top of page

సమస్యలోనే సమాధానం

#సమస్యలోనేసమాధానం, #SamasyaloneSamadhanam, #KarlapalemHanumantha Rao, #కర్లపాలెంహనుమంతరావు, #TeluguMoralStories, #నైతికకథలు

Samasyalone Samadhanam - New Telugu Story Written By Karlapalem Hanumantha Rao

Published In manatelugukathalu.com On 16/03/2025

సమస్యలోనే సమాధానం - తెలుగు కథ

రచన: కర్లపాలెం హనుమంతరావు

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



రాజు గారి అరవై ఏళ్ళ ఉత్సవంలో ఒక ప్రకటన చేసాడు. "రాబోయే పున్నమి రోజు నేనొక ప్రశ్న వేస్తాను. దానికి జవాబు చెప్పిన వారికి వెయ్యి బంగారు కాసులు ఇస్తాను." ఇదీ రాజు గారి ప్రకటన. 


పున్నమి రోజు రానే వచ్చింది. జనం తండోపతండాలుగా రాజధాని చేరుకున్నారు. అందరూ రాజు గారు అడిగే ప్రశ్నల కోసం ఎదురు చూడసాగారు. రాజుగారు ఇలా చెప్పారు. 


"మహారాణి గారికి గుత్తి వంకాయ కూర తినాలనిపించింది. వెంటనే వంట వాడిని పిలిపించింది. 'కూరలో మసాలా బాగావెయ్యి. గుత్తివంకాయ కూర ఘుమఘుమ లాడుతూవుండాలి’ అని చెప్పింది. 


వంటవాడు రంగంలోకి దిగాడు. సన్నెకల్లు మీద మసాలా నూరుతున్నాడు. కూర వండకముందే మసాలా గుబాళించేస్తుంది. 


వంటవాడి కూతురు ఉయ్యాలలో పడుకొని నిద్ర లేచి ఏడుస్తుంది. పొయ్యి దగ్గర ఉన్న నీళ్ళ గంగాళం పట్టుకొని వంటవాడి కొడుకు ఆడుకుంటున్నాడు. ఆనీళ్ళు పడి మంటలు ఆరు తున్నాయి. అది చూసిన వంట వాడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. 


ఇది వంటవాడి భార్య చూసింది. "ఓరేయ్! నీకు పొయ్యి దగ్గర ఏమి పనిరా? పొయ్యిలో పడ్డావంటే నీకు చావు మూడుతుంది." అని వాణ్ణి పట్టుకొని దూరంగా లాగింది. 

ఎలాగైతేనేం గుత్తివంకాయ కూర తయారు అయిపోయింది. దాన్ని తిని ఆ రుచికి మహారాణి మహదానంద పడిపోయింది. సంతోషం పట్టలేక ఆమె వంటవాడ్ని పిలిపించి కొన్ని బంగారు కాసులు బహుమానంగా ఇచ్చింది" – అని కథ చెప్పడం ముగించారు మహారాజు. 

"కథ విన్నారుగా! రాణివారు వంట వాడికి ఎన్ని బంగారు కాసులు ఇచ్చారు?

ఇదీ ప్రశ్న. సమాధానం కథలోనే వుంది. ఎవరు జవాబు చెపుతారో వారికి బహుమానం. " అన్నారు మహారాజు. 


పండితులు అంతా తలలు గోక్కున్నారు. ఎవరూ జవాబు ఊహించలేకపోయారు. 


ఆ ఊరిలోని ఒక బాలిక ఆ విషయం విన్నది. రాజుగారి కొలువుకు చేరి "మహారాజా! దీనికి నేను జవాబు చెపుతాను" అని చేతులు రెండూ జోడించింది. చెప్పమన్నారు మహారాజు. 


"మహారాజా! వంటవానికి రాణిగారిచ్చిన కాసులు వెయ్యినూట పదహార్లు. "


"శభాష్! ఖచ్చితంగా చెప్పావమ్మా!" అని ఆ బాలికను దగ్గరకు తీసుకుని తన పక్కన సింహాసనంలో కూర్చోబెట్టుకున్నారు. 

"ఎలా చెప్పగలిగావు చిన్నారీ!" అని అడిగారు మహారాజు. 

"జవాబు ఈకధలోనే వుంది మహారాజా! 'మసాలా వెయ్యి' లో ‘వెయ్యి’ వుంది. 'మసాలా నూరుతున్నాడు' లో ‘నూరు’ వుంది. ' ఏడుస్తుంది' లో ‘ఏడు’ వుంది. 'ఆరుతున్నాయి' లో ‘ఆరు’ వుంది. ' మూడుతుంది'లో ‘మూడు’ వుంది. మెుత్తం కలిపితే ‘వెయ్యి నూట పదహార్లు’ అని జవాబు వస్తుంది" అని చెప్పింది బాలిక. జనం చప్పట్లతో ఆ చిన్నారిని అభినందించారు. 


సునిశితమైన బుద్ధిగలవాళ్ళకు సమస్య లోనే సమాధానం దొరుకుతుంది. సూక్ష్మ మైన ఆ పరిశీలనా శక్తి క్రమశిక్షణతో క్షుణ్ణంగా విద్యను అభ్యసించడం వల్ల సాధ్యమవుతుంది. 


***


కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

కర్లపాలెం హనుమంతరావు -పరిచయం


రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోదీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.

 


 
 
 

Comments


bottom of page