top of page
Mana Telugu Kathalu - Admin

సంక్రాంతి శుభాకాంక్షలు


పాఠకులకు, రచయితలకు మా సంక్రాంతి శుభాకాంక్షలు.


డిసెంబర్ నెల వరకు ఎంపిక కాబడ్డ ఈ వారం ఉత్తమ కథల వివరాలు ప్రకటిస్తున్నాము.

బహుమతి పొందిన రచయితలకు ఈ- ప్రశంసా పత్రం పంపించాము.

బహుమతి మొత్తాన్ని23/01/2022 న వారి ఖాతాలకు జమ చేస్తాము.

వారానికి ఒక కథనే ఎంపిక చేయాలనుకున్నా మంచికథలు ఎక్కువ రావడంతో మరిన్ని కథలు బహుమతికి ఎంపిక చేసాము.

  1. 05/12/2021 మలి సంధ్య మద్దూరి బిందుమాధవి

  2. 05/12/2021 కాకి ఆవేదన కిడాల శివకృష్ణ

  3. 05/12/2021 మూగకు మాటొస్తే B. లక్ష్మీ శర్మ

  4. 12/12/2021 జీవన రేఖలు గొర్తి వాణిశ్రీనివాస్

  5. 12/12/2021 విద్యుల్లత బివిడి ప్రసాదరావు

  6. 19/12/2021 హోటల్ రాం ఏ. సి. M R V సత్యనారాయణ మూర్తి

  7. 19/12/2021 అల్లరి-వల్లరి అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

  8. 19/12/2021 దర్పణం పి. పూర్ణిమ

  9. 19/12/2021 బాంధవ్యాలు సీత మండలీక

  10. 26/122021 అమ్మ భాగవతుల భారతి

  11. 26/12/2021 ఆడజన్మ ఆటబొమ్మ కాదు! వెంకు సనాతని



రచయితలకు మా ధన్యవాదాలు


'Popular Writer 2022 Award'

ప్రారంభించిన నాటి నుండి పోటీలు నిర్వహిస్తూ బహుమతులు అందిస్తున్న మనతెలుగుకథలు.కామ్ వారు ఇప్పుడు పాపులర్ రచయిత/రచయిత్రి 2022 అవార్డు అందిస్తున్నారు.

ఈ అవార్డు పూర్తిగా పాఠకుల ఆదరణను బట్టి ఉంటుంది.

15/10/2021 తో మా విజయదశమి కథల పోటీ ముగిసింది.

కాబట్టి 16 /10 /2021 నుండి 15 /09 /2022 వరకు ప్రచురింప బడే కథలనుండి ఈ అవార్డు ఎంపిక చెయ్యబడుతుంది.

ఈ అవార్డును ఒక రచయిత/రచయిత్రి మొత్తం రచనలను పరిగణించి ప్రకటించడం జరుగుతుంది.

1. మనతెలుగుకథలు.కామ్ వెబ్ సైట్ www.manatelugukathalu.com

2. మనతెలుగుకథలు.కామ్ పోడ్ కాస్ట్ https://linktr.ee/manatelugukathalu

3. మనతెలుగుకథలు.కామ్ యూ ట్యూబ్ ఛానల్ https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


ఈ మూడింటిలో కలిపి, రచయిత/రచయిత్రుల మొత్తం రచనలకు కలిపి పాఠకుల జనాదరణ ఎంత వుందో పరిగణించి అవార్డు ను బహుకరించడం జరుగుతుంది.

పాఠకుల జనాదరణ శాస్త్రీయ పద్ధతిలో పరిశీలింప బడుతుంది

పాఠకులు కథను కేవలం క్లిక్ చెయ్యడం కాకుండా, చదవడానికి ఎంత సమయం కేటాయించారు, కొత్తగా ఎంతమంది సబ్స్క్రయిబ్ చేశారు అనే విషయాలు పరిగణిస్తాము.

మా ప్రియమైన రచయితలు/రచయిత్రులు వ్యూస్ పెంచడం కోసం అశాస్త్రీయ పద్ధతులు వాడరని ఆశిస్తున్నాము.

అవార్డు విజేతకు 1౦౦౦౦/-బహుమతి ఉంటుంది.

5 కన్సోలేషన్ బహుమతులు ఒక్కొక్కటి 5౦౦/- ఇవ్వబడతాయి.

ఈ అవార్డు కోసం విడిగా రచనలు పంపవలసిన అవసరం లేదు.

16/10/2021 నుండి ప్రచురింప బడే కథలన్నీ ఈ అవార్డు కు పరిశీలింప బడతాయి.

ఈ అవార్డు కు ఇతర బహుమతులతో సంబంధం లేదు.

రచయిత/రచయిత్రులు ఇదివరకే ప్రకటించిన ఉగాది బహుమతులు, వారం వారం బహుమతులు, భవిష్యత్తులో ప్రకటించబోయే బహుమతులు ఎప్పటిలాగే గెలుచుకోవచ్చు.

మాకువచ్చిన అన్ని కథలనూ పోడ్కాస్ట్ చెయ్యడం/యూట్యూబ్ లో ఉంచడం చేయలేము.

రచయితలు/రచయిత్రులు తమ కథలను పంపేటప్పుడు కథ, వింటే కూడా అర్ధమయ్యే విధంగా రాయవలసిందిగా కోరుతున్నాము.

ఇక ఉగాది కథల పోటీ గురించి.

ఆ ప్రకటన లింక్ ఇక్కడ ఇస్తున్నాము.

ముందు ప్రకటించిన విధంగానే బహుమతులు ఉంటాయి.

ఉగాది 2022 బహుమతుల వివరాలు :


ప్రథమ బహుమతి రూ: 5000 /-

ద్వితీయ బహుమతి రూ: 2000 /-

తృతీయ బహుమతి రూ: 1000 /-

ప్రత్యేక ప్రథమ బహుమతి రూ: 1000 /-

( కేవలం నూతన రచయితలకు)

గడువు తేదీ 20/03/2022

కథలు పంపవలసిన మెయిల్ ఐ డి story@manatelugukathalu.com


NON STOP PRIZES ( వారం వారం బహుమతులు )

ప్రతివారం ఒక ఉత్తమ కథను 'ఈ వారం ఉత్తమ కథ' గా ఎంపిక చేసి ప్రశంసా పత్రం తో బాటు రూ. 250 /- గౌరవ పారితోషకంగా అందజేయబడుతుంది.

పాఠకులకు బహుమతులు

మనతెలుగుకథలు.కామ్ నూ రెగ్యులర్ గా విసిట్ చేస్తున్న పాఠకులకు బహుమతులు అందించాలని నిర్ణయించుకున్నాము.

ప్రతి నెల 5 లేదా అంతకంటే ఎక్కువ కథల పైన సమీక్షలు రాసిన వారినుండి ముగ్గురు విజేతలను ఎంపిక చేసి వారికి Rs 116 /- పారితోషకంగా అందించబడుతుంది.

20 /03 /2022 నాటికి ఎక్కువ సమీక్షలు ప్రచురింప బడ్డవారికి 1116 /- బహూకరిస్తాము.

కేవలం బహుమతులు కోసం పంపే సమీక్షలు పరిగణింప బడవు.

నవ్వించండి - జోకుల పోటీలు

మనతెలుగుకథలు.కామ్ లో 'జోకులు' విభాగాన్ని ప్రారంభించాము.

ప్రతినెలా పది లేక అంతకంటే ఎక్కువ జోకులు ప్రచురింప బడ్డ వారి నుండి ( ఒక్కసారిగా గానీ, విడి విడిగా గానీ ) ముగ్గురు విజేతలను ఎంపిక చేసి, ఒక్కొక్కరికి 116 /- బహుకరిస్తాము.

20 /03 /2022 నాటికి ఎక్కువ జోకులు ప్రచురింప బడ్డవారికి 1116 /- బహూకరిస్తాము.

జోక్స్ ప్రచురించినట్లుగా ఇంటిమేషన్ ఇవ్వడం సాధ్యం కాదు.

మీ జోకుల్నిwww.manatelugukathalu.com విసిట్ చేసి ప్రచురింపబడ్డదీ, లేనిదీ తెలుసుకోవచ్చు.

ఈ విషయంగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపబడవు.

సాధారణంగా జోక్స్ ని మూడు రోజుల్లోగా ప్రచురిస్తాము.

అన్ని జోక్స్ నూ ఒకే పోస్ట్ లో అప్డేట్ చెయ్యడం జరుగుతుంది.

పాఠకుల ఆదరణ లేకపోతే ఈ పోటీ నిలిపివేయ బడుతుంది.

ప్రొఫైల్స్ :

మనతెలుగుకథలు.కామ్ లో ఇప్పడు పాఠకులు, రచయితలు లాగ్ ఇన్ అయి తమ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇతర రచయితలను ఫాలో చెయ్యడం, కథలకు కామెంట్స్ చెయ్యడం సులభంగా చెయ్యవచ్చు.


మరొకసారి పాఠకులకు, రచయితలకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.





56 views0 comments

Comments


bottom of page