top of page
Writer's pictureYasoda Gottiparthi

సంక్రాంతి సంతోషం

#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #సంక్రాంతిసంతోషం, #SankranthiSanthosham, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


Sankranthi Santhosham  - New Telugu Story Written By - Yasoda Gottiparthi

Published In manatelugukathalu.com On 17/01/2025

సంక్రాంతి సంతోషం - తెలుగు కథ

రచన: యశోద గొట్టిపర్తి


“అమ్మా! ఎక్కడున్నావ్?” అంటూ వీధి తలుపులు బార్లా తెరిచి యుండటం తో, ఇంత తెల్లవారు జామునే తలుపులు ఎవరూ తీశారు అని ఆశ్చర్య పోయింది కూతురు నయని. 


“ఇక్కడే ఉన్నాను” అన్నమాట బయటినుండి రావడం తో వాకిట్లో కి వెళ్లి వేస్తున్న ముగ్గు చూస్తూ నిలబడింది. “ఆప్పుడే తల స్నానం చేశావు ముగ్గు వేస్తున్నావు ఇంత చలిలో ఏమిటి ? ప్రత్యేకం?”


“నువ్వు కూడా రోజూ ఈ సమయానికి లేచి పూజకు తయారు కావాలి. మార్గశిర మాసంప్రారoభంలో నుండి మార్గలి మొదలవుతుంది. తెల్లవారుజామునే ఐదు గంటల ప్రాంతంలో లో వాకిలి ని ఆవుపేడతో కళ్ళాపి చల్లి, తల స్నానం బావిలోని నీరు గోరు వెచ్చగా వంట్లో చలిని పారద్రోలి శుభ్రమైన వస్త్రములను ధరించి. పిండి లేదా సున్నం రాయి పొడి తోనైనా అందమైన ముగ్గు పెట్టీ, ఆండాళ్ తల్లి గోపికలను నిద్రలేపి, రంగ నాధుల వారి పూజకు వేళ ఆయే రారమ్మా! అంటూ పాటలు పాడుతూ కోవెలకు పరుగులు తీస్తుంది. 


అలా మనం కూడా చేయాలి. విష్ణు చిత్తులవారి కుమార్తె గోదా దేవి ( ఆండాళ్), సంతానం లేక నిరీక్షిస్తున్న సమయాన తులసి వనంలో విష్ణు చిత్తుల వారికి లభించింది. పూల తోటలో లభించిన కుమార్తెను విష్ణు చిత్తుల దంప తులు అల్లారుముద్దుగా పెంచుకున్నారు. 


యుక్త వయస్సు వచ్చిన తరు వాత గోదాదేవి శ్రీవారు అయిన రంగ నాధులనే తన పతిగా పొందాలని తపించిoది. విష్ణు చిత్తులు ప్రతిరోజూ స్వామివారికి పూల మాలలు అలంక రణ గా తీసుకుని వెళ్ళేవారు. అయితే వాటిని ధరించిన తరువాత స్వామి వారికి పంపించసాగింది. ఒక రోజు

ఈ విషయం తండ్రి కితెలిసి చాలా దు:ఖించి స్వామివారికి మాలధారణ కావించరు. దీనితో స్వామి మొహం చిన్నబోతుంది. దీనికంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమని విష్ణు చిత్తులు బాధ పడుతుంటే, స్వామివారు విష్ణు చిత్తుల తో అదేమీ లేదని, అంతే కాకుండా ఇహ ప్రతి రోజూ తనకు గోదా దేవి ధరించిన మాల ధారణ కావాలని ఆదేశిస్తూ కలలో చెప్తారు. 


 తరువాత గోదా అమ్మవారు తోటి బాలికలతో కలిసి "తిరు ప్పావు" వ్రతా చరణ చేసింది. ముప్పది రోజులు ముప్పై పాశురాలు (పాటలు) తో రంగనాథుని కీర్తిస్తూ పూజలు చేసింది. వారిద్దరికీ వివాహం జరుగుతుంది. వివాహానంతరం గోదా దేవి ఆ చిద్వి లాసునిలో లీన మవుతుంది. అది చూసి విష్ణుచిత్తు లు దుఖిస్తుంటే, స్వామి విష్ణుచిత్తుు లకు జ్ఞానోపదేశం చేసి మాయ నుండి వెలుపలికి రావడానికి సాయం చేస్తారు. గోదా దేవి వ్రతాచరణ సమయంలో రచించిన "తిరుప్పావై" చాలా ప్రసిద్ధి చెందింది. దీనిని ధనుర్మాసంలో ( ధనుస్సు రాశిలో సూర్య సంక్రమణం) ప్రతి రోజూ విష్ణువు యొక్క ఆలయంలో రోజుకొక పాశురం (పాట) చొప్పున పఠిస్తారు. 


 విష్ణు చిత్తులు చాలా భక్తి కల మహనీయుడు. అందుకే లోకం పెళయ ఆళ్వార్ అని కీర్తిoచారు. 

ఈ రోజు నుండి సంక్రాంతి పర్వదినం ఎలాజరుపుకుంటారో చెపుతానమ్మా. పండుగకు చుట్టాలు, అక్కలు వస్తారు నువ్వు కూడా త్వరగా తయారు అయి దేవాలయం దర్శనానికి వెళదాం. 

 పూజా ద్రవ్యాలు, మంగళహారతి తో వెళ్లి కుoకుమ పూజలు చేసు కుందాము. అర్చన అభిషేకాలు జరుగు తాయి కన్నుల పండువుగా దేవుళ్ల దివ్యదర్శనం బాగుంటుంది. దేవాలయ ప్రాంగణం లో రంగుల రంగవల్లిక లు తీర్చిదిద్దుతారు భక్తులు. గంటలు. వినపడు తున్నాయి. నయని.. పద, తీర్థ ప్రసాదాలు తీసుకుందాం. 


తెలుగు సంస్కృతి, సంప్రదా యాలు లోని అంద చందాలు చాలా ఎక్కువగా కనపడేది పండుగ సమ యాల్లోనే, సoక్రాంతి పండుగలో అచ్చమైన తెలుగుదనం వెలుగు తూనే ఉంటుంది. మూడు రోజుల పెద్ద పండుగ అంటారు. పండుగలు అంటే పల్లెటూర్లలో జరిగి అక్కడి సంస్కృ తిని ప్రతి బింబింప చేస్తాయి. ఆరు కాలాలూ కష్టపడి పంటలు పండించి, చేతి వృత్తులు జీవనాధారమై పండుగ నాడు తమ కష్టాన్ని మరచి పోతారు. నిజమైన పండుగ వాతావరణం పల్లెల్లోని కనపడు తుంది. 


ఐకమత్యం, కట్టుబాటు కలిసి మెలిసి ఆప్యాయత తో అరమరికలు లేకుoడా, ఆడంబరాలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా కేవలం ఆనందాన్ని పంచేవే పండుగలు. ప్రకృతిని రక్షిస్తూ, పశు పక్ష్యాదులను ప్రేమిస్తూ వాటిని సంరక్షిస్తూ, పండిన పంటను ఇంటికి చేర్చి, గాదెల్లో గరి సెల్లో నింపుతారు. చెరకు తదితర పంటలు చేతికి వస్తాయి. తిండి పదార్థాలను బయట కొనకుండా, పండిన వాటితో మూడు రోజుల పండుగ జరుపుకుంటారు”. 


“అమ్మా! మనం అమ్మమ్మ వాళ్ల పల్లెటూరికి పోదాం పండుగకు”. 


“సరే అలాగే పోదాం, ముందు నువ్వు పరీక్షలకు బాగా చదువుకో సెలవుల్లో వెళ్ళు దాము”. 



“భోగి పండుగ గురించి చెపుతాను విను. భోగి పండుగ మొదటి రోజు పండుగ. ఆరోజు తెల్లవారు జామున కోడి కూయంగానేనిద్రలేచి, ఆముందు రోజే సమకూర్చుకున్న పాతబట్టలు, 

తట్టలు, బుట్టలు, విరిగిన చెక్క సామానులు ఒక్కటిగా వేసి మంట పెట్టీ చలి కాచుకుంటారు. 

అప్పుడప్పుడూ మంచు కురుస్తుంది. 


తలంటి స్నానాలు చేసి క్రొత్త బట్టలు ధరించి క్రొత్త కుండలో పొంగలి వండుతారు.  ఆ రోజు సాయంత్రం పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. క్రొత్తగా వచ్చిన రేగుపండ్లు, బియ్యం, నువ్వులు, పూవుల రెక్కలు, చెరకు ముక్కలు, నాణాలు వేసి కలిపి పిల్లల తలమీద నుండి మూడు చుట్లు త్రిప్పి తల మీద పోస్తారు”. 


“భలే భలే. నేనూ పోయించుకుంటాను’. 


“నీతోపాటు మామయ్య పిల్లలు పోయించుకుంటారు”.

***


“ఏమండీ! అమ్మాయిని మనుమరాలును పoడుగకు తీసుకురమ్మని అల్లుడు గారికి ఫోన్ చేసి చెప్పండి”. 


“నువ్వు ఒక పాసింజర్ రైలువే. నీలో సమాచారం పిల్లినడకలా వస్తుంది”. 


“అవును లెండి నామాటలు మీకు అలానే ఉంటాయి”. 


“నేను సూపర్ ఫాస్ట్ ట్రైన్ ను. అల్లుడుగారికి నువ్వు చెప్పినవన్నీ మొన్ననే చెప్పాను. సెలవులు రాగానే బయలు దేరి వస్తామన్నారు. నువ్వు ఇలా ఆందోళన పడుతావనే అలా మెల్లగా చెప్పాను నీకు. నేను పని వాళ్ళను పెట్టీ పూర్తి చేయిస్తాను నువ్వేమీ కంగారు పడకు”. 

“సరే నండి. మొదలు ఇల్లు శుభ్రం చేయాలి. దుమ్ము ధూళి దులపాలి. పిండి వంటలు కావలసిన సరుకులు కిరాణా కొట్టునుండి తెప్పించాలి. పిండి వంటలతో ఇల్లంతా ఘుమ ఘుమ లాడాలి. కూతురుకి అరిసెలు అంటే ఇష్టం. బియ్యం నానబెట్టి మెత్తగా పిండి మరకు పట్టిoచాలి. 

మా చిన్నప్పుడు పెద్దపెద్ద రోళ్ళలో, పొడువాటి రోకల్లతో దంచేవారు. ఇప్పుడు కూడా వాళ్ళున్నారు పిలుద్దాం. దంచి జల్లెడ పట్టి మెత్తటి పిండి ఇస్తారు”. 


“దంచoడమ్మా! కుందేనలు పెట్టండి పిండి ఎగిరి పైకి చిల్లుతుంది”. 


కొడుకు రఘురాం పిల్లలు వింతగా చూస్తున్నారు. “నానమ్మా ! పిండి దంచే వాళ్లు పాటలు పాడుతున్నారు. "


“దూరంగా నిలబడి వినండి అమ్మలూ”


కోడళ్ళు దంచుతుంటే అత్త అనే మాటలుతమపాటలోపాడుకుంటారు. 


"కోడలా దంచవే కిందకు అందేలా

కోడలా దంచవే గుండెదడ వచ్చేలా

కోడలా దంచవే రోకలి బాగా కదిలేలా

కోడలా దంచవే రోకలి బాగా కదిలేలా

కోడలా దంచవే రోట్లో పిండి అయ్యేలా

కోడలా దంచవె అప్ప చెక్కలు అయ్యేలా"


“బాగా పాడుతున్నారు నానమ్మా!”


“అవునమ్మా! వాళ్లు పాడుతూ దంచితే పడే కష్టం మరచిపోతారు. అలా దంచడం, చెరగటం లాంటివి వంటికి ఎక్సర్సైజ్ లా బలాన్నిస్తాయి. అందుకనే వాళ్ల ఎముకలు గట్టిగా ఉంటాయి”. 

***

“అమ్మాముగ్గమ్మాముగ్గు, సున్నపు

రాయి ముగ్గు తెల్ల నైన ముగ్గు”. 


“ఆ ముగ్గతనిని పిలుచుక రావే మనుమరాలా!”


“సరే నానామ్మా! కొనుక్కుందాం”. 


“ఆ ముగ్గు తో సంక్రాంతి నాడు మంచి మంచి పెద్ద పెద్ద ముగ్గులు వేయాలి. పచ్చని వాకిట్లో తెల్లని ముగ్గు చూడ చక్కగా ఉంటుంది”.

 

“నేను వేస్తాను ముగ్గు నానమ్మ” అంది మనుమరాలు సుమన. 


“పేపర్లో ముందు ప్రాక్టీస్ చేయి. ఎన్ని చుక్కలు పెట్టాలి, ఎలా కల్పాలో చాలా సార్లు పేపర్లో వేస్తే బాగా గుర్తుంటుంది తల్లి”. 


“అలాగే నానమ్మ నేను చుక్కల ముగ్గు వేస్తాను’. 


భోగి మందుగాకు ముందురోజే నయని తో బాటు తల్లి తండ్రి వచ్చారు. రాములమ్మ దంపతులు చాలా సంతోషంతో సందడిగా ఉంది. 


“భోగి మంటల కు పాత వస్తువులు కావాలి అమ్మమ్మ”. 


“చాలా వున్నాయి తల్లి. తెల్లవారు జామున మన పనివాడు వెంకడు అన్నీ తయారు చేస్తాడు చూద్దువు కానీ’. 


విరిగిన కుర్చీ ముక్కలు, పాత తాటాకు చాపలు, పాత బట్టలు తట్టలు అన్నీ మంటల్లో వేశారు. 


“రండి పిల్లలూ నయని, సుమనా పెద్దలందరూ భోగి మంట చుట్టూ అగ్ని దేవుడికి నమస్కారం చేస్తూ, భోగి మంటల చుట్టూతిరగండి. బాగా చలిగా ఉంది తెల్లారే వరకు ఈ మంటలు మండిoచాలి. మనలో ఉన్న చెడును కాల్చేసి, మంచిని పెంచుకోవాలి అందరికీ పంచుకోవాలి”. 


“పిల్లలూ జాగ్రత్త దూరం నుండి తిరగండి”. 

***


“బావా! నువ్వు లేవవా? ఉండు నీ పని చెప్తా”. 


మామకొడుకు చెవిలో " కూ" అని అరచింది. 


“ఈ కీచు పిట్ట పనిపడతా” అంటూ రెండు జడలు మెలి వేశాడు. 


“మేమంతా లేచి భోగి మంటల్లో చలి కాచుకుంటున్నాం నిద్రలేచి రా!

అమ్మమ్మకు చెప్తా నాజడలు గుంజాడని”నవ్వుతూ పరుగెత్తింది. 


సుశాంత్ కూడా చలి మంటలకు వెళ్ళాడు. 

వీధి వాకిల్లలో వేసిన ముగ్గు లను రంగు రంగుల రంగవల్లిక లను చూసి వచ్చారు. 


కూతురు కోడలు ముగ్గులో రంగులు దిద్దుతుంటే “నయని, సుమన.. గొబ్బెమ్మలు చేయoడిరా” అంది రాములమ్మ. 


సరే అంటూ ఆవు పేడను గొబ్బెమ్మలు చేసివాటిపై పూలను అలంకరించి ముగ్గుల మధ్యలో పెట్టారు. వాటి చుట్టూ తిరుగుతూ గొబ్బెమ్మ పాటలు పాడారు. 


“చిన్న తాతయ్య వాళ్ళింటికి వెళ్దాం. చిన్న నాన్నమ్మ అందరూ ఎలా ఉన్నారో చూసి వద్దాం”. 


“చిన్న నానమ్మ చకినాలు చేస్తూ, నూనెలో జార విడుస్తుండగా వేడి నూనె చేతి మీద పడి బొగ్గ లోచ్చాయట. రాములమ్మ నానమ్మ చెప్పింది”. 


“అయితే చూసి రావడానికి వెళ్లి నయని, సుమన నానమ్మకు మంట తగ్గేందుకు, బొబ్బలు రాకుండా

ఉండటానికి బర్నోల్ పెట్టాలి” అని చెప్పారు. 


“అవును తల్లి.. ఈ పల్లెటూర్లో అవి దొరకవు. నేను అప్పటికప్పుడు చల్లని నీళ్లు చల్లాను. అంతేనమ్మా”. 


“నేను బర్నాల్ తెచ్చాను నానమ్మా. నాదగ్గర ఉంది. చేయి చూపించు, నేను అయింట్ మెంట్ పెడతాను. ఇక్కడ దొరకవని అమ్మ తెచ్చింది”. 


“ఎంత ముందు చూపే తల్లీ. చాలా బాగుంది. మంట తగ్గి పోయింది”. 


సంక్రాంతికి ముందురోజు వచ్చే భోగ భాగ్యాలనిచ్చే పర్వదినం. పొంగలి చేస్తుంది అమ్మ. పిలుస్తుంది నయని. 


“ఆ( వస్తున్నా నానమ్మా!” 


పొంగలి తియ్యగా బాగుంది. వేడి వేడిగా ఈ చలిని తరిమేసింది. 


“పిల్లలూ మీరందరూ కొత్త బట్టలు వేసుకోoడి”. అని తీసుకొచ్చింది నానమ్మ.

 

“భలే భలే చాలా బాగున్నాయి”. 


“నానమ్మా! పిల్లలకే ఎందుకు పోస్తారు భోగి పండ్లు. పెద్దవాళ్లకు పోయరు?”


“పిల్లలకు నర దృష్టి ఎక్కువగా ఉంటుంది. వారిలో ఈర్ష్యాసూయలు ఉండవు. కల్మషం లేని మనసులు. వాడి తలమీద సూర్యాస్తమయం వేళ రేగుపండ్లు, బియ్యం, నువ్వులు, నాణెములు, పాల కాయలు, చెరకు ముక్కలు, పూవులు కలిపి పోయడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. 


ప్రతి పండుగలో సంక్రాంతి ఉన్నప్పటికీ మకర సంక్రాంతికి ప్రత్యేక ప్రాధాన్యత ఉండటానికి శాస్త్ర పరంగా అనేక రకాలున్నాయి. మనకు రెండు ఆయనములు. ఏడాదిలో ఆరు నెలలు ఉత్తరాయణం, మిగతా ఆరునెలలు దక్షిణాయనం. ఏడాదిలో ఆర్నెల్లు ఉత్తరాయణం దేవతలకు పగలు, ఆర్నెల్లు దక్షిణాయనం దేవతలకు ఒకరాత్రి. దేవతలు మేలుకుని ఉండే కాలం ఉత్తరాయణ పుణ్య కాలం కనుక దక్షిణాయనం నుండి ఉత్తరాయణం వైపు మారితే సంక్రాంతి కి అత్యంత ప్రాధాన్యత. 


జనవరి 14 న ఉదయం 8. 15 గంటలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవశిస్తాడు. కాబట్టి ఆ రోజు మకర సంక్రమణం. ఇంటి వెనుక పెద్ద రేగు చెట్టు ఉంది పిల్లలూచాలా పండ్లు కిందపడి ఉంటాయి తీసుకు రాండి. 


గాదే లో కొత్త బియ్యం ఉన్నాయి తీసుకు రామ్మా! కోడలా ఈ పండ్లు కలిపి, పక్కింటి పిల్లలను కూడా పిలిచి అందర్నీ కూర్చోబెట్టి భోగిపండ్లు పొద్దాము. పక్కింటి వాళ్ళు బొమ్మలకొలువు పెట్టారట 

అన్నీ రకాల బొమ్మలు చరిత్ర, పలు రకాల చెట్ల బొమ్మల వివిధ వరసల్లో అమర్చారు”. 


“నానమ్మా! నాకు ఆబొమ్మలు కావాలి. ఆ బొమ్మలు ఆడుకునేవి కాదు చూచి వాటి గురించి కథలు తెలుసు కోవాలి”. 


“మామయ్య, నాన్న, సుశాంత్ పతంగులు తయారు చేస్తున్నారు. వాటిని పెద్ద మాంజా దారoతో ఎగుర వేయాలని డాబా మీదకు వెళ్తున్నారు. మనము వెళదాం” అన్నది నయని. 

పతoగులు పోటీతో ఎగుర వేస్తారు. ఆకాశం నిండా రెక్కలు లేని పక్షుల్లా ఎగురుతున్నాయి. 


“నాన్నా! నీపతంగి పైపైకి పోతున్నది" అంది నయని. 


“మీరందరూ ఎగుర. వేయండి. గాలితో పైకి ఎగురుతాయి”. 


“నా పతంగి తెగి పోయింది. కనిపించటం లేదు”. 


“గాలి సమానంగా వీచినప్పుడు చక్కగా ఎగురుతాయి. సుడి గాలి వీచినపుడు తెగి పోతయమ్మా!” 

***


“ఈ ఏడు పంటలు బాగా పండినవి. అనుకున్న ఆదాయం చేతికి వచ్చింది. మీకు పండుగకు బట్టలు, బంగారం, వస్తువులు కొన్నాం. చూసుకోండి పిల్లలూ”

 

“నయని, సుమన.. మీకు చిన్న నెక్లెస్ లు”.

 

“బాగున్నాయి తాతయ్యా’. 


“సుమన.. నువ్వు ఇది తీసుకో మామాడిపిందెల గొలుసు”. 


“నాకు ఇదే కావాలి”. 


“అలా పొట్లడుకోవద్దమ్మా! పెద్ద దానివి కదా! సుమన.. నువ్వు అలా అనకూడదు, నయని మన అతిధి కదా! ఇచ్చేయమ్మా!"


“సరే తాతయ్యా!”


“పెద్దవాళ్లకు పెద్ద చైనులు తీసుకోండి”. 


“అమ్మా, నాన్న, మీరు మేం వచ్చినప్పుడు ఏవో బహుమతులు ఇచ్చి, మమ్మల్ని సంతోషపరుస్తారు. దానితో మేం సంతృప్తి పొందు తున్నాం”


“పండుగకు వచ్చిన ఆడపిల్లలకు కట్నాలు పెట్టడం ఆనవాయితీ. మాకు చేతనైన బహుమతులు ఇచ్చి పంపిస్తాము”. 


“మేము చిన్న చిన్న వ్యాపారాలు చేసు కుందామనుకుంటున్నాము”. 


“చేసు కోoడి. ప్రభుత్వ లోన్స్, చాలా బ్యాంకులు వడ్డీ తక్కువగా ఉన్నవాటిలో అప్పులు తీసుకుని వచ్చిన లాభాల్లో తీర్చుకోoడమ్మా.. మేము సంతోషి స్తాము”. 


“అలా అప్పులు చేసి వడ్డీలు కట్టడం తలకు మించిన భారమవుతుంది నాన్నా. 

ఆడపిల్లను కదా ! కట్నం కింద ఐదు ఎకరాలు భూమి నాపేరు మీద వ్రాస్తే, నేను ఆ భూమిని అమ్ముకుని, పెద్ద ఇల్లు కట్టుకుందామని అనుకుంటున్నాను”. 


“భూమి కన్నతల్లి వంటిది. అమ్ముకోవడం మంచిది కాదు. అమ్ముకుంటే మళ్లీ కొనలేము. నీకు పసుపు కుంకుమ కింద ఎప్పుడైనా ఆ ఐదు ఎకరాలు నీ భూమే. ఆ భూమిలో పండిన పoటలన్నీ అమ్మగా వచ్చిన ఆదాయాన్ని ప్రతి సంవత్సరం నీకే పంపిస్తాను అమ్మా! నీ ఇష్టంగా వాడు కోవచ్చును”


“నా మంచి నాన్న” అని రెండు చేతులతో కౌగిలించుకుంది. “ఈ సంక్రాంతి కానుక నాకు బాగా నచ్చింది”. 


“బయట కోడి పందాలు జరుగు తున్నాయి. చూద్దాం రండి పిల్లలు” అంటూ ప్రక్క వీధి లోకి పరుగెత్తారు అందరూ సంతోషంగా. 


శుభం


యశోద గొట్టిపర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి

హాబిస్: కథలు చదవడం ,రాయడం




30 views1 comment

1 Comment


సంక్రాంతి సంతోషం: యశోద గటిపర్తి


సంక్రాంతి నాలుగు రోజులు ఉంటాయి అని తెలిపింది.


I) భోగి

(చిన్నారుల పై భోగి పళ్ళు మరియు భోగి మంటలు ఇంట్లో ఉన్న పాత సామానుతో)


ii) మకర సంక్రాంతి / పొంగల్/ ఉత్తరాయణ / మగ్ బిహు

(సూర్యుడు ఇంకో రాశి లో అడుగు పెడతాడు ... పోంగల్ వండుకొని తింటారు)


iii) కనుమ

(పాడి ని (రైతుల ఆవులను, గేదెలను ముస్తాబు చేసి ... తిప్పి ... పండగ చేసుకుంటారు)


పంటలు కోసి చేతికొచ్చే రోజు - మాసం


iv) ముక్కనుమ


పాత తెలుగు సినిమాలు, చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయి.


అందరూ ఆప్యాయం తో కలిసి మెలిసి ఆత్మీయతతో పండగ జరుపు కోవాలి.


పేద - మధ్య తరగతి వారు ఆడంబరాలకు పోవద్దు. ఎక్కువ తలకు మించిన భారం - ఖర్చులు చేయ వద్దు.


అనుబంధాలు - మంచి మాటలు చేతలు ఆచరణ ఆరోగ్యం ఉంటే చాలు.


ఎక్సలెంట్... Excellent

పి. వి. పద్మావతి మధు నివ్రితి

Like
bottom of page