top of page

సంక్రాంతి 2024



'Sankranthi 2024' - New Telugu Article Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 15/01/2024

'సంక్రాంతి 2024' తెలుగు వ్యాసం

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము   

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)


'క్రము పాదవిక్షేపే'  అనే ధాతువు మీద వచ్చిన పదమే క్రాంతి అనేది. 


క్రాంతి అనే పదానికి మెల్లగా తాను 

ఉన్నచోటునుండి కదులుతూ కదులుతూ ఆ మీది స్థానంలోకి ఒక ప్రత్యేక ప్రణాళిక ప్రకారం చేరేది అని అర్థం.


'అయి జ్ఞానే 'అనే ధాతువు మీద ఏర్పడిన పదమే 'అయన'

మనేది. అయనమంటే ఒక విష యాన్ని తెలియజేసేది అని అర్థం. దక్షిణ, ఉత్తరం గురించి సవివరంగా తెలియజేసేవే దక్షిణ, ఉత్తర అయనాలే. 


చంద్రమా మనసో జాతః-చక్షో స్సూరో అజాయత- అని వేద

మంత్రం.దక్షిణ మనేది మనసుక సంకేతమైతే (చంచలంగా ఉంటూ అకృత్యాలని చేయించేది)ఉత్తరమనేది బుద్దికి సంకేతం.(చేయకూడని వేమిటో తెలిపి చేయకుండా ఉండేలా చేసేది).


అందుకే దక్షిణాయనాన్ని (మనసు)అదుపు చేయాల్సి వుంటూంటే ఉత్తరాయణాన్ని (బుద్దిని)పదునుపెడుతూ వుంటే జీవితం సక్రమంగా వెళుతుందన్న మాట. 


మకరరాశి లోనికి సూర్య ప్రవేశం  జరిగిన దానిని "మకరసంక్రాంతి"ని ఉత్తరాయణం అంటారు. 

సోమవారం నాడు మకరసంక్రాంతివస్తే "ధ్వాంక్షీ సంక్రాంతి" అంటారు. 


'''భోగభాగ్యాలు పంచే భోగిపండుగ 


యోగ ఆధ్యాత్మిక ఆరోగ్య ఖగోళ జ్యోతిశ్శాస్త్ర మర్మాల సమ్మేళనం 

మకరసంక్రాంతి-- 


ఐకమత్యానికి గుర్తుగా వేసే రథం ముగ్గుకు ప్రతీక కనుమ పండుగ. 


విశ్వమానవ శ్రేయస్సు కోరే ఈ పెద్ద పండుగ మనందరికీ సర్వశుభాలను తేవాలని కోరుకుంటూ 

-- సంక్రాంతి శుభాకాంక్షలతో 

రావమ్మా: మహాలక్ష్మీ: రావమ్మా::

-----------------------------------------------

సంక్రాంతి శుభాకాంక్షలతో--------


అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము &

ఉదయసుందరి.


38 views0 comments

コメント


bottom of page