'Sampath Cinema Kathalu - 9' New Telugu Web
Series Written By S. Sampath Kumar
రచన : S. సంపత్ కుమార్
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ఎపిసోడ్ లో
తను ఎలా ట్రాప్ చెయ్యబడ్డది గుర్తుకు చేసుకుంటాడు కిరణ్.
లింగస్వామి నమ్మక ద్రోహం చేస్తున్న విషయం కిరణ్ కి చెబుతాడు పోలీస్ ఆఫీసర్ విక్రమ్.
ఇక 'సంపత్ సినిమా కథలు’9 వ భాగం చదవండి.
తర్వాత తెలిసింది మీ లింగస్వామి అంకులే లారితో మన జీప్ ను డీ కొట్టించాడని. అప్పుడు నాకు దెబ్బలు బాగా తగిలినా ప్రాణాలకు ముప్పు రాలేదు. ఇంకా నీవు మత్తులోనే ఉన్నావు. నీకు చిన్న చిన్న దెబ్బలు తగిలినా బలమైన షాక్ తో కోమా లోకి వెళ్ళిపోయావు. అప్పుడు లింగస్వామి, అతని కొడుకు ఉదయ్ ఇంకా ఇద్దరు వచ్చి నీవు తీసిన వీడియో సెల్ కోసం ప్యాకెట్లు అన్ని వెతికారు. కాని సెల్ దొరకలేదు. నా పాకెట్స్ కూడ సెల్ కోసం వెతికారు. ఇంకా జీప్ దగ్గర వెతికారు. బాగా దెబ్బలు తగిలినా నేను వాళ్ళను గమనిస్తున్నా. అయిన నాకు నోరు ఎండిపోవడం వలన మాటలు రావడం లేదు. తర్వాత నిన్ను, నన్ను ఒక హాస్పటల్ చేర్చారు. నేను కొద్దిగా కోలుకొన్నాక లింగస్వామి వచ్చి "ఎలా ఉన్నారు సార్." అని అడిగాడు.
" మీరు కాల్ చేశాక నా వాళ్లతో వస్తే అప్పుడే మీకు ప్రమాదం జరిగింది. చుట్టు ప్రక్కల ఎవ్వరూ లేరు. అప్పుడు నేనే మిమ్మల్ని తెచ్చి హాస్పటల్ చేర్చి మీ డిపార్ట్మెంటు వాళ్లకి సమాచారం ఇచ్చాను" అన్నాడు.
‘అలాగా’ అని ‘థాంక్స్’ చెబుతూ, ‘మరి మా పాకెట్స్ ఎందుకు వెతికారు’ గా అడుగుదాం అనుకున్నా. మళ్ళీ ‘ఇప్పుడు వద్దు, నిదానంగా విషయలు కాస్త అర్థం అయ్యాక తెలుసుకుందాం’ అనుకున్నా.
ఇంతలో 'ఇంక కాస్త రెస్ట్ తీసుకోండి. మళ్ళీ వస్తా' అని చెప్పి లింగస్వామి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కొద్ది సేపు అయ్యాక కాస్త రిలాక్స్ అవుదామని బయటకు వచ్చా.
లింగస్వామి నన్ను చూసి 'మీ డిపార్ట్మెంటుతో మాట్లాడినాను.
కిరణ్ ను ఊటిలో ఉండే మా హాస్పటల్ కు తీసుకెళ్లుతానని చెప్పాను. వాళ్లు సరే అన్నారు.' అన్నాడు.
‘మరి రాజరావుకి కొడుకు ఆచూకీ దొరికిందని తెలుసా’ అన్నాను.
'కోమాలో ఉన్న కొడుకును చూసి వాళ్ల నాన్న రాజరావు తట్టుకోలేడు. అక్కడ కోమా నుంచి బయటకు వచ్చాక ఆయనకు చెబుదాం. అలాగె మీరు చేసే ఎంక్వరీకి కూడా ఏ ఆటంకం ఉండదు' అన్నాడు.
‘మా డిపార్ట్మెంటు పర్మిషన్ తోనే కదా ఆ హాస్పటల్ కు తీసుకెళ్ళుతున్నాడు’ అనుకొన్నా. తర్వాత తెలిసింది ఏమిటంటే నీవు కోమాలో నుంచి వస్తె వీడియో తీసిన సెల్ గురించి తెలుసుకోడానికి, అది తెలుసుకున్నాక నిన్ను ఖతం చేయడానికి, అలాగే నన్ను ఈ కేస్ ఎంక్వయిరీ చెయ్యకుండా తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళను తెచ్చుకుందాం అని కూడా అనుకొన్నాడు. కాని నన్ను స్పెషల్ గా అప్పాయింట్ చేసిందే ఈ కేస్ కోసం అని, ఎవ్వరు ఎంత వత్తిడి తెచ్చిన మార్చరని లింగస్వామికి తెలియదు.' అంటూ
“ఇంకోడి సెల్ నీ పాకెట్ లో పెట్టుకున్నావు కదా! అది నీవు తీసిన వీడియో సెల్ అని పగలు కొట్టారు కదా.. మళ్ళీ దేనికోసం పాకెట్స్ వెతికారు" అని కిరణ్ ని అడిగాడు.
"అదే అర్థం కావటం లేదు. నేను పగల గొట్టింది వీడియో తీసిన సెల్ కాదని తెలిసిందేమో " అన్నాడు కిరణ్.
"ఉండవచ్చు, లేకుంటే ఆ సెల్ గురించి నిన్ను పదే పదే అడగాల్సిన పని లేదు కదా. సరే..నేను వెళ్లి నీవు చెప్పిన చోట వెతికి ఆ సెల్ తెస్తాను" అన్నాడు విక్రమ్.
అంటూ "కిరణ్. ఇంక నీవు హాస్పిటల్ వెనుక రహస్యంగా ఏర్పాటు చేసుకున్న మత్తుమందుల స్థావర రహస్యాలు సేకరించి ఎప్పటికప్పుడు అందిస్తే, నేను దాని ప్రకారం ప్లాన్ వేస్తాను. ఆ ప్లాన్ ప్రకారం ఒక రోజు దాడి చేద్దాం. అంతవరకు మీ లింగస్వామి అంకుల్తో నమ్మకంతో నటించు."
"అలాగే సార్. బై బై "అంటూ అక్కడ నుండి సైకిల్ మీద వచ్చేశాడు కిరణ్,
“ఈ రోజు ఆ నారాయణ పని అయిపోయినట్టే” అంటూ నరసింహ తన అనుచరులతో వాళ్లు దాకొన్న రూమ్ దగ్గరికి వస్తున్నాడు . వాడు వచ్చేది కిటికీ లో నుండి చూసిన నారాయణ ‘అమ్మో.. వీడు రూములోకి వస్తున్నాడు. ఎలా..” అనుకున్నాడు.
ఇంతలో కిరణ్ అక్కడికి వచ్చి, నారాయణను, పిచ్చి అవతారం ను నరసింహకు అడ్డుగా ఒక దుప్పటి పెట్టీ, “మెల్లగ వాడికి కనపడకుండా ఆ రూమ్ లో నుండి కాంపౌండ్ వెనక గేట్ దగ్గర వెళ్ళండి” అని చెప్పాడు. నారాయణ ఏమీ ఆలోచించ కుండా కిరణ్ చెప్పినట్టు చేశాడు.
తర్వాత కిరణ్ కాంపౌండ్ వెనక గేట్ దగ్గర ఉన్న నారాయణ, పిచ్చి అవతారం దగ్గర కెళ్ళి ’ముందు నేను చెప్పినట్టు చెయ్యి’ అంటూ నారాయణ చెవిలో చెప్పాడు.
సరే అంటూ, “ఆరే అవతారం..పద” అంటూ అక్కడే ఒక చోట ఉన్న రూములో వాడిని ఉంచి కుర్చీలో కూర్చొ పెట్టీ అక్కడ ఉన్న తాడుతో చేతులు కాళ్ళు కట్టేసి నోట్లో గుడ్డ పెట్టీ బయటకు వచ్చి ఆ రూము డోర్ కు ఉన్న గొళ్ళెం పెట్టాడు. అవతారం ఎంత అరచినా నోట్లో గుడ్డ ఉండటం వలన అరుపు బయటకు వినిపించలేదు.
నారాయణ అక్కడ ఉన్న కిరణ్ దగ్గరకు వచ్చి
"నీవు చెప్పినట్లు చేశా" అన్నాడు.
"రేపు పిచ్చి అవతారం గాడిని ఇక్కడ నుండి షిఫ్ట్ చేసి ఇంకో దగ్గర.. అంటే మీ గెస్ట్ హౌస్ లో ఉంచుదాం. అంతవరకు వాడు చావకుండ తిండి ఏర్పాట్లు చూడు. తర్వాత కొన్ని రోజుల తరువాత వెండితెర మీద అసలు సినిమా చూపిస్తా” అన్నాడు కిరణ్.
"అలాగే బాబు." ఉల్లాసంగా అన్నాడు నారాయణ.
నరసింహ తన అనుచరులతో ఆ రూములోకి వచ్చి ఎంత వెతికినా నారాయణా, పిచ్చి అవతారం దొరకలేదు.
తర్వాత నారాయణ కిరణ్ తో
”కిరణ్ బాబు.. ఏమి జరుగుతుంది.. అంతా అయోమయంగా ఉంది." అన్నాడు.
"ఈ హాస్పటల్ లో మీకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి. ఈ హాస్పటల్ వెనుక ఒక బిల్డింగ్ ఉంది. అది ఎప్పుడైన చూసాావా"
"చూసాను. కాని ఎప్పుడు లోనికి వెళ్ళే అవసరం రాలేదు. అది ఒక గోడౌన్ .లింగస్వామికి తెలిసిన వాళ్లకి రెంట్ కి ఇచ్చాడని, వాళ్ళకు ఒక పార్మ కంపెనీ ఉందని, అందులో మందులు నిల్వ ఉంచుతరని తెలుసు."
"అయితే నీకు వివరంగా చెబుతా విను. లింగస్వామి నిజ స్వరూపం, ఇంకా హాస్పటల్ ముసుగులో ఈ వెనుక ఉన్న గోడౌన్ లో ఉంచిన మత్తు పదార్థాల నిల్వ. ఇక్కడి వాతావరణం, ఎప్పటికప్పుడు నిల్వ ఉన్న మత్తు పదార్థాలు వేరేచోటకి సప్లయ్ ఇక్కడనుండి నడుస్తుంది అని.. అసలు విషయము తనను ఎందుకు మత్తుకు గురి చేశారు, ఎందుకు ఇక్కడి తెచ్చారు అన్ని విషయాలు వివరంగా చెప్పి, ఇంకా ఆ నేపాల్ వాచ్మెన్, పిచ్చి అవతారం అంతా లింగస్వామి మనుషులే " అంటూ నారాయణకు చెప్పాడు కిరణ్.
"అమ్మ లింగస్వామి.. ఇక్కడ ఇన్ని కుట్రలు చేస్తున్నాడా. మీ నాన్న తో నమ్మకంగా ఉండి ఎన్ని అక్రమాలు చేస్తున్నాడు.. ఇవి సుజాతమ్మకు, నాకు తెలియవు. ఇక్కడ జరిగే భాగవతాలు. అయితే తర్వాత మనం చేయవలసిన పని?..”అన్నాడు నారాయణ.
"ముందు డాక్టర్ సుజాత ఆంటికి అసలు విషయము చెప్పాలి. మరి నీవు మాత్రం ఏమీ తెలియనివాడిలా ఉండి కథ ముగిసేంత వరకు ఆ పిచ్చి అవతారంను మనం మాయ చేసినట్లు కనపడకుండా ఆ రంగ భీమలకు కనపడేటట్లు చేయాలిి."
"తప్పకుండా కిరణ్ బాబు " అన్నాడు నారాయణ.
కిరణ్, నారాయణ ఇద్దరు సుజాత దగ్గరకు వెళ్లి లింగస్వామి పన్నిన పన్నాగం వివరించారు. ఆమె నమ్మలేక పోయింది.
కిరణ్ చెప్పే ప్లాన్ ప్రకారం లింగస్వామి కుట్రలు బట్ట బయలు చేయడానికి తన వంతు సహాకారాన్ని అందిస్తానంది సుజాత.
సుజాత దగ్గర నుండే తన తండ్రి రాజరావుకు కాల్ చేశాడు కిరణ్.
కిరణ్ గొంతు వినగానే "బాబు, ఎక్కడ ఉన్నావు, ఏమీ అయ్యిపోయావు" అంటూ అంతు లేని అనందంతో ఉక్కిరి బిక్కిరి ప్రశ్నలు వేసాడు రాజారావు.
"డాడీ.. నీ పక్కల ఎవ్వరూ లేరు కదా.. మెల్లగా మాట్లాడు"
"ఎవ్వరూ లేరు....”
“ముందు నేను చెప్పేది విను" అంటూ నమ్మకంగా ఉన్న లింగస్వామి పన్నిన పన్నాగం మొత్తం విడమరచి చెప్పాడు కిరణ్.
చాల ఆశ్చర్యానికి లోనయ్యాడు రాజరావు.
"ఇప్పుడు ఎక్కడ ఉన్నావు"
"ఎక్కడ ఉన్నానో ఇప్పుడు నీతో ఒకరు మాట్లాడుతారు విను"
అని సుజాతకు మొబైల్ ఇస్తుంటే ‘నేను మాట్లాడను’ అని సైగ చేసింది.
"ప్లీజ్ ఆంటీ.. " మెల్లగ రిక్వెస్ట్ చేశాడు కిరణ్.
ఇంక పక్కనే ఉన్న కావ్య కూడ "మాట్లాడు అమ్మ " అని రిక్వెస్ట్ చేసింది. ఇక్కడ రాజరావు లైన్ లో ఉండి
"హలో... హలో" అంటున్నాడు.
ఇద్దరు రిక్వెస్ట్ చేస్తే కాదనలేక మొబైల్ తీసుకోంది సుజాత
"హలో....బాగున్నారా"
"ఎవరు"
"అవునులే ... నన్ను పూర్తిగా మరచిపోయారు... ఇంక నా గొంతు ఏమీ గుర్తు పడతారు"
"సు.. సు.. సుజాత ." అనుమానం తో అడిగాడు
"అవును."
"ఔనా, చాలా ఆశ్చర్యంగా ఉంది ...కిరణ్ .. అక్కడ"
"మొత్తం కథ ఏమిటో కిరణ్ చెబుతాడు"
అంటూ కిరణ్ కి మొబైల్ ఇచ్చింది.
రాజరావు కి లింగస్వామి పన్నిన పన్నాగం మన వెనుక మనకు తెలియకుండా నడుపుతున్న భాగవతం మొత్తం చెప్పి. ఏమి తెలియనట్లు ఉండు అని చెప్పాడు. సరే అన్నాడు రాజరావు.
ఒక పక్క నమ్మకంగా ఉన్న లింగస్వామి ఇంత దారుణానికి ఒడిగట్టాడా....చెప్పలేనంత ఆశ్చర్యం, కోపం. ఇంకో పక్క కిరణ్ ఆచూకీ తెలివడం, మళ్ళీ సుజాత తనతో మాట్లాడటం ఇది పట్టరాని ఆనందం.
ఇంతలో లింగస్వామి వచ్చాడు.
అమ్మో..... కథ అంత తెలిశాక వచ్చాడు అనుకోని
లింగస్వామి చూడగానే ఏమీ తెలియని వాడిలా
"లింగ.. ఇంత పలుకుబడి ఉప్పయోగించినా ఇంకా కిరణ్ ఆచూకీ తెలియక పోవడం చాలా బాధగా ఉంది. ఇంక ఇక్కడ ఉండలేక పోతున్నాను. అలా మన ఊటి కెళ్ళితే కాస్త ప్రశాంతంగా ఉంటుందేమో" అన్నాడు రాజరావు.
రాజరావు ఎందుకు అలా అన్నాడో తెలియదు కాని వీడిని కూడ అక్కడ తీసుకోని పోతే నేను కూడా ఊటీలో ఉండి, అక్కడ పనులు అన్ని చక్క బెట్టుకోవచ్చు అనుకున్నాడు.
అలాగే..... ‘రాజరావు అక్కడికి పోయినా, హాస్పటల్ లో ఉండే కిరణ్ గురించి తెలుసుకొనే అవకాశం ఉండదు. ఎందుకంటే సుజాత హాస్పటల్ లో ఉంటుంది కదా.. అటువైపు వెళ్ళడు. వెళ్లినా పలకరించడు. ఇంక కోపంతో ఊగి పోయి అందరి ముందు అవమాన పరుస్తుందని తెలుసు .... ఆమె కోపం అలాంటిది. ఉంటే గెస్ట్ హౌసులో ఉండాలి’ అనుకొని
"సరే పోదాం. నాకు కూడా నాలుగు రోజులు అలా ఊటికి పొయి రెస్ట్ తీసుకోవాలని ఉంది" అన్నాడు.
"థాంక్స్ లింగ..... నన్ను అర్థం చేసుకొనే నమ్మక మైన ఫ్రెండ్ దొరికినందుకు." అన్నాడు రాజరావు.
రాజరావు అన్న మాటకు నవ్వుతూ
"రేపు సాయంత్రం రెడీగా ,వెళ్లుదాము " అన్నాడు.
తర్వాత బయటకు వచ్చి
"రెడీగా ఉండండి, ఊటి పోదాం. అక్కడే ఆ కిరణ్ సంగతి ఫైనల్ చేద్దాం. రాజరావు కూడ వస్తున్నాడు. నేను రాజరావును తీసుకోని రేపు బయలు దేరుతా. మీరు మాత్రం ఎల్లుండి రండి" అంటూ బావమరిది భాస్కర్, కొడుకు ఉదయ్ లకు కాల్ చేసి చెప్పాడు లింగస్వామి.
విక్రమ్ డ్రగ్స్ రాకెట్ ముఠా స్థావరనికి వెళ్ళాడు.
తాను రెడీ టూ ఎటాక్ ఆపరేషన్ చేశాక అది పోలీసుల అదుపులో ఉంది . కిరణ్ తీసిన వీడియో సెల్ అక్కడ ఒక చిన్న గుంతలో దాచాను అన్నాడు కదా.. అది తీసుకుని రావడానికి విక్రమే వెళ్ళాడు. మరి ఎవ్వరికీ అంటే తన డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడ ఆ వీడియో తీసిన సెల్ వివరాలు తెలియకూడదు అని.
విక్రమ్ ఆ డ్రగ్స్ రాకెట్ ముఠా స్థావరానికి జీపులో రాగానే అక్కడ కాపలా కాస్తున్న పోలీసులు అలర్ట్ అయ్యారు.
"ఇక్కడికి ఎవ్వరైనా వచ్చారా" అడిగాడు విక్రం.
కాపలా కాస్తున్న పోలీసులలో ఒకరు "ఎవ్వరూ రాలేదు సార్" అన్నాడు.
"అలాగా , సరే " అంటూ ఒక్కడే లోనికి వెళ్లి, కిరణ్ చెప్పిన చోట వెతికాడు . కాసేపుటికి కిరణ్ చెప్పిన చోట చూస్తే పగిలిన సెల్ ఒకటి కనిపించింది. అప్పుడు అర్థం అయ్యింది.. అది కిరణ్ చెప్పిన ప్రకారం కిరణ్ ను కాపలా ఉంచిన వాడి సెల్ అని. అలాగే అక్కడ వెతుకుతూ వుంటే ఒక ప్లాస్టిక్ డ్రమ్ము కనపడింది. అది జరిపి చూస్తే చిన్న గుంత కనపడింది. ఇంక చెయ్యి పెట్టీ గుంతలో ఉన్న దుమ్ము కాస్త తీసేసరికి కిరణ్ దాచిన వీడియో తీసిన సెల్ కనపడింది. కాని ఛార్జింగ్ లేదు . తర్వాత ఛార్జింగ్ పెట్టీ చూద్దామని ఆ సెల్ భద్రంగా జేబులో పెట్టుకొని బయటకి వచ్చాడు.
ఊటికి వచ్చారు లింగస్వామి , రాజరావు.
గెస్ట్ హౌసుకి వచ్చాక, “ఎన్నాళ్ళుకు వచ్చాను లింగ, మన గెస్ట్ హౌసుకు.. బాగనే మెయింటైన్స్ చేయిస్తున్నావు. చాలా నీట్ గా ఉంది." రాజరావు, గెస్ట్ హౌస్ చూస్తూ అన్నాడు.
"సరే, నీవు రెస్ట్ తీసుకో. నేను అలా మన హాస్పటల్ కు వెళ్లివస్తాను" అన్నాడు లింగస్వామి.
"మన హాస్పటల్ కు వెళ్ళి వస్తావా? అయితే లింగ.. సుజాతను చూడాలని వుంది."
"వస్తావా"
"వద్దులే.. అసలే నా మీద కోపంగా ఉంది. అక్కడికి వస్తె అందరి ముందు అవమానిస్తే తట్టుకోలేను."
లింగస్వామి నవ్వుతూ "రెండు రోజులు ఓపిక పట్టు సుజాతను చూపిస్తా" అన్నాడు.
"అవునా లింగ, నీవు, నేను ఊటికి పోదాం అన్నప్పుడే సరే అన్నావు. అంటే నన్ను, సుజాతను కలిపే ప్లాన్ ఎదో వేసుంటావు. నిజమైన స్నేహితుడివి నీవే లింగ” అన్నాడు రాజ రావు.
"సరే నేను వెళ్ళి వస్తా" అంటూ లింగస్వామి బయటకు వచ్చి కారు ఎక్కి హాస్పటల్ వైపు బయలు దేరాడు.
=====================================================
ఇంకా వుంది. . .
=====================================================
S. సంపత్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Podcast Link
Twitter Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : S. సంపత్ కుమార్
చదువు M.A. Archeology
కథలు రాయడం, వివిధ పత్రికలలో సుమారు 20 , అలాగే తీసిన షార్ట్ ఫిల్మ్స్ 6లో ఒక షార్ట్ ఫిల్మ్ కు డైరెక్టర్ గా స్పెషల్ జ్యూరీ అవార్డు, రెండు షార్ట్ ఫిల్మ్స్ బెస్ట్ స్టోరీ అవార్డ్స్ వచ్చాయి.
Yorumlar