top of page
Writer's pictureBVD Prasada Rao

సంపుటి మురిసింది - ఎపిసోడ్ 7



'Samputi Murisindi Episode 7' - New Telugu Web Series Written By BVD Prasada Rao Published In manatelugukathalu.com On 12/01/2024

'సంపుటి మురిసింది ఎపిసోడ్ 7' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

సంచిక, ప్రమథ ల కూతురు సంపుటి. తన వెంట పడుతున్న శ్రీహరితో ధైర్యంగా 'పద, పెళ్లి చేసుకుందా’మంటుంది. అబ్బాయిలతో ఆలా మాట్లాడకూడదని మందలిస్తుంది తల్లి సంచిక. తన చిన్ననాటి స్నేహితుడు శ్రీకర్ తో సంపుటి విషయం ఫోన్ లో మాట్లాడుతుంది.



శ్రీకర్, వాగ్దేవిల కొడుకు రాఘవ. అతను కూడా తనను ప్రేమించానని చెప్పిన కావ్యతో ముందు చదువు మీద దృష్టి పెట్టమంటాడు. పీజీలో రాఘవ, సంపుటిలు క్లాస్ మేట్స్ అవుతారు. ఇద్దరూ కలిసి కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకుంటారు. ఇంటర్వ్యూ కి గతంలో సంపుటికి ప్రపోజ్ చేసిన శ్రీహరి వస్తే, అతన్ని ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.



 సంపుటి, రాఘవలు, వాళ్ళ పేరెంట్స్ సమావేశమవుతారు. ఇద్దరి పెళ్లి ప్రస్తావన తెస్తారు. పెద్దల ఇష్ట ప్రకారం నడుచుకుంటామంటారు ఇద్దరూ.


శ్రీహరి చక్కగా పని చేస్తున్నట్లు అభిప్రాయ పడతారు సంపుటి, రాఘవలు.

కావ్య ట్యూషన్ సెంటర్ నడుపుతున్నట్లు తెలుసుకొని కలవడానికి వెళ్తారు ఇద్దరూ.


ఇక సంపుటి మురిసింది ఎపిసోడ్ 7 ( చివరి భాగం ) చదవండి.. 


"మరి.. మా ప్రకటన చూసాక.. మీరు అప్లై చేయవలసింది. ఎందుకంటే.. మీకు సైన్స్ సబ్జెక్ట్స్ బోధన.. అందులో కెమిస్ట్రీ అంటే భలే ఇష్టం అన్నారుగా మీ వార్తలో." అంది. చిన్నగా నవ్వుతుంది.


కావ్య.. సంపుటిని చిత్రంగా చూస్తుండడం గుర్తిస్తున్న రాఘవ..

"ఈమె సంపుటి. వుయ్ ఆర్ కమ్పానియన్స్. మా ఇద్దరమే మా ఇన్స్టిట్యూట్స్ కు మూలం." చెప్పాడు. చిన్నగా నవ్వేడు.

"మీకు టీచింగ్ అంటే మక్కువా." అడుగుతుంది సంపుటి.

"అవును నాకు బోధన అంటే ఇష్టమే కాదు.. దానిని నా ప్రాణంలా భావిస్తున్నాను. కానీ.. మీ ప్రకటనలో ఓన్లీ పిజి పైగా కెమిస్ట్రీ మెయిన్ ఐ ఉండాలని ఇచ్చారుగా.." చెప్పుతుంది కావ్య.


అడ్డై..

"మీది ఏమిటి.. ఎంత వరకు చదివారు." అడిగింది సంపుటి.

"నాకు పిజి చదవే అవకాశం కుదర లేదు. బియస్సీ డిగ్రీ అందుకున్నాను." చెప్పింది కావ్య.


"అలానా." అనేసింది సంపుటి.


కావ్య తల దించుకుంటుంది.

అప్పుడే.. 

"మీ మథర్ చనిపోవడం.. అంత వరకు నాన్న లేని మీరు మీ అమ్మ సంరక్షణలో పెరగడం.. తను పోయేక.. తోబుట్టువులు లేని.. బంధువుల ఆదరణ లేని మీరు.. ఒంటరి పోరాటం చేస్తూ.. అదరక, బెదరక.. ఈ ట్యూషన్ సెంటర్ పెట్టి.. మీ కాళ్ల మీద మీరు నిలదొక్కుకోవడం.. మీ వార్తలో రాసారు. నిజంగా బ్రేవ్." అన్నాడు రాఘవ.


"స్టూడెంట్స్ కు వర్క్ ఇచ్చి రానా." అంది కావ్య.


"ష్యూర్ ష్యూర్.. ప్రొసీడ్ ప్లీజ్." అనేసింది సంపుటి.

కావ్య లేచి.. అటు కదిలింది.


'అప్పటిలా కావ్య లేదు.. ఇప్పుడు ఆమెలో కష్టాల అలుపు స్పష్టంగా అగుపిస్తుంది.' తనలో తాను అనుకుంటున్నట్టు బయటికే అనేసాడు రాఘవ.


తల తిప్పి.. రాఘవనే చూస్తూ..

'సింపతా లేక కన్సర్నా.' అనుకుంది సంపుటి.

పిమ్మట.. 

"తనలో ఎట్టి ఆందోళన అగుపించడం లేదు. తను కష్టాల నుండి తెములుకున్నట్టు ఉంది." అనేసింది బయటికే.


అప్పుడే అక్కడికి కావ్య వచ్చేసింది.

ఆ ఇద్దరూ ముభావం అయ్యారు.

కావ్య కూర్చుంది.

"మీకు టీచింగ్ పై తొలి నుండి ఇష్టమా." అడిగాడు రాఘవ.

రాఘవను చూస్తూ.. 

"లేదు. నిజంగా మీరే ఇన్స్పిరేషన్.. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు.. ఖాళీ సమయాల్లో కోరి.. మీ పిలుపుతో చేరిన మన క్లాస్మేట్స్ కు మీరు కెమిస్ట్రీ సబ్జెక్ట్ టీచ్ చేసేవారు కదా. నేనూ అటెండ్ అయ్యేదాన్ని. మీ టీచింగ్ విధం బాగా నచ్చింది. సులభంగా సబ్జెక్ట్ అర్థమయ్యేది. మీలా చెప్పగలిగితే బాగుంటుందనుకునే దాన్ని. నేను టీచింగ్ చేపట్టడానికి అదే కారణం." చెప్పింది కావ్య.

ఇబ్బందయ్యాడు రాఘవ.

"మీ ట్యూషన్ సెంటర్ బాగా రన్ అవుతుందా." నెమ్మదిగా అడిగాడు రాఘవ.

సంపుటి శ్రోతలా చాలా సేపు నుండి ఉండిపోయింది. 

"బాగుంది. ఎయ్త్ క్లాస్ స్టూడెంట్స్ నుండి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వరకు మాత్రమే ఇక్కడ చేర్పించుకుంటున్నాను.. మాథ్స్, సైన్స్ సబ్జెక్ట్స్ మాత్రమే టీచ్ చేస్తున్నాను. టోటల్ గా ముప్పై ముగ్గురు వస్తున్నారు." చెప్పింది కావ్య.

రాఘవ.. కావ్య నుండి చూపు తిప్పి.. సంపుటిని చూసాడు.

అప్పటికే తననే తను చూస్తుండడం గుర్తించి..

"వెల్.. మరి మేము బయలుదేరుతాం. ఆల్ ద బెస్ట్." కావ్యతో చెప్తూనే.. లేచి నిల్చున్నాడు.

సంపుటి కూడా లేచింది.

ఆ ఇద్దరి వెనుకే.. వీథి గమ్మం వరకు వచ్చింది కావ్య.

'బై'ల పిమ్మట.. సంపుటి డ్రయివింగ్ సీటులో కూర్చోగా.. రాఘవ ఆమె పక్క సీటులోకి ఎక్కాడు.

ఆ కారు కదిలింది.

కావ్య లోనికి నడిచింది.

 ***

దారిలో..

"సంపుటి." అన్నాడు రాఘవ.

"ఉఁ. చెప్పు." అంది సంపుటి.. రోడ్డునే చూస్తూ.

"మనం.. కావ్యకు ఏ రకంగానైనా సాయ పడగలమా." మెల్లిగా అడిగాడు రాఘవ.

సంపుటి వెంటనే ఏమీ అనలేదు. ఆమె చూపు ఇంకా రోడ్డు వైపే ఉంది.

రాఘవ.. సంపుటినే చూస్తున్నాడు.

"ఎలా ఐతే బాగుంటుంది." అడిగింది సంపుటి.. చూపు తిప్పకుంటానే.

"తనకు టీచింగ్ మీద ఇష్టం ఉంది." చెప్పుతున్నాడు రాఘవ.

అడ్డై..

"అది మనకు ప్రస్తుతం ఉపయోగపడదుగా." అంది సంపుటి.

"ఫ్యూచర్ లో ఉపయోగపడవచ్చు." చెప్పాడు రాఘవ.

రాఘవను చూస్తూ.. "ఎలా" అంది. వింతవుతుంది సంపుటి. 

రాఘవ ఏమీ అనక పోయే సరికి.. తిరిగి రోడ్డు వైపుకు చూపు మార్చుకుంది.

అర నిముషం తర్వాత.. "ప్రస్తుతం మనం డిగ్రీ, పిజి స్టాండర్డ్స్ కే.. మన సర్వీస్ లు అందిస్తున్నాం. ఫ్యూచర్ లో ఇంటర్మీడియట్ వారిని కూడా అలవ్ చేసుకొని.. వారికి కూడా మన సర్వీస్ లు అందించ వచ్చుగా." చెప్పాడు రాఘవ.

రాఘవను చూసింది సంపుటి.

సంపుటినే చూస్తున్నాడు రాఘవ.

తిరిగి చూపు మార్చి.. "కావ్య కోసమా." అడిగేసింది సంపుటి.

వెంటనే మాట్లాడలేక పోయాడు రాఘవ. పిమ్మట మెల్లిగా సర్దుకుంటూ..

"మనం.. మన మోటివ్ ను విస్తృత పర్చుకుంటే బాగుంటుదనుకుంటున్న." చెప్పాడు.

ఆ వెంబడే..

"అదీ.. నీకు సమ్మతి ఐతేనే." చెప్పాడు.

సంపుటి తల తిప్పింది. రాఘవను చూసింది.

అతడు తననే చూస్తున్నాడు.

రాఘవ చూపుల్లోని ఆపేక్షకు సంపుటి సమ్మతించింది.

***

సరిగ్గా సంవత్సరం గడిచింది.

ఆ లోపున..

శ్రీహరి కొత్త కెమికల్ ఫార్ములా సంపుటి చొరవతో ఒక కన్సర్న్ ప్లేస్ న సబ్మిట్ చేయబడింది.

కావ్య ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ట్యూటర్ గా తమ కొత్త బ్రాంచ్ న రాఘవ చొరవతో చేరింది.

తమకు ఘనంగా పెళ్లి కావడంతో రాఘవ లాగనే..

సంపుటి మురిసింది.

 ***

ముగిసింది.


========================================================================

                                      ***శుభం***


సంపుటి మురిసింది ధారావాహికను ఆదరించిన మా ప్రియమైన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత శ్రీ బివిడి ప్రసాదరావు  గారి తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.

======================================================================== 

బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.





47 views0 comments

Comments


bottom of page