'Samputi Murisindi Episode 4' - New Telugu Web Series Written By BVD Prasada Rao
Published In manatelugukathalu.com On 28/12/2023
'సంపుటి మురిసింది ఎపిసోడ్ 4' తెలుగు ధారావాహిక
రచన: బివిడి ప్రసాదరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
సంచిక, ప్రమథ ల కూతురు సంపుటి. తన వెంట పడుతున్న శ్రీహరితో ధైర్యంగా 'పద, పెళ్లి చేసుకుందా’మంటుంది.
అబ్బాయిలతో ఆలా మాట్లాడకూడదని మందలిస్తుంది తల్లి సంచిక. తన చిన్ననాటి స్నేహితుడు శ్రీకర్ తో సంపుటి విషయం ఫోన్ లో మాట్లాడుతుంది.
శ్రీకర్, వాగ్దేవిల కొడుకు రాఘవ. అతను కూడా తనను ప్రేమించానని చెప్పిన కావ్యతో ముందు చదువు మీద దృష్టి పెట్టమంటాడు.
పీజీలో రాఘవ, సంపుటిలు క్లాస్ మేట్స్ అవుతారు. రెండు కుటుంబాల వాళ్ళు ఒక చోట కలుస్తారు. కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకుంటారు సంపుటి, రాఘవలు.
ఇంటర్వ్యూ కి గతంలో సంపుటికి ప్రపోజ్ చేసిన శ్రీహరి వస్తాడు.
ఇక సంపుటి మురిసింది ఎపిసోడ్ 4 చదవండి..
"ముందు తెల్పినట్టే.. ట్రైనింగ్ వరకు హైదరాబాద్ లో ఉంటుంది. తర్వాతి సెలక్షన్ బేస్ తో జాబ్ ఇక్కడ కానీ.. లేదా.. మేము పెట్టే కొత్త బ్రాంచీల్లో ఒక చోటన.. చూపుతాం. అలాగే ట్రయినింగ్ సమయం వరకు మా నుండి మీకు డబ్బు ముట్టదు.. మీ నుండి మేము డబ్బు వసూలు చేసేది లేదు. కేవలం విశ్రాంతి, తిండి వసతులు మాత్రమే మేము కల్పిస్తాం." చెప్పాడు రాఘవ.
శ్రీహరి చిన్నగా నవ్వేడు.
"మీ ప్రకటన పూర్తిగా చదివి ఉన్నాను." చెప్పాడు.
"గుడ్.. వచ్చే సోమవారం నుండి మీరు రావాలి." చెప్పింది సంపుటి.
"ష్యూర్. థాంక్యూ బోత్." అన్నాడు శ్రీహరి.
"వెల్కమ్ టు అవర్ కమ్యూనిటీ." చెప్పాడు రాఘవ.
శ్రీహరి వెళ్లి పోయాడు.
సంపుటి.. కాల్ బెల్ నొక్కింది.
***
సంచిక ఇంటిన..
డిన్నర్ చేస్తూ..
"బాగుంది. మీ ప్రయత్నం సక్సెస్ ఐనట్టే." అన్నాడు ప్రమథ.
"గ్రేట్. ఆరవై మంది రావడం.. అందులో ఇరవై ఐదు మంది మీకు నచ్చడం గుడ్." చెప్పింది సంచిక.
"మా రిక్వైర్మెంట్.. పదకొండు మందే." చెప్పాడు రాఘవ.
"ప్రస్తుతానికి. బికాజ్ మేము ప్లాన్ చేసింది.. ఎనిమిది బ్రాంచీలే. బ్రాంచికి ఒకరు.. ముగ్గురు రిజ్వర్డ్." వెంటనే అంది సంపుటి.
"యయ." తలాడించేసాడు రాఘవ.
"ఇట్స్ అప్ టు యు. ప్లీజ్ ప్రొసీడ్." చెప్పేసింది సంచిక.
"య. గో ఎహెడ్. ఆల్ ద బెస్ట్." అన్నాడు ప్రమథ.
ఆ తర్వాత..
వాళ్ల డిన్నర్.. కొద్ది సేపు మాటలు లేకుండా కొనసాగేక..
"ఆ శ్రీహరి.. అదే.. అప్పుడు నాచే తిరష్కరింపబడిన వాడు.. కూడా వచ్చాడు.." చెప్పుతుంది సంపుటి.
రాఘవ తిండాపేసి.. తలెత్తి.. సంపుటిని చూస్తున్నాడు.
సంపుటి.. తిండాపి.. తల్లిదండ్రుల వైపు చూస్తుంది.
"నిజమా." అంది సంచిక.
ప్రమథ ఏమీ అన లేదు. అన్నం కెలుకుతూ భార్యనే చూస్తున్నాడు.
సంచిక.. కూతురు వైపు నుండి తల తిప్పి.. రాఘవను చూస్తుంది.
వీటిని గమనించిన రాఘవ.. అప్పుడే..
"నా విల్లింగ్ తోనే అతడు ఎంపిక కాబడ్డాడు." చెప్పాడు.
"సరే. ఇందులో ఏముంది. మీరు.. మీకు తగ్గ వారినే ఫైనల్ గా సెలక్ట్ చేసుకుంటారుగా." అంది సంచిక.
"అబ్సెసివ్ గా. మా ఇద్దరి మోటివ్ అదే." సునాయాసంగా చెప్పాడు రాఘవ..
సంపుటి పేరెంట్స్ నే చూస్తూ.
"గుడ్. నో వర్రీస్." అనేసాడు ప్రమథ.
"య. అంతంతే." సంచిక కూడా అనేసింది.
రాఘవ చూపు సంపుటి వైపుకు వచ్చింది.
సంపుటి అన్నంలో పెరుగు వేసుకొని.. డిన్నర్ ముగింపుకు చేరువవుతుంది.
***
మూడు వారాల తర్వాత..
తమ ఆఫీస్ రూంలో సంపుటి ఉంది.
కెమిస్ట్రీ జరనల్ చదువుకుంటుంది.
టీచింగ్ ముగించుకొని.. అక్కడికి వచ్చాడు రాఘవ.
సంపుటి పక్క కుర్చీలో కూర్చున్నాడు.
చేతిలోని పుస్తకం మూస్తూ.. "నీ టెర్మ్ ఓగయా." అంది. నవ్వింది.
"బిల్కుల్." నవ్వేడు రాఘవ.
సంపుటి తన టెర్మ్ టీచింగ్ కై లేచింది.
అప్పుడే..
"సంపుటి.. ఏజ్ యు సెడ్, శ్రీహరి ఈజ్ ఎ స్ట్రాంగ్ పర్సన్." అన్నాడు రాఘవ.
ఆ వెంబడే..
"సబ్జెక్ట్ లో." అనేసింది సంపుటి.
"యయ." అన్నాడు రాఘవ.
"క్లారటీ మిస్ కాకు అబ్బా." చెప్పింది సంపుటి.. అక్కడి నుండి బయటికి నడుస్తూ.
చిన్నగా నవ్వుకుంటాడు రాఘవ.
***
మూడు నెలల తర్వాత..
సంచిక ఫామ్లీతో రాఘవ.. విశాఖపట్నం వచ్చి.. తన పేరెంట్స్ ఇంట ఉన్నాడు.
వారంతా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు.
"అనుకూలమైన ట్యూటర్స్ కుదరడంతో.. మీకు కొంత మేరకు వత్తిడి తగ్గినట్టేగా." అడిగాడు శ్రీకర్.
"వీళ్లది తీరని దాహం. వీళ్లు క్లాస్ లు తీసుకోవడం తగ్గించుకున్నారే తప్పా.. బ్రాంచీల విజిట్స్ కై దడి దడి తిరుగుతూ.. ఇంటి పట్టును కుదించేసుకుంటున్నారు." చెప్పాడు ప్రమథ.
"వీళ్లు విశాఖపట్నం వెళ్తున్నామనే సరికి.. మేమూ రెండు రోజులు సర్దుబాటు చేసుకొని వచ్చేసాం." చెప్పింది సంచిక.
"వీళ్లు రేపు ఇటు నుండి తిరుపతి బ్రాంచికి వెళ్లనున్నారు. మా ఇద్దరం ఇటు నుండి హైదరాబాద్ కు వెళ్లి పోతాం." చెప్పాడు ప్రమథ.
అప్పుడే.. పిల్లల్ని చూస్తూ..
"వీళ్లు వర్క్ డిమోన్స్." అంది సంచిక చిన్నగా నవ్వుతూనే.
"అబ్బే.. ఇద్దరం కెమిస్ట్రీ సబ్జెక్ట్ ప్రియులం." చెప్పాడు రాఘవ.
"మరే." అనేసింది సంపుటి.
వాళ్ల బ్రేక్ఫాస్ట్ కొనసాగుతుంది.
"వీళ్లిద్దరూ బాగానే శ్రమిస్తున్నారు. అలానే స్థిరమవుతున్నారు. సో.." చెప్తూ ఆగింది వాగ్దేవి.
మిగతా వారు వాగ్దేవిని చూస్తున్నారు.
ఆగిన వాగ్దేవి.. తిరిగి మాట్లాడక పోవడంతో..
"సో." అన్నాడు శ్రీకర్.
శ్రీకర్ పైన చూపు నిలిపి.. "వీళ్ల పెళ్లిళ్లకై మనం యోచిస్తే బాగుంటుందిగా." అనేసింది వాగ్దేవి.
అప్పుడే.. శ్రీకర్ తల తిప్పి.. సంచిక, ప్రమథలను చూస్తున్నాడు.
ప్రమథ.. సంచికను చూసాడు.
సంచిక.. భర్త నుండి చూపు మార్చి.. సంపుటిని చూస్తూ..
"అవును. మనం ఆలోచించాలి." అంది.
సంపుటి తల దించుకొని.. ఇడ్లీ తింటుంది.
రాఘవ అందర్నీ పరిశీలిస్తున్నాడు.
పిల్లల్ని చూస్తూ.. "వీళ్లకు పెళ్లి కానిస్తే మంచిదేగా." అనేసాడు ప్రమథ.
ఉలిక్కి పడింది సంపుటి. గమ్మున రాఘవను చూస్తుంది.
"మాకు పెళ్లా." అన్నాడు రాఘవ.
"నాలో ఆ ఆలోచన లేదు." చెప్పింది సంపుటి.
ఆ వెంబడే..
రాఘవతో.. "వాట్ ఈజ్ యువర్స్." అంది.
"నోనో. యయ. నీలానే నేను కూడా. ఐ హేవ్ నో ప్లాన్స్ ఆఫ్ మారేజ్." అనేసాడు రాఘవ.
"బట్.. ఇకపై మీరు మారేజ్ కై యత్నించాలి." టక్కున అనేసాడు ప్రమథ.
మిగతా అంతా అతడినే చూస్తున్నారు.
"వయస్సొచ్చిన మీ ఇద్దరూ కలిసి మెలిసి మొసులుతుండడం కూడా.." చెప్పుతున్నాడు ప్రమథ.
అడ్డై..
"వాట్ నాన్న.. మీరు చెప్పబోతుందేమిటి." సర్రున అడిగింది సంపుటి.
ఇప్పుడు.. మిగతా వారంతా సంపుటినే చూస్తున్నారు.
"కూల్ బేబీ. నాన్న నాతో మాట్లాడి ఉన్నారు. అతని భయం.. బయటి వారి గురించి. వారెవరూ మీ గురించి తప్పుగా వాగ రాదనే." చెప్పింది సంచిక.
"అవును బేబీ. నన్ను చెప్పనీ. లోకం తీరు ఎఱిగిన వాణ్ణి. పైగా భయస్థుడును." చెప్పడం ఆపాడు ప్రమథ. కూతురునే చూస్తున్నాడు.
"సారీ నాన్న. కాస్తా బెంబేలు పడ్డాను. సారీ." అంది సంపుటి.. తండ్రినే చూస్తూ.
"నువ్వు ఏం కానిది మాట్లాడ లేదులే. టేక్ ఇట్ ఈజీ ప్లీజ్." చెప్పాడు శ్రీకర్.
"మేమూ ఆలోచించాం మీ పెళ్లికై." కలగ చేసుకుంది వాగ్దేవి.
"క్లారిటీ ప్లీజ్." అన్నాడు రాఘవ.
వాగ్దేవి మాట్లాడక.. కొడుకునే చూస్తూ ఉండిపోయింది.
"మేము సవ్యంగానే మాట్లాడుతున్నాం. మరి.. వాట్ ఆర్ యువర్ మిసండర్స్టాండింగ్స్." విస్మయమవుతున్నాడు ప్రమథ.. పిల్లలనే చూస్తూ.
"మా పెళ్లి.. మా పెళ్లి.. అంటున్నారు. మాకు పెళ్లా.. మాకు పెళ్లిళ్లా." అడుగుతుంది సంపుటి.
ఆ వెంబడే..
రాఘవతో.. "అంతేగా." అంది.
"అవునవును." అనేసాడు రాఘవ.
సంచిక తెములుకుంటూ.. పిల్లల్నే చూస్తూ..
"సూటిగా చెప్పండి.. మీరు పెళ్లి చేసుకుంటారా.. లేదా.. వేరు వేరుగా పెళ్లిళ్లు చేసుకుంటారా." అడిగేసింది.
రాఘవ మాట్లాడ లేదు. సంపుటినే చూస్తున్నాడు.
"నాకైతే ఏ ఆలోచన లేదు. నువ్వు ఏమంటావు." అంది సంపుటి.. రాఘవతో.
"నాకు కూడా ఎట్టి ఆలోచన లేదు." చెప్పాడు రాఘవ.
"ఇప్పుడు అడుగుతున్నాంగా.. చెప్పండి." అన్నాడు ప్రమథ.
"అవును. మీ పేరెంట్స్ గా మేము అడుగుతున్నాం. ఇప్పుడు పెళ్లి సంగతి తేల్చుకోండి." శ్రీకర్ కూడా వెంటనే అన్నాడు.
"మేము మీతో ఇక్కడికి ఇలా వచ్చింది అందుకే. మా పెద్దలు చెంత మీ పెళ్లి బోగాటము తేలాలనే." చెప్పేసింది సంచిక.
సంపుటి, రాఘవ ఏమీ మాట్లాడడం లేదు.
"మీ ఇష్టం అంటారా.. మా ఇష్టం అంటారా. అదేనా చెప్పండి." అడిగేసాడు ప్రమథ.
"ఇదేమిటి ఈ యాతన. మేము ఇక్కడి బ్రాంచికి వెళ్లే తొందరన ఉన్నాం." చెప్పింది సంపుటి.
"అంతంతే." అన్నాడు రాఘవ.
"వెళ్దురు. ముందు ఇదీ ముఖ్యమే." అన్నాడు ప్రమథ.
"అవును. పెళ్లి పై.. మీ ఇష్టమా.. మా ఇష్టమా.. అన్నది తేల్చి కదలండి." కలగ చేసుకున్నాడు శ్రీకర్.
రాఘవ.. సంపుటిని చూసాడు.
అప్పటికే సంపుటి.. రాఘవనే చూస్తుంది.
"మా పేవరెట్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ లోనూ ఇంతటి జటిలం ఎదురు కాలేదు." నొసలు చిట్లించాడు రాఘవ.
సంపుటి నవ్వింది.
"సరే. మీ ఇష్టం." అనేసాడు రాఘవ.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Комментарии