top of page
Writer's pictureSampath Kumar S

సంపత్ సినిమా కథలు - 6


'Sampath Cinema Kathalu - 6' New Telugu Web


Series Written By S. Sampath Kumar




(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

గత ఎపిసోడ్ లో

నరసింహకు కనపడకుండా నారాయణను తప్పిస్తాడు కిరణ్.

తను నారాయణ కూతురినని కిరణ్ కి చెబుతుంది మేరీ.

కిరణ్, కావ్యతో కలిసి పార్క్ కి వెళ్తాడు.


ఇక 'సంపత్ సినిమా కథలు’ ఆరవ భాగం చదవండి.


హాస్పిటల్ లో ఒక రోజు నారాయణ - భీమా, రంగల దగ్గరికి వచ్చి "సాయంత్రం గెస్ట్ హౌస్ లో మందుపార్టీ " అన్నాడు.


"ఎందుకు గుర్తులేదు, సోమవారం అన్నావు కదా.. ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటే ఈ రోజు వచ్చింది." అన్నాడు రంగ.


నారాయణ మాట్లాడుతూ "అబ్బా. రంగ గాడిది షార్ప్ బుర్ర." అంటూ "ఈ రోజు పెండ్లి కొడుకులా తయారు అయ్యావు. మెడలో గోల్డ్ చెయిన్, చేతులకు ఉంగరాలు.. " అన్నాడు.


"అదా.. ఉదయం ఒక ఫంక్షన్ ఉంటే పోయి అలాగే హాస్పిటల్ డ్యూటీకి వచ్చాను " అన్నాడు రంగ.


"ఓహో అలాగా, ఆరే రంగ.. భీమ.. నా దగ్గర డబ్బులు లేవు. ఒక 5 వేలు అప్పు వుంటే ఇవ్వండిరా, ఈ రోజు మందు పార్టీకి" అన్నాడు నారాయణ.


"రేపు నాకు ఇస్తానంటే ఇస్తా” అన్నాడు భీమా.


‘నీవిచ్చిన 5 వేలకు ఇంక 5 వందలు కలిపి రేపే పూవుల్లో పెట్టి ఇస్తా. అలా ఇస్తే అభ్యంతరం లేదు కదా " అన్నాడు నారాయణ.


భీమ ఆనందంతో వెంటనే జేబులోంచి 5 వేలు తీసి ఇచ్చాడు.


"అవును నారాయణా.. ఆ రోజు నుంచి పిచ్చి అవతారం కనపడ్డం లేదేమిటి?" అన్నాడు భీమా.


వీళ్ళు ఆ పిచ్చి అవతారం గురించీ అడుగుతారని ముందే తెలుసు కాబట్టి వెనకాల కాంపౌండ్ గేట్ చెట్టు దగ్గర ఉన్న రూంలోకి తెచ్చిపెట్టాడు నారాయణ.

"అరే.. నేను ఇప్పుడే వెనుక ఉన్న మన కాంపౌండ్ గేట్ దగ్గర చూశానే " అంటూ

"ఒరే భీమ.. ఒక్కసారి చూసిరా , నేనేమ్మన్నా వేరే ఎవరినైనా చూసి అవతారం అనుకున్నానేమో" అన్నాడు నారాయణ.


భీమ అక్కడ కెళ్ళి చూసి వచ్చి "అవునురా రంగ.. ఆ పిచ్చి అవతారం అక్కడ ఉన్నాడు. మనం ఇక్కడ చూశాం. అక్కడ చూడలేదు. మకాం ఇక్కడ చెట్టు దగ్గర ఉన్న రూమ్ నుండి అక్కడ చెట్టు దగ్గర ఉన్న రూమ్కు షిఫ్ట్ అయ్యినట్టు ఉన్నాడు" అన్నాడు భీమ.


"సర్లే.. ఆ పిచ్చి అవతారం ఎక్కడ వుంటే మనకు ఎందుకు? నాకైతే ఆ నరసింహ పీడ విరగడ అయ్యింది. అంతా మీ వల్లనే " అన్నాడు నారాయణ.


"అవును.. అవును. అందుకే ఈ రోజు మందు పార్టీ" అన్నాడు భీమ.


"అయితే తొందరగా పార్టీ చేసుకుందాం. ఇప్పుడే నేను వెళ్లి మా గెస్ట్ హౌస్ లో అన్నీ రెడీ చేస్తా. మీరు ఇంటికి పోకుండా డైరెక్ట్ గెస్ట్ హౌస్ కి వచ్చేయండి" అంటూ నారాయణ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.


"ఆరే భీమ.. రేపు ఆ నరసింహ వచ్చి హంగామా చేస్తాడని తెలియదు పిచ్చి నారాయణకి " అన్నాడు రంగ.

***

గెస్ట్ హౌస్..

రంగ, భీమ వచ్చారు.

అంతకు ముందే వెళ్లిన నారాయణ మందుపార్టీ కి కావలసినవి రెడీ చేసి ఉంచాడు.

మందు పార్టీ స్టార్ట్ అయ్యింది.

రెండు రౌండ్ లు అయ్యాక వాచ్ మెన్ వచ్చి "అయ్యా! నాకు బయట పని ఉంది. మీ పార్టీ అయ్యేంత లోపల వస్తా" అన్నాడు.

నారాయణ "సరే, వెళ్ళి తొందరగా రా " అన్నాడు.

వాచ్ మెన్ అలా వెళ్లిన కొద్దిసేపటికి కిరణ్ నల్లటి దుప్పటి కప్పుకుని ఒక డమ్మీ పిస్తోలు పట్టుకొని వచ్చి. పిస్తోలు చూపిస్తూ "మర్యాద గా మీ దగ్గర ఉన్న గోల్డ్, డబ్బు ఇవ్వండి. లేకుంటే కాల్చి చంపుతా" అనగానే ముగ్గురూ భయపడి తమ దగ్గర ఉన్న గోల్డ్, డబ్బు ఇచ్చారు.


తర్వాత వాచ్ మెన్ వచ్చి "ఏమైంది సార్ " అన్నాడు.


"ఇంకేముంది.. దొంగ ఒకడు వచ్చి మా దగ్గర ఉన్న మొత్తం దోచుకొని వెళ్ళాడు" ఏడుస్తూ అన్నాడు నారాయణ.


"మా అత్త గారు పెట్టిన బంగారం అంతా పోయింది. ఇంటికి పోయి వచ్చి ఉంటే జేబులో ఉండే కాస్త డబ్బు పోయేది. ఇప్పుడు ఇంట్లో ఏమి చెప్పాలో దేవుడా దేవుడా" అంటూ రంగ ఒకటే గోల.

"ఏడ్చి ఏమీ లాభం . పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం" అన్నాడు నారాయణ.


"అంత కన్న చేసేది ఏమీ ఉంది పదా పోదాం" అన్నాడు భీమ.

సుజాత, హాస్పటల్ నుంచి కారులో ఇంటికి వచ్చింది.

వచ్చిన వెంటనే కోపంగా"కావ్య.. కావ్య.." అంటూ గట్టిగా కేక వేసింది.


"అమ్మా" అంటూ రూంలో నుంచి సుజాత దగ్గరకి వచ్చి నిల్చుంది కావ్య.

కావ్యను చూసి "ఏమే.. నిన్న సుధ మేడం ఇంటికి సంగీతం క్లాస్ కు వెళ్ళ లేదట" అని అడిగింది.

"అమ్మా.. అది..” అంటూ కాస్త ఆగింది.


"చెప్పు. ఎందుకు వెళ్లలేదో.., మరి ఆ టైమ్ కి ఇంట్లో కూడ లేవు "

"అమ్మా! మేరీ అమ్మ కు బాగా లేకుంటే అక్కడే ఉండి పోయాను. అందుకే సంగీతం క్లాస్ కి వెళ్లలేదు" అని టక్కున చెప్పింది.

"మరి ఈ మాట నాకెందుకు చెప్ప లేదు"

అంతలో శివమ్మ అక్కడికి వచ్చి "నాకు చెప్పిందమ్మా! నీకు చెప్పడం మరచి పోయాను" అంది.


"అవునా , సరే కాఫీ తీసుకోని రా" అని శివమ్మ కు చెప్పి తన రూంలో కి వెళ్ళింది సుజాత .

సుజాత రూంలో వెళ్ళగానే "భలే కవర్ చేసావే ముసలి" అంది కావ్య.

"నిజంగానే మేరీ ఇంటికి వెళ్ళావా, లేక.."

"అవును నిజంగా వెళ్ళాను" బుంగ మూతి తిప్పుతూ అంది కావ్య.

"సరే మీ అమ్మకు కాఫీ ఇవ్వాలి" అంటూ వంటింట్లోకి వెళ్ళింది శివమ్మ..

***

కాలేజీ నుంచి బయటకు వచ్చారు కావ్య, మేరీ.

బయట కావ్య కోసం ఎదురుచూస్తూ ఉన్న కిరణ్ ను చూసి “మేరీ.. బై. నేను వెళతాను” అని సైకిల్ మీద పోతూ కిరణ్ ని చూసి నవ్వుతూ చెయ్యి ఊపుకుంటూ వెళ్ళిపోయింది.


కావ్య, కిరణ్ తన దగ్గరకు రాగానే ఇద్దరు ఎవరి సైకిల్ మీద వారు కలిసి పోతూ పార్క్ దగ్గర ఆగి సైకిళ్లు పక్కనబెట్టి అక్కడ ఉన్న బెంచ్ మీద కూర్చున్నారు.

"రేపటి నుంచి కాలేజ్ కు సెలవులు. మనం ఎలా కలుసుకోవాలో"

"నేను మేరి కలసి చదవుకుంటాం అని చెప్పి బయటకు రా"

"అబ్బో ఐడియా బాగుందే. పద.. ఇప్పటికే లేట్ అయ్యింది. మా అమ్మకు తెలిస్తే బాగుండదు"


"అవును.. మీ అమ్మ ఎవ్వరిని ఇంటికి రానివ్వదు, ఎందుకు?"

"ఏమో తెలియదు,. మా అమ్మ అంటే భయం. ఆమె మనసు ఇప్పటి వరకు అర్థం కాలేదు. అదొక టైప్. నేనంటే చాలా ఇష్టం, ప్రేమ. నా మీద నమ్మకం ఎక్కువ. అందుకే మన ప్రేమ ఆమె కు ఎలా చెప్పాలో.."


"మీ అమ్మ ను మెప్పించే ప్లాన్ దొరకకపోతుందా.. అంతవరకు ఎదురు చూద్దాం" అన్నాడు కిరణ్.

***

ప్రకృతి మానసిక ఆరోగ్య చికిత్సలయం

డాక్టర్ సుజాత తన రూములో కూర్చొని పేషెంట్ డిశ్చార్జ్ రిపోర్ట్ చూస్తోంది.

అంతలొ నారాయణ వచ్చి "మేడం.. రూమ్ నంబర్ 4 లో ఉన్న పేషెంట్ డిశ్చార్జ్ రిపోర్ట్ చూసి సైన్ చేసి ఇస్తే ఆ పెసెంట్ ను డిశ్చార్జ్ చేస్తాము" అన్నాడు.

సరే అంటూ అదే రిపోర్ట్ చూస్తున్న సుజాత సైన్ చేసి నారాయణ కు ఇస్తు "నిన్న హాస్పటల్ రాలేదు.." అని అడిగింది.

"అదా మేడం.. నేను, మా ఆవిడ మా చుట్టాల ఫంక్షన్ ఉంటే పోయాం"


"మీ ఆవిడకు కాలుకు దెబ్బ తగిలితే ఎలా ఫంక్షన్ పోయారు"


"అదేమీ మేడం.. అది దుక్కలా ఉంటే.. మరి పొద్దున వాకింగ్ కూడ చేసింది. మీకు ఎవరు చెప్పారు?"


"అవునా.. ఏమోలే.. నాకు మీ ఆవిడకు కాలు విరిగినట్టు కల వచ్చింది ఏమో.. అది కల కాదు నిజమేమో అని అడిగినట్లు ఉన్నా, సరే నీవెళ్లు" అంది సుజాత.


"సరే మేడం" అంటూ నారాయణ అలా వెళ్ళగానే

కావ్య అబద్ధం చెప్పిందని అర్థం అయ్యింది. అందుకే కావ్య చెప్పింది అని చెప్పకుండా కవర్ చేసింది.

‘కావ్య ఎందుకు అబద్ధం చెప్పింది? ఇదేదో దారి తప్పుతోంది. ఏమీ తెలియనట్టు ఉండి ఏమీ జరుగుతుందో తెలుసుకోవాలి’ అని మనసులో అనుకోంది సుజాత.



బయట వచ్చిన నారాయణ ‘ఆరే.. మేడం కల కని, అది నిజమని ఎలా అనుకోంది? మానసిక రోగులను చూసి ఈమె మెదడు మానసికంగా దారి తప్పిందేమో..’ మనసులో నవ్వుకుంటూ అనుకున్నాడు.

***

కావ్య సైకిల్ మీద ఇంటికి వచ్చింది.

కూని రాగాలు తీస్తూ వస్తున్న కావ్యను చూసి సుజాత "ఏం చాలా హుషారుగా ఉన్నావు." అంది.

“ఎమీ లేదు. రేపటినుంచి కాలేజ్కి సెలవులు కదా..”

"ఇంతకు ముందు కాలేజ్ లేకుంటే ఇంట్లో బోర్ కొడుతుంది అనే దానివి."

"ఇప్పుడు కాలేజ్ ఉంటే బోరు కొడుతుంది అమ్మ"

"అవునా. రేపటినుంచి ఇల్లే బాగుంటుంది అన్న మాట"

"అవుననుకో.. అయినా ఎగ్జామ్స్ దగ్గరా పడుతున్నాయి కదా! మేరీ ఇంటికి వెళ్లి చదువుకుంటా"


"మేరీనే మన ఇంటికి రమ్మను"


"అమ్మా! మన ఇంటికి మేరీ ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ అని రోజూ మన ఇంటికి రమ్మంటే ఏం బాగుంటుంది”


"అవునూ నిజమే.. ఎలాగూ వాళ్ల అమ్మకు కాలు కూడ విరిగింది. నీవు వాళ్ల ఇంటికీ పోవడమే బెటర్" ఏమీ తెలియని దానిలా అంది సుజాత

"అవునమ్మా!"

***

కిరణ్ కావ్యను సైకిల్ మీద ఎక్కించుకొని పోతున్నాడు.

ఊహించని షాక్..

వీళ్ల ఎదురుగా సుజాత కారు వచ్చి నిలబడింది.

అమ్మ ను చూసి బిత్తర పోయింది కావ్య.

వెంటనే సుజాత కారు లో నుంచి దిగి పట్టరాని కోపంతో

కావ్య చెంప మీద ఒక్కటి ఇచ్చి చేయి పట్టుకొని తీసుకెళ్ళి కారు లో కూర్చో బెట్టింది.

మధ్యలో కిరణ్ "ఆంటీ.. ఆంటీ.. నా మాట వినండి" అంటున్నా వినకుండా కారు డ్రైవ్ చేసుకుంటూ పోతూ కిరణ్ వంక చూసి

"ఇంకోసారి కావ్య జోలికి వస్తె ఖబ్బదార్" అంటూ హెచ్చరించి పోయింది.

కారు లో ఇంటికి వస్తూనే అదే కోపంగా కావ్య చెయ్యి పట్టుకొని వెళ్లి రూములో వేసి బయట గొళ్ళెం పెట్టీ

"శివమ్మ... శివమ్మ" అంటూ గట్టిగా కేక వేసింది.

సుజాత కేక వినగానే వంటింట్లో గిన్నెలు తోముతున్న శివమ్మ హలులోకి వచ్చి "ఏమ్మా.. అంత కోపంగా వున్నారు ఏమైంది" అంది.

"నేను చెప్పింది విను. అంతే"

"కావ్య ఎటువంటి వత్తిడి తెచ్చినా ఆ రూములో నుంచి బయటకు రానివ్వద్దు. ఆ కిటికలో నుండే దానికి కావలసినవి అందివ్వు"

"సరే అమ్మ"


సుజాత అలా వెళ్ళగానే

కావ్య రూము కిటికీ దగ్గరకు వెళ్ళి "ఏమీ జరగింది" అని అడిగింది.

కావ్య ఏడ్చుకుంటూ

"నేను నన్ను ఇష్టపడే ఒక అబ్బాయిని ప్రేమించాను" అంది.

"అమ్మకు సమయం చూసి నా ప్రేమ ను చెబుదామనుకున్నాను. ఇంతలో ఆమె మా ఇద్దరిని చూసి నా మాట వినకుండా ఈ రూములో వేసి బయట గొళ్ళెం పెట్టింది. నా ప్రేమని అర్థం చేసుకోకుండా నన్ను నిర్బంధిస్తే ఈ రూములో ఉన్న ఫ్యాన్ కి ఉరి వేసుకొనీ చస్తా"

"అమ్మ నా బంగారు తల్లీ అంత పని చేయకు, నేను బ్రతికేది నీ కోసం, కాస్త ఓపిక పట్టు నేను మీ అమ్మను ఒప్పిస్తాను"


"సరే, నీ మాట విని నా ప్రేమ అంగీకరిస్తే సరే లేకుంటే అదిగో ఫ్యాన్ "


"అబ్బా భయపెట్టకు. నేను మాట్లాడుతా అన్నాగా" అంటూ “ముందు కాఫీ తెస్తా. తాగి రిలాక్స్ అవ్వు” అంటూ కాఫీ తేవడానికి వంటింట్లో కి వెళ్ళింది శివమ్మ.

సుజాత తన రూమ్ లో ఒంటరిగా ఆలోచిస్తూ కుర్చీలో కూర్చుంది . మళ్ళీ ఎదో ఆలోచన వచ్చి వెంటనే లింగస్వామికి కాల్ చేసింది.

“హలో.. లింగస్వామి గారు..కిరణ్కు ఇప్పుడు బాగా ఉంది.

ఇంకా ఎంక్వయిరీ ఉంది అని ఇక్కడ ఎన్ని రోజులు.. మీకు వీలు కాదంటే చెప్పండి. నేనే వాళ్ల ఇంటికి పంపించే ఏర్పాట్లు చేస్తాను".


" అమ్మా సుజాతమ్మా.. ,తొందరపడకు. సెల్లులో రికార్డ్ చేసిన వీడియో గురించి తెలియాలి. పోలీసులు దాని కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకూ మీకు ఏమైనా ఆ వీడియో రికార్డు చేసిన సెల్ ఎక్కడ పడేసుకున్నడో గుర్తు తెచ్చుకుని చెప్పాడా"

"అన్నీ గుర్తుకు ఉన్నాయి. అదొక్కటే గుర్తు లేదు.

అయినా ఇక్కడ ఉండే కన్న అక్కడ ఉంటెనే గుర్తుకు రావచ్చు"


”సరే, రెండు రోజులు ఓపిక పట్టు. నేనే వచ్చి తీసుకెళ్లుతా."


"మీరు రెండు రోజులో తీసుకెళ్లే కుంటే నేనే పంపుతా" అంటూ కాల్ కట్ చేసింది.


తర్వాత మళ్లీ ఆలోచనలో పడి పోయింది. తనకు ఏ అనందం వచ్చినా, కష్టం వచ్చినా డాక్టర్ సుధ తో పంచుకుంటుంది. ఎందుకంటే తాను రాజరావు చేత ఎలా మోసపోయింది.. మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోలేదో.. సుధకే తెలుసు. సుధ బాబా భక్తురాలు. అమే ఓదార్పు ఇస్తుంది . కావ్యకు మీ నాన్న చిన్నప్పుడే చనిపోయడనీ చెప్పింది.. సుజాత ఇంక ఎప్పుడో తాను మెడిసిన్లో తన బెస్ట్ ఫ్రెండ్ తో దిగిన ఫోటో చూపించి ఇతడే మీ నాన్న అని చెప్పింది. కావ్య కిరణ్ తో ప్రేమలో పడటం చూసి ఏమీ తోచక సుధకు కాల్ చేసి కావ్య, కిరణ్ గురించి చెప్పింది.


"ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. అసలు విషయము కావ్యకు చెప్పు. తన దృష్టి అంతా వచ్చే ఎగ్జామ్స్ మీద పెట్టమను. ఎలాగూ ఇవి ఫైనల్ ఎగ్జామ్స్ కదా! ఎలాగో పై చదువులకు అమెరికా పంపిస్తాం. తర్వాత కిరణ్ కి నిజం తెలుస్తుంది. ఇంక కిరణ్ ఇక్కడ ఉండే వాడు కాదు. ఇదొక పీడ కల అని కొన్ని రోజులకు మరచిపోతారు"


"చాలా థాంక్స్ సుధ, నీతో ఏది వచ్చినా షేర్ చేసుకొనేది ఎందుకంటె ఏ ప్రాబ్లెమ్ వచ్చినా వెంటనే మంచి ఐడియా ఇస్తావు. ఇప్పుడు నాకు వచ్చిన సమస్యకు పరిష్కారం చూపావు."


"నా నుంచి నీవు కూడ ఆ సాయిబాబా భక్తురాలు అయ్యావు కదా. ఇంక ఏమీ ఆలోచింకుండా మన ప్రయత్నం మనం చేద్దాం. తర్వాత ఆ బాబానే దారి చూపిస్తాడు."

సుధతో మాట్లాడిన తర్వాత

"ఓం సాయి రామ్" అని మనసులో అనుకుంది సుజాత.

ఇంకా వుంది...

S. సంపత్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Podcast Link

https://spotifyanchor-web.app.link/e/3aOKab9klwb

Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : S. సంపత్ కుమార్

చదువు M.A. Archeology

కథలు రాయడం, వివిధ పత్రికలలో సుమారు 20 , అలాగే తీసిన షార్ట్ ఫిల్మ్స్ 6లో ఒక షార్ట్ ఫిల్మ్ కు డైరెక్టర్ గా స్పెషల్ జ్యూరీ అవార్డు, రెండు షార్ట్ ఫిల్మ్స్ బెస్ట్ స్టోరీ అవార్డ్స్ వచ్చాయి.




9 views1 comment

1件のコメント


Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
2023年1月17日

Lingaswami Vemuganti • 3 days ago

Good writingGood narration

いいね!
bottom of page