కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Youtube Video link
'Sampath Cinema Kathalu - 1' New Telugu Web Series Written By S. Sampath Kumar
రచన : S. సంపత్ కుమార్
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
S. సంపత్ కుమార్ గారి ధారావాహిక సంపత్ సినిమా కథలు ప్రారంభం
రేపు సాయంత్రం 6 గంటలకు అప్పాయింట్మెంట్
ఇప్పుడు సాయంత్రం 6 గంటలు
అబ్బా ఇంక 24 గంటలు
ఒకపక్క ఆనందం మరోపక్క ఒకటే టెన్షన్
అప్పాయింట్మెంట్ అంటే డాక్టర్ది కాదు
అందరు అప్పాయింట్మెంట్ అంటే అదే అని సాధారణంగా అనుకుంటారు
ఒక సినీ ప్రొడ్యూసర్ నా కథ వినడానికి ఇచ్చిన సమయం
అది ఒక ప్రముఖ డైరెక్టర్ రేకమొండేషన్ ద్వారా.
రాత్రంతా నిద్ర పట్టలేదు.
కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలి
లేకుంటే ఏవో చిన్న చిన్న కథలు రాసుకొని వార పత్రికలకు పంపి వాళ్ళు ఇచ్చే రెమ్యునరేషన్తో తృపిపడలి అనుకున్న నాకు ఇప్పుడు సువర్ణ అవకాశం వచ్చింది.
రాసుకున్న కథ ఇప్పటికే వందసార్లు చదవుకున్నాను.
ముందు స్టోరీ లైన్ చెప్పి, నచ్చితే కథ ఎలా చెప్పాలి అనేది ప్రిపేర్ అయ్యాను.
ఇంక కథ నచ్చితే స్క్రిప్ట్ వర్క్ తయారు చేసుకోవచ్చు .
తెల్లారింది.
సమయం ఉదయం 6 గంటలు.
రాత్రి నిద్రరాక 2 గంటలు తర్వాత నిద్రపట్టింది.
ఇప్పుడు ఉదయం 6 గంటలు
ఇంక సాయంత్రం 6 గంటలు ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తున్నా!
మధ్యలో ఫ్రెండ్స్ నుండి కాల్స్ వస్తున్న అసలు విషయము చెప్పలేదు.
ముందుగా చెబితే అయ్యే పని కాకుండ పోతుందని..
సమయం సాయంత్రం 5 గంటలు.
రెకమెండ్ చేసిన డైరెక్టర్ కాల్.
రెడీగా ఉండు కారు వస్తుందని.
15 నిమిషాల తర్వాత కారు వచ్చి నా రూమ్ ముందు ఆగింది.
కారు వస్తుందని తెలుసు.
వచ్చే ముందే నీటుగా రెడీ అయివున్నా.
నేను ఎక్కిన కారు డైరెక్టర్ ఇంటిముందు ఆగింది.
అప్పటీకే ఆయన కూడ రెడీగా ఉన్నాడు.
కారు జూబ్లీహిల్లుసులో ఒక అపార్ట్మెంట్ దగ్గర ఆగింది.
అప్పుడు టైం సాయంత్రం పది నిమిషాలు తక్కువ 6 గంటలు.
కరెక్ట్ టైముకు వచ్చాం.
నీవు కథ చెప్పబోయే ప్రొడ్యూసర్ అపార్ట్మెంట్ ఇదే అన్నాడు డైరెక్టర్.
చిరునవ్వుతో " అవునా" అంటూ తల ఊపాను .
లిఫ్టులో సెకండు ఫ్లోర్, ఫ్లాట్ నెంబర్ 15 దగ్గర కొచ్చి కాలింగ్ బెల్ నొక్కగానే,
ప్రొడ్యూసర్ పర్సనల్ అసిస్టెంట్ డోర్ తీసి , డైరెక్టరును చూడగానే నవ్వుతు నమస్కారం పెట్టాడు .
ప్రొడ్యూసర్ ఆపీసు రూంలో కూర్చున్నాము.
ఇంతలో కాఫీ వచ్చింది.
కాఫీ మేము తాగిన వెంటనే ప్రొడ్యూసర్ వచ్చాడు.
నమస్కారాలు అయిన వెంటేనే,
"ప్రముఖ హీరోతో నేను తీసిన క్లాస్ మూవీ అనుకుంతా రిజల్ట్ ఇవ్వలేదు .ఇప్పుడు ఉన్న కొత్తతరం మాస్ ఫాలోయింగ్ బట్టి అన్ని హంగులు ఉన్న కమర్షియల్ సినిమా ఇప్పుడు ఉండే ప్రముఖ హీరోలతో చెద్దామంటున్నాను మరి వైరెటి గా ఉండే కథ నీ దగ్గర ఉంది అని మా డైరెక్టర్ అన్నాడు.
అయితే ముందు నేను ఆ కథ విన్న తర్వాత బాగుంటే మనం ఇప్పుడు ఉండే ఏ హీరో బాగుంటడో చూసి ఆ హీరోకు కథ వినిపిద్దాము" అంటూ ప్రొడ్యూసర్ నా వంక చూస్తూ కథ చెప్పమన్నాడు.
ఒక్కసారిగ ఆ ఆఫీస్ రూములో వాతావరణం సైలెంట్ అయిపోయింది.
ముందే ఎలాంటి కథ కావాలో తెలసు.
అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండే కథ.
స్టోరీ చెప్పడం మొదలుపెట్టాను.
రాజారావు సిటీలో పెద్ద కాంట్రాక్టర్ . ఎక్కువ నీటి ప్రాజెక్ట్లు , బ్రిడ్జిలు బిల్డింగ్స్ కన్స్ ట్రక్షన్ పనులు చేస్తూ కోట్లకు పరిగెత్తాడు. అతనికి ఒక్కగానొక్క కొడుకు కిరణ్. కొడుకంటే ప్రాణం, అలాగే కిరణ్ కు తండ్రి అంటే భయం,భక్తి . కొడుకు మాట తండ్రి కాదనడు అలాగే తండ్రీ మాట కొడుకు కాదనడు.
ఫ్రెండ్ చెల్లెలు పెండ్లికి బెంగళూర్ వెళ్ళిన కిరణ్ కనపడకుండా పోయాడు.
మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇంతకు కిరణ్ ఎందుకు కనపడకుండా పోయాడు?
ఎక్కడికి పోయాడు ?
ఊటీలో ఉన్న మానసిక చికిత్సలయములో కిరణ్ ను ఎవ్వరు చేర్చారు ?
సీక్రెట్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ చేసినా సాహసం ఏమిటీ ?
కావ్య (హీరోయిన్) కిరణ్ ప్రేమలో ఎలా పడింది ?
క్లుప్తంగా కథ విన్న ప్రొడ్యూసర్
"కథ చాలా ఇంటరెస్టింగ్ గా మొదలు పెట్టావు.
బాగుంది. ఎందుకు హీరో కిరణ్ కనపడకుండా పోయాడు ? ఎవ్వరూ మానసిక చికిత్సకోసం హీరొ కిరణ్ ను ఊటిలో ఉన్న ఆ మానసిక చికిత్సలయంలో చేరిపించల్సివచ్చింది..
విక్రమ్ పోలీస్ ఆఫీసర్ గా చేసిన సాహసం..
ఎలా కిరణ్ ప్రేమలో కావ్య ..
చెప్పేముందు మళ్ళీ కాఫీ వచ్చింది .
కాఫీ తాగాక మళ్ళీ కథ లోకి..
"వెళ్ళేముందు కాస్త చెప్పాను మీ ముఖాలలో వినాలనే ఆత్రుత కనబడింది చాలా సంతోషంగా ఉంది.ఇప్పుడు అసలు కథ సినిమాపరంగా వుంటుంది. కథ ఓకే అయితే ప్రేమ,కామిడీ, సెంటిమెంట్, డైలాగ్స్ అన్ని స్క్రిప్ట్ లో ఉంటాయి ఇంక సినిమాకు కావలసిన మార్పులు పూర్తి కథ మీరు విన్నాక నచ్చితే చేద్దాం. మీరు కథ వింటుంటే ఎవరి నటన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలో వాళ్ల పాత్రల ద్వారా తెలుస్తుంది. కథపరంగా ఇంక సీనులకు సంబంధించిన లోకేషన్స్,ఎలా తీయాలి , వాళ్ళ డైలాగ్స్ కు ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా ఉండాలి స్క్రిప్టు వర్క్ మరియు డైరెక్షన్లో తెలుస్తుంది."
"సరే ఇంక అసలు కథ మొదలుపెట్టు విందాం" అన్నాడు ప్రొడ్యూసర్.
కథ మొదలు పెట్టాను .
రాజారావు తన ఇంటి గార్డెన్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర మందు తాగుతున్నాడు.
లింగస్వామి స్విమ్మింగ్ చేస్తున్నాడు
రాజరావు సెల్ రింగ్ అవుతుంది
సెల్ ఫోన్ అందుకొని " హలో" అన్నాడు రాజారావు.
"హలో! అంకుల్ , నేను వినయ్ , కిరణ్ (హీరో) ఇంక బెంగళూరుకు రాలేదు. "
"రాలేదా!.....నిన్న రాత్రి బెంగుళూర్కు ఫ్లయిట్లో బయలుదేరాడే, ఇంక వాడి దగ్గర నుండి ఫోన్ రాకపోతే నేనే చేశ, సెల్ రింగ్ అయింది కానీ తీయలేదు మరి వాడే కాల్ చేస్తాడులే అనుకున్న అంతలో నీవు కాల్ చేసి పిడుగు లాంటివార్త చెప్పావు."
రాజారావు టెన్షన్తో మాట్లాడుతుంటే
"మీరేమీ టెన్షన్ పడవద్దు అంకుల్,వాడికి ఏమికాదు"
ఇంతలో స్విమ్మింగ్ చేస్తున్న లింగస్వామిని పిలిచి "కిరణ్ బెంగళూర్కు వెళ్ళలేదంట, మరి అక్కడికి పోకుండా, ఎమైపోయింటాడు." అన్నాడు
"నో టెన్షన్ నేను ఎంక్వరీ చేస్తా"
అంటూ సెల్ తీసుకోని తెలిసిన పోలీస్ ఆఫీసర్కు కాల్ చేశాడు లింగస్వామి.
" రొటీన్గా సమాజంలో జరిగే సంఘటనలు, ఇంక సినిమాకు సహజంగా కావలసిన మసాలా ఉన్న కథ , సూపర్ గా ఉంది ఇంక డైరక్టర్ ఇది ప్రెజెంట్ చేసే విధానం , చేయలిన మార్పుల గురించి నిర్ణయం తీసుకున్నాక , ఏ హీరో అనేది అనుకున్నాక , ఆ హీరో ఓకే చేశాక, అప్పుడు స్క్రిప్ట్ వర్క్ మీద కూర్చుందాము " అని భరోసా ఇచ్చాడు ప్రొడ్యూసర్.
నా కళ్ళల్లో, డైరక్టర్ కళ్ళల్లో ఆనందం.
"డైరెక్టర్! మళ్ళీ ఒకసారి కథ విని ఇంక మార్పులు డైరెక్టర్ గా ఏమీ చేస్తావో చేసి తీసుకొని రా"అని ప్రొడ్యూసర్ డైరెక్టర్కి చెప్పాడు.
ప్రొడ్యూసర్ దగ్గర నుంచి బయటకు వచ్చాక
"నీ కథ ప్రొడ్యూసర్కు నచ్చింది.తప్పకుండా ఇది సినిమా గా పట్టాలు ఎక్కుతుంది.రేపు మళ్ళి ఒక సారి కథ విన్నాక ప్రొడ్యూసర్ దగ్గరకు వెళ్ళుదాము."
"సరే"
డైరెక్టర్ కథను ఒక కాఫీ తీసుకెళ్ళాడు.
డైరెక్టర్ ఇంటికి వచ్చాక కాస్త రిలాక్స్ అయ్యాక కథ మొదటి సీను చదవిన తర్వాత ఇంక రెండవ సీను చదవడం మొదలు పెట్టాడు.
ఊటీలో ఒక ప్రదేశం
ఉరుములతో కూడిన వర్షం
అక్కడే ఉన్న ప్రకృతి మానసిక ఆరోగ్య చికిత్సలయము ముందు కారు ఆగింది.
ముందే వస్తున్నారని తెలుసు డాక్టర్ సుజాతకు.
కారు రాగానే దగ్గరకు వచ్చి తమ పని వాళ్ళతో జాగ్రత్తగా కారులో ఉన్న కుర్రాడిని తీసుకొని వచ్చి ఒక రూంలో మంచం మీద పడుకోపెట్టారు. చీకట్లో ఆ కుర్రాడి ఫేస్ సరిగా కనిపించడం లేదు.
కుర్రాడు వయసు 23 ఉండవచ్చు..
ఆ కుర్రాడికి ఒక ఏక్సిడెంట్ జరగడం వలన కోమాలోకి వెళ్లాడు. అతను మామూలు మనిషి కావడానికి ఈ ప్రకృతి మానసిక ఆరోగ్య చికిత్సలయంకు తెచ్చారు.
ఇంక ఇప్పుడు సినిమా పేరు.. 'నమ్మక ద్రోహం'
తర్వాత ముఖ్యమైన వాళ్ల పేర్లు
హీరో
హీరోయిన్
కెమెరామెన్
మ్యూజిక్
ప్రొడ్యూసర్
డైరెక్టర్
బెంగళూరుకి వెళతాను అని చెప్పిన కొడుకు కనబడకుండా పోవడం వలన రాజారావు మానసికంగా కృంగిపోయాడు.
"ఒక వేళ మన కిరణ్ ను కిడ్నాప్ చేస్తే డబ్బులు కోసం ఈపాటికే కాల్ చేసి డిమాండ్ చేసేవారు. అలాంటిది ఇంతవరకు జరగలేదు.
ఇంక చంపేసి ఉన్న ఈపాటికి తెలిసేది.ఎక్కడ ఉన్న సేపుగా ఉంటాడు" రాజారావు ఫ్రెండ్ లింగస్వామి అన్నాడు.
లింగస్వామి దైర్యం చెప్పడం వలన
"నీవు చెప్పిది నిజమే... కాని ఎక్కడ ఉన్నాడో "
హీరో కిరణ్ ఇంట్రడక్సన్
ఊటీలో..
అదొకఊరు. ఆ ఊరు చివరన చిన్న అడవిలో మారుమూల ప్రాంతం
కొంత మంది కుర్రాళ్ళుతో పాటు కొంత మంది అమ్మయిలు కూడా మత్తుమందు మత్తులో ఉన్నారు.
ఆ మత్తులో ఏదో తెలియని ఆనందంలో మునిగిపోతున్నారు.
ఒకటే కేరింతలు
అప్పుడు వాళ్ల మధ్యలో హీరో కిరణ్ వచ్చి మత్తులో ఒక పాట అందుకున్నాడు.
ఆ పాటలో మత్తుకు బానిస అయినవాళ్ల ఆనందానికి హద్దే లేదు.
పాట అయిపోయింది.
అంతలొ సీక్రెట్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ తన పోలీస్ బృందంతో 'రెడీ టూ ఎటాక్ ఆపరేషను' మొదలు పెట్టి ఆ ప్రాంతం మీద మెరుపు దాడి చేశాడు.
బీకర పోరాటంలో డ్రగ్ మాఫియా గ్యాంగ్లో కొంత మంది, పోలీసులు కొంత మంది చనిపోయారు . విక్రమ్ చేస్తున్న దాడి తట్టుకోలేక డ్రగ్ మాఫియా గ్యాంగ్ పారిపోయింది.
తర్వాత పోలీస్ వ్యాన్ వచ్చింది. డ్రగ్స్ అలవాటు పడిన వాళ్ళను అందులో ఎక్కించారు. పోలీస్ జీపులో విక్రమ్, కిరణ్ ను ఎక్కించుకొని వెళ్ళుతుంటే అప్పుడే ఒక లారీ వచ్చి ఆ జీపును డీ కొట్టింది. విక్రంకి బలమైన దెబ్బలు తగలాయి. కిరణ్కు చిన్న దెబ్బలు,..ఇంక మత్తులో ఉన్న కిరణ్ చావలేదు కాని కోమాలోకి వెళ్లిపోయాడు.
డైరెక్టర్ కథ అంత చదవిన తర్వాత 'కథలో మార్పులు కూడ చేయవలసిన అవసరం ఉంటే తర్వాత చేయవచ్చు' అనుకున్నాడు. ఈ కథకు ఇద్దరు హీరోలు అవసరం. హీరోలు ఎవరు అనేది డిసైడ్ చేయడం బట్టి కూడ కథకు తాను,మార్పులు ఎలా చేయాలో ఒక ఐడియా మైండులో పెట్టు కొనవచ్చు అనుకొని. పూర్తి స్క్రిప్ట్ వర్క్ అయ్యాక హీరోలు ఎవరు అనే దాని బట్టి తాను ఎలా డైరెక్షన్ చేయాలో కూడ ఆలోచిద్దాం అనుకొన్నాడు.
ప్రొడ్యూసర్ ఆఫీస్ రూమ్..
ప్రొడ్యూసర్ ముందు కథ ఫైనల్ అయ్యింది. హీరో ఎవరు అనుకుంటే ఇంక మిగత నటి నటులు ఎవరుంటే బాగుంటుంది అనేది డిసైడ్ చేద్దాం"
ఇద్దరు హీరోలు అవసరం.
కిరణ్ పాత్రకు ఇప్పుడు మంచి ఫాలోయింగ్ ఉన్న యువతరం ఒక హీరో
విక్రమ్ పాత్రకు కొద్దిగ ఏజ్ ఉండే మరో హీరో ఇది స్పెషల్ ఆపిరెన్స్ ఉండే గెస్ట్ రోల్.
విక్రంకు పవన్ కల్యాణ్..
కిరణ్ గా రామ్ చరణ్
తర్వాత వీళ్లు కాకుంటే
చిరంజీవి
అల్లు అర్జున్..
తర్వాత వీళ్లు కాకుంటే
నాగార్జున
జూనియర్ ఎన్టీఆర్..
తర్వాత వీళ్లు కాకుంటే
వెంకటేష్
నాగ చైతన్య..
ఈ కథ ఏ హీరోలు నచ్చి ఓకే అంటే అప్పుడు సినిమా మొదలు పెడతాం" అన్నాడు ప్రొడ్యూసర్
ప్రొడ్యూసర్కి మంచి పేరు ఉంది కాబట్టి హీరోలు ఎవరైనా ఈ కథ సినిమా త్వరలో పట్టాలు ఎక్కడం గారంటి .
ఇంక మరోసారి కథ చదవి ఏ హీరోలు అయితే బాగుంటుందో తర్వాత ఆలోచిద్దాం అనుకొని మళ్ళీ ఒకసారి కథ చదవడం మొదలు పెట్టాడు డైరెక్టర్. రెండు సీన్ల తర్వాత మూడో సీను చదవడం కోసం కాఫీ తాగి కాస్త రిలాక్స్ అయ్యి కథ లోకి పరకాయ ప్రవేశం చేశాడు..
ఇంకా ఉంది...
S. సంపత్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : S. సంపత్ కుమార్
చదువు M.A. Archeology
కథలు రాయడం, వివిధ పత్రికలలో సుమారు 20 , అలాగే తీసిన షార్ట్ ఫిల్మ్స్ 6లో ఒక షార్ట్ ఫిల్మ్ కు డైరెక్టర్ గా స్పెషల్ జ్యూరీ అవార్డు, రెండు షార్ట్ ఫిల్మ్స్ బెస్ట్ స్టోరీ అవార్డ్స్ వచ్చాయి.
Om sai creations • 3 hours ago
కథా పఠనంతో శ్రీ మల్లవరపు సీతారాం కుమార్ గారు తన మధుర స్వరం ద్వార నా "సంపత్ సినిమా కథలు" కు ప్రాణం పోసినందుకు ధన్యవాదాలు..సంపత్ కుమార్. రచయిత
Lingaswami Vemuganti • 1 hour ago
Super narration sampathi garu