'Sampath Cinema Kathalu - 5' New Telugu Web
Series Written By S. Sampath Kumar
రచన : S. సంపత్ కుమార్
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ఇక 'సంపత్ సినిమా కథలు’ ఐదవ భాగం చదవండి.
నర్సింహ తన అనుచరులతో నారాయణ, పిచ్చి అవతారం దాక్కొన్న రూం దగ్గరకి రావడం చూస్తూ అక్కడికి కిరణ్ వచ్చాడు.
నారాయణను, పిచ్చి అవతారాన్ని నరసింహకు కనపడకుండా అడ్డుగా ఒక దుప్పటి పెట్టి, వాళ్ళను నారాయణకు కనపడకుండా కాంపౌండ్ వెనక గేట్ దగ్గరకు వెళ్ళమన్నాడు. నారాయణ ఏమీ ఆలోచించకుండా కిరణ్ చెప్పినట్టు చేశాడు. తర్వాత కిరణ్ కాంపౌండ్ వెనక గేట్ దగ్గర ఉన్న నారాయణ, పిచ్చి అవతారం దగ్గర కెళ్ళి ముందు "నేను చెప్పినట్టు చెయ్యి" అంటూ నారాయణ చెవిలో ఏదో చెప్పాడు.
"సరే " అంటూ ‘ఆరే అవతారం.. పద.. ’ అంటూ అక్కడే ఒక చోట ఉన్న రూములో వాడిని ఉంచి కుర్చీలో కూర్చొపెట్టి, అక్కడ ఉన్న తాడుతో చేతులు కాళ్ళు కట్టేసి నోట్లో గుడ్డ పెట్టి బయటకు వచ్చి ఆ రూము డోర్కు ఉన్న గొళ్ళెం పెట్టాడు. తర్వాత అవతారం ఎంత అరచినా నోట్లో గుడ్డ ఉండటం వలన అరుపు బయటకు వినిపించలేదు.
నారాయణ అక్కడ ఉన్న కిరణ్ దగ్గరకు వచ్చి
" నీవు చెప్పినట్లు చేశా" అన్నాడు.
"రేపు పిచ్చి అవతారం గాడిని ఇక్కడ నుండి షిఫ్ట్ చేసి ఇంకో దగ్గర.. అంటే మీ గెస్ట్ హౌస్ లో ఉంచుదాం. అంతవరకు వాడు చావకుండ తిండి ఏర్పాట్లు చూడు. తర్వాత కొన్ని రోజుల తరువాత వెండితెర మీద అసలు సినిమా చూపిస్తా " అన్నాడు కిరణ్.
"అలాగే బాబు. " ఉల్లాసంగా అన్నాడు నారాయణ.
నరసింహ తన అనుచరులతో రూములోకి వచ్చి ఎంత వెతికినా నారాయణా, పిచ్చి అవతారం కనపడలేదు.
రూములో నుంచి బయటకు వచ్చిన నరసింహ, అతని అనుచరులు అక్కడే ఉన్న రంగ, భీమలను చూసి
"ఆ ఇద్దరు ఆ రూములో లేరు కదా" అన్నారు.
"ఈ రూంలో దాక్కొని వుంటాం అని చెప్పి మరి ఎక్కడకు పోయారబ్బ" అన్నాడు భీమ.
"పద,ఇంక వేరే రూమ్లలో దాకొన్నారేమో చూద్దాం'" అని రంగ అనగానే.. నరసింహ, అతని అనుచరులు, రంగ, భీమ.. అందరూ అక్కడ ఉన్న అన్ని రూములు వెతికారు. అయినా నారాయణ, అవతారం కనపడలేదు.
"ఎక్కడికి పోతాడు, ఎన్ని రోజులు తప్పించు కొంటాడు.. నీవు ప్రతి సోమవారం వస్తున్నావని తెలుసు. అందుకే నీవు వచ్చే టైమ్కి అవతారాన్ని తీసుకొని ఆ రూములో దాక్కొంటాం, అది నీతో చెప్పాద్దు’ అని మాకు చెప్పి మొత్తానికే మాకు తెలియకుండ ఈ కాంపౌండ్లో లేకుండా ఆ అవతారాన్ని తీసుకొని ఆ నారాయణ ఎలా మాయం అయ్యాడో తెలియడం లేదు. " అన్నాడు రంగ.
మళ్ళీ రంగ మాట్లాడుతూ "నరసింహ.. ఈ సారి మాత్రం ప్రతి సోమవారం కాకుండ మేము చెప్పిన రోజు రా. అప్పుడు నీవు సోమవారం వస్తావని ఆ రోజు కనపడకుండా ప్లాన్ వేసే నారాయణ, ఇంక నీవు రావని అనుకుంటాడు. తర్వాత మేము రమ్మని చెప్పిన రోజు వస్తావని ఊహించడు. అప్పుడు వాడి కథ చూడవచ్చు. " అన్నాడు.
"సరే రంగ.. నీవన్నట్టు వచ్చే సోమవారం కాకుండ, నీవు చెప్పిన రోజు వస్తాను, ఆ రోజు కూడ కనపడ లేదోో.. "
"అప్పుడు ఏమీ చేస్తావు" అన్నాడు భీమ.
"ఇంత వరకు ఆ నారాయణ ఇంటికి పోలేదు. ఇంక ఇంటి దగ్గరే నా 2 కోట్ల బాకీ వ్యవహారం తెల్చుకుంట" అని రంగ భీమలకు చెప్పి నరసింహ తన అనుచరులతో వెళ్ళిపోయాడు.
అతను వెళ్లిన తర్వాత నారాయణ అక్కడికి వచ్చాడు. నారాయణను చూడగానే రంగ భీమలు ఆశ్చర్య పోయారు. నారాయణ, “మీరు వేసిన ప్లాన్కు మళ్ళీ వాడు రాడు. చాలా థాంక్స్ రా మీ ఇద్దరికీ" అన్నాడు.
"నరసింహ వెళ్ళిపోయాక మీరు దాక్కున్న రూములో మేము వచ్చి చూస్తే కనపడలేదు” అన్నాడు రంగ.
"ఎందుకో మీరు చెప్పిన మాటలు నరసింహ నమ్మడు అనిపించింది. ఇక డవుట్ వచ్చి మిగతా రూములు అన్నీ వెతుకుతారని కాంపౌండ్ వెనుక గేట్ నుండి అవతారాన్ని తీసుకొని మాయం అయ్యాను. " అన్నాడు నారాయణ.
"అబ్బా భీమ.. నేను ముందే చెప్పాను కదా నారాయణ ఇలా తెలివి తేటలు ఉపోయోగించి ఉంటాడని" అన్నాడు రంగ.
"అవును అవును" అన్నాడు భీమ.
"సరే ఇంత హెల్ప్ చేసినందుకు మా గెస్ట్ హౌస్ లో మీకు మంచి పార్టీ. కాని పార్టీ ఇప్పుడు కాదు, వచ్చే సోమవారం. " అంటూ నారాయణ అక్కడ నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.
"ఏందిరా అంతా అయోమయంగా ఉంది" అన్నాడు భీమ.
"ఎందుకు అయోమయం. నరసింహకు వచ్చే సోమవారం కాకుండా మనం చెప్పిన రోజే ఆ నరసింహను రమ్మని చెప్పాం కదా. " అన్నాడు రంగ.
"ఏమో.. నారాయణకు మన మీద డౌటు వచ్చిందేమో అని అనుమానం కలుగుతోంది" అన్నాడు భీమ.
"నీవు అనవసరంగా అనుమానం పడొద్దు. ముందు నారాయణ మందు పార్టీ కాని. ఒక రోజు నరసింహను పిలిచి నారాయణను పట్టిస్తే ఇంక నారాయణ మీద మన పగ తీరుతుంది. తర్వాత ఎలాగో నర్సింహ డబ్బులు ఇస్తాడు. ఇంక మందు పార్టీలు రోజూ చేసుకుందాం. " అన్నాడు రంగ.
"వాడు ఇచ్చే డబ్బులు మందు పార్టీ కి ఎన్ని రోజులు వస్తాయి. " అన్నాడు భీమ.
"అయిపోయినప్పుడు మళ్ళీ ఆ నర్సింహ ఉన్నాడు. "
"వాడు మళ్ళీ మళ్ళీ డబ్బులు ఎందుకు ఇస్తాడు" అన్నాడు భీమ.
"దానికి ఇంకో ప్లాన్ ఉంది" అన్నాడు రంగ.
"ఏమో.. ఆ నారాయణను మనం ఎదో చేయాలనుకుంటే వాడే మనకు పిచ్చి పట్టిస్తాడేమో చూడు. " అన్నాడు భీమ.
"ఆరే.. నీ బుర్ర పాడు అయ్యినట్టు ఉంది. నేను చెప్పినట్టు చెయ్యి. " అన్నాడు రంగ.
"సరే " అని బుర్ర గోకున్నాడు భీమ.
ఒక రోజు కాలేజి నుండి కావ్య ఇంటికి పోయే దారిలో సైకిల్ మీద ఎదురు చూస్తున్నాడు కిరణ్.
కాసేపు తర్వాత కావ్య, మేరీ సైకిళ్ల మీద ఆదే దారిలో వస్తున్నారు. కాస్త దూరం నుండి కావ్య చూసి
"నా ప్రియుడు ఎదురు చూస్తున్నాడు" అంది.
"అవును. ఈ రోజు మూడవ రోజు" అంది మేరీ.
"ఇంక లాభం లేదు. కిరణ్ మీద జాలి కలుగుతుంది. నా ప్రేమకు గట్టి పునాది వేస్తా".
"పిచ్చిదానా.. ఇంకా ముదరాలి నీ ప్రేమ. రేపు ఆదివారం కదా! కాలేజ్ ఉండదు. మరి రేపు నిన్ను చూడకుండా ఉండలేకపోతే అప్పుడు నీ ప్రేమకు ఓకే చెప్పు. "
"అంతే అంటావా"
"అంతే"
అటు చూడకుండా సైకిళ్ల మీద స్పీడ్గా వెళ్లిపోదాం”
అంది మేరీ.
ఇద్దరు కిరణ్ను చూడకుండ స్పీడ్గా సైకిళ్ల మీద పోతుంటే వాళ్ల వెనుక కిరణ్ "కావ్య.. కావ్య.. "అని గట్టిగా పిలిచాడు.
వెనక్కి తిరిగి కిరణ్ వంక చూడకుండా నవ్వుకుంటూ సైకిళ్లు స్పీడుగా తొక్కుకుంటూ వెళ్ళిపోయారు కావ్య, మేరీ.
***
ఆదివారం.
ఈ రోజు కావ్యకు కాలేజ్ లేదు.
ఒకనాలుగు రోజుల నుండి రోజూ కావ్య తనతో మాట్లాడకున్నా, చూసే అవకాశం కాలేజ్ ఉండటం వలన జరిగేది. మరి ఈ రోజు ఆదివారం! ఎలా కావ్యను చూసేది.. అని కిరణ్ అవరణలో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే వెనక నుండి మేరీ వచ్చి, "ఏమి ఆలోచిస్తున్నావు? ఆ కావ్య గురించే కదా" అంది మేరీ.
"నీవేమి ఇక్కడ "
"నేను మా డాడీ నారాయణతో వచ్చాను.. ”
" వాట్.... నారాయణ మీ డాడ్.. ఏమి ఈ రోజు ఇలాంటి వింతలు జరగుతున్నాయి.. ”
అప్పుడు అక్కడికి నారాయణ, చేతిలో ఒక పేసెంట్ మెడికల్ రిపోర్ట్ పట్టుకొని వచ్చాడు.
"ఏదో సుజాత అమ్మ ఒక పేషెంట్ సంబందించిన ఫైల్ తెమ్మని కాల్ చేసింది. అందుకు వచ్చాను. అలాగే మేరీకి దారిలో పని ఉంది. నాతో పాటు వచ్చింది. " అన్నాడు నారాయణ.
"ఔనా, మేరీ మీ కూతురా "
"అవును. మేరీ ఇంతకు ముందే తెలుసా"
"డాడీ.. అది నేను తర్వాత చెబుతాలే "
"నీ పేరు నారాయణా, మీ అమ్మాయి పేరు మేరీ అయితే.. నారాయణ అంకుల్.. నీ నుదుట నామం ఉంది. అంతా కన్ ఫ్యూజ్ గా ఉంది" అన్నాడు కిరణ్.
"నీ కన్ఫ్యూజ్ పొగొడతా ఉండు" అంటూ
"నేను హిందువు. మా ఆవిడ క్రిస్టియన్. నాకు ఇద్దరు పిల్లలు. ఒకరు ఈ మేరీ అనే అమ్మాయి. ఈ మేరీ తర్వాత బాబు.. వాడి పేరు శ్రీరామ్. హిందు సంప్రదాయం ప్రకారం నేను పూజలు చేస్తా. అలాగే అన్ని పండుగలు చేస్తాం. మా ఆవిడ క్రిస్టియన్ అయినా మా సంప్రదాయలు పాటిస్తుంది, గౌరవిస్తుంది. ఇంక నేను కూడా మా ఆవిడా పిల్లలతో చర్చికి వెళతాను. క్రిస్మస్ చాలా గ్రాండ్ గా చేస్తాము".
"సూపర్ అంకుల్, ఎంతో థ్రిల్ గా ఉంది మీ ఫ్యామిలీ కథ,"
"ఇంకా థ్రిల్ చెప్పనా.. మా మేరీ ఓకే అంటే నాకు ఉన్న బెస్ట్ ముస్లిం ఫ్రెండ్ కొడుకు మేరీని ఇష్టడుతున్నాడు. ఆ ముస్లిం అబ్బాయితో మా మేరీ పెండ్లి అయితే ఇంక ముస్లిం సంప్రదాయం కూడ మా ఇంట్లో ఎంట్రీ అవుతుంది.
"అబ్బ అబ్బ.. చాలా సూపర్..... ఒకే ఇంట్లో సర్వమత సమ్మేళనం. ఒకరి మతాలను ఒకరు గౌరవిస్తూ ఉండే ఈ భారత దేశం ఎంతో గొప్పది. ” అన్నాడు కిరణ్.
"సరే.. మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి. నేను మూడవ నంబరు రూములో ఉన్న పేషెంట్ దగ్గరికి వెళ్ళి వస్తా. " అంటూ నారాయణ వెళ్ళాడు.
ఇంతలో కిరణ్ మేరీ వంక చూస్తూ
"అంత కరెక్ట్ గా కావ్య గురుంచి ఆలోచిస్తున్నా అని ఎలా చెప్పావు. " అన్నాడు.
"ఈ రోజు ఆదివారం కదా, ఎలా కావ్యను కలవాలని ఆలోచిస్తున్నావు అని గెస్ చేశా. అది నిజమని తెలిసింది. "
"మరి ఇద్దరం సుజాత ఆంటీ ఇంటికి వెళ్ళుదామా" అన్నాడు కిరణ్.
"బాబు. సుజాతమ్మ ఇంటికి ఎవ్వరిని రానివ్వదు.
నేనే ఎమర్జెన్సీ ఉంటే పోతాను. ఇంక మా డాడీ కూడ అంతే. ఈ రోజు పేషెంట్ రిపోర్ట్ ఫైల్ చాలా అవసరం అంది కాబట్టీ హాస్పటల్ కు వచ్చాడు".
"అలాగా, అయితే కావ్యను చూసే అవకాశం లేదు అన్నమాట, మరి ఎలా. "
"ఈ రోజు ఆదివారం అయినా కావ్య ఇప్పుడు సంగీతం నేర్చుకోడానికి సుధ మేడం ఇంటికి వెళుతుంది "
"అవునా.. అయితే పద. సుధ మేడం ఇల్లు చూపించు"
"అయినా కావ్యను చూస్తే ఏమి. ఆమె మనసులో నీవు ఉండాలి కదా"
"ఆదే అర్థం కావటం లేదు మేరీ. నా మనసు మాత్రం ఎక్కడో ఒక మూల నన్ను ప్రేమిస్తుందనే చెబుతుంది. కాని నాలుగు రోజులుగా కాలేజ్ కి పోయేటప్పుడు నేను వెంట పడుతున్నా నన్ను చూడనట్టు నటిస్తుంది"
"నేను ఒక ప్లాన్ చెబుతా"
"చెప్పు.. చెప్పు మేరీ "ఆత్రుతగా అడిగాడు కిరణ్.
"నేను కూడా సంగీతం నేర్చుకోడనికి సుధ మేడం ఇంటికి వెళుతాను. నేను అక్కడ పోయే టైమ్ కు నీ దగ్గరకు వస్తా. నీవు నన్ను సైకిల్ ముందు కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళు.
అప్పుడు మన ఇద్దరిని చూసి షాక్ తింటుంది. అప్పుడు దాని ప్రేమ చచ్చినట్టు బయటకు వస్తుంది. "
"అబ్బా సూపర్ ప్లాన్, థాంక్స్ మేరీ. "
సైకిల్ ముందు రాడ్ మీద మేరీనీ కూర్చోబెట్టుకొని కిరణ్ పోతున్నాడు.
కావ్య సైకిల్ మీద ఎదురు వచ్చింది.
కిరణ్ మేరినీ సైకిల్ మీద తీసుకెళ్లుతున్నాడు.
నిజంగా ఆ సీన్ చూసి షాక్ అయ్యింది కావ్య.
అయినా కిరణ్ కావ్యను చూసిన చూడనట్టు పోతున్నాడు.
కోపంగా తన సైకిల్ తిప్పి వెనకాలే వెళ్లి సైకిల్ బెల్ కొట్టినా కిరణ్ వెనక్కి తిరిగి చూడకుండా పోతూనే ఉన్నాడు.
కావ్యకు ఇక పట్టుదల పెరిగింది. వెంటనే స్పీడ్గా వెళ్ళి తన సైకిల్ అడ్డం పెట్టీ మేరీ జుట్టు పట్టుకొని,
"ఒసే మేరీ! ఇంకా నా ప్రేమ ముదరాలి అని నీ ప్రేమతో నా ప్రేమని ముంచుతున్నావా"
"అమ్మ తల్లీ ! నీ ప్రేమ అర్థం కాక నిన్ను చూడక ఉండలేను అంటే నీవు ఎక్కడ ఉంటావో అని చెప్పి పట్టుకొని వస్తే నా జుట్టు పట్టుకుని హంగామా చేస్తావా.. "
"మరి నన్ను చూశాక సైకిల్ ఆపకుండా ఎందుకు పోతున్నారు"
"అది నీ ప్రియుడినే అడుగు" అంటూ కావ్య సైకిల్ మేరీ తీసుకొని
"నీ ప్రేమ బాగ ముదిరి పండు అయ్యి రాలేంత వరకు ఉండి, తర్వాత మా ఇంటికి వచ్చి నీ సైకిల్ తీసుకెళ్ళు " అని మేరీ
బై బై అంటూ కావ్య సైకిల్ ఎక్కి తొక్కు కుంటు వెళ్ళిపోయింది.
మేరీకి కావ్య "బై బై" చెప్పి, కిరణ్ సైకిల్ ముందు ఎక్కి కూర్చొంది.
కిరణ్ ఆనందంగా కావ్యను సైకిల్ మీద హుషారుగా పార్క్ వద్దకు తీసుకెళ్ళాడు.
ఇంకా వుంది...
S. సంపత్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Podcast Link
Twitter Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : S. సంపత్ కుమార్
చదువు M.A. Archeology
కథలు రాయడం, వివిధ పత్రికలలో సుమారు 20 , అలాగే తీసిన షార్ట్ ఫిల్మ్స్ 6లో ఒక షార్ట్ ఫిల్మ్ కు డైరెక్టర్ గా స్పెషల్ జ్యూరీ అవార్డు, రెండు షార్ట్ ఫిల్మ్స్ బెస్ట్ స్టోరీ అవార్డ్స్ వచ్చాయి.
Comments