#BVDPrasadaRao, #బివిడిప్రసాదరావు, #Samajayindaa, #సమజయిందా, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ
![](https://static.wixstatic.com/media/acb93b_c06cf77e69b544df9d86bda3316d9a8d~mv2.jpg/v1/fill/w_940,h_788,al_c,q_85,enc_auto/acb93b_c06cf77e69b544df9d86bda3316d9a8d~mv2.jpg)
Samajayindaa - New Telugu Story Written By BVD Prasada Rao
Published In manatelugukathalu.com On 06/02/2025
సమజయిందా - తెలుగు కథ
రచన: బివిడి ప్రసాదరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఆవిడకి 52. ఆయనకి 59. ఆవిడ కల్పన. ఆయన రాజారామ్. ఈ ఇద్దరికి ఇద్దరు కొడుకులు. ఆ ఇద్దరు కొడుకులకి పెళ్లిళ్లయ్యాయి. ఆ పిల్లలు ఇద్దరు ఉద్యోగ రీత్యా.. పెద్దోడు జపాన్ లోను.. చిన్నోడు సింగపూర్ లోను స్థిర పడ్డారు.
కల్పన.. రాజారామ్.. ఇండియాలో.. విశాఖపట్నంలో సొంతింటిన నివసిస్తున్నారు. ఇద్దరూ ఉద్యోగాలు చేసేరు.. రిటైరూ అయ్యారు. పిల్లల మధ్య ససేమిరా వంతుల వారీగా తిరగలేమనేసారు. ఒకొరికొకరుగా మెత్తగా మెసులుకుంటున్నారు.
తెల్లవారుతోంది..
అలారం రింగ్ కి రాజారామ్ నిద్ర లేచాడు.
బెడ్ లైట్ పల్చగా వెలుగుతోంది. పక్కకు చూసాడు. కల్పన నిద్రపోతోంది.
భార్య భుజం మీద తట్టాడు సుతిమెత్తగా.
కల్పన కదిలింది.
"నిద్ర లేచున్నాను. " చెప్పింది మెల్లిగా.
రాజారామ్ మంచం దిగేసాడు.
"ఏం. లేవ్వా. " అడిగాడు.
కల్పన ఏమీ అనలేదు.
"వాకింగ్ కి వెళ్లే టైమవుతోందిగా. " చెప్పాడు రాజారామ్.
"ఈ రోజు వద్దు. " చెప్పింది కల్పన తను కప్పుకున్న రగ్గును పక్కగా తోసేస్తూ.
"వై. " అడిగాడు రాజారామ్.
"ఇలా రండి. " అంది కల్పన గోముగా.
మంచంకు అటు నుండి ఇటు తిరిగొచ్చి.. భార్య దరినాగాడు రాజారామ్.
భర్త కుడి చేతిని పట్టుకొని.. అతన్ని తన మీదికి లాక్కుంటోంది కల్పన.
స్డడీగా లేకపోవడంతో కల్పన గుంజుకు.. ఇంచుమించుగా.. కల్పన మీద రాజారామ్ పడవలసిందే. కానీ జల్దుకున్నాడు. కల్పన ముఖంకి చెంతగా.. తన రెండు అర చేతుల మీద నిలవగలిగాడు.
ఆ ఇద్దరి ముఖాలు నియరయ్యాయి. ఇద్దరి ఊపిరిలు ఇద్దర్నీ వెచ్చగా స్పర్శిస్తున్నాయి.
రాజారామ్ ముఖాన్ని తన రెండు అర చేతులతో మెత్తగా పట్టుకుంది కల్పన.
భర్త పెదాలపై తన పెదాలతో ముద్దు పెట్టుకుంటోంది.
ఆ ముద్దు ముగిసాక.. కల్పన కళ్లల్లోకి చూస్తూ.. "ఇదెన్నో ముద్దు. " అడిగాడు రాజారామ్ మెత్తగా.
కల్పన కూడా రాజారామ్ కళ్లల్లోకి చూస్తూనే.. ఆ సంఖ్య చెప్పింది సొంపుగా.
"లెక్క తప్పవేం. " చిన్నగా నవ్వేడు రాజారామ్.
"తమరు నంగనాచా మరి. మన ఫస్ట్ కిస్ నుండి.. ప్రతి ముద్దుకు లెక్క మీరు అడగడం.. నేను చెప్పడం. ఎప్పుడైనా నా లెక్క తప్పని మీరు అనేది ఉందా. " చక్కగా నవ్వేస్తూ అంది కల్పన.
ఆ వెంబడే భార్య మీదకు ఒరిగిపోయాడు రాజారామ్.
కల్పన ఆ తర్వాత భర్తను సుతి మెత్తగా తన పక్కకు నెట్టింది.
"ఈ రోజుటి వాకింగ్ పాయే. " అన్నాడు.
"పోనీయండి. " అనేసింది కల్పన.
"బద్ధకమా. " కల్పన వైపుకు జరుగుతూ అడిగాడు రాజారామ్.
దానికి బదులు ఇవ్వక.. భర్తను కలుపుతూ తను రగ్గును కప్పుకుంటూ.. "వెచ్చతనంని రాజేసుకుందాం.. ముచ్చటగా ముచ్చట్లాడుకుందాం. " మెల్లిగా చెప్పుతోంది కల్పన.
"అలానా. " భార్య కళ్లల్లోకి కొంటెగా చూస్తున్నాడు రాజారామ్.
భర్త చూపుల్లోంచి చూపు మార్చుతూ.. గుంభనంగా నవ్వుతోంది కల్పన.
భార్యపై మరింత మీదకి రాజారామ్ జరిగాడు.
కల్పన కళ్లు మూసుకుంటోంది.
"సిగ్గే. " చిలిపిగా అంటాడు రాజారామ్.
సరళంగా నవ్వుతోంది కల్పన. కానీ కళ్లు విప్పదు.
రాజారామ్ కుడి చేయి చూపుడు వేలు కల్పన పెదాలను తడుముతున్నట్టు తాకుతుంటోంది.
అంతలోనే ఫక్కున నవ్వేసింది కల్పన. కళ్లు మాత్రం విప్పడం లేదు.
"ఏమమ్మా.. ఎందుకీ అకాల నవ్వు. " రాజారామ్ విప్పు ఱెప్పల ఱేడు.
"మన ఫస్ట్ కిస్ గుర్తొచ్చింది. " చెప్పుతూ..
"అప్పుడూ మీరిలానే.. ఇలాంటి బెడ్ లైట్ కాంతిలో.. మన ఫస్ట్ నైట్ న.. నా పెదాలను తడిమారు ముద్దుకు ముందు. కదూ. " అంది కల్పన గమ్మత్తుగా.
"పో. " ఉడుక్కుంటాడు రాజారామ్.
"మరి. అప్పటికి ఆ ముద్దుకై నేను ఎన్ని మార్లు దేబరించానో. కదూ. " అన్నాడు.
చిన్నగా నవ్వుతోంది కల్పన.
"నేను ముద్దుకు ససేమిరా అనేసరికి.. మీ ముఖం.. కాదు కాదు.. మీరు.. మీ మూతిని ముచ్చికలా పెట్టేవారు. భలే అనిపించేది. " ఇంకా అలానే నవ్వుతోంది. ఈ సరికి కళ్లు విప్పి ఉంది.
"పో. ఎంత బతిమలాడినా ముద్దుకు కాదనేసేదానివి. భలే చిరాకయ్యిందప్పుడు. " గుణిచాడు రాజారామ్.
"తెలుసు. సాక్షిని నేనేగా. " చక్కగా అంది కల్పన. మెత్తగా నవ్వింది కూడా.
ఆ వెంబడే..
"చెప్పాగా.. తాళి పడందే అట్టివి ఏమీ పనికిరావని. " అంది జ్ఞప్తి చేస్తున్నట్టు.
"ఆఁ. అవును. నీ కన్విన్సింగ్ నచ్చే అప్పుడు వల్లకునే వాడ్ని" చెప్పాడు రాజారామ్ పిల్లోడులా.
"మీరు.. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ గుడ్ బోయ్ నాకు. చెప్పింది వింటారు.. పాటిస్తారు. " చెప్పింది కల్పన నిండుగా.
ఇద్దరి నడుమ కొద్దిసేపు మాటలు లేవు. కానీ చూపులు ఉన్నాయి.
"ఏంటా చూపు. " చూపు మార్చుకుంటుంది కల్పన.
"నువ్వు ఇప్పటికీ.. అప్పటి మాదిరినే అగుపిస్తుంటావు. " చెప్పాడు రాజారామ్.
"అయ్యా.. గొప్పలకూ హద్దు ఉండాలి. ఇప్పుడు మనం చాలా వయస్సు పైబడ్డ వాళ్లం. తోళ్లు పట్టులు.. బిగిలు తప్పాయి. " చెప్పుతోంది కల్పన.
అడ్డై.. "కావచ్చు. నీ సాంగత్యం నాకు నిత్య యవ్వనమే. అతిశయోక్తి కాదు. " చెప్పాడు రాజారామ్.
ఆ వెంబడే..
"మన మధ్య ఫస్ట్ కిస్ లానే.. ఇందాకటి మన మధ్య ముద్దు కూడా.. నాకు అనిపించింది.. నన్ను మెప్పించింది. సచ్ఛ్.. నమ్ము. " చెప్పాడు రాజారామ్.
కల్పన చూపు నిలిపి భర్తనే చూస్తోంది.
"చాల్లేండి బడాయి. " అంది మెత్తగా.
"లడాయిల పిదపటి మన ఫస్ట్ కిస్ బడాయేగా. " అన్నాడు రాజారామ్.
ఆ వెంబడే..
"ఆ తర్వాతి కిస్ లన్నీ మిఠాయిలే. " చెప్పాడు.
"పోండి" అంది కల్పన లజ్జగా.. మెత్తగా.
"అవునా. " అంటూనే భార్య పెదాలను తన పెదాలతో అందుకున్నాడు రాజారామ్.
ఆ ముద్దు తర్వాత.. "ఏమంటావ్. ఈ.. " సంఖ్య చెప్పి.. "వ కిస్ కూడా.. ఇదీ మిఠాయే. కాదా. " అడిగాడు.
ఆ వెంబడే..
"మన ఫస్ట్ కిస్ లా అనిపించలే. " అని కూడా అన్నాడు.
ఏమీ అనదు కల్పన. కానీ ఆవిడ ఒళ్లు పులకరిస్తోంది..
"ఏంటా వణుకు.. చలా. " అడుగుతాడు రాజారామ్.
"ఊహుఁ. చలి కాదు గిలి. " అంది భర్త బట్టతల మీది అరకొర ఎంట్రుకలను తన రెండు అర చేతులతో నిమురుతూ.
ఈ ఇద్దరి వైవాహికంకి 33 యేళ్లు నిండాయి నిన్నటితో. ఐనా నిత్య నూతనమే ఈ ఇద్దరి వివాహ బంధం.
కారణం..
వీరు తమ ఫస్ట్ కిస్ ను.. తమ ఫస్ట్ నైట్ నే ఇచ్చిపుచ్చుకున్నారు కనుక.. పరిణయంతో మాత్రమే వీరు తమ కన్యాత్వం వీడారు కనుక..
సమజయిందా?..
***
బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
![](https://static.wixstatic.com/media/acb93b_cf77215b40634ea885a196741a56f382~mv2.png/v1/fill/w_153,h_191,al_c,q_85,enc_auto/acb93b_cf77215b40634ea885a196741a56f382~mv2.png)
రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
![](https://static.wixstatic.com/media/acb93b_6f78c6fee0844cf6ac4087ec927a9409~mv2.png/v1/fill/w_294,h_428,al_c,q_85,enc_auto/acb93b_6f78c6fee0844cf6ac4087ec927a9409~mv2.png)
Commentaires