'Sandeharayullu' - New Telugu Article Written By Sudarsana Rao Pochampally
Published In manatelugukathalu.com On 29/02/2024
'సందేహరాయుళ్ళు' తెలుగు వ్యాసం
రచన : సుదర్శన రావు పోచంపల్లి
చెట్టునుంచి కొబ్బరికాయ రాలితె సామాన్యంగా రాలిందిగదా అని సామాన్యులు తీసుకపోయి వాడుకుంటారు- అదే కొందరికి దానిమీద సందేహ మేర్పడుతుంది కాయ రాలడానికి కారణమేమిటని - ఎక్కువ గాలి వీచి రాలిందా, చెట్టుమీదికెక్కి కోతి పడేసిందా, కాయ ముదిరి కాలంతీరి పడిందా లేక చెట్టు బలహీనబడిందా అని రకరకాల సందేహాలొస్తుంటాయి.
అట్లనే దారిలో ప్రమాద వశాత్తు వ్యక్తి చనిపోతె దానికి వివిధ కారణాలు వెదుకుతారు ఆ వ్యక్తి అనుకోకుండా ప్రమాదానికి గురయ్యిండా లేక ఇందులో ఎదో కుట్ర ఉండవచ్చు అని అనుమానము పొడచూపుతుంది. ఆ సందర్భంగా పోలీసులైతె వివిధ కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు - నిజమైన ప్రమాదమా- ఎవరైనా కావాలని చేశారా లేక ఆ వ్యక్తే ఆత్మహత్యకు పాలుపడ్డాడా లేక వ్యక్తిగాని ప్రమాదము చేసిన వ్యక్తిగాని మద్యము సేవించి ఉన్నారా లేక వ్యక్తికి ఆకస్మిక గుండెపోటు వచ్చిందా ఇట్లా వివిధ కోణాలలో పరిశొధన చేస్తూ ఉంటారు-
అట్లనే పెళ్ళయిన కొత్తలో అమ్మాయి ఈ భర్త తో నేను కాపురము చేయలేను అంటే ఇందులో ఏదో పెద్ద కారణము ఉండవచ్చు అనుకొని ఊహించుతారు -అబ్బాయి ప్రవర్తన బాగులేదా లేక అమ్మాయి మీద చేయి చేసుకుంటాడా అతనికేమైనా దురలవాట్లు ఉన్నాయా, లేక శారీరక బలహీనుడా, సంపాదన లేకుండా ఉన్నదా పనిదొంగనా, అవివేకా ఇట్లా ఎన్నో రకాల ఆలోచిస్తుంటారు-
అట్లనే వయసుముదిరిన అబ్బాయి పెళ్ళికి ఉన్నాడని ఎవరైనా సమాచారమిస్తె అతనికి ఇంతకాలము పెళ్ళి కాకపోవడానికి కారణమేమిటి- అమ్మాయి దొరకకనా- సమాజానికి పరిచయము కాకనా, చదువులో వెనుకబడ్డాడా, అబ్బాయి తలిదంద్రుల ప్రవర్తన బాగలేదా, ఎక్కువ వరదక్షిణను ఆశించాడా, లేదా విప్రలబ్దుడయ్యాడా, కాకపోతె అమ్మాయిలు నచ్చకనా- పెళ్ళంటే భయమా ఇట్లా ఆలోచిస్తూ పోతుంటారు-
ఎవరైనా ఒకవస్తువు బజారు విలువకంటె అగ్గువకిస్తానంటె అది నాసిరకమా, ఎక్కడైనా దొంగిలించి తెచ్చాడా, లేక డబ్బులు చాలా అవసరముండి తక్కువ ధరకు అమ్ముకుంటున్నాడా, నాణ్యతా లోపమా లాంటి సందేహాలు ఉత్పన్న మైతావి.
ఇంట్లో అబ్బాయి చదువుకోను బడికి పోను అంటే అందులోను సందేహమే వీనికి చదువు వంటబట్టకనా, పాఠ శాలలొ తోటి విద్యార్థులతో తగవా, లేక ఉపాధ్యాయులు మందలిస్తారా, దురవలాట్లకు లోనయ్యాడా, సోమరితనము ఆవహించిందా అనె అనేక సందేహాలు కలుగకపోవు.
పక్కింటి పార్వతమ్మ వచ్చి వదినగారూ మీ ఇంట్లో ఏమైనా కూరలు చేస్తే కాస్త మాకూ పెడతారా అని అడుగుతె అందులోనూ సందేహమే-వీళ్ళకు గతిలేకనా, ఒంగలేకనా, చేయడానికి బద్దకమా, సమయము సరిపోకనా, లేక వీళ్ళు చేస్తె రుచిగా ఉంటవనా ఇంకా ఇంకా ఎన్నో సందేహాలు కలుగుతుంటాయి.
అనుకోకుండా ఎవరైనా చుట్టము వస్తె తినిపోవడానికి వచ్చిండా, డబ్బులు అడుగడానికి వచ్చిండా, ఇంట్లో అలిగి వచ్చిండా వాస్తవానికి ఊళ్ళో ఏదైనా పని ఉండి వచ్చిండా ఇట్లా సందేహాలు కలుగుతూనే ఉంటాయి.
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
Comments