'Samskaraniki Namaskaram' - New Telugu Story Written By Pitta Gopi
Published In manatelugukathalu.com On 04/02/2024
'సంస్కారానికి నమస్కారం' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
మానవుడు ఈ భూమి మీద ఎన్నెన్నో పాఠాలు నేర్చుకున్నాడు మరియు నేర్చుకుంటున్నాడు. అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి రాగలిగే శక్తి ఉందంటే మనిషి ఎంత గొప్ప పనితనం నేర్చుకున్నాడో ఇట్టే అర్థం అవుతుంది.
ఇంత నేర్చుకున్నా కూడా.. ! సాటి మనిషికి కాసింత సహాయం ఎప్పుడు చేయాలో, ఎందుకు చేయాలో, ఎలా చేయాలో నేర్చుకోలేకపోతున్నాడు. సరికదా.. ! తమకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని వీలు చిక్కినపుడల్లా దోచుకుంటుంటారు.
పుట్టుకతో ఒక వ్యక్తి పేదవాడు అయితే అలాంటి వారికి కనీసం అనుభవించటానికి ఆస్తులు కూడా ఉండవు. వారి పిల్లలు అయినా మంచి స్థానాల్లో ఉంటారనుకుంటే అది కూడా జరగదు.
ఇక అదృష్టం అంతా ధనవంతులదే అనుకుంటాం. నిజమే. దీనికి తోడు వాళ్ళ పిల్లలు కూడా పెద్ద ఉద్యోగాలు సాధించి వారి సంపాదనను మరింత పెంచుతారు. ఇంత సంపాదిస్తున్నా కొందరు పక్కవాడికి కాసింత సహాయం చేస్తామని, తోటివారికి సహాయపడతామని ఆలోచించరు.
అలాంటి ఆలోచనను దరికి కూడా రానివ్వకుండా జయచంద్ర చాలా కాలంగా పదిమందికి సహాయం చేస్తు తృప్తిగా బతుకుతున్నాడు.
బాగా సంపాదించటం, లేనివారికి దానం చేయటం, మంచి సంస్కారవంతంగా బతకటం అతని చిన్నప్పటి కల. ఆ కల కోసం జయచంద్ర నిజంగా చాలా కష్టపడ్డాడు. అతడు, అతడి బార్య ప్రభుత్వ ఉద్యోగులు కావటంతో నిజాయితీగా పని చేస్తు వచ్చారు. ఇప్పుడు బార్య భర్తలు రిటైర్డ్ అయ్యారు. ఇప్పుడు అతడి కొడుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు.
ఇంకేం.. ఏ ఆలోచన లేకుండా అతడు సాటి వారికి సహయం చేస్తు బతుకుతున్నాడు. జయచంద్ర ఎంతటి సంస్కారవంతుడు అంటే.. కేవలం ఆస్తులు ఉన్నాయని, డబ్బు ఉందని మాత్రమే కాకుండా.. మరికొన్ని అడుగులు ముందుకేసి స్వయంగా అతడు కష్టపడుతు వచ్చిన డబ్బుతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. అందులో భాగంగా స్వచ్ఛంద సంస్థలు నిర్వహించి ఎందరో పేదలకు అపన్నహస్తం అందిస్తున్నాడు.
ఓ 5 స్టార్ హొటల్ నడుపుతూ వచ్చిన డబ్బుతో స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్నాడు. ఆ హోటల్లో కూడా తను కూర్చోకుండా వెయిటర్స్ తో సమానంగా పని చేస్తున్నాడు. పదిమంది కోసం కష్టపడుతున్నాడు కానీ దాన్ని కష్టంగా భావించుకోటం లేదు అతడు.
ఆ హొటల్ తో జయచంద్ర ఆదాయం లక్షల్లో వస్తుంది. అక్కడికి వచ్చే పేదలకు కూడా ఫ్రీగా పెడుతూ మిగిలిన వారికి టోకెన్లు ఇస్తుంటారు జయచంద్ర సిబ్బంది. జయచంద్ర కూడా ఎవరికి ఏ ఆహారం కావాలో అడిగి వెయిటర్స్, మేనేజర్ అనే తారతమ్యం లేకుండా పనిచేస్తున్నాడు.
అందుకే అతడి సేవలను ప్రభుత్వం గుర్తించి అవార్డు, బిరుదు ప్రధానం చేయటానికి సభను ఏర్పాటు చేసింది.
ఆ సభకు చాలామంది ప్రముఖులు వచ్చారు. సభా వేదిక పైకి రేష్మ అనే అమ్మాయి వచ్చింది. జయచంద్ర సేవలను అందరికీ వివరించారు. సన్మానించారు మరియు సేవా విక్రమార్క అనే బిరుదు ప్రధానం చేశారు. అవార్డును రేష్మ చేతులు మీదగా ఇచ్చారు. రేష్మని చూడగానే ఆ అవార్డుని జయచంద్ర తిరస్కరించాడు. రేష్మ తలదించుకుంది. జయచంద్ర ఎందుకు తిరస్కరించారో అక్కడ ప్రముఖులు ఆరా తీశారు.
"ఒకరోజు ఒక మహిళ అయిన ఈమె తన ఇద్దరు స్నేహితులతో నా హోటల్ కి వచ్చింది. కారు ఆగగానే హోటల్ ముందు రద్దీ క్రమబద్ధీకరించటానికి ఆమె కారుని నా హోటల్ సిబ్బంది ఒకరు డ్రైవర్ కి సిగ్నల్ ఇస్తుండగా రేష్మ కారు దిగి ఆ సిబ్బంది చెంప చెళ్ళుమనిపించి పర్సు నుండి డబ్బులు తీసి "సారీ.." అంటు ముఖం పై డబ్బులు విసిరి లోపలికి వెళ్ళింది. జయచంద్ర గమనించినా ఊరుకున్నాడు.
తమకు కావల్సిన ఆహరం ఆర్డర్ ఇవ్వగా తానే తెచ్చి వారి ముందు పెట్టాడు. వాటితో పాటు కర్చీఫ్, టిస్యు పేపర్ కూడా పెట్టాడు. అయితే పొరపాటున ఆ పేపర్ రెష్మ స్నేహితురాలిపై పడింది. అంతే.. ! రేష్మ జయచంద్ర పై కస్సుబుస్సులాడింది. ఆమె స్నేహితులు సముదాయించే లోపే జయచంద్ర చెంప చెళ్ళుమనిపించి పర్సు లో రెండు వేల నోట్లు తీసి జయచంద్ర చొక్కా జేబులో పెట్టి అహంకారంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది.
ఆమె అహంకారాన్ని నిలువరించేందుకు వెయిటర్స్ ప్రయత్నించగా జయచంద్ర వారిని సముదాయించాడు. కాస్తో కూస్తో మంచి మనసున్న ఆమె స్నేహితురాల్లు ఇద్దరు బిక్కముఖం వేసుకుని "క్షమించండి" అంటు రెష్మ వెళ్ళిన దారిలో వెళ్ళిపోయారు" జరిగింది వివరించాడు జయచంద్ర.
"నేను ఈ ఘటనకు ఏ మాత్రం బాదపడలేదు. ఎందుకంటే.. ! ఎవరి వ్యక్తిత్వం వారిది, ఎవరి సంస్కారం వారిది. అందరు నాలాగనే మంఛిగా ఉండాలని నేను అనుకోవటం లేదు. సంస్కారవంతుడిగా సేవ చేస్తూ ఈ అవార్డుకి నేను అర్హుడిని అయితే ఆ అవార్డుని సంస్కారహీనత కల్గిన, అహంకారం నిండిన ఈమె చేతులు మీదగా తీసుకోవటం సమంజసమేనా.. ? నా స్థానంలో మీరు ఉంటే ఇలాగే ఆనందంతో తీసుకుంటారా.. ?” ప్రశ్నించాడు.
ఆమాటలకు అందరూ నిశ్శబ్దం అయిపోయారు. సభాకు వచ్చిన జనం నుండి
"ఇలాంటి సంస్కారం లేని మనుషులకు అసలు ఈ వేడుకకు ఆహ్వానం ఇచ్చింది చాలక.. ఇంకా వేదిక ఎక్కించటం, ఎంతో సంస్కారం కలిగిన వ్యక్తిలా అవార్డు ఆమె చేతులు మీద ఇస్తారా.. ఆమె కంటే కూడా మిగిలిన వారు సంస్కారహీనులా " మాటలు వినపడ్డాయి.
రేష్మ కలుగజేసుకుని
"సభకు నమస్కారం. నిజంగా ఆయన చెప్పింది నిజమే. నాకు అహంకారం ఎక్కువ. అయితే.. ! జీవితంలో ఏ మనిషికైనా ఇలాంటి గాయాలు తగులుతాయి. అహంకారంతో విర్రవీగే మనుషులకు మార్చటానికి ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. ఇప్పుడు నేను మంచిగా మారటానికి ఈ ఒక్క గాయం చాలు. ఇంతమంది జనం ముందు నాకు అవమానం జరిగింది అని నేను బావించటం లేదు. ఎందుకంటే నా వలన ఎందరో అవమానపడ్డారు. వారితో పోలిస్తే నాకు జరిగిన అవమానం పెద్దదేమి కాదు.
వేదికపైకి వచ్చినపుడే ఈయన గార్ని చూశాను. ఇంతటి గొప్ప సంస్కారం కలిగిన వ్యక్తిని అవమానించిన నాకు ఈ వేదికపైకి వచ్చే అర్హత కూడా నాకు లేదు. సభ ముగియగానే క్షమాపణలు చెబుదాం అనుకున్నాను కానీ.. నా చేతులు మీదుగానే ఆయనకు అవార్డు ఇస్తానని మాత్రం అనుకోలేదు. ఇప్పుడు నేను మారాను. ఈయనలా సేవలు చేస్తానో లేదో కానీ నా వలన ఏ ఒక్కరు బాదపడకుండా నడుచుకుంటాను " అని కన్నీరు పెట్టింది.
"ఈ అవార్డును నేను కాకుండా మీలో ఒకరు ఇవ్వండి ఈరోజుల్లో ఇంతటి గొప్ప వ్యక్తులను భవిష్యత్ లో మనం చూస్తామో లేదో.. అంతటి కీర్తి గడించిన ఈ సేవ విక్రమార్కకు, ఇతని సంస్కారానికి ఇవియే మా నమస్కారములు " అని చేతులు జోడించింది.
ఆ మాటలతో సభా ఒక్కసారి ఈలలు, చప్పట్లు, కేకలతో మారుమోగగా జయచంద్రకి అవార్డు ప్రధానం చేశారు ప్రముఖులు.
***** ***** ***** *****
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )
Profile:
Youtube Playlist:
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
Comments