top of page
Writer's pictureBVD Prasada Rao

సంచిక పొంగింది - ఎపిసోడ్ 4



'Sanchika Pongindi - Episode 4/6' - New Telugu Web Series Written By BVD Prasada Rao

'సంచిక పొంగింది - ఎపిసోడ్ 4/6' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)



జరిగిన కథ:


సంచిక శ్రీకర్ మంచి స్నేహితులు.


ఒక టెస్ట్ రాయడానికి ఇద్దరూ మరో ఊరు వచ్చి హోటల్ లో స్టే చేస్తారు.


అనుకోకుండా వాళ్ళు ఉన్న గదికి పోలీసులు వస్తారు.

పెళ్లికాని యువతీయువకులు ఇలా ఒక గదిలో ఉండటం మంచిది కాదంటారు పోలీసులు.

సంచికకు ఇబ్బంది రానివ్వ వద్దని శ్రీకర్ తల్లి అతనితో చెబుతుంది.

ఇంటర్వ్యూకి వెళ్లిన శ్రీకర్, సంచికలకు వాగ్దేవి అనే యువతి పరిచయమవుతుంది.

ఆ ఉద్యోగం తనకు చాలా అవసరమని చెబుతుంది.


ఇక సంచిక పొంగింది ధారావాహిక నాలుగవ భాగం చదవండి..


ఉదయం తన ఇంటిలో ఉండగా.. వాగ్దేవి నుండి సంచికకు ఫోన్ వచ్చింది.

కాల్ కు కనెక్ట్ ఐ.. "హలో వాగ్దేవి." అంది.


"మనం ఎటెండ్ ఐన ఇంటర్వ్యూ రిజల్ట్స్ ఏమైనా తెలిశాయా." అడిగింది వాగ్దేవి."లేదు." చెప్పింది సంచిక.


"అవునా. నేను హాస్పిటల్ లో ఎడ్మిటై ఉన్నాను. ఏమైనా తెలిస్తే తెల్పండి." చెప్పింది వాగ్దేవి.


"అలానే. ఐనా.. హాస్పిటల్ లో ఏంటి." ఆరా తీస్తుంది సంచిక.


"రోడ్ మీద నా స్కూటీ స్కిడ్ ఐంది. పడ్డాను. పాదం దగ్గర కాలు కొద్దిగా ఫ్రైక్చర్ ఐంది." చెప్పింది వాగ్దేవి.


"ఓ గాడ్. టేక్కేర్. ఇంటర్వ్యూ గురించి మాకేమైనా తెలిస్తే చెప్పగలను." చెప్పింది సంచిక.


"ప్లీజ్." అంది వాగ్దేవి.


"ఇట్స్ ఓకే." అంది సంచిక.


ఆ కాల్ ను కట్ చేసేసింది వాగ్దేవి.

ఆ సాయంకాలం..

శ్రీకర్, సంచిక లైబ్రరీలో కలుసుకున్నారు.

మాటల మధ్య వాగ్దేవి గురించి ప్రస్తావించింది సంచిక.


"అవునా. తన హాస్పిటల్ లో ఉందా. ఓ మారు వెళ్దామా." అన్నాడు శ్రీకర్.


"వెళ్లాలా." అడిగింది సంచిక.


"బాగుంటుందిగా. తను మరీ భయస్తురాలాయే." అనేశాడు శ్రీకర్.


"సరే ఐతే." అంది సంచిక. ఆ వెంబడే వాగ్దేవికి కాల్ చేసింది.


వాగ్దేవి ఆ కాల్ కు కనెక్ట్ కాగానే.. "నేను సంచికను. ఏ హాస్పిటల్ లో ఉంటున్నావ్." అడిగింది.

వాగ్దేవి చెప్పింది.


"సరే. మేము వస్తున్నాం." చెప్పింది సంచిక.


"రిజల్ట్ వచ్చేసిందా." టక్కున అడిగింది వాగ్దేవి.


"లేదు. బహుశా రేపు రావచ్చుట." చెప్పింది సంచిక. తర్వాత ఆ కాల్ ను కట్ చేసేసింది.


శ్రీకర్, సంచిక.. తమ తమ వెయికల్స్ తో ఆ హాస్పిటల్ కు బయలు దేరారు.

అర గంట గడిచాక.. వాళ్లు ఆ హాస్పిటల్ లో.. వాగ్దేవి చెంతన ఉన్నారు.


వాగ్దేవి తన తల్లిని పరిచయం చేసింది. అలానే తన తల్లికి సంచికను, శ్రీకర్ ను పరిచయం చేసింది.


"నాన్న లేరు. నేను.. అమ్మే." చెప్పింది వాగ్దేవి.


"అందుకొచ్చింది అనే సరికి.. ఈ దెబ్బ. చాలా కష్టంగా ఉంది." చెప్పింది వాగ్దేవి తల్లి, కామాక్షి.


"దిగులొద్దు ఆంటీ. అన్నీ సర్దుకుంటాయి." చెప్పింది సంచిక చొరవగా.


"ఆయన చనిపోయాక.. నేను టైలరింగ్ చేస్తూ.. దీనిని చదివించ గలిగాను. దీనికి ఏదో ఉద్యోగం వస్తే.. కాస్తా కుదుట పడవచ్చు అనుకున్నాను. ప్చ్." విచారమవుతుంది కామాక్షి.


"డోన్ట్ వర్రీ. వాగ్దేవి తేరుకుంటుంది. మీకు సాయం అవుతుంది." చెప్పగలిగాడు శ్రీకర్.


"అమ్మాయి చెప్పింది.. మీరు చాలా ధైర్యం చెప్పారట. దాంతో తను ఇంటర్వ్యూ బాగానే చేసిందట. తనకు ఉద్యోగం రావచ్చు అంది." చెప్పింది కామాక్షి.


"తను నేర్పు ఐనదే. కానీ కాస్తా భయం. అంతే." నవ్వుతూ అంది సంచిక.


"ముందు.. చిక.. ఐ మీన్.. సంచిక అంతే. కొన్నింటి తర్వాత పరీక్షల భయం తనను వీడింది." నవ్వేడు శ్రీకర్.


"మరే. నువ్వూ ఏం పోటుగాడివి కాదు. నువ్వు రాను రాను తేరినవాడివే." నవ్వింది సంచిక.

అక్కడి వారంతా నవ్వుకున్నారు.


"రిజల్ట్స్ నోటీస్ బోర్డులో పెడతారట. మేము చూసి తెల్పుతాం లే. ఏమీ వర్రీ వద్దు." చెప్పింది సంచిక.. వాగ్దేవితో.


పిమ్మట.. సంచిక, శ్రీకర్ అక్కడ నుండి కదిలారు.

మర్నాడు మధ్యాహ్నం..

తిరిగి ఆ ఇద్దరూ వాగ్దేవి వద్దకు వచ్చారు.


"రిజల్ట్స్ ఇచ్చేశారు. మేము సెలెక్ట్ కాలేదు. నువ్వు అయ్యావు. కంగ్రాట్స్." చెప్పింది వాగ్దేవితో సంచిక.


"అదేమిటి. మీరూ బాగానే చేశారన్నారుగా." నొచ్చు కుంటుంది వాగ్దేవి.


"అంతే. వాళ్ల నార్మ్స్ వాళ్లవి. మాకు ఇది మామూలే." అన్నాడు శ్రీకర్.


"కొరియర్ ద్వారా ఆర్డర్స్ ఇంటికి పంపుతున్నారట. వచ్చే సోమవారమే జాయినింగ్." చెప్పింది సంచిక.


వాగ్దేవి ఏమీ అనలేదు.

"అయ్యో. వచ్చే సోమవారమే. అమ్మాయి నెల రోజులు వరకు నడవ రాదట. వీల్ఛైర్ లోనే కదలాలట." చెప్పింది కామాక్ష్మి.


"రేపు ఇంటికి పంపేస్తున్నారు." చెప్పింది వాగ్దేవి.


"అలానా." అనేసింది సంచిక.


"వీల్ఛైర్ లోనే ఆఫీసుకు వెళ్లొచ్చుగ." అనేశాడు శ్రీకర్.


"ఈ రద్దీ రోడ్లు మీద వీల్ఛైర్ తో.. కష్టమే మరి." అంది సంచిక.


"అలా అంటారా." దిగులవుతుంది కామాక్షి.


ఆ వెంబడే.. "తను నడవ లేదు. నేనే తీసుకు వెళ్ల వలసి ఉంటుంది. ఎలాగో ఏమో. ఆఫీస్ లంటే నాకు తెలవదు." అంటుంది.


"ఆంటీ. నోన్ట్ వర్రీ. మేము ఉన్నాం. మీకు అలవాటు పరుస్తాం. సరేనా." హామీలా అంది సంచిక.

శ్రీకర్ దానికి వంతు పాడేడు.


ఆ వెంబడే.. "మీ ఇల్లు ఎక్కడ." అడిగాడు.

వాగ్దేవి అడ్రస్ చెప్పింది.


ఈ లోగ.. "ముందు ఆ కంపెనీ వాళ్లని కలిసి.. వాగ్దేవి సిట్యువేషన్ చెప్పి.. వాళ్ల నుండి ఏమైనా ఫేవర్ సంపాదించ వచ్చేమో." అంది సంచిక.


"ప్రయత్నిద్దాం." ఒప్పేసుకున్నాడు శ్రీకర్.


"ఆంటీ.. రేపు మీ ఇంటికి వస్తాం. వాగ్దేవి మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వండి. ఆ ప్రయత్నం చేస్తాం." చెప్పింది సంచిక.


"థాంక్స్." అంది వాగ్దేవి.


మర్నాడు..


ఆ కంపెనీ మేనేజర్ ముందు ఉన్నారు శ్రీకర్, సంచికలు.

వాగ్దేవి పరిస్థితిని వివరిస్తున్నారు.. ఆధారాలు చూపుతూ.


చివరికి ఆ మేనేజర్ మాట్లాడేడు. "మరి.. ఆమె వీల్ఛైర్ లో కూడా.. ఆఫీస్ కు రావడం కుదరదంటారా." అడిగాడు.


"ముమ్మాటికి. హెవీ ట్రాఫిక్ తప్పక ఆటంకం అవుతుంది. ప్లీజ్.. ఆమెకు సహకరించండి." వేడుకుంటుంది సంచిక.


"నెల అంటే కుదరదు.. కష్టం కూడా. ఇక్కడ వర్క్ లోడ్ జాస్తీగా ఉంది. అందుకే ఎకాఎకీ ఈ నియామకాలు." తన నిస్సహాయత అగుపరుస్తున్నాడు ఆ మేనేజర్.


వెంటనే శ్రీకర్ ఏమీ అనలేక పోయాడు.


సంచిక మాత్రం.. "మీరు అనుమతిస్తే.. ఆమె చేరే వరకు.. ఆమె వంతు.. మీరు చూపిన వర్క్ నేను చేసి పెట్టగలను. మీ పనికి ఆటంకం కలగనీయను. ఒప్పుకోండి ప్లీజ్." చెప్పింది.


ఆ మేనేజర్ అయోమయం అయ్యాడు. "అది ఎలా." అనేశాడు.


"నేను ఆమె బదులు తప్పక వర్క్ చేయగలను. ఆమే మీ ఎంప్లాయ్. బట్ పరిస్థితి బట్టి కొద్ది సర్దుబాటు. ఆలోచించండి.. సహకరించండి." పట్టుగా రిక్వెస్ట్ చేస్తుంది సంచిక.

శ్రీకర్ తోడయ్యాడు.


"మేనేజ్మెంట్ తో మాట్లాడాలి. మాట్లాడి వస్తాను. మీరు వెయిట్ చేయండి." చెప్పేశాడు మేనేజర్. పిమ్మట లేచి.. అటు వెళ్లాడు.

అర గంట తర్వాత.. తిరిగి వచ్చాడు.


"మేనేజ్మెంట్ మెత్త బడింది. ఇవి రూల్స్ కు విరుద్ధం. కానీ.." ఆగాడు.


"మరో సంశయం వద్దు. సంచికకు అవకాశం ఇవ్వండి. తను వాగ్దేవి వంతు పనిని మీకు కచ్ఛితంగా చేసి పెడుతుంది. ప్లీజ్." అన్నాడు శ్రీకర్.


ఆ మేనేజర్ 'సరే' అనేశాడు.

ఆ వెంబడే.. "ఇది ప్రయివేట్ సెక్టర్ కనుక.. వీలు కల్పించబడింది." చెప్పాడు.


సంచిక, శ్రీకర్.. కోరస్ గా "థాంక్స్." చెప్పారు.


"నేను కొన్ని పేపర్లు ఇస్తాను. వాటి మీద ఆమె.. ఐ మీన్.. ఆ వాగ్దేవి గారి సంతకాలు తీసుకొని తీసుకు రండి. సోమవారం నుండే మీరు ఆమె బదులు రండి. ఆమె వచ్చేక.. మీరు తప్పుకోవాలి. అందుకు మీరు కొన్ని పేపర్లు మీద సంతకాలు చేయవలసి ఉంటుంది."


"తప్పక." ఒప్పేసుకుంది సంచిక.


అక్కడ నుండి నేరుగా.. వాగ్దేవి ఇంటికి వెళ్లారు సంచిక, శ్రీకర్ లు.

విషయాన్ని చేర వేశారు.


వాగ్దేవి కూలవుతుంది. కామాక్షి మాత్రం తెగ సంతోషం.. ధన్యవాదాలు వ్యక్త పరిచింది.


సోమవారం నాడు..

ఆ కంపెనికి వాగ్దేవి బదులు సంచిక వర్క్ కై బయలు దేరింది.

అందుకు ఆమె పెద్దలు మురిశారు కూడా.

శ్రీకర్.. సంచికను ఫాలో అయ్యాడు.

======================================================================ఇంకా ఉంది..

=======================================================================


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







55 views0 comments

Comments


bottom of page