కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Youtube Video link
'Sampath Cinema Kathalu - 2' New Telugu Web
Series Written By S. Sampath Kumar
రచన : S. సంపత్ కుమార్
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
గత ఎపిసోడ్ లో
డైరెక్టర్ నన్ను ప్రొడ్యూసర్ వద్దకు తీసుకొని వెళతాడు.
ప్రొడ్యూసర్ నన్ను కథ చెప్పమంటాడు.
నా కథ ప్రకారం ఫ్రెండ్ చెల్లెలి పెళ్లి కోసం బెంగళూరు వెళ్లిన కిరణ్ అనే యువకుడు కనపడకుండా పోతాడు. అదృశ్యమైన కిరణ్ ఒక మానసిక చికిత్సాలయం లో ఉంటాడు.
అతడు రాజారావు అనే ఒక కోటీశ్వరుడి కుమారుడు.
మొదటి భాగం విన్న నిర్మాత కథ నచ్చినట్లు చెబుతాడు.
ఇక 'సంపత్ సినిమా కథలు రెండవ' భాగం చదవండి.
కొన్ని రోజుల తర్వాత…
హాస్పటల్(ప్రకృతి మానసిక ఆరోగ్య చికిత్సాలయం)
వాతవరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది.
బయట సన్నని వర్షం..
తన తలకు అడ్డుగా ఉన్న గొడుగు తీస్తూ తన అందాలను కనువిందుగా ఒక్కసారి గుమ్మరించింది కావ్య, వయసు 20.
తెల్లని పలుచని ఓణీ, పరువాలు కనబడేటట్టు ఆకు పచ్చని డిజైన్ వేసిన బ్లౌజు.. ఇంకా నాభి కింద ఆదే ఆకు పచ్చ డిజైన్ చేసిన లంగా. ఆమె అందానికి తగ్గట్టు ఆ డ్రస్ ఉంది.
ఆ అందాలను చూస్తే- బ్రహ్మ కైన పుడుతుంది రిమ్మ తెగులు అంటారు కదా… అంత అందంగా ఉంది కావ్య. ఇక వయసులో ఉన్న కుర్రాళ్ళు చూస్తే ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.
అప్పుడప్పుడే కాస్త కళ్ళు తెరచి రిలాక్స్ గా బెడ్ మీద కదులుతూ కిరణ్ తన రూం కిటికీలో నుంచి ఒక్కసారిగా కావ్యను చూసేసరికి ఆమె అందానికి ముగ్దుడై పోయాడు. ఇంక అతనికి తెలియకుండానే ఏదో లోకంలో తేలిపోయాడు. కాసేపుయ్యక కిరణ్ కళ్ళు మూతపడిపోయాయి.
కావ్య తన పుట్టిన రోజు సందర్భంగా అక్కడ ఉన్న పేషెంట్లకు పండ్లు ఇవ్వడానికి వచ్చింది.
కావ్యది ఈ రోజు పుట్టినరోజు అని ముందే కావ్య చెప్పడం వలన, పండ్లు తెచ్చి పెట్టాడు అక్కడ పనిచేసే నారాయణ.
అంతలొ అక్కడున్న ఒక పిచ్చోడు.. అతని పేరు అవతారం వచ్చి, నారాయణను చూసి "నాకు ఇవ్వాల్సిన 5 కోట్లు ఎప్పుడు ఇస్తావు " అని షర్ట్ కాలర్ పట్టుకుని అడిగాడు.
"చెప్పాను కదా వచ్చే వారం ఇస్తానని" అన్నాడు నారాయణ.
ఇది విన్న కావ్య " అతనికి 5 కోట్లు బాకీ ఉన్నావా!" అని అడిగింది.
"లేదమ్మా! ఆ పిచ్చోడు అలాగే అడుగుతాడు, నేను ఇలాగే చెబుతాను” అన్నాడు నారాయణ.
ఆ మాటకు నవ్వుతూ కావ్య
"ఔనా, అదే.. 5 కోట్ల బాకీ అంటే ఆశ్చర్యం వేసింది"
"ఏమి చేద్దాం! అప్పుల బాధలతో పిచ్చోడయ్యాడని వాడి కొడుకు ఇక్కడ వదలి, మళ్ళీ వస్తా అని రాలేదు. ఇక్కడ వదలి వెళ్లిపోతే పోనీలే.. కాస్త తిండి, బట్ట ఇస్తే ఇక్కడే ఒక మూల పడి వుంటాడు అని జాలి వేసి ఉంచా. "
"మంచి పనేగా... ఇక పండ్లు పేషెంట్లకు పంచుతా" అని నారాయణ తెచ్చిన పండ్లు తీసుకోని పేషెంట్స్ కి పంచడానికి వెళ్ళింది.
పండ్లు పంచిన తర్వాత కావ్య అక్కడనుంచి వెళ్ళిపోతూ నారాయణకు కనపడి ‘వెళుతున్నా’ అని చెప్పి వెళ్ళిపోయింది.
అంతలో అక్కడికి నరసింహా అనే రౌడి తన అనుచరులతో వచ్చి "ఆ పిచ్చోడు అవతారం ఎప్పుడు బాగవుతాడు?" చెట్టు దగ్గర ఉన్న అవతారమనే పిచ్చోడిని చూపిస్తూ అడిగాడు.
"నేను ఎప్పుడు 5 కోట్లు ఇస్తే అప్పుడు" వెటకారంగా నవ్వుతూ అన్నాడు నారాయణ.
అప్పుడు వారిలో ఒకడు నారాయణ షర్ట్ కాలర్ పట్టుకుని
"తొందరగా 5 కోట్లు ఇచ్చేయి. వాడు మాకు 2 కోట్లు బాకీ ఉన్నాడు” అంటూ నారాయణను ఒక్క తన్ను తన్ని పోయారు.
"నేనేదో సరదా అన్నాను అంటే వాళ్లు నేను చెప్పేది వినకుండా నాలుగు తన్నులు తన్ని, మళ్ళీ వచ్చే వారం వస్తాం అని చెప్పిపోయారు" అంటూ ‘ఇదేమి ఖర్మరా బాబు’ అని మనసులో అనుకుంటూ తల బాదుకున్నాడు నారాయణ.
కొన్ని గంటల తర్వాత కిరణ్ రూంలో శబ్దం వినపడగానే నర్సు చూసి "మేడం! ఆ కిరణ్ కళ్ళు తెరచి పైకి లేస్తున్నాడు" అనగానే, డాక్టర్ సుజాత కిరణ్ దగ్గరకు వచ్చి " హమ్మయ్య.... కదలిక మొదలయింది. ఇక కోమా నుండి మామూలు స్థితిలోకి వస్తాడు" అంటూ రూమ్ బయటకు వచ్చి రాజారావుకూ తమకూ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన లింగస్వామికి కాల్ చేసింది.
డాక్టర్ సుజాత కాల్ రిసీవ్ చేసుకున్న లింగస్వామి
"శుభ వార్త చెప్పావు. ఇంక కాస్త రికవరీ అయ్యాక రాజారావుకు చెబుదాం. ఈ వార్త రాజారావుకు చెప్పలేదు కదా" అన్నాడు.
"లేదు, ఇక్కడ ఎవ్వరికీ తెలియకుండా చేర్చింది మీరే కదా, అందుకే ముందు మీకే చెబుతున్నా. ఇది రాజారావు, మా అన్న సురేందర్- ఇద్దరూ కట్టించిన హాస్పిటల్ అయినా ఇందులో నేను ఒక డాక్టర్ గా మాత్రమే పని చేస్తున్నా. ఒక డాక్టరుగా నేను కిరణ్కు పేషేంట్ గా సేవ చేశా కానీ రాజారావు కొడుకు కిరణ్ గా కాదు. "
"అది తెలుసులేవమ్మా. " అన్నాడు లింగస్వామి
ఒక రోజు లింగస్వామి కిరణ్ ఎలా ఉన్నాడో చూడటానికి ఊటీకి వచ్చాడు.
ఇప్పుడిప్పుడే ఈ లోకంలోకి వచ్చిన కిరణ్ రూంలోకి వచ్చారు లింగస్వామి, సుజాత.
లింగస్వామిని చూసిన వెంటనే కిరణ్ "ఏమైంది అంకుల్ నాకు" అని అడిగాడు.
"ఏదో చిన్న ఏక్సిడెంట్. కాస్త తలకు దెబ్బ తగలడం వలన, స్పృహ తప్పితే ఇక్కడికి తెచ్చాము"
"అవునా! డాడీ ఎలా ఉన్నారు? ఇలా జరగింది డాడీకి తెలియదా.. "
"తెలిస్తే ఇక్కడికి వచ్చేవాడు కదా! నేనే ఇక్కడ నీ పరిస్థితి బట్టి రమ్మని చెబుదామని చెప్పలేదు. ఇలా నిన్ను మీ డాడీ చూస్తే తట్టుకోలేడు. బెంగుళూరు అని చెప్పి వెళ్ళనవాడివి డ్రగ్స్ మాఫియా చేతికి ఎలా చిక్కావు"
"ఏమో ఆదే తెలియదు"
"ఆ రోజు మా ఫ్రెండ్ వినయ్ చెల్లి పెళ్లికని డాడీకి బెంగళూరుకు వెళుతున్నా అని చెప్పి ఫ్లయిట్ ఎక్కి బెంగళూరు ఏయిర్ పోర్ట్లో దిగి అలా బయటకు వచ్చిన వెంటేనే షాలిని అనే అమ్మాయి కనపడి ‘హలో కిరణ్’ అని పలకరించింది.
‘మీరు ఎవరు’ అని అడిగా.
‘నేను మీ ఫ్రెండ్ వినయ్ చెల్లెలి ఫ్రెండును. నా పేరు షాలిని” అందామె.
‘మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు’ అన్నాను నేను.
‘మీరు నన్ను చూడలేదు కాని నేను మిమ్మల్ని వినయ్ ఇంట్లో చూసాను’ అంది ఆ అమ్మాయి.
‘ఔనా, మరి ఒక్కసారి కూడ పలకరించుకొలేదు మనం’ అన్నాన్నేను.
‘అదా మీ సందేహం! వినయ్ వాళ్ల ఇంటికి నేను వచ్చినప్పుడు మీరు మందు పార్టీలో ఉండేవాళ్లు. అప్పుడు మేము అటు వచ్చే వాళ్ళం కాదు. మీ ఫేస్ అచ్చం ప్రభాస్ లా ఉంటుంది. అందుకే నాకు మీ ఫేస్ బాగా గుర్తు ఉంది” అంది షాలిని.
‘ఓ.. అలాగ’ అన్నాను.
‘వినయ్ కార్ తీసుకోని రాలేదా’ అంది షాలిని.
‘లేదు నేనే క్యాబ్లో వస్తా అన్నా’ చెప్పాను.
‘అయితే రండి మా కార్లో డ్రాప్ చేస్తా’ అంది.
‘వద్దు.. నేను క్యాబ్లో వెళ్ళుతా’ అన్నాను.
‘పర్వాలేదు. నేను కూడా పోయేది అటువైపే’ అంది షాలిని.
ఎందుకో షాలిని మీద అనుమానం రాలేదు అలాగే బెంగళూరు దిగిన వెంటనే వినయకు కాల్ చేసి చెప్పే అలవాటు కూడా లేదు. ఎందుకంటే ఎప్పుడు బెంగళూర్ వెళ్లినా ఇంటికి వెళ్ళి వినయ్ ను సర్ప్రైజ్ చేయడం అలవాటు.
అలా షాలినితో పాటు కార్లో వెళుతున్నాను. మధ్యలో వినయ్ చెల్లెలు తనకు ఎలా ఫ్రెండ్ అయినది చెబుతుంది. వింటూనే ఆమె ఇచ్చిన చాక్లెట్ తిన్న తరువాత ఏంజరిగిందో నాకే తెలియదు. లేచి చూసేసరికి ఒక పాడుపడిన బంగ్లాలో ఒక రూములో ఉన్నాను. అప్పుడు నేను తిన్నది మత్తు చాక్లెట్ అని, మోసపోయి వచ్చానని తెలుసుకున్నా. మత్తు నుండి నిద్ర లేచేసరికి చుట్టు ప్రక్కల ఎవ్వరూ లేరు. నెమ్మదిగా లేచి ఆ రూంలో నుండి బయటకి వచ్చి చూస్తే ఒక పెద్ద మనిషి.. ఫేస్ సరిగా కనపడలేదు. అతని ముందు ఉన్న ఇద్దరు డ్రగ్స్ సరఫరా గురించి వివరిస్తూ ఉన్నారు.
అప్పుడు నాకు అర్థమైంది, డ్రగ్స్ రాకెట్ నన్ను కిడ్నాప్ చేసిందని. వెంటేనే నా సెల్ లో వాళ్లు మాట్లాడుతుంటే వీడియో ఆన్ చేసి రికార్డు చేశా. ఆ వాతావరణం చాలా సైలెంట్ గా ఉంది కాబట్టి వాళ్లు మాట్లాడే మాటలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. అక్కడ నుంచి ఎలాగైనా తప్పించు కొందామనీ అనుకొనే లోపల అప్పుడే బయట నుంచి వస్తున్న ఒకడు చూసి గట్టిగా అరిచాడు. అంతే! నేను పారిపోతుంటే చుట్టూ నలుగురు వచ్చి పట్టుకొన్నారు. వారినుంచి పెనుగులాడుతూ ఉంటే ఆ షాలిని వచ్చి మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. అంతే.. మళ్ళీ నేను ఇలా మీ ముందుకు..” ముగించాడు కిరణ్.
“అయితే ఆ సెల్ లో డ్రగ్స్ రాకెట్ వివరాలు వీడియో తీశావు కదా! ఆ సెల్..” అడిగాడు లింగస్వామి.
“మరి.. అది.. అది..” అంటూ మత్తుగా కళ్ళు మూసుకున్నాడు.
“చాలా నీరసంగా వున్నాడు. కాస్త బాగా అయిన తర్వాత మాట్లాడుదాం. ఇంక రెస్ట్ తీసుకోనీ” సుజాత చెప్పగానే
"అయితే ఇన్స్పెక్టర్ విక్రమ్ ని ఒక వారం తరువాత రమ్మని,. కిరణ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నడని చెప్పాలి.
డ్రగ్స్ రాకెట్ ముఠా వివరాలు సేకరించడానికి విక్రమ్ వస్తానన్నాడు"
"ఔనా... అతను ఒక వారం తరువాత వస్తేనే మేలు" అంది సుజాత.
మానసిక ఆరోగ్య చికిత్సలాయ ఆవరణలో ఇద్దరు సిబ్బంది మాట్లాడుకుంటున్నారు
వారి పేర్లు రంగ, భీమ.
"అరే.. ఆ నారాయణ మన మీద పెత్తనం చెలాయిస్తూ, వాడు మాత్రం పై పై పనులు చేస్తూ అధికారం చెలయిస్తున్నాడు. వాడికి ఎలాగైనా గుణపాఠం చెప్పాలి"
" ఔను రా " అన్నాడు భీమ
అంతలో నారాయణ అటు వచ్చి
"ఎందిరా గుస గుసలు.. నా గురించేనా?" అడిగాడు.
"అబ్బే అదేం కాదు"
ఇంతలో పిచ్చోడు అవతారానికి 2 కోట్లు అప్పు ఇచ్చిన నరసింహా తన అనుచరులతో వచ్చాడు.
వాడిని చూసిన వెంటనే నారాయణ "అమ్మో! వీడు వచ్చాడు. మళ్ళీ నాకు మూడింది " అంటూ
"అరే రంగ, భీమ! వాడు మళ్ళీ వచ్చాడురా! నన్ను అడిగితే ఈ రోజు డ్యూటికి రాలేదు అని చెప్పు” అంటూ కనపడకుండా దాగుకున్నాడు.
నరసింహ వస్తూనే, రంగ భీమ ల దగ్గరకు వచ్చి
" నారాయణ ఎక్కడ " అన్నాడు.
" ఈ రోజు డ్యూటికి రాలేదు. ఎందుకు?" అన్నారు వాళ్ళు.
"వాడికేం! 5 కోట్లు ఆ అవతారం దగ్గర అప్పు తీసుకుని పెళ్ళాం పేరిట ఈ ఊటీలో రెండు గెస్ట్ హౌస్లు కొన్నాడు. ఇంక అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ అవతారం మాత్రం నారాయణకు అప్పు ఇచ్చి పిచ్చోడయ్యి ఇక్కడ చేరినాడు"
అంతలొ అవతారం అక్కడికు వచ్చి
" నారాయణ.. నారాయణ ఎక్కడ" అన్నాడు.
అప్పుడు భీమ "నీ అప్పు తీర్చడానికి 5 కోట్లు తేవడానికి వెళ్ళాడు" అన్నాడు.
"ఓహ్! అలాగా.. భలే భలే " అనుకుంటూ అక్కడ ఉన్న చెట్టు దగ్గర ఆడుకోడానికి వెళ్ళాడు.
"నా దగ్గర 2 కోట్లు అప్పు తీసుకున్న అవతారం పిచ్చోడు కావడానికి ఈ నారాయణ తీసుకున్న 5 కోట్ల అప్పే కారణం అన్న మాట! మరి ఆ రోజు ఆ పిచ్చోడి అనందం కోసం అలా సరదా చెప్పానన్నాడు”
"ఎలాగూ వాడి పిచ్చి కుదరదని, అలా చెబితే నష్టం లేదని అలా చెబుతున్నాడు " అన్నాడు రంగ.
"అలాగా, వాడి ఇంటికి పోయి వాడి అంతు చూస్తా" అన్నాడు నర్సింహ.
"వద్దు. నర్సింహ ఇంటికి పోవద్దు. కొన్ని రోజులకు ఆ అవతారం పిచ్చి కుదురుతుంది. అప్పుడు చూద్దాం " అన్నాడు బీమ
" సరే మీరు చెప్పినట్టు చేద్దాం. "
"అయినా ఇంత రౌడివి ఆ బక్కపలుచని ఆ అవతారంకు రెండు కోట్లు అప్పు ఎలా ఇచ్చావు" అన్నాడు రంగ.
"అదే కదా వాడు ప్రభుత్వ భూమి చూపించి దొంగ పేపర్లు సృష్టించి తెలివిగా మోసం చేసి 2 కోట్లు తీసుకున్నాడు. ఈ బక్కవాళ్లను నమ్మరాదు వాళ్ళకు తెలివితేటలు ఎక్కువ. సరె మీరు మాత్రం హెల్ప్ చేయండి మీకు మంచి కమిషన్ ఇస్తా "
అని చెప్పి అనుచరులతో అక్కడనుండి వెళ్ళిపోయాడు నరసింహా.
నారాయణను భలే ఇరికించాం అని ఇద్దరు నవ్వుకున్నారు
ఇంతలో అక్కడ ఒక మూల దాగుకున్న నారాయణను చూసి అప్పుడే రూంలో నుంచి బయటకు వచ్చిన కిరణ్
"ఏమి నారాయణ ఇక్కడ దాక్కున్నావ్ " అని అడిగాడు.
"ఏమీ లేదు బాబూ," అంటూ
"మీరేమిటి ఇలా బయటకు వచ్చారు" అన్నాడు నారాయణ.
"బోర్ కొడుతుంది.. అలా పోదామని.."
"నా సైకిల్ తీసుకొని పొండి"
"అలాగే! థాంక్స్ నారాయణ "
నారాయణ సైకిల్ తీసుకొని పోతుంటే గేట్ దగ్గర ఉండే వాచ్ మెన్ ..నేపాల్ వాడు, వాడి పర్సనాలిటీ చూస్తే భయం వేస్తుంది. అంతా సైగలతోనే ‘పర్మిషన్ లేకుండా బయటకి పోరాదు’ అంటూ నేపాల్ భాషలో చెబుతున్నాడు. భాష అర్థం కాకున్నా పర్మిషన్ లేకుండా పోరాదు అని అర్థమైంది కిరణ్కు.
“నారాయణా అంకుల్ వెళ్ళమన్నాడు” అంటూ నారాయణ అంకుల్ ని పిలిచాడు కిరణ్
అక్కడ నుండి నేపాల్ వాచ్ మెన్ కి చేతులతో సైగ చేశాడు నారాయణ.
“తొందరగా రండి” అని నేపాల్ బాషలో అన్నాడు వాచ్ మెన్.
వాచ్ మెన్ మాటలు అర్థం కాకున్నా సరే అన్నాడు కిరణ్.
ఇంకా వుంది...
S. సంపత్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : S. సంపత్ కుమార్
చదువు M.A. Archeology
కథలు రాయడం, వివిధ పత్రికలలో సుమారు 20 , అలాగే తీసిన షార్ట్ ఫిల్మ్స్ 6లో ఒక షార్ట్ ఫిల్మ్ కు డైరెక్టర్ గా స్పెషల్ జ్యూరీ అవార్డు, రెండు షార్ట్ ఫిల్మ్స్ బెస్ట్ స్టోరీ అవార్డ్స్ వచ్చాయి.
jyothirmai sriperambur • 3 days ago
Good