top of page
Writer's pictureBVD Prasada Rao

సంచిక పొంగింది - ఎపిసోడ్ 5


'Sanchika Pongindi - Episode 5/6' - New Telugu Web Series Written By BVD Prasada Rao

'సంచిక పొంగింది - ఎపిసోడ్ 5/6' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ:


సంచిక శ్రీకర్ మంచి స్నేహితులు.


ఒక టెస్ట్ రాయడానికి ఇద్దరూ మరో ఊరు వచ్చి హోటల్ లో స్టే చేస్తారు. అనుకోకుండా వాళ్ళు ఉన్న గదికి పోలీసులు వస్తారు. పెళ్లికాని యువతీయువకులు ఇలా ఒక గదిలో ఉండటం మంచిది కాదంటారు పోలీసులు. సంచికకు ఇబ్బంది రానివ్వ వద్దని శ్రీకర్ తల్లి అతనితో చెబుతుంది.


ఇంటర్వ్యూకి వెళ్లిన శ్రీకర్, సంచికలకు వాగ్దేవి అనే యువతి పరిచయమవుతుంది. వాగ్దేవి ఉద్యోగానికి సెలెక్ట్ అయినా తనకి యాక్సిడెండ్ కావడంతో నెలరోజులు ఆఫీసుకు రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. తాత్కాలికంగా ఆ ఉద్యోగం చేయడానికి సంచికకు ఆ కంపెనీ నుండి అనుమతి లభిస్తుంది.


ఇక సంచిక పొంగింది ధారావాహిక ఐదవ భాగం చదవండి..


డోర్ బెల్ మోగుతుంది.

కామాక్షి డోర్ తెరిచింది.

ఎదురుగా.. శ్రీకర్.


కామాక్షి పలకరించింది. లోనికి ఆహ్వానించింది.

హాలులో వాగ్దేవి వీల్ఛైర్ లో ఉంది.

శ్రీకర్ అక్కడి సోఫాలో కూర్చున్నాడు.


"కాఫీ తేనా బాబూ" అడిగింది కామాక్షి.


"అడగడం ఏంటి. తే. " చెప్పింది వాగ్దేవి.


"లేదు లేదు. వద్దు. నా బ్రేక్ఫాస్ట్ ఐ.. గంట కూడా కాలేదు."

చెప్పాడు శ్రీకర్.


ఆ వెంబడే.. "ఆంటీ అలా కూర్చొండి. " అన్నాడు.


కామాక్షి మరో సోఫా కుర్చీలో కూర్చుంది.

"సంచిక.. వాగ్దేవి ప్లేస్ లో రిపోర్ట్ ఇచ్చింది. నేను హాజరయ్యాను. అటు నుండే నేరుగా ఇలా వచ్చాను. " చెప్పాడు శ్రీకర్.


"అంతా సవ్యమేగా బాబూ. " అంది కామాక్షి.


"ఏమీ కంగారు లేదు. వాగ్దేవి తేలికయ్యే వరకు.. తన వర్క్ ను సంచిక చేసి పెట్ట గలదు. " చెప్పాడు శ్రీకర్.


"మీ సాయంని మరవం బాబూ. " చెప్పింది కామాక్షి.


"ముమ్మాటికి. మీ తీరులు మమ్మల్ని కుదుట పెట్టాయి. థాంక్స్. " చెప్పింది వాగ్దేవి.


"మరదే. ఆ కంపెని వాళ్లు ఛాన్స్ ఇచ్చారు. లేక పోతే మేము చేసేది ఏమీ ఉండదు. " చెప్పాడు శ్రీకర్.


"లేదు లేదు. మీ ప్రయత్న మూలంగానే వాళ్లు సానుకూలంగా స్పందించగలిగుంటారు” అంది వాగ్దేవి.


మాట మార్చ తలచి.. "మరే ఆలోచన వద్దు. ఆరోగ్యం కుదుట పర్చుకోవడమే నీ ప్రస్తుత కర్తవ్యం. " చెప్పాడు శ్రీకర్.. వాగ్దేవితో.


"జాగ్రత్తగానే మెసులుకుంటున్నాను. త్వరలోనే దీని నుండి గట్టెక్కగలను. " చెప్పింది వాగ్దేవి.


"థట్స్ గుడ్. గట్టెక్కేస్తావు. డోన్డ్ థింక్ అదర్వైజ్. " చెప్పాడు శ్రీకర్.


"మీ ఇద్దరికి ఉద్యోగాలు రాక పోవడమే వెలితిగా ఉంది. " చెప్పింది కామాక్షి.


"ఇది రాలేదు. మరోటి రాకపోదు. ప్రయత్నిస్తాం. " చెప్పాడు శ్రీకర్.


"సంచిక చాలా చురుకైనది. " అంది కామాక్షి.


"చురుకే కాదు.. చొరవైనది. " చెప్పాడు శ్రీకర్.


"అవునవును. " అనేసింది వాగ్దేవి.


"మీరు చాన్నాళ్లుగా ఎరిగన వాళ్లలా ఉన్నారు. " అంది కామాక్షి.


"మరీ చాన్నాళ్లు కాదు. మేము డిగ్రీ చేస్తున్న రోజుల నుండి పరిచయస్తులం. మా వ్యూస్ కలిశాయి. మేము ఈజీగా మెసులుకో గలుగుతున్నాం. మా మూలంగా మా ఇరు కుటుంబీకులు బాగా చేరువ అయ్యి పోయారు. దాంతో మాకు మరింత స్వేచ్ఛ కుదిరింది. " చెప్పాడు శ్రీకర్.


ఆ వెంబడే.. "మా ఇరు వైపు పెద్దలకు మేమంటే ఏంటో తేలి పోయింది. మేము మంచి స్నేహితులమే కాదు.. మేమిద్దరం ఒకరికి ఒకరం మంచి హితులం. " చెప్పాడు.


"తెలుస్తుంది. " అంది కామాక్ష్మి చిరునవ్వుతో.


ఆ వెంబడే.. "మా ఇద్దరం.. మాకు మీమేలా బతుకుతున్నాం. తనకు నేను.. నాకు తను. అంతే. మా ఇద్దరికీ చొరవ తక్కువ.. బెంబేలు ఎక్కువ. " చెప్పింది కామాక్షి.


"అలా డిసైడ్ కాకండి. కోరి కలవండి. అవసరం మేరకు నడుచుకు పోతుండండి. అలా అని మీ హద్దులు వీడనక్కర లేదు. " చెప్పాడు శ్రీకర్.


"మీ పరిచయం.. మీ మాటలు.. మమ్ము కాస్తా.. కాదు కాదు.. బాగానే మోటివేట్ పరుస్తున్నాయి. " మాట్లాడింది వాగ్దేవి.


చిన్నగా నవ్వేశాడు శ్రీకర్.

ఆ వెంబడే.. "నేను వెళ్లి వస్తాను. టేక్కేర్. " అన్నాడు. లేచి నిల్చున్నాడు.


కామాక్షి కూడా లేచి నిల్చుంది.


"ఏ అవసరమైనా ఫోన్ చేయండి. మేము అప్పుడప్పుడు వచ్చి కలుస్తుంటాం లెండి. త్వరగా తేరుకుంటారు. అంతా సవ్యం అవుతుంది. బి హేఫీ. " అన్నాడు శ్రీకర్.. వాగ్దేవితో.


గుమ్మం వరకు శ్రీకర్ వెంటే కామాక్షి వచ్చింది.

శ్రీకర్ తన బైకును స్టార్ట్ చేశాడు. తన ఇంటికి బయలు దేరాడు.


వారం తర్వాత..

శ్రీకర్, సంచికలు.. వాగ్దేవి ఇంటికి వచ్చి ఉన్నారు.


"సండే.. హాలిడే. ఈ రోజు వేల్యూ ఇప్పుడు తెలుస్తుంది. నిన్నటి వరకు వర్క్ లో మునిగిన నేను.. ఈ రోజు గాలిలో తేలుతున్నాను. " సరదాగా అంది సంచిక.


కామాక్షి అందరికి కాఫీ కలిపి ఇచ్చింది. తనూ కాఫీ కప్పుతో వాళ్లతో కూర్చుంది.

వాళ్లంతా హాలులో ఉన్నారు.


"థాంక్స్ సంచిక. " అంది వాగ్దేవి.


"నో. నేనే నీకు థాంక్స్ చెప్పాలి. జాబ్ మీద మోజు పెంచావు. హాలిడే మజా చవి చూపావు. " చెప్పింది సంచిక.


"మీ ఇద్దరికీ త్వరలోనే జాబ్ లు రావాలి. మాకు అప్పుడే సంతోషం. " చెప్పింది కామాక్షి.


"అందుకు మా ప్రయత్నాలు మావి అవుతున్నాయి. " చెప్పాడు శ్రీకర్.


"వాగ్దేవి జాబ్ లోకి వచ్చే వరకు నాకు అట్టి అవకాశం అంద కూడదు. " చెప్పేసింది సంచిక.


"అదేమిటమ్మా. అలా అనేశావు. " నొచ్చుకుంది కామాక్షి.


"అంతేగా ఆంటీ. వాగ్దేవి జాబ్ లోకి వచ్చేస్తే.. నా చొరవ ఎంచక్కా చక్కబడినట్టు అవుతుందిగా. " అంది సంచిక.


"మీరు మంచోళ్లు. మీ మనసులు మంచివి. మీకు తప్పక ఎప్పుడూ మంచే జరుగుతుంది. " చెప్పింది కామాక్షి.

"థాంక్స్ ఆంటీ. " అనేశాడు శ్రీకర్.


వాళ్లు కాఫీ తాగుతూ మాటలు కొనసాగిస్తున్నారు.

"కంపెని ఎలా ఉందమ్మా. అక్కడ పని ఈజీగా ఉంటుందా. " అడుగుతుంది కామాక్షి.


అడ్డై.. "ఆంటీ.. కంపెని బాగుంది. అక్కడి పని తీరు బాగుంది. తమ ఎంప్లాయ్స్ నుండి తమకు కావలసింది.. సరళంగా రాబెట్టుకుంటున్నారు. ఆల్ ఆర్ ఓకే. " చెప్పింది సంచిక.


"మరే. ఇది కాస్తా బెరుకైనది. అందుకే ఆరాలు తీస్తున్నాను. " చెప్పుతుంది కామాక్షి.


అడ్డై.. "ఆంటీ. మీకు అదే వద్దన్నాను. ఆ ఆలోచన తుడి చేయండి. వాగ్దేవి.. మీరు అనుకున్నంత దేమీ కాదు. తను కాస్తా నెమ్మదస్తురాలు. అంతే. చూడండీ. తను జాబ్ లోకి ఎంటర్ అయ్యేక.. తనూ మెఱికైపోతుంది. " చెప్పాడు శ్రీకర్.


"అవును ఆంటీ. మీరు దిగులు వదలండి. " అనేసింది సంచిక.


కొద్ది సేపు అక్కడ మాటలు లేవు.

ఆ వెంబడే.. వాగ్దేవి మాట్లాడింది. "నిన్న హాస్పిటల్ కు వెళ్లాను. " చెప్పింది.


"ఎలా. ఆంటీకి వీలు ఐందా. " అడిగింది సంచిక.


"రోడ్డు ఓరగా.. వీల్ఛైర్ నడుపుతూ.. తీసుకు వెళ్లగలిగాను. " చెప్పింది కామాక్షి.


"ఏం. హాస్పిటల్ వాళ్లు ఏమైనా తీసుకు రమ్మన్నారా. " అడిగాడు శ్రీకర్.


"అవును బాబూ.. వారం వారం చూపించమన్నారు. " చెప్పింది కామాక్షి.


"అలానా. చూసి.. ఏమైనా చెప్పారా మరి. " అడిగాడు శ్రీకర్.


"ఊతంతో చిన్న చిన్నగా అడుగులు వేస్తూ నడవమన్నారు. అలా నడుస్తున్నప్పుడు కట్టు కాలు మీద.. భారం పడకుండా.. వత్తిడి కానీయకుండా చూసుకోమన్నారు. " చెప్పింది కామాక్షి.


"అవునా. ఆ పని మొదలెట్టారా. " అడిగింది సంచిక.


"ఇంకా లేదు. " చెప్పింది వాగ్దేవి.


"మేము ఉన్నాంగా. ట్రై చేద్దాం. " అంది సంచిక. లేచి నిల్చుంది.


శ్రీకర్ కూడా లేచాడు.

ఆ ఇద్దరు చెరో సైడ్ ఊతం ఇస్తూ.. వాగ్దేవిని మెల్లిగా పైకి లేపారు.


వాగ్దేవి వెనకకు చేరింది కామాక్షి.

వాగ్దేవి చిన్న చిన్నగా అడుగు లేస్తుంది.


"గుడ్ గుడ్. గుడ్ ఇమ్ప్రూవ్మెంట్. థట్సా ఫైన్. " అన్నారు కోరస్ లా.. సంచిక, శ్రీకర్ లు.


పది నిముషాల లోపునే..

"చాలు. ఇప్పటికి చాలు. " అనేసింది కామాక్షి.


"సరే. నిజమే.. ఈ రోజుకు ఇది చాలు. " అంది వాగ్దేవి.


ఆ వెంబడే.. "హాస్పిటల్ లో చెప్పారు. రోజుకు ఓ మారు.. అదీ పది నిముషాలే చాలు అని. " చెప్పింది.


వాగ్దేవిని తిరిగి వీల్ఛైర్ లో కూర్చుండ బెట్టేక..

"ఆర్ యు ఓకే. " అడిగింది సంచిక.


"బాగున్నాను. " చెప్పింది వాగ్దేవి.


"గుడ్. మరి మేము వెళ్లి వస్తాం. టేక్కేర్. " చెప్పాడు శ్రీకర్.


ఆ వెంబడే.. "ఇక నుండి రోజూ వస్తాను. నేను వచ్చే వరకు వాగ్దేవిని మీరు లేపి నడిపించ వద్దు. ఆంటీ.. మీరు ఒక్కరూ కాయలేరు. " చెప్పాడు.


"పర్వాలేదు. అమ్మ చూసుకుంటుంది. " చెప్పింది వాగ్దేవి.


"నో. తను వస్తాడు. " చెప్పింది సంచిక.


ఆ తల్లీ కూతుళ్లు ఏమీ అనలేదు.

పిమ్మట సంచిక, శ్రీకర్ అక్కడ నుండి కదిలారు.

======================================================================ఇంకా ఉంది..

=======================================================================


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







59 views0 comments

Comments


bottom of page