top of page
Writer's pictureMohana Krishna Tata

సమయానికి సాయం

#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #సమయానికిసాయం, #Samayaniki Sayam, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


'Samayaniki Sayam' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 21/10/2024

'సమయానికి సాయంతెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



రాత్రి పది దాటింది.. ఫోన్ మోగుతోంది. 


‘ఈ టైం లో ఎవరబ్బా.. ?’ అనుకుంటూ ఫోన్ అందుకున్నాడు సతీష్. ఫోన్ లో రాజా అని పేరు చూసి.. 'ఇతను ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తున్నట్టో.. ?' అని అనుకుని ఫోన్ కట్ చేసాడు సతీష్.. 


మళ్ళీ కొంతసేపటికి అదే ఫోన్.. 


గాఢ నిద్రలో ఉన్న సతీష్, ఫోన్ సైలెంట్ లో పెట్టేసి పడుకున్నాడు.. 


మర్నాడు ఉదయం లేచి ఫోన్ చూసేసరికి రాజా నుంచి ఒక పది మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అప్పుడే.. రాత్రి జరిగింది గుర్తొచ్చింది సతీష్ కి.. 


****


ముందు రోజు రాత్రి సతీష్ తన భార్యను బస్సు ఎక్కించడానికి బస్సు కాంప్లెక్స్ కి వెళ్ళాడు. భార్య నీలిమని ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు సతీష్. పెళ్ళైన తర్వాత సిటీ లో కొత్తగా కాపురం పెట్టారు. సరిగ్గా సంవత్సరం క్రిందట నుంచి ఇక్కడే ఇల్లు తీసుకుని ఉంటున్నాడు సతీష్. 


సతీష్ బ్యాంకు ఎంప్లాయ్.. పెళ్ళైన వెంటనే, ఈ సిటీ కి ట్రాన్స్ఫర్ చేసారు. ఇక్కడ సిటీ లో ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ఎవరిని నమ్మాలో తెలియక.. పెద్దగా ఎవరితో పరిచయం పెంచుకోలేదు. ఒక్క తన హౌస్ ఓనర్ తో తప్ప ఎవరితో మాట్లాడేవాడు కాదు. భార్య ప్రెగ్నెంట్ అవడంతో, తల్లిని చూడడం కోసం పక్క ఊరులో ఆమె పుట్టింటికి బస్సు ఎక్కించాడు సతీష్. 


"ఏమండీ.. ! ఎందుకు అంత కంగారు పడుతున్నారు.. ?"


"ఇప్పుడు వెళ్లడం అవసరం అంటావా నీలిమ.. ? అసలే నీకు నెలలు నిండాయి.. పోనీ, మీ పుట్టింట్లోనే ఉండమంటే ఉండవు.. "


"మిమల్ని వదిలేసి నేను పుట్టింట్లో ఎలా ఉండమంటారు.. ? మీకు ఇక్కడ ఎవరూ తెలియదు.. మిమల్ని ఎవరు చూస్తారు చెప్పండి.. ? రాత్రి అమ్మ కలలో కనిపించింది.. అందుకే వెళ్లి చూసి వచ్చేస్తాను. ఎవరితో గొడవలు పెట్టుకోకండి.. " అంది నీలిమ. 


"ఏమైనా అవసరమైతే, ఫోన్ చెయ్యి.. " అన్నాడు సతీష్. 


"ఫోన్ లో ఛార్జింగ్ తక్కువ ఉందే, అయినా ఏ అవసరం రాదులెండి.. " అంటూ ఉండగానే బస్సు స్టార్ట్ అయ్యింది. 


తర్వాత.. బస్సు స్టేషన్ లో రాజా ను చూసిన సతీష్, పలకరించకుండానే ఇంటికి వచ్చేసాడు. 


****


కాలింగ్ బెల్ మోగడంతో ఈ లోకంలోకి వచ్చాడు సతీష్. తలుపు తీసిన సతీష్ కు.. ఎదురుగా రాజా ప్రత్యక్షమయ్యాడు. అలా రాజాని చూడగానే.. ఏమనాలో తెలియక అలా ఉండిపోయాడు సతీష్. నిజానికి సతీష్ కి, హౌస్ ఓనర్ రాజా కి నాలుగు రోజుల కిందటే గొడవ జరిగింది. రెంట్ చాలా పెండింగ్ ఉన్నదని హౌస్ ఓనర్ సతీష్ ని గట్టిగా అడిగాడు. దానికి సతీష్ చాలా ఫీల్ అయి, హౌస్ ఓనర్ తో అప్పటినుంచి మాట్లాడం మానేసాడు. రాజా కింద పోర్షన్ లో ఉండి, పైన పోర్షన్ సతీష్ కి రెంట్ కి ఇచ్చాడు. భార్య చనిపోవడంతో, రాజా చాలా కాలంగా ఒంటరిగానే ఉంటున్నాడు. 


"హలో సతీష్.. ! తలుపు తీస్తావా.. " అన్నాడు రాజా.


"సారీ రాజాగారు.. ! రాత్రి నిద్రలో మీ ఫోన్ ఎత్తలేకపోయాను.." అని తేరుకొని అన్నాడు సతీష్. 


“పర్వాలేదు గాని.. ! నిన్న రాత్రి నువ్వు మీ భార్యను బస్సు ఎక్కించిన తర్వాత.. మీ భార్యకి నొప్పులు వచ్చాయి.. అక్కడే ఉన్న నేను చూసి.. వెంటనే నీకు ఫోన్ చేసాను.. మీ వైఫ్ ఫోన్ లో ఛార్జ్ అయిపోవడంతో ఆమె నీకు ఫోన్  చేయలేక పోయింది. టైం కి నేను హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాను కాబట్టి.. మీ ఆవిడకు పెద్ద ప్రమాదమే తప్పిందని డాక్టర్ చెప్పారు. 


నిన్న రాత్రి నీకు చాలా సార్లు కాల్ చేసాను, కానీ నువ్వు ఫోన్ ఎత్తలేదు. ఇక నేను చేసేదేమే లేక, మీ ఆవిడ ఆపరేషన్ కోసం ఒక బ్రదర్ గా సంతకం పెట్టాను. ఇప్పుడు మీ ఆవిడ బాగానే ఉంది. కొంతసేపటిలో ఆపరేషన్ చేస్తారు. నీకు ఈ విషయమే చెబుదామనే రాత్రి చాలా సార్లు ఫోన్ చేసాను. 


ఒకప్పుడు నా భార్య కుడా ఇలాగే బస్సు లో ఒంటరిగా వెళ్తున్నప్పుడు హార్ట్ ఎటాక్ వచ్చింది. చుట్టూ ఉన్న జనం ఎవరూ పట్టించుకోకపోవడంతో, హాస్పిటల్ కి తీసుకుని వెళ్లడం ఆలస్యం అయి, నా భార్య చనిపోయింది. మనలో మనం ఎన్ని అనుకున్నా.. అవసరానికి సాయం చేసుకోకపోతే ఎందుకు ఈ మనిషి జీవితం.. ? అందుకే, నేను అప్పుడు ఇంకేమి అలోచించకుండా సంతకం పెట్టేసాను”. 


రాజాని తప్పుగా అర్ధం చేసుకున్నందుకు సతీష్ చాలా ఫీల్ అయి, హౌస్ ఓనర్ రాజా సమయానికి చేసిన సహాయానికి కృతఙ్ఞతలు తెలుపుకున్నాడు.. 


*******


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


113 views0 comments

Comments


bottom of page