వ వేళల   దేశ ప్రజల

 రక్షణ  భాద్యతే  కర్తవ్యంగా

 మంచు  గడ్డకట్టి   వణికించే  చలిలో 

 హిమాలయాల శిఖర  అంచుల్లో

 వేడిశెగలు రేపే ఎడారి  ఇసుక రేణువుల్లో

 శత్రువులకు  దడ  పుట్టించే

 శతఘ్ని  భీకర  శబ్ధాలతో

 నిరంతర  సరిహద్దుల  పహారా    

 దేశ రక్షణలో  నీ ధృడ సంకల్పం

 ఎంత పొగిడినా  తక్కువే  సోదరా!


దేశ  అంతర్గత  కల్లోలలో

ప్రకృతి  వైపరీత్యాల  ఆపదల్లో

నీ ప్రాణాలకు  తెగించి  ప్రజల

రక్షణే  భాద్యతగా  నీ సాహసం

ఎందరో యువతకు  స్ఫూర్తి!


నూనూగు మీసాల  యవ్వనంలో

దేశ రక్షణ  దళాలలో  చేరి

అకుంఠిత  సుదీర్ఘ సేవలు  చేసి

యవ్వనాన్ని  ధారపోసి

నెరసిన   తల వెంట్రుకలతో

నడి వయసులో  ఇంటికి  వచ్చే

సైనిక   నీ కర్తవ్య   సాధనకు


దేశ సరిహద్దుల  రక్షణలో

శత్రు మూకల  ఖర్కశ  దాడిలో

అమరులైన  వీర సైనిక  సోదరులకు

సెల్యూట్ ! సలాం !! అభివందనం!!!


  సమాప్తం


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


14 views0 comments

Comentários


bottom of page