సంపుటి మురిసింది - ఎపిసోడ్ 5
- BVD Prasada Rao
- Jan 2, 2024
- 4 min read
Updated: Jan 17, 2024

'Samputi Murisindi Episode 5' - New Telugu Web Series Written By BVD Prasada Rao
Published In manatelugukathalu.com On 02/01/2024
'సంపుటి మురిసింది ఎపిసోడ్ 5' తెలుగు ధారావాహిక
రచన: బివిడి ప్రసాదరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
సంచిక, ప్రమథ ల కూతురు సంపుటి. తన వెంట పడుతున్న శ్రీహరితో ధైర్యంగా 'పద, పెళ్లి చేసుకుందా’మంటుంది.
అబ్బాయిలతో ఆలా మాట్లాడకూడదని మందలిస్తుంది తల్లి సంచిక. తన చిన్ననాటి స్నేహితుడు శ్రీకర్ తో సంపుటి విషయం ఫోన్ లో మాట్లాడుతుంది.
శ్రీకర్, వాగ్దేవిల కొడుకు రాఘవ. అతను కూడా తనను ప్రేమించానని చెప్పిన కావ్యతో ముందు చదువు మీద దృష్టి పెట్టమంటాడు.
పీజీలో రాఘవ, సంపుటిలు క్లాస్ మేట్స్ అవుతారు. కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకుంటారు సంపుటి, రాఘవలు. ఇంటర్వ్యూ కి గతంలో సంపుటికి ప్రపోజ్ చేసిన శ్రీహరి వస్తాడు. అతన్ని ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
సంపుటి, రాఘవలు, వాళ్ళ పేరెంట్స్ సమావేశమవుతారు.
ఇద్దరి పెళ్లి ప్రస్తావన తెస్తారు. పెద్దల ఇష్ట ప్రకారం నడుచుకుంటామంటారు ఇద్దరూ.
ఇక సంపుటి మురిసింది ఎపిసోడ్ 5 చదవండి..
అంతలోనే.. "మాకు పెళ్లి చేస్తారో.. మాకు వేరు.. వేరు పెళ్లిళ్లు చేస్తారో.. మీ ఇష్టం." అంది సంపుటి.
ఆ వెంబడే..
"అంతేనా." అడిగింది రాఘవను.
"అవును. అంతంతే." అనేసాడు రాఘప.
"క్లారటీ బాబు క్లారటీ. లేదంటే.. మనది మిసండర్స్టాండింగ్ అంటారు ఈ పెద్దలు." చెప్పింది సంపుటి చలాకీగా.
దాంతో అక్కడి పెద్దలంతా పక్కున నవ్వేసారు.
"కెన్ వుయ్ గో." అడిగింది సంపుటి.
"బ్రేక్ఫాస్ట్ కాలేదింకా." అంది వాగ్దేవి.
"నాకు చాలు." అక్కడి నుండి షింక్ వైపు నడిచింది సంపుటి.
రాఘవ కూడా లేచి.. అటు కదిలాడు.
"దొందూ దొందే." పిల్లల్ని చూస్తూ అనేసింది సంచిక.
మరో మారు ఆ పెద్దలు మనసారా నవ్వుకున్నారు.
మాట్లాడుతూనే.. తమ బ్రేక్ఫాస్ట్ ను కొనసాగిస్తున్నారు.
***
తమ విశాఖపట్నం బ్రాంచిన..
గెస్ట్ టీచింగ్ ను ముగించుకొని.. ఆఫీస్ రూంలోకి వచ్చింది సంపుటి.
అక్కడ రాఘవ.. శ్రీహరి ఉన్నారు.
శ్రీహరి ఆ బ్రాంచి ఇన్చార్జి కమ్ టీచర్.
సంపుటిని చూస్తూనే కుర్చీ లోంచి లేచాడు రాఘవ.
అప్పుడే అతడి ఎదురు కుర్చీలో కూర్చున్న శ్రీహరి కూడా లేచి నిల్చున్నాడు.
"నేను వెళ్తాను." అంటూనే బయటికి కదిలాడు రాఘవ.. తన గెస్ట్ టీచింగ్ కై.
సంపుటి.. రాఘవ ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంటూనే..
"ప్లీజ్ సిట్." అంది.. శ్రీహరితో.
శ్రీహరి తిరిగి కుర్చీలో కూర్చున్నాడు.
"వెల్.. స్టూడెంట్స్ పికింగ్ బాగుంది. మీ టీచింగ్ స్కిల్స్ చక్కగా అగు బడ్డాయి." చెప్పింది సంపుటి.. శ్రీహరినే చూస్తూ.
చిన్నగా నవ్వేడు శ్రీహరి.
"ఇక్కడి ఫిఫ్టీ టు స్టూడెంట్స్ ను హేండిల్ చేయడంలో ఇబ్బంది కావడం లేదుగా." అడిగింది సంపుటి.
"లేదు సంపుటి గారూ." చెప్పాడు శ్రీహరి.
జాయినింగ్ టైంలోనే.. అందరికి చెప్పినట్టే.. శ్రీహరికి.. సంపుటి, రాఘవ చెప్పారు.. తమని 'మేడమ్ అని'.. 'సార్ అని' పిలవనవసరం లేదని.. తామంతా ట్యూటర్స్ం గానే మెసులు కుందామని. హుందాతనం వీడక.. పేర్ల తోనే పిలుచు కుందామని. దాంతో తొలుత తడబడినా.. మెల్లిగా శ్రీహరి.. ఆ ఇద్దరు చెప్పిందే పాటిస్తున్నాడు.
"రిజర్వ్డ్ లో ముగ్గురు ట్యాటర్స్ ఉన్నారు. సో.. మేము ఆలోచించి.. ఒకరిని ఈ బ్రాంచికి పంపుతాం. అప్పుడు రెండు క్లాస్ లుగా విడదీద్దాం. బర్డన్ తగ్గించగలం." చెప్పింది సంపుటి.
శ్రీహరి ఏమీ అనలేదు.
"మీ ఒపినియన్ చెప్పండి." అడిగింది సంపుటి.
"డు ఏజ్ యు విష్. బట్.. నేను మేనేజ్ కాగలుగుతున్నాను." చెప్పాడు శ్రీహరి.
"థట్స్ గుడ్ స్పిరిట్. బట్.. మేము యోచిస్తాం." నవ్వింది సంపుటి.
శ్రీహరి ఏమీ అనలేదు.
"ఇంకేమైనా చెప్ప తగ్గవి ఉన్నాయా." అడుగుతుంది సంపుటి.
శ్రీహరి ఏమీ లేవనగా..
"జాయినింగ్ టైంలో చెప్పినట్టు.. కాకినాడ నుండి మీ పేరెంట్స్ ను విశాఖపట్నంకు షిఫ్ట్ చేసేసారా." అడిగింది సంపుటి.
"ఆఁ. డబుల్ బెడ్ రూం ప్లాట్ తీసుకున్నాను. ఇక్కడికి వాకబుల్ డిస్టేన్సే." చెప్పాడు శ్రీహరి.
నిముషమాగి..
"ఇంటర్మీడియట్ తర్వాత.. మీ చదువంతా కాకినాడలోనేనా." అడిగింది సంపుటి.
"య. అంతా అక్కడే. అక్కడే ఒక ట్యుటోరియల్ లో టీచింగ్ పని కుదిరింది. అక్కడే మీ ప్రకటన చూడడం జరిగింది. అప్పటికే మీ ఇన్స్టిట్యుషన్ గురించి తెలిసి ఉన్నాను." చెప్పడం ఆపాడు శ్రీహరి.
"టీచింగ్ వైపు మొగ్గారు. అటు ఇష్టమా." అడిగింది సంపుటి.
'అవును' అన్నట్టు తలాడించాడు శ్రీహరి.
ఆ వెంబడే..
"పట్టుతో టీచింగ్ ను చేపట్టాను." చెప్పాడు.
"అవర్ లక్. లేకపోతే మీలోని ట్యూటర్ ను మిస్ అయ్యేవాళ్లం." నవ్వింది సంపుటి.
శ్రీహరి కూడా చిన్నగా నవ్వేసాడు.
"లేదు లేదు. నిజానికి నాలోని ట్యూటర్ మీ వలననే బాగా సాన పెట్టబడ్డాడు." చెప్పాడు శ్రీహరి.
తన ముందు ఉన్న ఫైల్ ను తెరుస్తూ..
"చేవ ఉంటేనే సాన పడడం కుదురుతుంది." అంది సంపుటి.. శ్రీహరిని చూస్తూ.
అతడు ఏమీ అనలేక పోయాడు.
సంపుటి ఫైల్ లోని పేపర్లును చూస్తుంది.
"నేను.. మీ తర్ఫీదు సమయంన.. ఒక కొత్త థాట్ వద్ద నిలిచి ఉన్నాను." సడన్ గా అన్నాడు శ్రీహరి.
సంపుటి తలెత్తి.. శ్రీహరిని చూస్తుంది.
శ్రీహరి కూడా సంపుటినే చూస్తూ..
"ఒక కొత్త కెమికల్ ఫార్ములా ప్రజెంట్ చేయగలనని తోస్తుంది." చెప్పేసాడు.
"గుడ్." కను బొమలు ఎగరేస్తుంది సంపుటి.
"మీరు అనుమతిస్తే మరింత వివరణ ఇవ్వగలను." చెప్పాడు శ్రీహరి.
"య. ప్రోసీడ్." చిన్నగా అంది సంపుటి.
"మీరే నాకు ఇన్స్పిరేషన్.. అవును.. మీరు కాదన్నాక.. నేను పరోక్షంగా మీ వైపు మరింత మొగ్గాను. మీ కదలికల బట్టి కదిలాను. నిజానికి నేను కామర్స్ వైపు పోవాలి. బ్యాంక్ జాబ్ కోరుకునే వాణ్ణి. కానీ మీ తోవన వస్తున్న నేను.. మీకు ఇష్టమైన కెమిస్ట్రీ సబ్జెక్ట్ వైపు తూగాను. పట్టుతో పిజి సాధించాను. ఐనా మీ మెప్పుకై నా యావ తీరలే. అందుకే కోరి కెమిస్ట్రీ సబ్జెక్ట్ తో కొత్త పంథా చేపట్టా. అది సాధించేకనే మీ ముందుకు రాతలిచాను. కానీ.. ఇలా నాకు మీ దరి అవకాశం కుదిరింది." చెప్పుతున్నాడు శ్రీహరి.
వింటుంది సంపుటి.
"నా ప్రయత్నంకు మీ పరివేక్షణ కావాలి." అడిగాడు శ్రీహరి.
శ్రీహరినే చూస్తూ.. "వెల్.. ముందు అటు మీ ప్రయత్నం కానీయండి." చెప్పింది సంపుటి.
ఆ వెంబడే..
"ఇక్కడి స్టూడెంట్స్ కు మాత్రం ఇబ్బంది రాకూడదు." అంది. చిన్నగా నవ్వింది.
శ్రీహరి కూడా సర్దుకుంటూ.. చిన్నగా నవ్వేసాడు.
"లేదు. లేదు. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ ఆశయంకే." చెప్పాడు.
అర నిముషమాగి..
"అర్ధమైందా.. చదువ అవసరం. ఇంటర్మీడియట్ లోనే నేను నీలా ఐతే.. ఈ గోల్ కు చేరే వాళ్లమా." మెల్లిగా అంది సంపుటి.
శ్రీహరి తల దించుకున్నాడు.
అప్పుడే.. అక్కడికి రాఘవ వచ్చాడు.
***
మర్నాడు..
తమ తిరుపతి బ్రాంచి విజిట్ కై బయలు దేరుతున్నారు.. సంపుటి, రాఘవ.
"మేము సాయంకాలం హైదరాబాద్ కు బయలుదేరుతున్నాం." చెప్పింది సంచిక.
"టేక్కేర్." చెప్పింది సంపుటి.
"టిక్కెట్స్ అయ్యాయా. లేక.. నేను తీయనా." అడిగాడు రాఘవ.
"మేము బుక్ చేసేసుకున్నాం. ట్రైన్ కు వెళ్తున్నాం." చెప్పాడు ప్రమథ.
"నైస్." అనేసాడు రాఘవ.
"మేము తిరుపతి తర్వాత.. విజయవాడ, వరంగల్ బ్రాంచిలు చూసుకొని.. హైదరాబాద్ వచ్చేస్తాం." చెప్పింది సంపుటి.
"అదేమిటి. మీ ప్లానింగ్ సరిగ్గా లేదు. అడ్డదిడ్డంగా తిరుగుతున్నారు." నవ్వేడు శ్రీకర్.
"మేము పెట్టిన బ్రాంచిల క్రమంలో తిరుగుతున్నాం." చెప్పాడు రాఘవ.
"సరిసరే. బాగుంది." అనేసాడు శ్రీకర్.
"ఆరోగ్యాలకై జాగ్రత్త వహించండి." అప్పుడే అంది వాగ్దేవి.
"తప్పక. నో వర్రీస్." చెప్పాడు రాఘవ.
"మరి మేము బయలుదేరమా." అంది సంపుటి.
"మీరు కోరినట్టే.. మేము మీ పెళ్లికై ఆలోచన చేసి ఉన్నాం." చెప్పాడు ప్రమథ.
"మీ ఇద్దరికి పెళ్లి చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం చేసాం." చెప్పింది సంచిక.
సంపుటి, రాఘవ మొహాలు చూసుకుంటున్నారు.
ఆగి.. అడిగాడు ప్రమథ.. "ఏమంటారు."
ఆ వెంబడే..
"తేల్చి.. వెళ్లండి." చెప్పాడు శ్రీకర్.
తమ చూపులను ఆ పెద్దల వైపున నిలిపి.. "కానీయండి." కోరస్ లా చెప్పేసారు సంపుటి, రాఘవ.
"కారు ప్రయాణం. టేక్కేర్." చెప్పాడు ప్రమథ.
"స్లో డ్రయివింగ్ తో వెళ్తుండండి." చెప్పింది సంచిక.
"అలానే." అనేసింది సంపుటి.
"ఇద్దరికీ డ్రయివింగ్ వచ్చు కనుక.. తడవ తడవగా మారుతుండండి." చెప్పాడు శ్రీకర్.
"నైట్ జర్నీ వద్దు." చెప్పింది వాగ్దేవి.
"సరే." అనేసాడు రాఘవ.
ఆ వెంబడే..
అక్కడి నుండి కదిలింది సంపుటి.. తన బేగ్ తో.
ఆ వెనుకే.. రాఘవ కదిలాడు.. తన బేగ్ తో.
***
కారులో..
"విశాఖపట్నం బ్రాంచి బాగుంది. శ్రీహరి గుడ్." చెప్పాడు రాఘవ.
అతడు డ్రయివింగ్ చేస్తున్నాడు.
అతడి పక్క సీటులో సంపుటి ఉంది.
"యయ. అనుకున్నాంగా.. అతడికి ప్రస్సర్ తగ్గించాలి. మరొక ట్యూటర్ ను ప్రొవయిడ్ చేద్దాం." అంది సంపుటి.
"అలాగే. మనకు స్టాండ్బైస్ ఉన్నారుగా." అన్నాడు రాఘవ.
కొద్ది సేపు తర్వాత..
"నేను డ్రయివ్ చేయనా." అడిగింది సంపుటి.
"లేదు లేదు. టు సమ్ ఎక్స్టెట్ ఐ కెన్." నవ్వేడు రాఘవ.
సంపుటి రోడ్డును చూస్తుంది.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.

aaa
Comments