top of page
Writer's pictureBVD Prasada Rao

సంపుటి మురిసింది - ఎపిసోడ్ 3



'Samputi Murisindi Episode 3' - New Telugu Web Series Written By BVD Prasada Rao

Published In manatelugukathalu.com On 23/12/2023

'సంపుటి మురిసింది ఎపిసోడ్ 3' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

సంచిక, ప్రమథ ల కూతురు సంపుటి. తన వెంట పడుతున్న శ్రీహరితో ధైర్యంగా 'పద, పెళ్లి చేసుకుందా’మంటుంది.

 

అబ్బాయిలతో ఆలా మాట్లాడకూడదని మందలిస్తుంది తల్లి సంచిక. తన చిన్ననాటి స్నేహితుడు శ్రీకర్ తో సంపుటి విషయం ఫోన్ లో మాట్లాడుతుంది.


శ్రీకర్, వాగ్దేవిల కొడుకు రాఘవ. అతను కూడా తనను ప్రేమించానని చెప్పిన కావ్యతో ముందు చదువు మీద దృష్టి పెట్టమంటాడు.


పీజీలో  రాఘవ, సంపుటిలు క్లాస్ మేట్స్ అవుతారు. రెండు కుటుంబాల వాళ్ళు ఒక చోట కలుస్తారు.



ఇక సంపుటి మురిసింది ఎపిసోడ్ 3  చదవండి..



ఆ వెంటనే..

"అవునవును. మా పిజిలు పూర్తి అయ్యాయి. తదుపరి మాకై మీ యోచన ఏమిటో తెలుసు కోవాలనుకుంటున్నాం." అన్నాడు రాఘవ. 


అర నిముషం తర్వాత..

"మీకంటూ ఏమైనా యోచన ఉందా." అడిగింది సంచిక.. సంపుటి, రాఘవలను.


"య. అది ముందు మీరు తేల్చండి." అనేసింది వాగ్దేవి.


సంపుటి, రాఘవ.. మొహాలు చూసుకున్నారు.

ప్రమథ, శ్రీకర్ ఇంకా ఏమీ మాట్లాడడం లేదు.


"మా ఇద్దరం కెమిస్ట్రీ సబ్జెక్ట్ లో గట్టి గ్రిప్పింగ్ కోరుకున్నాం. ఆ పట్టును పొందాం. సో హేపీ." చెప్పాడు రాఘవ.


"యయ." అనేసింది సంపుటి.


"సో.. విత్ ద సేమ్ గ్రిప్ యు గాట్ ఆన్ థట్ సబ్జెక్ట్ యు టు కెన్ ఫైన్డ్ ఎ న్యూ థీయరీ ఆర్ ఫార్ములా." చొరవగా అన్నాడు శ్రీకర్.


సంపుటి, రాఘవ మళ్లీ మొహాలు చూసుకున్నారు.

సంచిక, వాగ్దేవి ఏమీ అనలేదు. కానీ ప్రమథ మాత్రం 'కదా' అన్నట్టు తలాడించాడు.


"మాకు టీచింగ్ అంటే ఇష్టం." ఇంచుమించు కోరస్ లా సంపుటి, రాఘవ చెప్పారు.


"ఫైన్. దెన్.. పర్థర్ ఓపినియన్స్ ఎందుకు." టక్కున కలగచేసుకున్నాడు శ్రీకర్.


అదే అదునుగా.. "అవును. టీచింగ్ కై లెక్చరర్స్ గా వెళ్ల వచ్చు. మీకు ఆ వర్త్ ఉందిగా." అనేసాడు ప్రమథ.


అప్పుడే.. "ద మోటివ్ అఫ్ బోత్ ఆఫ్ అజ్ ఈజ్.." చెప్తూ ఆపాడు రాఘవ. అప్పుడు అతడి చూపు సంపుటి వైపున ఉంది.

సంపుటి కలగచేసుకుంటూ.. "మేము ట్యూటర్స్ గా ఆ సబ్జెక్ట్ ను మాత్రమే స్టూడెంట్స్ కు మాదైనా శైలిన నేర్పాలని తలుస్తున్నాం. అందుకు ప్రయివేట్ గా ట్యుటోరియల్ ఇన్స్టిట్యూట్ ని నిర్వహించాలనుకుంటున్నాం." చెప్పింది.


అక్కడి పెద్దలు వెంటనే ఏమీ అనలేదు. పిల్లల్నే చూస్తున్నారు.

"అందుకు హైదరాబాద్ మంచి అనుకూలంగా ఉంటుంది." చెప్పుతుంది సంపుటి.


అడ్డై..

"విశాఖపట్నం మంచి ప్లేస్ అవుతుందని నేను అంటున్నాను." చెప్పాడు రాఘవ.


"ఇక్కడే.. మాకు పొంతన కాక.. ఇలా మిమ్మల్ని సంప్రదించ తలిచాం." అంది సంపుటి.


"ఇద్దరూ కలిసి ఉండి చేద్దామనుకుంటున్నారా." టక్కున ప్రశ్నించాడు శ్రీకర్.


'అవునవును.' అన్నట్టు సంపుటి, రాఘవ తలలాడించారు.

ఆ వెంబడే..

"అలాగైతేనే.. మా ఇద్దరం చేదోడు వాదోడు మాదిరిన మరింత నాణ్యమైన టీచింగ్ స్కిల్స్ ను అందించ గలమనుకుంటున్నాం." చెప్పింది సంపుటి.


తలాడించాడు రాఘవ.


"గుడ్. నిజమే.. తొలుత మీరు.. ఉమ్మడిగా కాన్ఫిడెన్స్ ని కూడతీసుకోవడం ఉత్తమం. బట్.. ఎక్కడ ఉండి అన్నది ప్రశ్న." ఆగాడు శ్రీకర్.


అప్పుడే.. "హైదరాబాద్ లో కానిద్దాం." అనేసాడు ప్రమథ.


శ్రీకర్ ఏదో అనబోతుండగా..

"తొలుత హైదరాబాద్ లో కానివ్వండి. తర్వాత విశాఖపట్నంలో మరో మీ బ్రాంచి మాదిరిగా మీ సర్వీస్ లను మొదలెట్టండి." చెప్పింది సంచిక.


ఆ వెంబడే..

"అక్కడైనా.. ఇక్కడైనా మీరు వసతి అవస్థలు ఏమీ పడనక్కర లేదు. అక్కడ ఇక్కడ మీ పెద్దలుగా మేము ఉండనే ఉన్నాం." అంది.


అప్పుడు వాగ్దేవి చూపు శ్రీకర్ వైపున ఉంది.

శ్రీకర్ మాత్రం.. సంపుటి, రాఘవలనే చూస్తూ..

"వెల్. ఛాయిస్ మీదే. మొదట అటా, ఇటా తేల్చుకోండి." అనేసాడు.


అప్పుడే రాఘవ.. "ఆర్ యు ష్యూర్." అన్నాడు తండ్రిని చూస్తూ. 


"వై నాట్." అనేసాడు శ్రీకర్.


రాఘవ చూపు తిప్పి.. సంపుటిని చూస్తున్నాడు.

అప్పటికే సంపుటి.. రాఘవనే చూస్తుంది.

"నా పరిశీలనల ప్రకారం.. తొలుత.. హైదరాబాద్ బెటర్ అనుకుంటున్నాను." అంది సంపుటి.


"సరే. అలానే." అనేసాడు రాఘవ.


ఆ వెంటనే..

"మీ ఇరువురి కొత్త అడుగుకు మనసారా వెల్కమ్." చెప్పింది సంచిక.


"య." అన్నాడు ప్రమథ.


"ఇలాగైనా మన ముఖాముఖీలు తరుచుగా కాగలవు." నవ్వేడు శ్రీకర్.


వాగ్దేవి సరళంగా తలాడించేసింది.


 ***

యేడాది తర్వాత..

సంపుటి, రాఘవల ట్యుటోరియల్ ఇన్స్టిట్యూట్ అనతి కాలంలోనే పెర్ఫెక్ట్ స్థాయిని చేరింది.


అందుకు సంపుటి, రాఘవల పటిమైన స్కిల్స్ కారణమంటే అతిశయోక్తి కానే కాదు.


వీళ్లను.. లోకల్ మరియు నాన్ లోకల్ ప్రయివేట్ విద్యా సంస్థ నిర్వాహకులు.. కోరి కలిసారు. తమ సంస్థల్లో కెమిస్ట్రీ సబ్జెక్ట్ బోధించమని కోరారు. మంచి ఆఫర్స్ గుప్పించారు. కానీ సంపుటి, రాఘవలు అటు మొగ్గ లేదు. వీలైనంత వేగిరంగా తమ ఇన్స్టిట్యూట్ బ్రాంచీలను వివిధ చోట్ల తామే నెలకొల్పాలని తలుస్తున్నారు. అందుకు ఇరువురి పెద్దలు.. సమ్మతి, సహకారాలు అందించుటకు సిద్ధమై ఉన్నారు.

పెద్దల సలహాల మేరకు.. సంపుటి, రాఘవ.. తమలా కొంత మంది ట్యూటర్స్ ను ముందుగా సిద్ధ పర్చుకోవాలని నిర్ణయించుకున్నారు.


అందుకై.. తమకు కావలసిన టెస్టిమోనియల్స్ తెల్పుతూ ప్రకటనలు ఇచ్చారు.


***

ఇంటర్వ్యూ కు వచ్చిన శ్రీహరిని చూసిన సంపుటి కాసింత జలదరించింది. తల తిప్పి.. తన పక్క కుర్చీలో ఉన్న రాఘవను చూసింది.


రాఘవ మాత్రం తమ ఎదుటకు వచ్చిన శ్రీహరిని చూస్తూ.. "ప్లీజ్ సిట్డౌన్." అంటున్నాడు.


శ్రీహరి.. వాళ్ల ఎదురున ఉన్న రెండు కుర్చీలో.. ఒక దాంట్లో కూర్చున్నాడు.


"మీ సర్టిఫికేట్స్ చూపండి" అడిగాడు రాఘవ.


శ్రీహరి తనతో తెచ్చుకున్న ఫైల్ ను రాఘవకు అందించాడు.

సంపుటి ప్రేక్షకురాలుగా ఉంది.


కొద్ది నిముషాల్లోనే ఆ ఫైల్ ను.. సంపుటి వైపు టేబుల్ భాగంలోకి తోస్తూ.. "చూడు." చెప్పాడు రాఘవ.


ఆ ఫైలు తెరిచి చూస్తుంది సంపుటి.

అంతలోనే..


"మీరు చేస్తున్న జాబ్ ను వదిలేసి మా వైపుకు రాబోతున్నారా." అడిగాడు రాఘవ.


"అవును." అన్నాడు శ్రీహరి.


"మా ప్రకటన పూర్తిగా మీకు అర్థం ఐందా." తిరిగి ప్రశ్నించాడు రాఘవ.


"ఐంది." పొడి పొడిగానే ఆన్సర్ ఇస్తున్నాడు శ్రీహరి.

అప్పుడే ఫైల్ ను మూసి.. శ్రీహరిని చూస్తూ.. "రెండు వారాల మా ఓరియంటేషన్ ప్రొగ్రాం తర్వాత.. ఎంపిక కాగలిగితే.. నాలుగు వారాల ట్రైనింగ్ పిరియడ్ ఉంటుంది. ఆ తర్వాతి సెలక్షన్ ద్వారానే మీకు జాబ్ చూపగలం." చెప్పింది సంపుటి.


"ఆ వివరణ మా ప్రకటనలో ఉంది." కలగచేసుకున్నాడు రాఘవ.


"తెలుసు." అన్నాడు శ్రీహరి.


రాఘవ, సంపుటి మొహాలు చూసుకుంటుండగా..

"మీ సంస్థ గురించి బాగా తెలిసింది. అవకాశం వస్తే.. మీ సిస్టమ్ లో పని చేయాలి అనుకుంటున్నాను." చెప్పాడు శ్రీహరి.


"ప్లీజ్ వైట్ ఇన్ ద వెయిటింగ్ రూం." చెప్పింది సంపుటి.


"ఎంత వరకు." అడిగాడు శ్రీహరి.


"బిట్వీన్ టెన్ టు ఫిప్టీన్ మినిట్స్." చెప్పింది సంపుటి. 


రాఘవ.. సంపుటినే చూస్తున్నాడు. 

శ్రీహరి లేచి.. బయటికి నడిచాడు.

కాల్ బెల్ నొక్కింది సంపుటి.

బయటి బోయ్ లోపలికి వచ్చాడు.


అతడితో.. తన ముందున్న పేపర్స్ ను చూస్తూ.. "ఇంకా పది మంది ఉన్నారుగా. బ్రేక్ తీసుకుంటున్నాం. తిరిగి పిలిచాక వరసగా పంపండి." చెప్పింది సంపుటి.


ఆ బోయ్ వెళ్లి పోయాడు.

"ఏంటి సంపుటి.. ఏమైంది. బ్రేక్ ఎందుకు." అడుగుతున్నాడు రాఘవ.


"ముందు వచ్చిన కేండిటేట్.. శ్రీహరి.. ఇంటర్మీడియట్ లో నాతో చదివాడు. నీకు గుర్తు ఉండే ఉంటుంది. అప్పుడు నా వెంట 'లవ్' అంటూ పడింది ఇతడే." చెప్పింది సంపుటి.


"అవునా. నీ రిఫ్యూజ్ ఫేస్ చేసింది ఇతడేనా." అడిగాడు రాఘవ.


"ఇతడిని మనతో కలుపుకోగలమా." అడిగింది సంపుటి.


"వై నాట్.. ఐనా.. మనకు కావలసినవి నాలెడ్జ్ స్కిల్స్. మన నార్మ్స్ కు తగ్గట్టు కుదిరితే.. చేర్చుకోవచ్చు." చెప్పేసాడు రాఘవ.


ఆ వెంబడే..

"ఐనా.. అప్పుడు నువ్వు కాదనగా.. ఇతడు సవ్యంగా తప్పుకున్నాడుగా. సో ఇతడు బిహేవియర్ సాఫీయే అనుకోవచ్చు. నువ్వు ఏమంటావు." అన్నాడు రాఘవ.


"సరే.. నీ ఇష్టం. మనకు కావలసినవి ఇతడికి ఉన్నాయి. ట్రైనింగ్ వరకు చూద్దాం." చెప్పింది సంపుటి.


"ఆర్ యూ ఓకే." రెట్టించాడు రాఘవ.


"య. యయ." అనేసింది సంపుటి.


రాఘవ.. కాల్ బెల్ నొక్కాడు.

బయటి బోయ్ వచ్చాడు.

"శ్రీహరి గారిని మరో మారు పంపు." చెప్పాడు రాఘవ.


 బోయ్ బయటికి వెళ్లి.. శ్రీహరిని లోనికి పంపాడు.


శ్రీహరిని చూస్తూనే.. "రండి కూర్చొండి." అన్నాడు రాఘవ.

శ్రీహరి కుర్చీలో కూర్చున్నాడు.

========================================================================

ఇంకా వుంది..

======================================================================== 

బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.








67 views0 comments

Commentaires


bottom of page