'Sanchika Pongindi - Episode 2/6' - New Telugu Web Series Written By BVD Prasada Rao
'సంచిక పొంగింది - ఎపిసోడ్ 2/6' తెలుగు ధారావాహిక
రచన: బివిడి ప్రసాదరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ:
సంచిక శ్రీకర్ మంచి స్నేహితులు.
ఒక టెస్ట్ రాయడానికి ఇద్దరూ మరో ఊరు వచ్చి హోటల్ లో స్టే చేస్తారు.
అనుకోకుండా వాళ్ళు ఉన్న గదికి పోలీసులు వస్తారు.
ఇక సంచిక పొంగింది ధారావాహిక రెండవ భాగం చదవండి..
"ఎవరు మీరు." అడిగాడు ఒక పోలీసు.
"ఫ్రెండ్స్ మి." చెప్పాడు శ్రీకర్.
సంచిక అయోమయంలో ఉంది.
"ఎక్కడ నుండి వచ్చారు. ఎందుకు వచ్చారు." టకటకా అడిగేస్తున్నాడు మరో పోలీస్.
శ్రీకర్ చెప్పాడు.
"ఐతే హాల్ టికెట్స్ చూపండి." కటినంగా ఉంది పోలీసుల వ్యవహారం.
సంచిక వాటిని చూపింది.
"సరే. బాగుంది. పేరెంట్స్, ఎల్డర్స్ లేకుండా ఇలా ఇద్దరే రావడం ఏమిటి." అడిగాడు పోలీస్.
"తప్పా. ఏం రాకూడదా." టక్కున ప్రశ్నించింది సంచిక.
"మగ మగ పర్వాలేదు. ఆడ ఆడ కొంత వరకు పర్వాలేదు. ఇలా ఆడ మగ.."
మాట్లాడుతున్న పోలీస్ కు అడ్డై..
"చాలు చాలు. తొక్కలోని స్టేట్మెంట్స్ ఆపండి." రోషంగా అంది సంచిక.
"మాకు లేని అభ్యంతరం మీకు ఎందుకు." వెంబడే ప్రశ్నించాడు శ్రీకర్.
"అయ్యో. మీ మంచికే చెప్పుతున్నాం. అనవసరమైన అపోహలకు తోవ వేయ వద్దు అన్నది మా భావన." చెప్పాడు పోలీస్.
ఆ ఇద్దరూ మాట్లాడ లేదు.
"లేని పోని తల నొప్పులు.. ఎందుకు." అన్నాడు మరో పోలీస్.
"సరి సరే. టేక్కేర్. రేపు ఒక్క రోజే ఎగ్జామ్ గా. అది కాగానే.. మీ ఊరు పోండి. ఇలా స్టే కొనసాగించ వద్దు." చొరవగా చెప్పాడు ఒక పోలీస్.
ఆ తర్వాత.. ఆ వచ్చిన పోలీసులు వెళ్లి పోయారు.
శ్రీకర్ రూం డోర్ మూసేశాడు.
"అబ్బ. చెత్త. డిస్ట్రబెన్స్. చదివే మూడ్ దొబ్బింది." చిరాకవుతుంది సంచిక.
"కూల్ కూల్. చిక.. పడుకుందాం. ఎర్లీ అవర్స్ లో లేపుతాను. అప్పుడు చదువుదాం. ఐనా.. రివిజనేగ." అక్కడి పుస్తకాలు మూసి.. వాటిని తమ బేగ్ మీద పెట్టాడు శ్రీకర్.
లైట్ ఆర్పి.. మంచం ఎక్కాడు.
"గుడ్నైట్." చెప్పింది సంచిక.
"వెరీ గుడ్నైట్." అనేశాడు శ్రీకర్.
ఇద్దరూ ఆ డబుల్ కాట్ మీద నడుములు వాల్చారు. నిద్రకు ఉపక్రమించారు.
మర్నాడు..
పరీక్ష రాసి ఇంటికి వచ్చిన సంచిక.. తన తండ్రి సీతారాంతో..
"మార్పు ఇంకా రావడం లేదు." అంది చిరాగ్గా.
"ఏం ఐంది." అడిగాడు సీతారాం.
"మగ ఆడ కలిసి ఒకే రూంలో ఉంటే అదో తప్పులా మాట్లాడేస్తే ఎలా." ఇంకా చిరాకులోనే ఉంది సంచిక.
కూతురునే చూస్తున్నాడు సీతారాం.
తమ టూర్ లోని ఆ పోలీస్ ల కబుర్లు ఆపడం లేదు సంచిక.
ఆమెకు ఆడ్డై..
"మనలాగే ఎదుట వారు ఆలోచించాలని లేదు కదా." చెప్పాడు సీతారాం.
"అది కాదు డాడీ.."
"అర్ధమైంది. కుదురవ్వు. మనకు లోటు కానప్పుడు.. ఏమీ పట్టించుకో వద్దు. చాలా సార్లు చెప్పానుగా. ప్రతి సారి తంటాలేనా." అనేశాడు సీతారాం కాస్తా సీరియస్ గానే.
సంచిక తగ్గుతుంది.
అప్పుడే.. "డిన్నర్ కు ఇద్దరూ రండి." కేకేసింది సంచిక తల్లి.. కమల.. డైనింగ్ టేబుల్ దరి నుండి.
"లే." అన్నాడు లేస్తూ సీతారాం.
సంచిక లేచింది.
ఇద్దరూ ఆ హాలు నుంచి.. డైనింగ్ టేబుల్ వైపు కదిలారు.
శ్రీకర్ ఇంటిలో..
డిన్నర్ చేస్తూ..
"నువ్వు మగవాడివి. సంచిక ఆడది. తను ఇబ్బంది కాకూడదు." అంది శ్రీకర్ తల్లి.. సుశీల.
"ఆ పోలీసుల తీరును తనే ఖండించింది మమ్మీ." చెప్పాడు శ్రీకర్.
"మనం ఏమిటో మనకు తెలుసు. థట్సాల్." కల్పించు కున్నాడు శ్రీకర్ తండ్రి.. శాంతారావు.
ఆ వెంబడే.. "మీ మమ్మీ తీరు అంతే. పాము చావ కూడదు.. కర్ర ఇరగా కూడదు." నవ్వేడు శాంతారావు.
అప్పుడే సుశీల.. ఏదో చెప్పబోతుండగా..
"వదిలేసి. మన పిల్లల సంగతి మనకు తెలియందా. వీళ్లు పక్కా ట్రాన్స్ఫరెంట్ పర్షన్స్. నో డౌట్. కాదా." అడిగాడు శాంతారావు.
సుశీల ఏమీ అనక.. అన్నంలో రసం వేసుకుంటుంది.
పిమ్మట అక్కడ డిన్నర్ నిశ్శబ్దంగా ముగిసి పోయింది.
మర్నాడు..
లైబ్రరీ నుండి బయటికి వచ్చారు.. సంచిక, శ్రీకర్ లు.
"మనం మాట్లాడాలి." చెప్పాడు శ్రీకర్.
ఆ వెంబడే.. "పెద్ద చెరువు వాకింగ్ ట్రాక్ వైపు వెళ్దాం." చెప్పాడు.
సంచిక తన స్కూటీ స్టార్ట్ చేసింది.
శ్రీకర్ తన బైక్ స్టార్ట్ చేశాడు.
ఇరవై నిముషాల పిమ్మట..
ఆ ఇద్దరు.. ఆ వాకింగ్ ట్రాక్ సైడ్ న.. ఎడమగా ఉన్న ఓ సింగిల్ సిమెంట్ బెంచీ మీద కూర్చుని ఉన్నారు.
"చెప్పు." అంది సంచిక.
"మన ఫ్రెండ్షిప్ అపార్ధాల వైపు నెట్ట బడుతుందేమో అనిపిస్తుంది." చెప్పాడు శ్రీకర్.
"అలా ఎలా అనగలుగుతున్నావు." టక్కున అంది సంచిక.
ఆ వెంబడే.. "ఆ పోలీసుల తతంగంతో అలా అంటున్నావా." అంది.
"అదీ కావచ్చు. కానీ.. ఆ తంతు కంటే మునుపు మరి కొన్ని మనం ఫేస్ చేశాంగ." గుర్తు చేశాడు శ్రీకర్.
"మనం తొలుత నుండి అట్టి వాటిని పట్టించుకోవడం లేదుగా కర్. మరి ఇప్పుడెందుకా మాటలు." చెప్పింది సంచిక.
శ్రీకర్ వెంటనే ఏమీ అనలేదు.
"మన ఇద్దరం క్లీన్. అలాగే మన పేరెంట్స్ మద్ధతు లభిస్తుంది. మరి అటు ఎందుకు ఆలోచన చేస్తున్నావు." అడిగింది సంచిక.
"మరే. మమ్మీ రాత్రి కూడా అంది. సంచిక ఆడది.. తనకు ఇబ్బంది రాకూడదు అని." ఆగాడు శ్రీకర్.
"ఫో. నాకు ఏం ఇబ్బంది. నో నో." తేలిగ్గా అనేసింది సంచిక.
"అది కాదు చికా.. పెళ్లి తర్వాత.. నీ ఆయన.. ఏమైనా.. నీ గురించి.. తప్పుగా అనేసినా.. అనుకున్నా.." నీళ్లు నములు తున్నాడు శ్రీకర్.
"ఛుఫ్. ఆపాపు. చాల్లే." అనేసింది సంచిక.
శ్రీకర్.. సంచికనే చూస్తున్నాడు.
తనూ శ్రీకర్ నే చూస్తూ.. "ఇంతకీ నువ్వు ఏమంటావ్. బహుశా.. పెళ్లి తర్వాత.. నీ ఆవిడ.. ఏమైనా.. నీ గురించి.. తప్పుగా అనేస్తుందనా.. అనుకుంటుందనా.. ఆఁ." గమ్మున అనేసింది.
"అబ్బబ్బే. అలా అడిగితే నేను కన్వెన్స్ చేయ గలను.. చేస్తాను కూడా." చెప్పేశాడు శ్రీకర్.
"అబ్బో. అక్కడికి నేనే వెర్రిదాన్నా. నేను ఆ పని చేయలేనా.. చేయనా." అడిగింది సంచిక.
"అది కాదు. అలా కాదు. నువ్వు ఆడదానివిగా. నీకు ఆపోహ అంట రాదు. అదే నా ఆలోచన. అంతే." చెప్పగలిగాడు శ్రీకర్.
"బాగుంది. కొత్తగా ఈ ఆడ మగ తేడా తెస్తున్నావేమిటి. ఏమైంది నీకు." విడ్డూరమవుతుంది సంచిక.
శ్రీకర్ తడబడుతున్నాడు.
"నోర్మూసుకో. అంతైతే.. మన పెళ్లిళ్లకు ముందే.. మన గురించి ఆయా వాళ్లకు వివరణ ఇద్దాం. వాళ్లు సమ్మతిస్తేనే మనం అట్టి పెళ్లిళ్లకు సరే అందాం. సరేనా మహాప్రభూ." గబగబా చెప్పేసింది సంచిక.
శ్రీకర్ తలాడించాడు.
"చాల్లే. ఆ కబుర్లాటలైతే.. వాటిని ఆపేసి. లే. ఇళ్లకు వెళ్దాం." లేచింది సంచిక.
శ్రీకర్ లేచాడు.
"మరో మారు ఇట్టివి తేకు. తేస్తే తాట తీసేస్తాను." హెచ్చరికలా చెప్పేసింది సంచిక.
శ్రీకర్ ఏదో అనబోయాడు.
"నోర్మూయ్. సే.. యస్. అంతే." అనేసింది సంచిక.
"చిత్తం." అనేశాడు శ్రీకర్.
"థట్స్ గుడ్." నవ్వింది సంచిక.
నవ్వేశాడు శ్రీకర్.
ఇద్దరూ.. తమ తమ వెయికల్స్ తో తమ తమ ఇళ్ల వైపు బయలుదేరారు.
======================================================================ఇంకా ఉంది..
=======================================================================
బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Comments