'Sampath Cinema Kathalu - 11' New Telugu Web
Series Written By S. Sampath Kumar
రచన : S. సంపత్ కుమార్
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
గత ఎపిసోడ్ లో
లింగస్వామి హాస్పిటల్ కి వచ్చి కిరణ్ ని కలుస్తాడు.
కిరణ్ తాను మరికొద్ది రోజులు హాస్పిటల్ లోనే ఉంటానని చెబుతాడు.
కిరణ్ ను తీసుకుని లింగస్వామి డ్రగ్స్ మాఫియా ముఠా స్థావరనికి బయలుదేరాడు.
లింగస్వామి మనిషయిన నరసింహ- రాజారావు, సుజాత, కావ్యలను కిడ్నాప్ చేస్తాడు.
వాళ్ళని విక్రమ్, కిరణ్ లు తప్పిస్తారు.
ఎలా తప్పించారనేది విక్రమ్, తన పై ఆఫీసర్ కి ఇలా వివరిస్తాడు.
ఇక సంపత్ సినిమా కథలు ధారావాహిక చివరి భాగం చదవండి.
అది ఓపెన్ ప్లేస్. చుట్టు లారీలు కొన్ని ఆగి ఉన్నాయి. చిన్న షెడ్. ఆ షెడ్ లో రాజరావు, సుజాత, కావ్య, శివమ్మలను బందీలుగా ఉంచారు.
ఆ షెడ్ కు ఉన్న కిటికిలోనుండి రాజారావు, అపుడే అక్కడికి వచ్చిన లింగస్వామి అనుచరులతో పాటు ఉన్న విక్రమ్, కిరణ్ లను చూసి "ఒరేయ్ లింగ.... నా కొడుకును తీసుకొచ్చావా... నీవెంత మంచి వాడవు రా....... మరి వీళ్లు ఎవరురా... మనల్ని కిడ్నాప్ చేసి తెచ్చారు... ఎందుకు తెచ్చారో తెలియదు... " ఏమీ తెలియని వాడిలా అన్నాడు.
విక్రమ్ కి కిరణ్ కి రాజరావు నాటక ఆడుతున్నాడు అని అర్థం అయ్యింది.
ఇంక లింగస్వామి "అవును అవును.. నీ కొడుకును నీకు అప్పజెప్పి ఈ కిడ్నాప్ చెర నుండి విడిపిద్దమని వచ్చాను” అన్నాడు.
"అబ్బా.. నమ్మినబంటు అంటే నీలా వుండాలి" అన్నాడు రాజారావు.
"రెండు నిమిషాలు ఆగు. నమ్మినబంటో నమిలేబంటో తెలుస్తుంది...... బావ.. ఆలస్యం వద్దు. ముందు ఆ విక్రమ్ దగ్గర ఆ విడియో సెల్ తీసుకో'" అన్నాడు భాస్కర్.
"ముందు మా వాళ్ళను ఆ షెడ్ నుంచి తెచ్చి అప్పజెప్పితేనె సెల్ విడియో ఇచ్చేది" కిరణ్ అనగానే విక్రమ్ వీడియో తీసిన సెల్ చేతిలో పట్టుకున్నాడు.
"కిడ్నాప్ చేసి షెడ్ లో బంది చేసిన వాళ్లను తీసుకొని రా నరసింహ. " అన్నాడు భాస్కర్.
షెడ్ లో రాజరావును, సుజాత, కావ్య, శివమ్మలను ఉన్నా బయటకు తెచ్చారు.
బయటకు వచ్చాక రాజరావు "ఏమి లింగ.. ఏమీ జరుగుతుంది" అన్నాడు.
"నోరు మూసుకో.. లింగ లేదు లంగా లేదు. " అని లింగస్వామి కొడుకు ఉదయ్ అనగానే.
అప్పుడే అక్కడికి వచ్చిన నారాయణ "వాడు లింగ కాదు దొంగ" అంటూ లింగస్వామి వంక చూస్తూ
"ఒరేయ్ లింగ అసలు వీడియో సెల్ ఇదిగో" అన్నాడు అక్కడికి తెచ్చిన వీడియో సెల్ చూపిస్తూ.
"పిచ్చోడా.. అది కిరణ్ ఎప్పుడో తెచ్చి వాట్సప్ లో పోలీసు అధికారులకు పంపాడు. ఇంక మీరు, ఆ దావుద్ అనుచరులు వారి స్థావరాలు మటాష్. " అన్నాడు.
"అరే ఎంత నమ్మకద్రోహం " అంటూ పిస్తోలు తో ముందు రాజరావును షూట్ చేయడానికి పోతే కిరణ్ ఎగిరి దూకి వాళ్ళ నాన్నను కాపాడాడు.
ఇంతలో విక్రమ్ అక్కడ ఉన్న లింగస్వామి అనుచరులు, గుండాల మీద దాడి చేశాడు. అప్పుడే నారాయణ రాజరావును సుజాత కావ్య, శివమ్మలను అక్కడే ఉన్న ఒక లారీ వెనుక దాక్కోమన్నాడు. వాళ్ళు అలాగే చేశారు.
అక్కడికి దావుద్ అనుచరులు కూడ రావడంతో ఇంక విక్రమ్, కిరణ్ వాళ్లను చితక బాదారు. ఇంక నారాయణ వెంటనే రాజరావును, సుజాత, కావ్య, శివమ్మలను తీసుకొని నరసింహను వాడి అనుచరులను లారీల చుట్టు తిప్పి వెనకాల నుండి ఒక్కొకరిని చితక బాదారు.
ఇంతలో పోలీసులు జీపుల్లో రావడం.. లింగస్వామిని, అతను కొడుకు ఉదయ్ బావమరిది భాస్కర్ ఇంక అక్కడ ఉన్న దావుద్ అనుచరులతో పాటు నరసింహ అనుచరులను అరెస్ట్ చేశారు. అపుడే పిచ్చి అవతారంను తన్ను కుంటు రంగ భీమలు తీసుకొచ్చారు.
"ఆ వీడియో సెల్ నా దగ్గర ఉంది" అన్నాడు నారాయణ.
ఎప్పుడో కిరణ్ తెచ్చాడని బురుడి కొట్టించావు... తెలివి బాగ ఉపయోగించావు" అన్నాడు విక్రమ్.
"అలా అంటేనే ఆలోచనలో పడ్డారు. లేకుంటే రాజరావును తర్వాత మనల్ని చంపేవారు” అంటూ ”ఇంక వాళ్లకి మీ శక్తి తెలియదు. అందుకే తుక్కు తుక్కు లేపారు" అన్నాడు నారాయణ.
నారాయణ నరసింహను, వాడి అనుచరులను, పిచ్చి అవతారంను చూస్తూ "ఎంత నాటకమాడి నన్ను ఆడుకున్నారు రా" అంటూ
"విక్రమ్ సార్.. వీళ్ళను ఒక్కసారి నా బెల్ట్ తో కొడతా" అనగానే
"నీ ఇష్టం. తనివితీరా నీవు కొట్టాకే మా వాళ్లు వీళ్ళను తీసు కెళ్లుతారు". అన్నాడు.
నారాయణ బెల్ట్ తో ఓపిక ఉన్నంత సేపు కొట్టి
"అమ్మ.. వీళ్ళను కొట్టి కొట్టి నా చేతులకి నొప్పి పుడుతున్నయి, ఇంక తీసుకెళ్ళండి" అనగానే అందరు నవ్వారు.
సౌత్ ఇండియా లో దావుద్ డ్రగ్స్ సరఫరా స్థావరాల మీద విక్రమ్ ఆధ్వర్యంలో రెడీ టూ ఎటాక్ ఆపరేషన్ చేసి దావూద్ అరెస్ట్ చేశారు.
దావూద్ ని అరెస్ట్ చేసి జైలుకు తెచ్చారు. అక్కడ ముందే ఉన్న లింగస్వామి, లింగ స్వామి కొడుకు ఉదయ్, బావ మరిది భాస్కర్ ఇంక కొంత మంది దావుద్ అనుచరులు లింగస్వామి అనుచరులు ఉన్నారు.
అప్పుడు దావుద్ లింగస్వామిని చూసి "బేవకూఫ్... ఈ డ్రగ్స్ బిజినెస్స్ లో ఎప్పటి నుండో ఉన్నా ఇంత వరకు పట్టుబడలేదు. నిన్ను నమ్మాను. నిండ మునిగాను.... ఎంత నమ్మక ద్రోహం చేశావు రా" అంటూ...... జైలు సెల్ లొకి వెళ్ళి పోయాడు దావుద్.
"వీడు కూడ నేను నమ్మక ద్రోహం చేసాను అనుకుంటున్నాడు బావమరిదీ" అన్నాడు లింగస్వామి.
"బావమరిది... నాది మహా జాతకం అని నమ్మకంగా చెప్పి నమ్మక ద్రోహం చేసిన ఆ జ్యోతిష్యుడు ఎవ్వరూ"
"ఇంక ఎవ్వరూ.. వాడు నీ వెనుకనే ఉన్నాడు"
"అవును మరి.. మంచి కోసం పోతే మహా జాతకం అన్నా కాని ఇలాంటి పని చేస్తే మహజాతకం అనలేదు"
"ఏది ఏమైనా ఇలా జైలుకు రావడం మహాజాతకం బావ"
"బావమరిది.... నీవు రా నన్ను నమ్మించి ఈ ఉచ్చు లో దించి నమ్మక ద్రోహం చేసావు " అన్నాడు లింగస్వామి.
"నమ్మితేనే కదా బావ నమ్మక ద్రోహం చేసేది" అన్నాడు భాస్కర్.
పోలీసులు వచ్చి అక్కడ ఉన్న అందరిని " పదండి.... పదండి" అంటు సెల్ లోకి తీసుకెళ్ళారు
కథ డైరెక్టర్ మూడవసారి చదివాక .. ‘ఏ హీరోలతొ తీసినా స్క్రిప్టు సూపర్గా ఉంటుంది. మార్పులు అంతగా ఉండవు’ అనుకున్నాడు.
"ఇప్పటికీ మూడుసార్లు చదవాను. మార్పులు అవసరం లేదుఅన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. రేపు స్క్రిప్టు వర్క్ మీద కూర్చుందాం. " అన్నాడు డైరెక్టర్.
ఈ సినిమా కథ ప్రొడ్యూసర్ నచ్చింది. అడ్వాన్స్ ఇచ్చాడు. ఇంక స్క్రిప్టు వర్క్ పనులు కూడ దాదాపు అయిపోయాయి. హీరోలను బట్టి అవసరం అనుకుంటే కాస్త సీనులు నేను చేంజ్ చేసుకుంటా అని డైరెక్టర్ చెప్పాడు. ఇంక ఆ సినిమా ఎప్పుడు మొదలు అయితే అప్పుడు నాకు పని. అంత వరకు నేను ఎలాగో ఖాళీ. ఈ సినిమా నుంచి నేను బిజీ అవ్వచ్చు అనే నమ్మకంతో ఇతర హీరోలకు కథలు రాసుకొని ఉన్నా. ఎందుకైనా మంచిదని తాను హీరోలకు రాసుకున్న కథలకు ముందుగా స్టోరీ లైన్ చెప్పడానికి ఒక పేపర్ మీద హీరో పేరు, సినిమా టైటిల్ పెట్టి, స్టొరీ లైన్ రాయడం మొదలు పెట్టా.
ఇలా ఆ హీరోలకు రాసుకున్న కథలకు స్టోరీ లైన్ రాద్దామనుకొనే ముందు ఒక స్ట్రాంగ్ కాఫీ తాగుదామని బయటకు వెళ్లడానకి లేస్తున్న నాకు..
అంతలొ... రూమ్ తలుపు చప్పుడు.
ఎవరా.... అని వెళ్ళి తలుపు తియ్యగానే.
ఎదురుగా ప్రొడ్యూసర్, డైరెక్టర్.
“సార్... మీరేమిటి... మా రూంకు రావడం” అంటూ ప్రొడ్యూసర్ వంక చూస్తూ అన్నాను.
తర్వాత వెంటనే “రండి... రండి కూర్చోండి” అన్నాను.
“నాకు టైమ్ లేదు... ఇప్పుడు చెన్నయ్ కు పోతున్న మా ఫ్రెండ్ తన కొడుకుతో సినిమా తీయాలనే ప్లాన్లో ఉన్నాడు అర్జెంట్ గా ఏదయినా మంచి ఫ్యామిలీ డ్రామా ఉండే కథ మరి ఫైట్స్ లేకుండా కాస్త సెంటిమెంటు తో ముడి పడి ఉండేల ఉండాలి. అలాంటి కథ రాసివుంటే ఇవ్వు నేను జర్నీలో చదవడానికి”
“ఒక కథ ఉంది కాని ఇంక మార్పులు చేర్పులు చేయాలి. అలాగే మామూలుగా ఫెయిర్ చేయకుండ రఫ్ గా రాశాను”
“ఏం పర్వాలేదు అలాగే ఇవ్వు.. నాకు ఎలా రాసిన అర్థం అవుతుంది. నాకు జర్నీ చేసేటప్పుడు వినడం కన్న చదవడం చాలా ఇంటరెస్ట్. ఆ రోజు నాకు చూపించావే ఆ ‘ఊహించని మలుపు’ కథ ఇవ్వు” అన్నాడు డైరెక్టర్.
సరే అంటూ నేను ఈ మధ్య రాసుకున్న "ఊహించని మలుపు" కథ ఇచ్చాను ప్రొడ్యూసర్కు.
ఆ కథ తీసుకోని ప్రొడ్యూసర్, డైరెక్టర్ వెళ్ళిపోయాడు
ఇంక జర్నీలో ప్రొడ్యూసర్ ఊహించని మలుపు కథలొ నిమగ్నమై పోయాడు.
డైరక్టర్ కాల్ చేసి నీవు రాసుకున్న కథలకు రెక్కలు వస్తున్నాయి. ఆల్ ది బెస్ట్ అన్నాడు.
డైరక్టర్ ఆ మాట అనగానే గొప్ప సినీ రైటర్ అవుతాననే నమ్మకం బలంగా నా మనసులొ నాటుకొని పోయింది.
సమాప్తం
సంపత్ సినిమా కథలు అనే ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత సంపత్ కుమార్ గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
S. సంపత్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Podcast Link
Twitter Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : S. సంపత్ కుమార్
చదువు M.A. Archeology
కథలు రాయడం, వివిధ పత్రికలలో సుమారు 20 , అలాగే తీసిన షార్ట్ ఫిల్మ్స్ 6లో ఒక షార్ట్ ఫిల్మ్ కు డైరెక్టర్ గా స్పెషల్ జ్యూరీ అవార్డు, రెండు షార్ట్ ఫిల్మ్స్ బెస్ట్ స్టోరీ అవార్డ్స్ వచ్చాయి.
Comments